sudesh
-
మహేంద్రగిరి జల ప్రవేశం
ముంబై: భారత నావికాదళం సామర్థ్యాన్ని మరింత పెంచే మహేంద్రగిరి యుద్ధనౌక శుక్రవారం ముంబైలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ఆయన సతీమణి సుదేశ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ యుద్ధనౌకను జలప్రవేశం చేయించారు. మహేంద్రగిరిని ప్రారంభించడం మన నావికాదళ చరిత్రలో కీలక మైలురాయిగా ధన్‌ఖడ్ సందర్భంగా అభివర్ణించారు. భారత సముద్ర నావికాశక్తికి రాయబారిగా మహా సముద్ర జలాల్లో త్రివర్ణపతాకాన్ని మహేంద్రగిరి సగర్వంగా రెపరెపలాడిస్తుందని ఆయన పేర్కొన్నారు. ముంబైలోని మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్(ఎండీఎల్) మహేంద్రగిరిని తయారు చేసింది. ప్రాజెక్ట్ 17ఏ సిరీస్‌లో ఇది ఏడోదని అధికారులు తెలిపారు. దేశ ఆర్థిక ప్రగతికి, ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు, సముద్ర జలాల్లో మన ప్రయోజనాలను రక్షించుకునేందుకు నావికాదళాన్ని ఆధునీకరణ చేయడం ఎంతో అవసరమన్నారు. హిందూమహా సము ద్ర ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక రాజకీయాలు, భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా కూడా ఈ అవసరం ఎంతో ఉందని చెప్పారు. మహేంద్రగిరిలో వినియోగించిన పరికరాలు, వ్యవస్థల్లో 75 శాతం దేశీయంగా తయారైనవే కావడం గర్వకారణమని పేర్కొన్నారు. -
Sudesh Ramakant Narvekar: వందోసారి రక్తదానం
పణజీ: ప్రమాదంలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వ్యక్తికి రక్తమిచ్చి సాయపడిన సుదేశ్ ఆ తర్వాతా ఆ పరంపరను కొనసాగించారు. అనుకోకుండా మొదలైన రక్తదాన వ్రతం ఇటీవల శతకం పూర్తిచేసుకుంది. గోవా బ్లడ్మ్యాన్గా పేరు తెచ్చుకున్న ఆయన పూర్తి పేరు సుదేశ్ రమాకాంత్ నర్వేకర్. 51 ఏళ్ల వయసున్న సుదేశ్ 18 ఏళ్ల వయసులో తొలిసారి రక్తదానం చేసి తోటి వ్యక్తికి సాయపడితే వచ్చే ఆత్మ సంతృప్తికి ఫిదా అయ్యాడు. అప్పటి నుంచి గత 33 సంవత్సరాలుగా ఆపదలో ఉన్న వారికి సాయంగా రక్తదానం చేస్తూనే ఉన్నాడు. దక్షిణ గోవాలోని పండాలో నివసించే సుదేశ్ ఇటీవల వందోసారి రక్తదానం చేసిన సందర్భంగా ఆయనను పీటీఐ పలకరించింది. ‘ టీనేజీలో ఉన్నపుడు ఒక యాక్సిడెంట్లో రక్తమోడుతున్న వ్యక్తికి బ్లడ్ ఇచ్చాకే తెలిసింది ఆపత్కాలంలో సాయపడటం ఎంత ముఖ్యమో. అందుకే నాకు తోచినంతలో ఇలా ఆపదలో ఉన్న వారికి సాయమందిస్తున్నా. భారత్‌లో వంద సార్లు రక్తదానం చేయడం అరుదు అని ఈమధ్యే తెలిసింది’ అని ఇండియన్ రెడ్ క్రాస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సుదేశ్ అన్నారు. ‘ మొదట్లో ఏడాదికి రెండు సార్లు డొనేషన్ చేసేవాడిని. తర్వాత శిబిరాలు పెరిగేకొద్దీ ఎక్కువసార్లు ఇవ్వడం స్టార్ట్‌చేశా. బెంగళూరు, పుణె, హుబ్లీ, బెళగామ్సహా పొరుగు రాష్ట్రాల్లోనూ రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేశా. మూడేళ్ల క్రితం పది మంది స్నేహితులతో కలిసి సార్థక్ ఎన్జీవోను ప్రారంభించా. గోవా అంతటా క్యాంప్‌లు నిర్వహించాం. ఇప్పుడు వైద్యులతో కలిసి 30 మంది బృందంగా ఏర్పడి ఎన్జీవో సేవ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాం. ఒక్క గోవా మెడికల్ కాలేజీలోనే 90సార్లు క్యాంప్‌లు పెట్టాం. గోవా విషయానికొస్తే మహిళలు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలకు వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు’ అని సుదేశ్ చెప్పారు. -
అసమ్మతి ఉంది...అయినా వారికే...
మహబూబాబాద్, న్యూస్‌లైన్: మానుకోట పార్లమెంట్ నియోజకవర్గంలో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు(మానుకోట, భద్రాచలం, పినపాక) డోకా లేదు.. ఇన్‌చార్జ్‌లు ఉన్నచోట వారికే టికెట్ ఇస్తాం.. ఇదే ఫైనల్ అని ఏఐసీసీ పరిశీలకుడు సుదేష్బోటే స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని తెలుసుకోవడానికి సుదేష్బోటేతోపాటు పీసీసీ కార్యదర్శి(రాష్ట్ర పరిశీలకుడి హోదాలో) జైప్రకాశ్ రాపోల్ సోమవారం మానుకోటకు వచ్చారు. కేంద్రమంత్రి బలరాంనాయక్, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు వారికి ఘనస్వాగతం పలికారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో అభిప్రాయాల సేకరణ, ధరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ముగిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. గాంధీ భవన్లో ఆదివారం జరిగిన కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశానికి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారని చెప్పారు. మూడు నియోజకవర్గాలలో కొంత అసమ్మతి ఉన్నట్లు వచ్చిన దరఖాస్తుల ద్వారా అర్థమవుతోందని, అయినా మెజార్టీ ఎమ్మెల్యేలకే అనుకూలంగా ఉందన్నారు. మానుకోట ఎంపీ స్థానానికి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోలేదని, నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మద్దతుగా మాట్లాడాడం వల్ల మళ్లీ ఆయనకే ఎంపీ టికెట్ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి రెండు మూడు దరఖాస్తులు వచ్చినా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నచోట వారికి టికెట్ ఇస్తామని, ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం మూడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీ పరిస్థితి బాగానే ఉంది.. వాటిలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. రాష్ట్ర ఏర్పాటు ప్రకటనతో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగిందని, సైనికుల్లా పని చేసి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తారనే నమ్మకం ఉందన్నారు. తెలంగాణ ప్రాంతం కాంగ్రెస్‌కు కంచుకోటగా మారుతుందని చెప్పారు. ఆదివాసీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కాంగ్రెస్ వైపు ఉన్నారని, వారు పార్టీకి పూర్వ వైభవం తెస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈనెల 23తో అసెంబ్లీలో తెలంగాణపై చర్చ ముగుస్తుందని, గడువు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా దెబ్బతిందని, ఆ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. సమావేశంలో మానుకోట ఎమ్మెల్యే మాలోతు కవిత, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కాటా భాస్కర్, నాయకులు పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, పజ్జూరి ఇంద్రారెడ్డి, గిరిధర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.