
సాక్షి, గుంటూరు: సీఎం జగన్ పాలనలో లబ్ధిదారుడి ఇంటివద్దకే సంక్షేమం చేరుతోందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పథకాలు అందుతున్నాయని తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 98 శాతం నెరవేర్చినట్లు స్పష్టం చేశారు. ఎన్నికల్లో హామీ ఇవ్వని పథకాలను కూడా అమలు చేస్తున్నామన్నారు.
జగనన్నే మన భవిష్యత్తు కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లామని అంబటి చెప్పారు. గడపగడపకు వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుత స్పందన వచ్చిందని తెలిపారు.
చదవండి: ‘పవన్‌ను బ్లాక్‌మెయిల్ చేసేందుకు రజినీకాంత్ రంగంలోకి!’