సాక్షి, తాడేపల్లి: రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నేటి నుంచి ప్రారంభమయ్యే ‘జగనన్నే మా భవిష్యత్’ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ వరకూ కొనసాగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ చర్రితలోనే ఇలాంటి కార్యక్రమం జరగలేదని స్పష్టం చేశారు.
కాగా, మంత్రి బొత్స శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. 1.60 కోట్ల కుటుంబాలను సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు కలుస్తారు. నాడు-నేడు పాలనలో వ్యత్యాసాన్ని వివరిస్తారు. ఇంటింటికి స్టిక్కర్ అంటిస్తారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇంకా ఎలాంటి పథకాలు అమలు చేయొచ్చో నిర్ణయం తీసుకుంటాం. దేశ చర్రితలోనే ఇలాంటి కార్యక్రమం జరగలేదు.
ప్రజలతో మమేకమై సర్వే చేయడం దేశంలో ఇదే తొలిసారి. ఐదు ప్రశ్నలతో వివరాలు సేకరించి ప్రజా మద్దతు పుస్తకంలో నమోదు చేస్తారు. ప్రభుత్వ పథకాలు నచ్చితే 82960 82960కి మిస్డ్ కాల్ ఇవ్వాలన్నారు. వివక్ష, లంచాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో పథకాల కోసం జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగేవారు. గతంలో జన్మభూమి కమిటీ అనుమతి లేనిదే పథకాలు వచ్చేవి కావు అని తెలిపారు.
ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో టీడీపీ క్లోజ్ అన్నారు. చంద్రబాబును ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉంటే వారి పేర్లు చెప్పాలి?. చంద్రబాబు పేరు చెబితే ఒక్క సంక్షేమ పథకమైనా గుర్తొస్తుందా?. కేరళలో విద్య బాగుంటుందని గతంలో చెప్పుకునేవారు. ఇప్పుడు దేశమంతా ఏపీ గురించి చెప్పుకుంటున్నారు. జనసేన ఒక సెలబ్రిటీ పార్టీ. జననేనను మేము రాజకీయ పార్టీగా భావించడం లేదు అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment