ఇంటింటా అభిమానం.. 55 లక్షల కుటుంబాల ప్రజలు మిస్డ్‌కాల్స్‌ | Jagananne Maa Bhavishyathu Campaign Programme | Sakshi
Sakshi News home page

ఇంటింటా అభిమానం.. 55 లక్షల కుటుంబాల ప్రజలు మిస్డ్‌కాల్స్‌

Published Tue, Apr 18 2023 7:52 AM | Last Updated on Tue, Apr 18 2023 3:28 PM

Jagananne Maa Bhavishyathu Campaign Programme - Sakshi

సాక్షి, అమరావతి/పాణ్యం (నంద్యాల): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అత్యంత ప్రతి­ష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్నే మా భవి­ష్యత్తు’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో కొనసాగుతోంది. 11వ రోజు సోమవారం కార్యక్రమానికి కూడా అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఎమ్మె­ల్యేలు, నియో­జక­వర్గాల వైఎస్సార్‌­సీపీ సమ­న్వ­­యకర్తలు, ప్రజా­ప్రతి­నిధులు, సచివాల­యాల కన్వీ­నర్లు, వలంటీర్లు, గృహ సారథులకు ప్రతిఇంటా ఆ కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలి­కారు.

గత 46 నెలలుగా సీఎం వైఎస్‌ జగన్‌ అమ­లుచేస్తున్న సంక్షేమ పథకాలు, అందిస్తున్న సుపరి­పాలన గురించి ప్రతిఇంటా జగనన్న సైన్యం వివ­రించింది. టీడీపీ సర్కార్‌కూ.. జగన్‌ ప్రభు­త్వా­నికి మధ్యనున్న తేడాలను వివరిస్తూ కరపత్రాలు అందించారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు మోసంచేశారని.. సీఎం జగన్‌ వైఎస్సార్‌ ఆసరా పథకం కింద ఆ రుణాన్ని వడ్డీతో సహా చెల్లించి మాట నిలబెట్టుకు­న్నారని అక్క­చెల్లె­మ్మలు జగనన్న సైన్యానికి వివరించారు.

ఇక జన్మ­భూమి కమిటీలోని టీడీపీ నేతలకు లంచం ఇచ్చినా అప్పట్లో పింఛన్‌ మంజూరు చేసేవారు కాదని.. సీఎంగా జగన్‌ అధికారంలోకి వచ్చాక ఎవరి వద్దకు వెళ్లకుండానే.. లంచాలకు అతీతంగా పిం­ఛన్‌ మంజూరు చేశార­న్నారు. అలాగే, ప్రతినెలా ఒకటో తేదీన ఇంటి వద్దకే వలంటీర్‌ వచ్చి రూ.2,750ల చొప్పున పింఛన్‌ అందిస్తూ ఆదుకుంటున్నా­రని అవ్వాతాతలు ప్రశంసించారు. ఏ నోట విన్నా ఇదే మాట. మళ్లీ వైఎస్సార్‌సీపీనే గెలిపించి.. సీఎంగా వైఎస్‌ జగన్‌నే చేసుకుంటామని.. మా నమ్మకం నువ్వే జగన్‌ అంటూ నినదించారు.

పొలమంతా ‘అభిమానం’
నంద్యాల జిల్లా పాణ్యం మండల పరిధి­లోని కందికాయపల్లె గ్రామానికి చె­ందిన బిరవోలు శివ అనే రైతు తన ఎడ్లకు సీఎం వైఎస్‌ జగన్‌ స్టిక్కర్‌ అతికించి పొలాన్ని దున్నడం అందరి దృష్టిని ఆక­ర్షిం­చింది. ఇటీవల గ్రామంలో ‘జగనన్నే మా భవి­ష్యత్‌’ కార్యక్రమంలో భాగంగా గృహ సార­థులు, సచివాలయ కన్వీనర్లు పర్య­టించారు. రైతు ఇంటి బయట స్టిక్కర్‌ అతికించేందుకు శివ అనుమతి కోరగా.. అభిమాన నాయకుని ఫొటో బయ­­టకా­దని, ఇంట్లో ఉండాలన­డం విశే­షం.

వ్యవ­సాయంపై ఆధారపడ్డ కుటు­ం­బం కావ­డంతో మూ­డె­కరాలు కౌలు­కు తీసుకుని సాగు­చేస్తు­న్న­ట్లు తెలి­­పాడు. ఈ మేరకు రైతు­భరోసా కింద ఏటా రూ.13,500 తన ఖాతాలో జమవుతోందన్నా­రు. పంట­నష్టం కింద కూడా డబ్బు జమవుతోందని.. భార్య పొదుపు గ్రూపు­లో ఉండటంతో ఆసరా కింద డబ్బులు వస్తున్నా­య­న్నాడు. తల్లికి చేయూత ద్వారా సాయం అందిందని సంతోషం వ్యక్తంచేశాడు. ఎవ్వరినీ అడగకుండా, ఎక్క­డికి వెళ్లకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం జగన్‌ అంటే తమ కుటుంబానికి ప్రాణమ­న్నాడు. అందుకే వ్య­వ­సాయంలోనూ ఆయన తోడుగా ఉన్నట్లుగా భావించేందుకు ఎడ్లకు స్టిక్కర్లు అతికించుకున్నట్లు శివ తెలిపాడు.
చదవండి: నోటీసులిచ్చి అరెస్టులా? 

73 లక్షల కుటుంబాలతో మమేకం
మరోవైపు.. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం పదో­రోజు ముగిసే నాటికి అంటే ఆదివారానికి జగనన్న సైన్యం 73 లక్షల కుటుంబాలను నేరుగా కలి­సింది. ఈ కార్యక్రమంలో భాగంగా సచి­­వాల­యాల కన్వీనర్లు, గృహసా­రథులు నిర్వహిస్తున్న మెగా ప్రజా­సర్వే­లో జగన్‌ ప్రభు­త్వా­నికి మద్దతు తెలు­పుతూ 55 లక్షల కుటుంబాల ప్రజ­లు 82960–­82960 నెంబర్‌­కు మిస్డ్‌­కాల్స్‌ ఇచ్చారు. గృహ సార­థు­లను అడిగి మరీ వైఎస్‌ జగన్‌ ఫొటోతో కూడిన స్టిక్కర్లను తీసుకుని.. ఇంటి త­లుపు­లకు, మొబైల్‌ ఫోన్లకు అతికించు­కుని అభిమానాన్ని చాటుకుంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Advertisement
 
Advertisement
 
Advertisement