Jagananne Maa Bhavishyathu Campaign Starts Tomorrow - Sakshi
Sakshi News home page

రేపటి నుంచి జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం

Published Thu, Apr 6 2023 8:31 AM | Last Updated on Thu, Apr 6 2023 9:59 AM

Jagananne Maa Bhavishyathu Campaign Starts Tomorrow - Sakshi

నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యే ఒక భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైఎస్సార్‌సీపీ.  పార్టీ తరఫున సచివాలయ కన్వీనర్లతో పాటు వారి తర్వాత స్థాయిలో పనిచేసే గృహసారథుల నియామకం తర్వాత మొట్టమొదటి సారిగా ఒక భారీ పార్టీ కార్యక్రమంతో ప్రజలతో మమేకమవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా పార్టీ నియమించిన ఈ రెండు వ్యవస్థలు (కన్వీనర్లు, గృహసారథులు) ఒక మిషన్‌ మోడ్‌లో బాధ్యతగా ఫోకస్డ్‌గా.. సుశిక్షితులైన సైనికుల్లా పనిచేస్తే ఎలా ఉంటుందనే విషయంపై దృష్టిసారించింది.

పార్టీ పరంగా పనిచేసే వారు ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలుగానే కాకుండా ప్రజల అవసరాలను గుర్తించి.. వాటిని తీర్చే బాధ్యతగల కార్యకర్తలున్న రాజకీయ పార్టీగా వైఎస్‌ఆర్‌సీపీ ముందుకెళ్తుందన్నది నిరూపించాలనేది తమ ప్రయత్నం. అలాగే, ప్రభుత్వం పనితీరుపై పార్టీ పట్ల ప్రజల అభిప్రాయాన్ని, వారి సంతృప్తిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ .. ప్రజల అంచనాలకు అనుగుణంగా  పార్టీ అజెండా మార్చుకోవాలనుకునే సమర్ధమంతమైన పార్టీ అధ్యక్షుడుని కలిగి ఉన్నది ‘వైఎస్‌ఆర్‌సీపీ’ అని మనందరం గర్వంగా చెప్పుకునేందుకు కసరత్తు ప్రారంభించినట్లు వైఎస్సార్‌సీపీ స్పష్టం చేసింది.  దీనిలో భాగంగా ప్రజలతో మమేకమయ్యే ఈ భారీ కార్యక్రమం ఎలా ఉండాలి..?  పార్టీ సైన్యం ప్రజలతో ఏ విధంగా మమేకమవ్వాలనే విషయంపై ఇప్పటికే శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. 

7 నుంచి 20 వరకు ‘జగనన్నే మా భవిష్యత్తు’...
 ఈనెల 7 నుంచి 20 వ తేదీ వరకు ‘జగన న్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం జరగనున్నది. రాష్ట్రవ్యాప్తంగా 14 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో 7 లక్షల మందిదాకా ప్రధాన కిందిస్థాయి కార్యకర్తలు మా పదాధిదళంగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం సచివాలయ వాలంటీర్‌లు స్థానికంగా ఎంత ఏరియా కవర్‌ చేస్తారో.. అంతే పరిధిలో గృహసారథుల వ్యవస్థ కూడా పనిచేస్తుంది. వాళ్లమీద సచివాలయ కన్వీనర్లను ఎప్పటికప్పుడు సమన్వయం చేసే జేసీయస్ మండల ఇన్ ఛార్జులు సైతం ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో పూర్తిస్థాయిలో భాగస్వాములవుతారు.

‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అనే నినాదంతో...
ప్రజల నుంచి వచ్చిన ప్రధానమైన నినాదం ‘మా నమ్మకం నువ్వే జగన్‌’. అందుకే ఈ నినాదాన్ని కూడా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో ఒక ప్రధాన అంశంగా పెట్టాం. ఈ నినాదమనేది మాకు మేముగా అనుకున్నది కాదు. మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకొచ్చాక ప్రజలకు ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వాల ఆలోచనలకు భిన్నంగా.. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే లక్షణం రాజకీయ పార్టీలకు ఉండాలని, అలాగే ప్రజలతో మమేకమై ప్రజల అవసరాలకు, అంచనాలకు అనుగుణంగా పాలన సాగించాలని, ప్రజల జీవితాల్లో, వారి జీవనశైలిలో వచ్చిన మార్పును కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం.

రియల్ ఛేంజ్...
ప్రజల జీవితాల్లో అనూహ్యమైన మార్పును తెస్తూ, బాధ్యతగా సేవలందించడంలో అందరికంటే మేము ముందున్నాం. పార్టీ అజెండా రూపకల్పన దగ్గర్నుంచి, మా పార్టీ విధానాలు.. సంక్షేమ పథకాలు అమలు తీరు.. ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్న క్రమాన్ని అందరూ గుర్తించారు. ఈ విషయాన్ని మా పార్టీ జనంలోకి వెళ్లినప్పుడు, గడపగడపకు మా ప్రభుత్వం కార్యక్రమం పేరిట మేము ఇంటింటికీ తిరిగినప్పుడు.. సచివాలయాల ద్వారా వాలంటీర్లు క్షేత్రస్థాయి నుంచి తీసుకొస్తున్న సర్వేల ద్వారా పరిశీలిస్తే.. దాదాపు 80 నుంచి 90 శాతం వరకు సమాజంలో ఒక రియల్‌ ఛేంజ్‌ (గుణాత్మకమైన మార్పు) కనిపిస్తుందని నిరూపితమైంది.

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై ఏదైతే నమ్మకం పెట్టుకున్నామో.. దాన్ని ఒకటికి రెండింతలు నిలబెట్టుకున్నారని .. అందుకనే జగన్‌మోహన్‌రెడ్డినిమేమంతా నమ్ముతున్నామని ఈరోజు ప్రజలు చెబుతున్నారు. మా భవిష్యత్తు జగన్‌మోహన్‌రెడ్డిలో కనిపిస్తోందని బలంగా ప్రజల మాటల్లో వినిపిస్తోంది. ఇవన్నీ చూశాక.. ప్రజల నుంచి వచ్చిన ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అనే నినాదంగా తీసుకుని, దీన్నే కార్యక్రమం పేరుగా ఎందుకు చేయకూడదని అనుకున్నాం.

రాష్ట్ర వ్యాప్తంగా కోటి 60 లక్షల కుటుంబాలను నేరుగా కలిసి...
14 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 1కోటి 60 లక్షల కుటుంబాలను జగన్‌మోహన్‌రెడ్డి గారి ప్రతినిధులుగా నియమించిబడిన గృహసారథులు, సచివాలయ కన్వీనర్లుతో పాటు మిగతా అన్ని స్థాయిల్లో నేతలు కలుస్తారు. 
గత ప్రభుత్వాలకు-ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటారు. అర్హులైన కుటుంబాలను నూటికి నూరుశాతం సంక్షేమ పథకాల అమలులోకి తీసుకువచ్చి.. వాళ్లందర్నీ కూడా సొంతకాళ్లమీద నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టే, సర్వే ప్రశ్నల ద్వారా వారి అభిప్రాయాల్ని సమాధానాల రూపంలో ఇస్తారు. మా నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు చెప్పినట్లు రాష్ట్రంలో సగటున 87శాతం ప్రజలు మా ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల పూర్తిస్థాయి విశ్వసనీయత కనబరుస్తారనే నినాదం ఈ కార్యక్రమం ద్వారా వినబోతున్నామని వైఎస్‌ఆర్‌సీపీ తరఫున బలంగా నమ్ముతున్నాం. 

దీని తరువాత ఒక ప్రత్యేకమైన ‘పీపుల్స్ సర్వే’ నిర్వహించనుంది.. ఈ సర్వేలో ప్రతి ఇంటికి తిరిగి వారి పిల్లల భవిష్యత్తు కోసం సీఎం జగన్‌పై నమ్మకం ఉందా? అని అడిగి తెలుసుకుంటారు. ఇది ‘ప్రజా మద్దతు పుస్తకం’ లేదా ‘5 పాయింట్ల ప్రశ్నాపత్రం’ ద్వారా నిర్వహించనున్నారు.

ప్రతిపక్షాల పేరుతో వికృతచేష్టలకు ఒడిగట్టి గౌరవ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ రథానికి అడ్డంపడే ప్రయత్నాలు, కుట్రలు చేస్తున్న దుష్టశక్తులకు మా పార్టీ కార్యక్రమం తగిన గుణపాఠం చెబుతుంది.
- వైఎస్సార్‌సీపీ విశాఖ ఐటీ విభాగం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Advertisement
 
Advertisement
 
Advertisement