
‘న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్’లో తమిళిసై
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్‌తో భేటీ అయ్యారు. సోమవారం ఢిల్లీ వచ్చిన తమిళిసై తొలుత నేషనల్ బుక్ ట్రస్ట్–కేంద్ర విద్యాశాఖ సంయుక్తంగా ప్రగతి మైదాన్‌లో నిర్వహించిన ‘న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్–2023’ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రపంచ పుస్తక ప్రదర్శనలో పార్లమెంట్ లైబ్రరీ, పార్లమెంట్ మ్యూజియం–ఆర్కైవ్స్ ఏర్పాటు చేసిన స్టాల్‌ను పరిశీలించారు.
ప్రతిఒక్కరూ పుస్తకాల సేకరణ, పుస్తకాలను కొనుగోలు చేయడం ద్వారా భవిష్యత్తులో ఆరోగ్యంపై సానుకూల ప్రభావం ఉంటుందని గవర్నర్ తెలిపారు. అంతేగాక ప్రతిఒక్కరూ ఇంట్లో లైబ్రరీని కలిగి ఉండాలని, చదివే అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ను ఆయన నివాసంలో కలిసి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment