సాధించిన విజయాలు, భవిష్యత్ ప్రణాళికలపై చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర గనుల శాఖ అధికారులతో కేంద్ర బొగ్గు, గనుల శాఖమంత్రి కిషన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. శుక్రవారం ఢిల్లీలోని శాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో గనుల శాఖ సాధించిన విజయాలు, దీర్ఘకాలిక ప్రణాళికలపై చర్చించారు. మైనింగ్ రంగంలో భారత్‌ను ఆత్మనిర్భర్‌గా మార్చేందుకు ఆటోమేషన్, ఇన్నొవేషన్, సుస్థిరత, అధునాతన సాంకేతికతలను అమలు చేయడం వంటి కీలకమైన అంశాలపై ప్రధానంగా సమీక్షించారు. అంతకుముందు అధికారులు శాఖకు సంబంధించిన పలు అంశాలను కిషన్‌రెడ్డికి వివరించారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీశ్‌చంద్ర దూబే, సీపీఎస్‌ఈలు, అనుబంధ కార్యాలయాల ఉన్నతాధికారులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కలిసిన కిషన్‌రెడ్డి
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు. కిషన్‌రెడ్డి వెంట కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయమంత్రి సతీశ్ చంద్ర దూబే ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కేబినెట్‌లో మంత్రులుగా బాధ్యతలు తీసుకున్న కిషన్‌రెడ్డి, సతీశ్‌చంద్ర దూబేలను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment