
నెల్లూరు జిల్లా:
►సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం, మనుబోలు, తోటపల్లి గూడూరు, ముత్తుకూరు మండలాల్లో జగనన్నే మా భవిష్యత్తు, మానమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో పాల్గొన్న గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు వాలంటీర్లు వైఎస్సార్‌సీపీ నాయకులు
►ప్రతి ఇంటికి వెళ్లి బుక్ లెట్, స్టికర్ అందించి సీఎం జగన్ స్టిక్కర్లను ఇళ్ల కు అంటించిన గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు వాలంటీర్లు, వైఎస్సార్‌సీపీ నాయకులు
గత 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రజలకు చేస్తున్న మేలును వివరించి.. ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా సాగిస్తున్న దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది.
సీఎం వైఎస్ జగన్ ప్రతినిధులుగా ఇంటికి వచ్చిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, సచివాలయాల కన్వీనర్లు, గృహ సారథులు, పార్టీ శ్రేణులు, వలంటీర్లకు కుటుంబ సభ్యులు ఎదురేగి ఆహ్వానించారు. టీడీపీ సర్కార్‌కూ ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలను వివరిస్తూ కరపత్రాన్ని చదివి వినిపించినప్పుడు.. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తమతోపాటు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారనే మాట ప్రతి ఇంటా విన్పిస్తోంది.
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 7వ తేదీన ప్రారంభమైన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. తొలి రోజు మెగా పీపుల్స్ సర్వేలో 10 లక్షల కుటుంబాలు పాల్గొన్నాయి. ఏకంగా 8 లక్షల మంది సీఎం వైఎస్ జగన్‌కు మద్దతు తెలుపుతూ 82960 82960 నంబరుకు మిస్డ్ కాల్ ఇచ్చారు. మొత్తం 175 నియోజకవర్గాల్లోని 15 వేల సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమానికి విజయవంతంగా శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్ల ప్రజా రంజక పాలన గురించి మరోసారి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి మధ్య గల తేడాను వివరించి చెబుతున్నారు. ఇంకా ఎక్కడైనా అర్హులు మిగిలిపోయి ఉంటే వారికి కూడా ప్రభుత్వ ఫలాలు అందించేలా అడుగులు ముందుకు వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment