
సాక్షి, నెల్లూరు: ప్రజాసంక్షేమాన్ని చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరిస్తున్నట్లు చెప్పారు. ప్రజా భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతోందన్నారు. సీఎం జగన్ పథకాలతో లబ్ధి పొందుతున్నాం అని ప్రజలు అంటున్నారని తెలిపారు.
'జగనన్నే మా భవిష్యత్తు ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. సొంతింటి కలను సాకారం చేశారంటు ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంటి వద్దే పింఛన్ అందిస్తూ బాసటగా నిలిచారని అవ్వాతాతలు చెబుతున్నారు. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ అన్ని వర్గాల ప్రజలు నినదిస్తున్నారు. ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ 43 లక్షల కుటుంబాలకు పైగా మిస్డ్ కాల్స్ ఇచ్చాయి.' అని మంత్రి కాకాణి పేర్కొన్నారు.
చదవండి: కేంద్రం తీరుపై స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఆగ్రహం.. నిరసనగా సింహాచలం వరకు పాదయాత్ర
Comments
Please login to add a commentAdd a comment