ఆరోగ్యశ్రీ సేవలు ఆగలేదు | alladi Vishnu Fires on BJP and TDP | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీ సేవలు ఆగలేదు

Published Sun, May 26 2024 5:57 AM | Last Updated on Sun, May 26 2024 5:57 AM

alladi Vishnu Fires on BJP and TDP

టీడీపీ, బీజేపీ తప్పుడు ప్రచారంపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్‌  

ఆరోగ్యశ్రీ సేవలపై పచ్చ నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాల్‌  

సాక్షి, అమరావతి/అజిత్‌సింగ్‌నగర్‌(విజయవాడసెంట్రల్‌): రాష్ట్రంలో ఎక్కడా ఆరోగ్యశ్రీ సేవలు ఆగలేదని ప్లానింగ్‌ బోర్డు ఉపాధ్యక్షుడు, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. కానీ టీడీపీ, బీజేపీ నాయకులు పనిగట్టుకుని ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయాయని విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ధైర్యం ఉంటే ఆరోగ్యశ్రీ సేవలపై పచ్చ నేతలు బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్‌ విసిరారు. ఈ మేరకు మల్లాది విష్ణు శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు యథాతథంగా కొనసాగుతున్నాయి. ఎక్కడా అంతరాయం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

అయినా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయంటూ కొన్ని పత్రికలు అబద్ధాలు వండివారుస్తూ పేదలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పేదల సంపూర్ణ ఆరోగ్యానికి భరోసా కలి్పస్తూ దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నిరీ్వర్యం చేసిన టీడీపీకి ఈ పథకం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. టీడీపీ హయాంలో కేవలం తెల్ల రేషన్‌కార్డు కలిగిన కుటుంబాలకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తించేది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చాక తెల్ల రేషన్‌కార్డు కలిగిన కుటుంబాలతోపాటు రూ.5లక్షలలోపు ఆదాయం ఉన్న మధ్య తరగతి కుటుంబాలకు కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో 1.42కోట్లకు పైగా కుటుంబాలకు ప్రస్తుతం ఆరోగ్యశ్రీ వర్తిస్తోంది.

దీనిని తెలుగుదేశం నేతలు కాదనగలరా?.. టీడీపీ హయాంలో కేవలం 1,059 మాత్రమే ఉన్న ప్రొసీజర్లను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 3,257కి పెంచింది. ఉచిత వైద్య పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతూ సీఎం జగన్‌ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ పాలనలో కేవలం 919 ఆస్పత్రులకు మాత్రమే పరిమితమైన ఆరోగ్యశ్రీ సేవలను మా ప్రభుత్వం 2,371 ఆస్పత్రులకు విస్తరించింది. ఇతర రాష్ట్రాల్లోని నెట్‌వర్క్‌ ఆస్పత్రులను 72 నుంచి 204కి పెంచింది. టీడీపీ పాలనలో ఆరోగ్యశ్రీ నిధులన్నీ చంద్రబాబు దురి్వనియోగం చేయగా, నేడు గ్రీన్‌ చానల్‌ ద్వారా పారదర్శకంగా చెల్లింపులు జరుగుతున్నాయి. ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ ద్వారా 42.91లక్షల మందికి రూ.13,471కోట్ల విలువైన వైద్యసేవలు అందించాం

2023–24 ఆరి్థక సంవత్సరానికి సంబంధించి నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.3,566కోట్లు చెల్లించింది. 2024–25 ఆరి్థక సంవత్సరంలో తొలి రెండు నెలల్లో రూ.366కోట్లు చెల్లించగా, తాజాగా మరో రూ.200కోట్ల బకాయిలు విడుదల చేసింది. అదేవిధంగా ప్రజలకు ఇంటి వద్దే వైద్యసేవలు అందించేలా ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం అమలుచేసింది. ప్రభుత్వ వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు రూ.16,852కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతోపాటు నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి చేసింది.

గత ఐదేళ్లలో వైద్యశాఖలో సుమారు 54వేల పోస్టులను భర్తీ చేసింది. ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రులలో పేదలకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందుతున్నాయి. నీతి ఆయోగ్‌ విడుదల చేసిన ఆరోగ్య సూచీల్లో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉంది. ప్రజలకు డిజిటల్‌ వైద్యసేవలు, పౌరులకు టెలీ మెడిసిన్‌ సేవల కల్పనలోనూ ఏపీ తొలి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడి ఆరోగ్య అవసరాలు తీర్చడమే లక్ష్యంగా సీఎం జగన్‌  నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అహరి్నశలు పనిచేస్తోంది.’ అని విష్ణు పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement