ముంబై: భారత నావికాదళం సామర్థ్యాన్ని మరింత పెంచే మహేంద్రగిరి యుద్ధనౌక శుక్రవారం ముంబైలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ఆయన సతీమణి సుదేశ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ యుద్ధనౌకను జలప్రవేశం చేయించారు. మహేంద్రగిరిని ప్రారంభించడం మన నావికాదళ చరిత్రలో కీలక మైలురాయిగా ధన్‌ఖడ్ సందర్భంగా అభివర్ణించారు.
భారత సముద్ర నావికాశక్తికి రాయబారిగా మహా సముద్ర జలాల్లో త్రివర్ణపతాకాన్ని మహేంద్రగిరి సగర్వంగా రెపరెపలాడిస్తుందని ఆయన పేర్కొన్నారు. ముంబైలోని మజ్‌గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్(ఎండీఎల్) మహేంద్రగిరిని తయారు చేసింది. ప్రాజెక్ట్ 17ఏ సిరీస్‌లో ఇది ఏడోదని అధికారులు తెలిపారు.
దేశ ఆర్థిక ప్రగతికి, ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు, సముద్ర జలాల్లో మన ప్రయోజనాలను రక్షించుకునేందుకు నావికాదళాన్ని ఆధునీకరణ చేయడం ఎంతో అవసరమన్నారు. హిందూమహా సము ద్ర ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక రాజకీయాలు, భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా కూడా ఈ అవసరం ఎంతో ఉందని చెప్పారు. మహేంద్రగిరిలో వినియోగించిన పరికరాలు, వ్యవస్థల్లో 75 శాతం దేశీయంగా తయారైనవే కావడం గర్వకారణమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment