
ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ చేతులు మీదుగా అవార్డులు అందుకుంటున్న మహంకాళి శ్రీమన్నారాయణ మూర్తి, కోలంక లక్ష్మణరావు, మహాభాష్యం చిత్తరంజన్, ఐలయ్య ఒగ్గరి
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు వురికి సంగీతనాటక అకాడమీ అవార్డులు ప్రదానం చేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్‌ఖడ్ గ్రహీతలకు అవార్డు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కూచిపూడికి చెందిన మహంకాళి శ్రీమన్నారాయణ మూర్తి (కూచిపూడి), ముమ్మిడి వరానికి చెందిన పండితారాధ్యుల సత్యనారాయణ (హరికథ), మచిలీపట్నానికి చెందిన మహాభాష్యం చిత్తరంజన్ (సంప్రదాయ సంగీతం–సుగమ్ సంగీత్), తెలంగాణ నుంచి కోలంక లక్ష్మణరావు (కర్ణాటక సంగీతం–మృదంగం) (స్వస్థలం పిఠాపురమైనా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు), నల్లగొండ జిల్లా కూర్మపల్లికి చెందిన ఐలయ్య ఒగ్గరి (ఒగ్గు కథ), వరంగల్‌కు చెందిన బాసని మర్రెడ్డి (థియేటర్ డైరెక్టర్)లు అవార్డులు అందుకున్నారు. అవార్డు గ్రహీతలను రూ.లక్ష బహుమతి, తామ్రపత్రం, శాలువాతో సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment