Arogayasree
-
బాబూ.. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానిది కాదా?: విడదల రజిని
సాక్షి, గుంటూరు: ఏపీలో పేదల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు మాజీ మంత్రి విడదల రజని(Vidadala Rajini). ఓటు వేసి గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఆరోగ్య ఆసరా ఊసే లేకుండా చేశారని మండిపడ్డారు.మాజీ మంత్రి విడదల రజిని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఆరోగ్యశ్రీ(aarogyasri) పేదలకు సంజీవిని లాంటింది. కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేదలకు అందించటమే లక్ష్యంగా డాక్టర్ వైఎస్ఆర్ ప్రారంభించారు. ఇతర సంక్షేమ పథకాల మాదిరిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని చూడకూడదు. వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన పథకాన్ని వైఎస్ జగన్ మరింత బలోపేతం చేసి పేదలకు అందించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానిదే అని భావించి ఆరోగ్యశ్రీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసింది.ఈరోజు నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ.3000 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో ఆసుపత్రులు వైద్య సేవలు ఆపేశాయి. ప్రజల ఆరోగ్యం.. ప్రభుత్వ బాధ్యత కాదు అని కూటమి సర్కార్ ఆలోచిస్తోంది. ఇటువంటి పరిస్థితులు మా ప్రభుత్వంలో ఎప్పుడూ రాలేదు. కోవిడ్(covid)ను ఆరోగ్యశ్రీలో చేర్చి మా ప్రభుత్వం వైద్యం అందించింది. గత ప్రభుత్వాలు అమలు చేసిన ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం కొనసాగించాలి. మూడు వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆరోగ్యశ్రీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.ఆరోగ్య శ్రీని హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడ్‌లో అమలు చేస్తామని చెబుతున్నారు. థర్డ్ పార్టీకి బీమా సౌకర్యం అందించే ప్రయత్నం మంచిది కాదు. బీమా కంపెనీలు సేవా దృక్పథంతో వ్యవహరించవు. అలాగే, బీమా సౌకర్యం ఎన్ని ఆసుపత్రుల్లో అమలు చేస్తారో తెలియదు. ఎన్ని రోగాలకు అమలు చేస్తారో తెలియదు. ఓటు వేసి గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు. పేదల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడ్ విధానాన్ని వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తుంది. ఆరోగ్య ఆసరా ఊసే లేకుండా చేశారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నిర్వీర్యం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానిది కాదన్న సందేశాన్ని ఇస్తున్నారు. కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ విధానాన్ని అమలు చేయలేకపోయాయి. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 637 కోట్ల పాత ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించారు అని చెప్పుకొచ్చారు. -
రాష్ట్రంలో కుప్పకూలిన ప్రజారోగ్య వ్యవస్థ: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార ఘటనలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు. ‘డయేరియాతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. 11మంది చనిపోయినా, వందల సంఖ్యలో బాధితులున్నా చంద్రబాబు ప్రభుత్వం నిద్ర వీడడంలేదు. సమీపంలోనే ఉన్న విజయనగరం, విశాఖపట్నంలలో మంచి ఆస్పత్రులు ఉన్నా బాధితులకు స్థానిక పాఠశాలలోని బెంచీల మీద చికిత్స అందించడం దారుణం.నాణ్యమైన అత్యవసర వైద్యాన్ని అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. లిక్కర్, ఇసుక స్కాముల్లో నిండామునిగిపోయిన ప్రభుత్వ పెద్దలు ప్రజల కష్టాలను గాలికొదిలేశారు. ఇప్పటికే 104, 108 వ్యవస్థలు దెబ్బతిన్నాయి. బాబుగారు వచ్చాక వీరికి సరిగా జీతాలు కూడా రావడంలేదు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయింది. గత మార్చి నుంచి దాదాపు రూ.1,800 కోట్ల బకాయిలు పెండింగ్‌లో పెట్టారు. ఆరోగ్య ఆసరాను పూర్తిగా ఎత్తివేశారు. జీరో వేకెన్సీ పాలసీకి మంగళం పాడారు. సీహెచ్సీలలో స్పెషలిస్టు డాక్టర్లను తీసివేశారు. విలేజ్ క్లినిక్స్, పీహెచ్‌సీలను నిర్వీర్యం చేశారు.ఫ్యామిలీ డాక్టర్ ఊసేలేదు. ప్రభుత్వాస్పత్రుల్లో నాడు–నేడు పనులు నిలిచిపోయాయి. కొత్త మెడికల్ కాలేజీలను అస్తవ్యస్థం చేశారు. స్కాములు చేస్తూ అమ్మడానికి సిద్ధమవుతున్నారు. తనవారికి కట్టబెట్టేందుకు చంద్రబాబు వాటిని ప్రయివేటుపరం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రజల ప్రాణాలమీదకు వస్తున్నాయి. ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోవాలి. డయేరియా బాధిత గ్రామాల్లో మంచి వైద్యం, తాగునీటి వనరులపై ప్రత్యేక దృష్టిపెట్టాలి’ అని జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. -
‘ఆసరా’కూ మంగళం!
అనకాపల్లి జిల్లా రత్నాలపాలెంకు చెందిన పైడితల్లి ఈ ఏడాది ఆగస్టులో కోటవురట్ల సామాజిక ఆరోగ్య కేంద్రంలో బిడ్డకు జన్మనిచ్చి0ది. ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ) పథకం కింద నమోదు చేసి వైద్యులు ప్రసవం చేశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అనంతరం ఇంటికి వెళ్లిన 24 గంటల్లో ఆమెకు ఆరోగ్య ఆసరా కింద ప్రభుత్వం రూ.5 వేలు చెల్లించాల్సి ఉంది. రెండు నెలలు కావస్తున్నా ఆమె ఖాతాలో నగదు జమ అవ్వలేదు. పేమెంట్ ఇంకా ప్రాసెస్‌లో ఉన్నట్టు చూపిస్తోంది. కోనసీమ జిల్లా సఖినేటిపల్లికి చెందిన రైతు నాగేశ్వరరావుకు 58 ఏళ్లు. రెండు నెలల క్రితం అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. గుండెకు రక్తం సరఫరా అయ్యే రక్త నాళాల్లో పూడికలు ఉన్నట్టు తేలింది. దీంతో విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో స్టంట్లు వేశారు.అడ్మిట్ అయ్యే సమయంలో ఆరోగ్య ఆసరా డబ్బు జమ చేయడం కోసం ఆరోగ్య మిత్ర ఆయన బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేశారు. చికిత్స పూర్తయ్యాక నాగేశ్వరరావు ఇంటికి చేరుకుని రెండు నెలలైంది. అయినా ఇప్పటి వరకు ఆసరా సాయం అందలేదు. ఆ సొమ్ము వస్తే పౌష్టికాహారం, మందుల ఖర్చుకు ఇబ్బంది ఉండేది కాదని మధనపడుతున్నాడు. పేద ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష గట్టింది. విద్య, వైద్యం, సంక్షేమం.. ఇలా అన్ని విషయాల్లో వారిని వంచిస్తోంది. ఆరోగ్యశ్రీ స్థానంలో బీమాను ప్రవేశపెట్టే క్రమంలో ప్రొసీజర్లకు కోతలు, చికిత్సల అనంతరం రోగులు ఇంట్లో గడిపే విశ్రాంత సమయానికి జీవన భృతి అందించే ఆసరా కార్యక్రమాన్ని అటకెక్కించే చర్యలకు పాల్పడుతోంది. ఇందులో భాగంగా కొద్ది రోజులుగా రోగులకు ఆరోగ్య ఆసరా చెల్లింపును నిలిపి వేసింది. గత ప్రభుత్వంలో రోగులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 24 గంటల్లో భృతి మొత్తం రోగి/కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యేది. ప్రస్తుతం రోగి డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లి కోలుకున్నాక కూడా ఆ సొమ్ము చెల్లించడం లేదు. దీంతో శస్త్ర చికిత్సల అనంతరం విశ్రాంత సమయంలో పేద, మధ్యతరగతి రోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్నారు. నెలకు రూ.5 వేలు2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో కునారిల్లిన ఆరోగ్యశ్రీ పథకాన్ని 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం బలోపేతం చేసింది. ఇందులో భాగంగా 1,059 ప్రొసీజర్లను 3,257కు పెంచారు. వైద్య సేవల పరిమితిని దేశంలో ఎక్కడా లేనట్టుగా రూ.25 లక్షలకు పెంచారు. పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని వ్యక్తులు అనారోగ్యం బారినపడి శస్త్ర చికిత్సల అనంతరం ఇంటి పట్టునే ఉండి విశ్రాంతి తీసుకోవాలంటే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ క్రమంలో పూర్తిగా కోలుకోకుండానే వాళ్లు తిరిగి వృత్తి, ఉపాధి పనుల్లో నిమగ్నం అవుతారు. ఇలా చేయడంతో మళ్లీ వ్యాధులు, జబ్బులు తిరగబెట్టే అవకాశం ఉంటుంది. ఈ సమస్య తలెత్తకుండా పూర్తిగా కోలుకునే వరకు రోగులు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకూడదనే లక్ష్యంతో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కార్యక్రమాన్ని 2019లో ప్రవేశపెట్టారు.ఈ కార్యక్రమం కింద నెట్వర్క్ ఆస్పత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్జి అయిన రోజే వైద్యులు సూచించిన విశ్రాంత సమయానికి రోజుకు రూ.225 లేదా గరిష్టంగా నెలకు రూ.5 వేలు చొప్పున ప్రభుత్వం చెల్లించింది. ఇలా ఐదేళ్లలో 24,59,090 మందికి రూ.1465.67 కోట్ల మేర ఆర్థిక సాయం అందించింది. రూ.30 కోట్ల మేర పెండింగ్ ప్రస్తుత ప్రభుత్వం ఆగస్టు నుంచి ఆసరా చెల్లింపులను నిలిపివేసినట్టు తెలుస్తోంది. ఆసరా ప్రతిపాదనలు పంపినప్పటికీ రోగుల ఖాతాల్లో డబ్బు జమ అవ్వడం లేదని ఆరోగ్య మిత్రలు చెబుతున్నారు. రోగులు, వారి బంధువులు తమకు ఫోన్లు చేస్తుండటంతో ఆన్లైన్లో వెరిఫై చేస్తే పేమెంట్ ప్రాసెస్‌లో ఉందని చూపిస్తోందని వెల్లడించారు. 60–70 రోజులుగా 1.50 లక్షల నుంచి రెండు లక్షల మంది రోగులకు రూ.30 కోట్ల మేర ఆసరా చెల్లింపులు నిలిచిపోయినట్టు సమాచారం. ఆలస్యం లేకుండా రోగుల ఖాతాల్లో డబ్బు జమ చేయడానికి ఆరోగ్య ఆసరాను గత ప్రభుత్వం గ్రీన్ ఛానల్లో ఉంచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రీన్ ఛానల్ నుంచి ఆ పథకాన్ని తొలగించినట్టు తెలుస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్–పీఎం జన్ ఆరోగ్య యోజన పథకం కింద వచ్చే నిధులకు కొంత మేర రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి, బీమా రూపంలో భారం తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఆసరా భారాన్ని కూడా దించేసుకుని చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. -
డీమ్డ్ మెడికల్ కాలేజీల్లో సగం సీట్లపై సర్కారు పట్టు
సాక్షి, హైదరాబాద్: డీమ్డ్ మెడికల్ కాలేజీలకు ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కృత నిశ్చయంతో ఉంది. ఇతర ప్రైవేట్ మెడికల్ కాలేజీల మాదిరిగానే జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనల ప్రకారం డీమ్డ్ మెడికల్ కాలేజీలు కూడా సగం సీట్లను కనీ్వనర్ కోటా కిందే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంటుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఆయా కాలేజీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇతర వర్గాలకు కూడా రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటుందని అంటున్నాయి. డీమ్డ్ వర్సిటీలైనా, ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలైనా సగం సీట్లను కనీ్వనర్ కోటాకు ఇచ్చేలా కొత్త నిబంధనలు తీసుకురావాలని యోచిస్తోంది.ఒకవేళ ఈ నిబంధనలను అమలు చేసేందుకు డీమ్డ్ మెడికల్ కాలేజీలు సహా ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలు ఒప్పుకోకపోతే, మరో రూపంలో ఆయా కాలేజీలను కట్టడి చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల డీమ్డ్ హోదా పొందిన రెండు మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లపై ప్రభుత్వం పట్టుదలతో ఉంది. దీనిపై బుధవారం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్షించనున్నారు.డీమ్డ్ హోదా పొందిన కాలేజీలు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక సదుపాయాలు పొందుతున్నాయని, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల పేరిట ప్రభుత్వ బిల్లులు పొందుతున్నాయని అంటున్నారు. అవసరమైతే కోర్టుకు వెళ్లైనా దీనిపై తేల్చుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. అంతేకాదు నీట్ ఫలితాలు వెలువడి కౌన్సెలింగ్ తేదీలు ప్రకటించిన తర్వాత, డీమ్డ్ హోదా పొందటం న్యాయపరంగా ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.డీమ్డ్‌లో సొంత నిబంధనలపై గరంగరం..రాష్ట్రంలో రెండు మల్లారెడ్డి మెడికల్ కాలేజీలు డీమ్డ్ హోదా దక్కించుకున్నాయి. మరో నాలుగు మెడికల్ కాలేజీలు డీమ్డ్ హోదాకు దరఖాస్తు చేసుకున్నాయి. కనీ్వనర్ కోటా సీట్లను మేనేజ్మెంట్ సీట్లుగా మార్చుకోవడం, ఫీజులు తమకు అవసరమైన రీతిలో వసూలు చేసుకోవడం, రిజర్వేషన్లు ఎత్తేయడం, సొంతంగానే పరీక్షలు పెట్టుకోవడం.. వంటివి ఉంటాయని ఆయా కాలేజీలు చెబుతున్నాయి. నీట్లో ర్యాంకు సాధించిన ప్రతిభ గల, పేద, మధ్య తరగతి విద్యార్థులు డాక్టర్ కావాలన్న ఆశను దెబ్బ కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలున్నాయి. డీమ్డ్ వర్సిటీలుగా మారా లంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదన్న వాదననను ప్రైవేట్ యాజమాన్యాలు తెరపైకి తెస్తున్నాయి.ఇదే జరిగితే మున్ముందు మరిన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డీమ్డ్ హోదా సాధించుకునే అవకాశం ఉంది. అలాగైతే రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని కనీ్వనర్ కోటా సీట్లు మొత్తం మేనేజ్మెంట్ సీట్లుగా మారిపోతాయని అంటున్నారు. దీనివల్ల కన్వీనర్ కోటా ఫీజు ఎత్తేసి మేనేజ్మెంట్ ఫీజులు అమలవుతాయి. డీమ్డ్ హోదా కోసం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నుంచి ఎన్ఓసీ తీసుకోవాల్సిందేనని అంటున్నారు.ఎన్ఎంసీ నుంచి ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి పొందుతున్నందున ప్రభుత్వ అజమాయిషీ లేకుండా ఎలా ఉంటుందంటున్నారు. ఫీజును కూడా ఆయా కాలేజీలు సొంతంగా నిర్ణయించుకునే అధికారం లేదని అంటున్నారు. దీనిపై సీరియస్‌గా ఉన్న మంత్రి రిజర్వేషన్లు రాజ్యాంగం కలి్పంచిన హక్కు అని... దానిని డీమ్డ్ పేరుతో ఎలా కాలరాస్తారని ప్రశి్నస్తున్నారు. -
ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడింది. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ స్పెషాలిటీ అసోసియేషన్(ఆశా) ప్రతినిధులు సేవలు నిలిపివేశారు. ఎమర్జెన్సీ కేసుల్లో మాత్రమే రోగులకు చికిత్సలు అందించారు. ఎమర్జెన్సీ కాని సందర్భాల్లో రోగులకు చికిత్సలు అందించడానికి విముఖత చూపారు. దీంతో దూర ప్రాంతాల నుంచి చికిత్సల కోసం ఆస్పత్రులకు వచి్చన వివిధ అనారోగ్య బాధితులు వెనుదిరిగారు. రూ.2,500 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని లేదంటే ఆగస్ట్ 15 నుంచి సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వానికి నెట్వర్క్ ఆస్పత్రులు గత నెల 30వ తేదీనే అల్టిమేటం ఇచ్చాయి. ఈ నెల 10వ తేదీలోగా కొంత మొత్తం విడుదల చేస్తామని అధికారులు చెప్పినప్పటికీ నిధులు విడుదల చేయలేదు. ఆస్పత్రులు నిర్వహించడం కూడా కష్టంగా ఉంటోందని తేల్చి చెప్పి గురువారం నుంచి సమ్మెలోకి వెళతామని యాజమాన్యాలు తేల్చి చెప్పాయి. దీంతో చేసేదేమీ లేక రూ.200 కోట్లు మాత్రమే బుధవారం ప్రభుత్వం విడుదల చేసింది. మరో రూ.300 కోట్లు త్వరలో విడుదల చేస్తామన్నప్పటికీ సేవల కొనసాగింపునకు ఆస్పత్రులు ససేమిరా అన్నాయి. శుక్రవారం మంత్రులు సత్యకుమార్, లోకేశ్‌లతో భేటీ ఏర్పాటు చేయడంతో అప్పటి వరకూ కేవలం ఎమర్జెన్సీ కేసులకు మాత్రమే సేవలు అందిస్తామని యాజమాన్యాలు ఒప్పుకున్నాయి. -
ఫలించని చర్చలు.. నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యానికి సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. పథకం ఊసే లేకుండా చేయాలని సీఎం చంద్రబాబు నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో పథకం నిర్వహణకు డబ్బులు లేవు.. కేంద్రం అమలు చేసే ఆయుష్మాన్ భారత్ పథకాన్నే ప్రజలు వినియోగించుకోవాలంటూ టీడీపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఉచిత సలహా ఇచ్చారు. మరోవైపు పథకం స్థానంలో బీమా ప్రవేశ పెట్టడానికి సిద్ధమైన బాబు సర్కార్.. నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిల చెల్లింపులో జాప్యం చేస్తోంది. దీంతో ఆస్పత్రుల నిర్వహణ సాధ్యం కావడం లేదని, సిబ్బందికి జీతాల చెల్లింపు, మందులు, కన్జుమబుల్స్ కొనుగోలుకు కూడా డబ్బులు లేవని నెట్వర్క్ ఆస్పత్రులు చేతులెత్తేశాయి. గురువారం నుంచి పథకం సేవలను నిలిపి వేయడానికి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) సిద్ధమైంది. బకాయిలు చెల్లిస్తే గానీ సేవలు కొనసాగించలేమని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవో లక్ష్మిషాకు బుధవారం అసోసియేషన్ ప్రతినిధులు తేల్చిచెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల యాజమాన్య అసోసియేషన్ ప్రతినిధులతో సీఈవో అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. ప్రస్తుతం రూ.200 కోట్లు విడుదల చేశామని, త్వరలో మరో రూ.300 కోట్లు ఇస్తామని సీఈవో వెల్లడించినట్టు తెలిసింది. ఇలా అరకొర నిధులతో ఆస్పత్రులను నడపలేమని వారు తేల్చి చెప్పినట్లు సమాచారం. బకాయిలు రూ.2500 కోట్లు వెంటనే విడుదల చేయాలని లేదంటే ఆగస్టు 15 నుంచి సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వానికి నెట్వర్క్ ఆస్పత్రులు గత నెల 30వ తేదీనే అల్టిమేటం ఇచ్చాయి. తొలుత ఈ నెల 10వ తేదీలోగా కొంత మొత్తం విడుదల చేస్తామని అధికారులు చెప్పారు. రెండు వారాల తర్వాత బుధవారం రాత్రి కేవలం రూ.200 కోట్లు మాత్రమే విడుదల చేసిన ప్రభుత్వం.. సేవలు కొనసాగించాలని కోరింది. ఈ మేరకు సీఈవో లక్షిషా ఆస్పత్రుల యాజమాన్యాలను కోరగా, వారు ససేమిరా అన్నట్లు సమాచారం. దీంతో శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్‌తో సమావేశం ఏర్పాటు చేస్తామని సీఈవో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంతో కేవలం అత్యవసర కేసులు మాత్రమే చూసేందుకు యాజమాన్య అసోసియేషన్ ప్రతినిధులు సమ్మతించారు. మొత్తం బకాయిలు చెల్లించే వరకు పూర్తి స్థాయిలో సేవలు అందించలేమని స్పష్టం చేశారు. ప్రజారోగ్య పరిరక్షణలో అత్యంత కీలకమైన పథకానికి నిధులు చెల్లించడంలో తీవ్ర జాప్యం చేస్తుండటం పట్ల ఆస్పత్రుల యాజమానులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆరోగ్యశ్రీ బకాయిలపై సర్కార్ బెదిరింపులు.. రేపటి నుంచి సేవలు బంద్?
సాక్షి, అమరావతి: ఏపీలో ఆరోగ్యశ్రీపై కూటమి సర్కార్ శీతకన్ను వేసింది. బకాయిలు చెల్లించకపోవడమే కాకుండా డబ్బులు అడిగిన ఆసుపత్రులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బకాయిలు చెల్లించకపోతే రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వాన్ని అసోసియేషన్ హెచ్చరించింది. ఈ సందర్భంగా నెట్వర్క్ ఆసుపత్రులు సభ్యులు మాట్లాడుతూ..‘ఆరోగ్యశ్రీ బకాయిలు అడిగితే వేధిస్తున్నారు. తనిఖీల పేరుతో కేసులు పెడుతున్నారు. వారం వ్యవధిలో పలు ఆసుపత్రుల్లో తనిఖీల పేరుతో హడావుడి చేశారు. అనంతపురంలో చంద్ర, క్రాంతి ఆసుపత్రులపై.. అలాగే విజయవాడలో క్యాపిటల్, గుంటూరులో శ్రావణి ఆసుపత్రుల్లో తనిఖీలు చేపట్టారు.డబ్బులు అడిగినందుకు ఇలా కేసులు నమోదు చేసి బెదిరింపులకు దిగుతున్నారు. ఇక, రాష్ట్రంలో ఇప్పటికే రూ.2500 కోట్లకు ఆరోగ్యశ్రీ బకాయిలు చేరుకున్నాయి. ఇప్పటి వరకు చంద్రబాబు కూటమి సర్కార్ ఆరోగ్యశ్రీకి ఇచ్చింది కేవలం రూ.160 కోట్లు మాత్రమే చెల్లించారు. బకాయిలపై నోరెత్తకుండా వేధిస్తున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆరోగ్యానికి తగ్గిన ‘శ్రీ’
సాక్షి, హైదరాబాద్: రెండ్రోజుల క్రితమే ఆరోగ్యశ్రీ చికిత్సల ప్యాకేజీని పెంచారు. కొత్తగా మరికొన్ని వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. అలాగే ఆరోగ్యశ్రీ కింద కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. కానీ ఈ బడ్జెట్లో మాత్రం ఆరోగ్యశ్రీకి నిధులను తగ్గించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతఏడాది బడ్జెట్లో ఆరోగ్యశ్రీకి రూ.1,101 కోట్లు కేటాయించగా, ఇప్పుడు రూ.1,065 కోట్లకు పరిమితం చేశారు. వాస్తవంగా చికిత్సల ప్యాకేజీ, కవరేజీ పెంపుతో అధికంగా నిధులు కేటాయించాల్సి ఉందన్న చర్చ జరుగుతోంది. ఇక మొత్తంగా వైద్య, ఆరోగ్యశాఖ బడ్జెట్ కేటాయింపులు కూడా తగ్గాయి. ఈ బడ్జెట్లో వైద్యరంగానికి ప్రభుత్వం రూ.11,468 కోట్లు కేటాయించింది. గత ఏడాది బీఆర్ఎస్ సర్కారు వైద్య, ఆరోగ్య శాఖకు బడ్జెట్లో రూ.12,161 కోట్లు కేటాయించింది. గతేడాది బడ్జెట్‌తో పోలిస్తే ఈ శాఖ కేటాయింపులు రూ.693 కోట్లు తగ్గాయి. కాగా బడ్జెట్లో నర్సింగ్ కాలేజీల నిర్మాణాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ కాలేజీల నిర్మాణం కోసం రూ.200 కోట్లు కేటాయించారు. మెడికల్ కాలేజీలకు రూ.542 కోట్లు..మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం రూ.542 కోట్లు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు రూ.260 కోట్లు, బోధనాస్పత్రుల్లో డయాగ్నస్టిక్స్, పరికరాల కోసం రూ.360 కోట్లు కేటాయించారు. వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల అప్‌గ్రేడింగ్ కోసం రూ.249 కోట్లు, ఆయా ఆస్పత్రుల్లో వైద్య పరికరాల కొనుగోలుకు రూ.115 కోట్లు కేటాయించారు. అలాగే ఈ ఆస్పత్రుల్లో శానిటరీ, రోగుల సేవలకు మరో రూ.114 కోట్లు కేటాయించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతం కోసం రూ. 51 కోట్లు, అమ్మఒడి కోసం రూ. 141 కోట్లు, 102 వాహనాల కోసం రూ. 17.62 కోట్లు, 108 కోసం రూ.19.53 కోట్లు, 104కు రూ.21 కోట్లు ఇచ్చారు. నిమ్స్‌లో అత్యవసర వైద్య పరికరాల కోసం రూ.49 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కలిగిన డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును జారీ చేసే విధానాన్ని త్వరలోనే ప్రవేశ పెడుతున్నామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ.150 కోట్లు కేటాయించింది. అలాగే ప్రగతి పద్దులో వైద్యవిద్య సంచాలకులకు రూ.2,656 కోట్లు, ప్రజారోగ్య సంచాలకులకు రూ.558 కోట్లు, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి రూ.1,762 కోట్లు, ఆయుష్కు రూ.117 కోట్లు, ఔషధాల కొనుగోళ్ల కోసం రూ. 377 కోట్లు, మాతాశిశు సంరక్షణ కిట్ (ఎంసీహెచ్– గతంలో కేసీఆర్ కిట్)కు రూ. 200 కోట్లు కేటాయించారు. ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకిసాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షనేత హోదాలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2024–25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో కేసీఆర్ బంజారాహిల్స్‌లోని నందినగర్ నివాసం నుంచి అసెంబ్లీకి వచ్చారు. సాధారణ ఎమ్మెల్యేలు వచ్చే రెండో నంబర్ గేట్ నుంచి అసెంబ్లీకి వచ్చిన ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నేరుగా తనకు కేటాయించిన చాంబర్లోకి వెళ్లారు. శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు కేసీఆర్‌ను కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. శాసనసభలోకి వెళ్లిన కేసీఆర్ స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు అభివాదం చేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కేటాయించిన సీటులో కూర్చొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వచ్చి కేసీఆర్‌ను కలిశారు. సభలో అప్పటికే భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం సాగుతుండగా, కేసీఆర్ ఆసక్తిగా వింటూ పాయింట్స్ నోట్ చేసుకున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ అంశంపై బడ్జెట్ ప్రసంగం సాగుతున్న సమయంలో ఎమ్మెల్యే హరీశ్‌రావును పిలిచి చర్చించడం కనిపించింది. భట్టి బడ్జెట్ ప్రసంగం పూర్తికాకముందే కేసీఆర్ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ హాలు నుంచి బయటకు వచ్చారు. మీడియాపాయింట్ ఎక్కడ అని ఎమ్మెల్యేలను అడిగారు. నేరుగా మీడియా పాయింట్‌కు చేరుకొని ఎమ్మెల్యేలతో కలిసి బడ్జెట్‌పై తన అభిప్రాయం తెలియజేశారు. కాగా 20ఏళ్ల తర్వాత కేసీఆర్ మీడియా పాయింట్ నుంచి మాట్లాడడం ఇదే తొలిసారి అని సీనియర్ పాత్రికేయులు వ్యాఖ్యానించారు. 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అప్పట్లో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన రేగులపాటి పాపారావుతో కలిసి మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడిన విషయాలను వారు గుర్తు చేశారు. -
వేర్వేరుగా రేషన్, ఆరోగ్యశ్రీ కార్డులు
సాక్షి, హైదరాబాద్: అర్హులైన పేదలకు రేషన్‌కార్డులు మంజూరు చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు వేర్వేరుగా ఇస్తామన్నారు. రేషన్‌కార్డు నిబంధనలతో పోలిస్తే.. ఆరోగ్యశ్రీ కార్డు నిబంధనలు కాస్త భిన్నంగా ఉండడంతో ఈ మేరకు నిర్ణయించామని చెప్పారు. అతి త్వరలో మంత్రివర్గ ఉపసంఘం రేషన్ కార్డులపై భేటీ అవు తుందని, ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రభు త్వానికి నివేదించిన తర్వాత మార్గదర్శకాలు జారీ చేస్తామ న్నారు. ఆ తర్వాత క్షేత్రస్థాయి నుంచి నిర్ణీత ఫార్మాట్లో దరఖాస్తులు స్వీకరిస్తామని వివరించారు. ఇప్పటికే స్వీకరించిన దరఖాస్తులు భద్రంగా ఉన్నా, మరింత లోతైన సమా చారం కోసం దరఖాస్తుల స్వీకరణ అనివార్యమని మంత్రి వెల్లడించారు. బుధవారం శాసనమండలిలో సభ్యులు తాతా మధుసూదన్, వాణీదేవి, జీవన్‌రెడ్డి తదితరులు లేవనెత్తిన అంశాలపై మంత్రి స్పందిస్తూ పైవిధంగా సమాధానమి చ్చారు. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కకార్డు కూడా జారీ చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.15వేల సాయం చేస్తామ ని చెప్పినా, అమలు కాలేదంటూ వాణీదేవి తదితరులు సభలో ప్రస్తావించగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన రూ.7,500 కోట్లు రైతులకు అందించినట్టు వెల్లడించారు. రైతుభరోసా పథకానికి సంబంధించి విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదని, ఈ అంశంపై మంత్రివర్గంతోపాటు అన్నిరంగాల నిపుణులు, ప్రజాసంఘాల అభిప్రాయాలను సేకరిస్తున్నా మన్నారు. ఈ అంశంపై ఉభయసభల్లో చర్చించి ఆమోదం పొందిన తర్వాతే రైతుభరోసా అమలు చేస్తామని చెప్పారు. అర్హత ఉన్న రైతులకే భరోసా దక్కుతుందని, గత ప్రభుత్వం రైతులు కాని వారికి కూడా సాయం చేసిందన్నారు. కానీ ఈసారి సాగుచేసే రైతులకు తప్ప కుండా భరోసా అందిస్తామని మంత్రి వివరించారు. ఇందిరమ్మ గృహలక్ష్మి పథకం కింద రూ.5 లక్షల సాయం అందిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకం కింద పేదలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. గృహజ్యోతి నిరంతర ప్రక్రియ: ఉపముఖ్యమంత్రి భట్టిరెండువందల యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారికి గృహజ్యోతి పథకం కింద ఉచిత కరెంట్ అందిస్తున్నామని, మార్చి 1 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క మండలిలో స్పష్టం చేశారు. ఈ పథకం నిరంతరం కొనసాగుతుందన్నారు. చెల్లుబాటు ఆహారభద్రత, రేషన్‌కార్డులున్నవారు ఈ పథకా నికి అర్హులని, ఇతరత్రా కారణాలతో ఒక్కోసారి 200 యూని ట్ల కంటే ఎక్కువ బిల్లు వచ్చినప్పుడు జీరో బిల్లు రాదని, ఆ తర్వాతి నెలలో 200 కంటే తక్కువ బిల్లు వస్తే తిరిగి జీరో బిల్లు అమలవుతుందన్నారు. ఈ పథకం కింద అర్హులుంటే ఎప్పటికప్పుడు వారికి పథకాన్ని వర్తింపజే స్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటివరకు 1.79కోట్ల మంది ఈ పథకం కింద లబ్ధి పొందారని, రూ.2వేల కోట్లు ఖర్చు చేసి నట్టు మంత్రి వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడినప్పు డు మిగులు బడ్జెట్‌తో ఉంటే..పదేళ్లలో అప్పులపాలు చేసి ఆర్థిక వ్యవ స్థను అస్తవ్యస్తం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవ స్థను గాడిన పెడుతూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తు న్నామని, ఒక్కో సమస్యను పరిష్క రిస్తున్నట్టు వివరించారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను త్వరలోనే విడుదల చేస్తామని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేత నాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.గుండు సున్నా వచ్చినా.. బుద్ధి మారకుంటే ఎలా? శాసనసభలో బీఆర్ఎస్పై సీఎం రేవంత్ విమర్శలు అభిప్రాయాలు తీసుకుందామనుకుంటే.. వివాదాలు రేపుతున్నారు బయటికి పంపిస్తే.. బతుకు జీవుడా అంటూ వెళ్లిపోదామనుకుంటున్నారు మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: అందరి అభిప్రాయాలు, సలహాలు స్వీకరించి ముందుకెళ్లే మంచి సంప్రదాయాన్ని అసెంబ్లీలో నెలకొల్పుదామనుకుంటే.. బీఆర్ఎస్ సభ్యులు సభను దురి్వనియోగం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. మాజీ మంత్రి కేటీఆర్ సత్యదూరమైన అంశాలను ప్రస్తావిస్తూ.. పాపాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ‘‘బీఆర్ఎస్ ఏదో పోరాటం చేసినట్టు, ఆ పోరాటానికి ఢిల్లీ దద్దరిల్లినట్టు, పదేళ్లు చెమటోడ్చి తెలంగాణ అభివృద్ధిని ఆకాశంలోకి తీసుకెళ్లినట్టు చెప్పే ప్రయత్నం మంచిది కాదు. కాంగ్రెస్ రూ.14,500 కోట్ల మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని అప్పగించింది. అప్పుడు ఏడాదికి రూ.6,500 కోట్లు అప్పులు కట్టాల్సి వచ్చేది. అదే ఇప్పుడు నెలకు రూ.6, 500 కోట్లు అప్పుల కింద కడుతున్నాం. మిత్తీలు కట్టీ కట్టీ నడుము వంగిపోయే పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని పెట్టి వెళ్లారు. ఏదో ఉద్ధరించినట్టు చెప్తున్నారు. కేన్సర్, ఎయిడ్స్ లాంటి రోగాలున్నా కూడా ఎర్రగా, బుర్రగా ఉన్నాను కాబట్టి పెళ్లి పిల్లను చూడాలని అడిగినట్టు ఉంది..’’అని రేవంత్ ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని దివాళా తీయించారని, ఎక్కడి బిల్లులు అక్కడే పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. అసలు విషయాలను పక్కనపెట్టి వివాదాలు రేపితే అసెంబ్లీ నుంచి బయటికి పంపిస్తారనే ఉద్దేశంతో, బతుకు జీవుడా అంటూ వెళ్లిపోవాలని బీఆర్ఎస్ సభ్యులు చూస్తున్నారని విమర్శించారు. ‘‘అలా పంపవద్దు, బీఆర్ఎస్ వారు ప్రజలకు సమాధానం చెప్పించాల్సిందే. అన్ని వివరాలు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బయటపెడతా..’’అని రేవంత్ పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుండు సున్నా వచ్చినా కూడా బుద్ధి మారకపోతే ఎలాగని వ్యాఖ్యానించారు. -
ఆరోగ్యశ్రీ సేవలు ఆగలేదు
సాక్షి, అమరావతి/అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో ఎక్కడా ఆరోగ్యశ్రీ సేవలు ఆగలేదని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. కానీ టీడీపీ, బీజేపీ నాయకులు పనిగట్టుకుని ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయాయని విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ధైర్యం ఉంటే ఆరోగ్యశ్రీ సేవలపై పచ్చ నేతలు బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. ఈ మేరకు మల్లాది విష్ణు శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు యథాతథంగా కొనసాగుతున్నాయి. ఎక్కడా అంతరాయం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.అయినా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయంటూ కొన్ని పత్రికలు అబద్ధాలు వండివారుస్తూ పేదలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పేదల సంపూర్ణ ఆరోగ్యానికి భరోసా కలి్పస్తూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నిరీ్వర్యం చేసిన టీడీపీకి ఈ పథకం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. టీడీపీ హయాంలో కేవలం తెల్ల రేషన్‌కార్డు కలిగిన కుటుంబాలకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తించేది. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక తెల్ల రేషన్‌కార్డు కలిగిన కుటుంబాలతోపాటు రూ.5లక్షలలోపు ఆదాయం ఉన్న మధ్య తరగతి కుటుంబాలకు కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో 1.42కోట్లకు పైగా కుటుంబాలకు ప్రస్తుతం ఆరోగ్యశ్రీ వర్తిస్తోంది.దీనిని తెలుగుదేశం నేతలు కాదనగలరా?.. టీడీపీ హయాంలో కేవలం 1,059 మాత్రమే ఉన్న ప్రొసీజర్లను సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం 3,257కి పెంచింది. ఉచిత వైద్య పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతూ సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ పాలనలో కేవలం 919 ఆస్పత్రులకు మాత్రమే పరిమితమైన ఆరోగ్యశ్రీ సేవలను మా ప్రభుత్వం 2,371 ఆస్పత్రులకు విస్తరించింది. ఇతర రాష్ట్రాల్లోని నెట్వర్క్ ఆస్పత్రులను 72 నుంచి 204కి పెంచింది. టీడీపీ పాలనలో ఆరోగ్యశ్రీ నిధులన్నీ చంద్రబాబు దురి్వనియోగం చేయగా, నేడు గ్రీన్ చానల్ ద్వారా పారదర్శకంగా చెల్లింపులు జరుగుతున్నాయి. ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ ద్వారా 42.91లక్షల మందికి రూ.13,471కోట్ల విలువైన వైద్యసేవలు అందించాం2023–24 ఆరి్థక సంవత్సరానికి సంబంధించి నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.3,566కోట్లు చెల్లించింది. 2024–25 ఆరి్థక సంవత్సరంలో తొలి రెండు నెలల్లో రూ.366కోట్లు చెల్లించగా, తాజాగా మరో రూ.200కోట్ల బకాయిలు విడుదల చేసింది. అదేవిధంగా ప్రజలకు ఇంటి వద్దే వైద్యసేవలు అందించేలా ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం అమలుచేసింది. ప్రభుత్వ వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు రూ.16,852కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతోపాటు నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి చేసింది.గత ఐదేళ్లలో వైద్యశాఖలో సుమారు 54వేల పోస్టులను భర్తీ చేసింది. ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రులలో పేదలకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందుతున్నాయి. నీతి ఆయోగ్ విడుదల చేసిన ఆరోగ్య సూచీల్లో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉంది. ప్రజలకు డిజిటల్ వైద్యసేవలు, పౌరులకు టెలీ మెడిసిన్ సేవల కల్పనలోనూ ఏపీ తొలి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడి ఆరోగ్య అవసరాలు తీర్చడమే లక్ష్యంగా సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అహరి్నశలు పనిచేస్తోంది.’ అని విష్ణు పేర్కొన్నారు. -
బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్రంలోని 1.40 కోట్లకుపైగా కుటుంబాలకు ఆపద్బాంధవి. దురదృష్టవశాత్తు ఏదైనా జబ్బు చేస్తే ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని కార్పొరేట్ ఆస్పత్రులకు వెళితే చేతి నుంచి రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా చికిత్స అందుతోంది. ఏదైనా శస్త్ర చికిత్స జరిగినా డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లాక విశ్రాంత సమయంలో సైతం ప్రభుత్వం ఆరోగ్య ఆసరా ద్వారా భృతి కూడా ఇస్తోంది. వెరసి పేద, మధ్య తరగతి కుటుంబాలకు కష్టకాలంలో ఈ పథకం కొండంత అండగా నిలుస్తోంది. ఇంతటి గొప్ప పథకంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శీతకన్ను వేశారు. నాడు వైఎస్సార్‌కు, నేడు సీఎం జగన్‌కు ఎంతో మంచి పేరు తెచ్చిన ఈ పథకాన్ని ఏదోరకంగా కనుమరుగు చేయాలని కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలో 2014–19 మధ్య ఈ పథకానికి పూర్తిగా ప్రాధాన్యం తగ్గించారు. ప్రొసీజర్లు, నెట్వర్క్ ఆస్పత్రుల సంఖ్యను పెంచకుండా అధికారం లోంచి దిగిపోయేనాటికి అంపశయ్య పైకి ఎక్కించారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ ఈ పథకానికి ఊపిరిలూదారు. దీంతో బాబుకు మింగుడు పడలేదు. ఇలా అయితే లాభం లేదనుకుని పెద్ద స్కెచ్చే వేశారు. బీమా పేరుతో మాయ చేసి, మేనిఫెస్టోలో ఆరోగ్యశ్రీ ప్రస్తావనే లేకుండా చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇటీవల టీడీపీ, జనసేన పారీ్టలు ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశాయి. వైద్యం, ఆరోగ్యం అంటూ నాలుగు అంశాలను పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని మెరుగ్గా అమలు పరుస్తామని గానీ, పేద ప్రజలకు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు (క్యాష్ లెస్ ట్రీట్మెంట్), రోగ నిర్ధారణ పరీక్షల సౌకర్యం కల్పిస్తామని ఎక్కడా ప్రస్తావించలేదు. దీన్నిబట్టి బాబు వస్తే ఆరోగ్యశ్రీ పథకం కనుమరుగవుతుందనడానికి టీడీపీ మేనిఫెస్టో ఒక సంకేతం అని రాజకీయ విశ్లేషకులు, వైద్య రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.రాష్ట్రంలో ప్రస్తుతం డాక్టర్ వైఎస్సార్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తోంది. ట్రస్ట్‌లో ఎంప్యానెల్డ్ అయిన ఆస్పత్రుల్లో పేదలు, మధ్యతరగతి కుటుంబాల వారు చేతి నుంచి నగదు చెల్లించకుండానే పూర్తి స్థాయిలో చికిత్సలు పొందుతున్నారు. కాగా, టీడీపీ తాజా హామీని గమనించినట్లయితే వాళ్లు అధికారంలోకి వస్తే.. ట్రస్ట్ స్థానంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఏజెన్సీలను ప్రవేశపెట్టనున్నారని ఇట్టే తెలుస్తోంది. ఇప్పటి వరకు ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభు త్వమే నేరుగా పథకాన్ని అమలు చేయడంతో ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు వైద్య సేవలు అందుతున్నా యి. అదే ఇన్సూరెన్స్ ఏజెన్సీల చేతుల్లోకి వెళితే వారి లాభాపేక్ష వల్ల ప్రజలకు వైద్య సేవల కల్పన ప్రశ్నార్థకంగా మారుతుందనడంలో సందేహమే లేదు. ట్రస్ట్ అయితే అందులో ఎంప్యానెల్డ్ అయిన ఆస్పత్రులు ఏ ప్రొసీజర్స్‌కు అయి నా నిర్ధే శించిన రేట్స్ ప్రకారమే వైద్య సేవలు అందిస్తాయి. అంతకు మించి ప్రజల నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడ్డానికి వీలుండదు. అలా వసూళ్లకు పాల్పడితే జిల్లా స్థాయిలో కలెక్టర్లు, రాష్ట్ర స్థాయిలో ట్రస్ట్ సీఈవో ఆధ్వర్యంలో ఆస్పత్రులపై చర్యలు తీసుకునే ఒక వ్యవస్థ ఉంటుంది. అదే ప్రైవే ట్ ఇన్సూరెన్స్ ఏజెన్సీలు వస్తే ఆస్పత్రులపై ప్రభుత్వ నియంత్రణ పోతుంది. ఇష్టారాజ్యంగా బిల్లులు వేసి ప్రజల నుంచి అదనపు వసూళ్లు చేస్తాయి. లేదంటే ఆస్పత్రి నుంచి బయటకు పంపించేస్తాయి. ఆరోగ్యశ్రీ ప్రస్తావనే లేని 2024 టీడీపీ మేనిఫెస్టో ∗ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వరకూ ఆరోగ్య బీమా ∗ ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డు ∗ అన్ని మండలాల్లో జనరిక్ ఔషధ కేంద్రాలు ∗ బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులకు జనరిక్ మందులు 2024 వైఎస్సార్సీపీ మేనిఫెస్టో ∗ రాష్ట్రంలో ప్రారంభించిన ఐదు వైద్య కళాశాలలతో పాటు, మరో 12 కళాశాలల నిర్మాణం పూర్తి చేసి ఐదేళ్లలో అందుబాటులోకి తేవడం.తద్వారా 2,550 ఎంబీబీఎస్, 2,737 పీజీ మెడికల్ సీట్లు సమకూర్చడం.