న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం రాజ్యసభలో భావోద్వేగానికి గురయ్యారు. తన రాకీయ జీవితంపై బీజేపీ ఎంపీ ఘనశ్యామ్ తివారీ సభలో మంగళవారం చేసిన వ్యాఖ్యలను ఆయన వ్యతిరేకించారు. తన కుటుంబం మొత్తం రాజకీయాల్లోనే ఉందని ఘన శ్యామ్ తివారీ అన్నారని, ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని సభాపతిని కోరారు.
అయితే ఖర్గే మాటలకు సభ ఛైర్మన్ జదగీప్ ధన్‌ఖర్ స్పందించారు. ఖర్గేను బాదపెట్టిన ఏ పదం రికాల్లో ఉండదని హామీ ఇచ్చారు. మరోవైపు ఖర్గే మా ట్లాడుతూ.. తమ కుటుంబంలో తానే మొదటితరం రాజకీయ నాయకుడినని తెలిపారు. యువకుడిగా ఉన్నప్పుడే కాంగ్రెస్‌లో చేరడంతో తన రాజకీయ జీవితం ప్రారంభమయ్యిందని అన్నారు. తాను చేపట్టిన వివిధ పదవుల గురించి ఆయన వివరించారు.
అయితే తన తండ్రి 85 ఏ ళ్ల వయసులో మరణించాడని ఖర్గే తెలపగా.. దీనికి చైర్మన్ స్పందిస్తూ.. తన తండ్రి కంటే ఎక్కువ సంత్సరాలు ఖర్గే జీవించాలని ఆకాంక్షించారు. అయితే ఈ వాతావరణంలో ఎక్కువ కాలం జీవించాలనే కోరిక తనకు లేదని ఖర్గే బదులిచ్చారు.
అనంతరం తివారీ మాట్లాడిన సమయంలో తాను సభలోనే ఉన్నానని, బీజేపీ నేత తప్పుగా ఉద్దేశించి మాట్లాడినట్లు తాను భావించడం లేదని అన్నారు. రికార్డులను సూక్ష్మంగా పరిశీలించి, అటువంటి వ్యాఖ్యలు ఉంటే వాటిని రికార్డుల నుంచి తొలగిస్తామని ఛైర్మన్ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment