సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డే మా భవిష్యత్తు అంటున్నారు జనాలు.. పేద ప్రజల బతుకులకు ఒక భరోసా ఇచ్చి.. ‘కుల, మత, పార్టీలకు అతీతంగా గత 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ఎంతో మేలు చేస్తున్నారు సీఎం జగన్.
సీఎం వైఎస్ జగన్ ప్రతినిధులుగా ఇంటికి వచ్చిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, సచివాలయాల కన్వీనర్లు, గృహ సారథులు, పార్టీ శ్రేణులు, వలంటీర్లకు కుటుంబ సభ్యులు ఎదురేగి ఆహ్వానించారు. టీడీపీ సర్కార్‌కూ ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలను వివరిస్తూ కరపత్రాన్ని చదివి వినిపించినప్పుడు.. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తమతోపాటు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారనే మాట ప్రతి ఇంటా వినిపిస్తోంది.
సీఎం వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పేదల కోసం అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు చెప్పిన దానికంటే ఎక్కువగానే మేలు చేస్తున్నారు. పైసా అవినీతి లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో పథకాలను అమలు చేస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారుజామునే 5 గంటలకే నిద్రలేపి మరి పింఛను ఇస్తున్నారు. ‘నా మనవడు జగనయ్య మా కోసం వలంటీర్లను పెట్టారు. ఇంటి వద్దకే పింఛన్ పంపిస్తున్నారు. మా మనవడు చల్లగా ఉండాలయ్యా’ అంటూ వృద్ధులు దీవిస్తున్నారు.
చదవండి: జగనన్న కాలనీలు చూద్దాం వస్తావా బాబూ..?
Comments
Please login to add a commentAdd a comment