∗ కొత్తగా 17 నర్సింగ్ కాలేజీలు తేవడం ద్వారా అందుబాటులోకి 1,020 నర్సింగ్ సీట్లు. ∗ హృద్రోగ బాధితుల కోసం విశాఖ, గుంటూరు, కర్నూలులో మూడు వైద్య హబ్‌ల ఏర్పాటు. ∗ క్యాన్సర్ వైద్యాన్ని మరింత బలోపేతం చేసేలా గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో క్యాన్సర్ కేర్ సెంటర్లు.∗ గడచిన ఐదేళ్లలో మాదిరిగానే వచ్చే ఐదేళ్లలోనూ ప్రజారోగ్య రంగానికి ఏ మాత్రం ప్రాధాన్యం తగ్గకుండా చర్యలు. వైద్య రంగ అభివృద్ధిని కొనసాగిస్తాం. పై రెండు మేనిఫెస్టోలు గమనిస్తే ప్రజారోగ్యం పట్ల ఏ నాయకుడికి ఎంత చిత్తశుద్ధి ఉందో స్పష్టంగా అర్థం అవుతుంది. మూడు సార్లు సీఎంగా పనిచేశా.. విజనరీనని చెప్పుకునే నాయకుడు ప్రజారోగ్యం పట్ల ఉజ్జాయింపుగా నాలుగంటే నాలుగే హామీలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. సీఎం జగన్ మాత్రం ప్రజారోగ్యం విషయంలో గడచిన ఐదేళ్లలో దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా ప్రజారోగ్యం విషయంలో రాజీ పడకుండా చర్యలు తీసుకున్నారు. ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచారు. ఆ ఒరవడిని అదే విధంగా కొనసాగిస్తూ వచ్చే ఐదేళ్లలోను ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తానని తన మేనిఫెస్టోలో ప్రకటించారు. సాక్షి, అమరావతి: వైద్య, విద్యా రంగాలను ప్రైవేట్ పరం చేయాలన్నది చంద్రబాబు లక్ష్యం. ఇందులో భాగంగానే తొలి నుంచీ ఆయన ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తూ వచ్చారు. 2014 ఎన్నికల సమయంలో ‘ఆరోగ్యశ్రీలో వ్యాధులన్నింటినీ చేర్చి, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత పరీక్షలు, చికిత్స, ఆపరేషన్ సౌకర్యం కల్పిస్తాం’ అని టీడీపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక తూతూ మంత్రంగా ప్రొసీజర్లను పెంచి చేతులు దులుపుకున్నారు.2007లో వైఎస్సార్ హయాంలో 942 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి ప్రారంభిస్తే, చంద్రబాబు ప్రభుత్వం పథకాన్ని ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చి, కేవలం 117 వ్యాధులను మాత్రమే పెంచింది. అయినా వాటికి ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స సరిగా అందని దుస్థితి. వివిధ అనారోగ్య బాధితులకు చికిత్సలు అందించడానికి ఆస్పత్రుల నుంచి ట్రస్టుకు అభ్యర్థనలు వచ్చినా వాటిని రోజుల తరబడి పెండింగ్‌లో ఉంచేవారు.దీంతో చేసేదేమీ లేక చికిత్సలు చేయించుకోవడానికి ప్రజలు అప్పులపాలైన దుస్థితి. ఈ ఐదేళ్ల పాలనలో ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి, విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి సీఎం జగన్ ప్రజలకు అండగా నిలిచారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.5 లక్షల్లోపు వార్షికాదాయ కుటుంబాలను పథకం పరిధిలోకి తెచ్చి, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి రక్షగా నిలిచారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.25 లక్షల వరకు వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు.1,059గా ఉన్న ప్రొసీజర్లను ఏకంగా 3,257కు పెంచారు. తద్వారా ఐదేళ్లలో 45.10 లక్షల మందికి ఉచిత చికిత్సల కోసం రూ.13,421 కోట్లు వెచ్చించారు. ఆరోగ్య ఆసరా కింద రూ.1,465 కోట్ల మేర శస్త్ర చికిత్సలు చేయించుకున్న 24.59 లక్షల మందికి సాయం చేశారు.జగన్, బాబు పాలన మధ్య ఎంతో తేడా! అంశం: కొత్త వైద్య కళాశాలలు జగన్ పాలన: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు. ఇందుకోసం ఏకంగా రూ.8,480 కోట్లు వెచ్చిస్తున్నారు. అన్ని ప్రాంతాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు చేరువ చేస్తున్నారు. ఇప్పటికే విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను ప్రారంభించి ఒకే ఏడాది 750 ఎంబీబీఎస్ సీట్లలో అడ్మిషన్లు కల్పించారు. ఈ విద్యా సంవత్సరం మరో ఐదు, వచ్చే విద్యా సంవత్సరం మిగిలిన ఏడు కళాశాలలు ప్రారంభించేలా ప్రణాళికలు రచించారు. బాబు పాలన: టీడీపీ అధికారంలో ఉండగా ఏ రోజు ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలల ఏర్పాటుకు పాటుపడింది లేదు. వైద్య విద్యను వ్యాపారం చేసి తన వాళ్ల జేబులు నింపడానికే పాటుపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 16 ప్రైవేట్ వైద్య కళాశాలలకు బాబు పాలనలో అనుమతులు ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. అంశం : గ్రామీణ ప్రజల ఆరోగ్యం జగన్ పాలన: పీహెచ్సీ వైద్యులనే గ్రామాలకు పంపి ప్రజలకు వైద్య సేవలు అందించారు. మంచానికే పరిమితం అయిన రోగుల ఇళ్ల వద్దకే వెళ్లి, వారి ఆరోగ్యాలపై వాకబు చేశారు. 2,500 జనాభాకు ఒకటి చొప్పున 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేశారు. వీటిల్లో బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత కలిగిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో)లను నియమించారు. తద్వారా 12 రకాల వైద్య సేవలు, 14 రకాల వైద్య పరీక్షలతో పాటు, 105 రకాల మందులను అందుబాటులో ఉంచి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. వీటికి తోడు విలేజ్ క్లినిక్స్‌లో టెలీ మెడిసిన్ సౌకర్యం ఉండటంతో స్పెషలిస్ట్ వైద్యుల కన్సల్టేషన్ సైతం ఇక్కడే లభిస్తుండటంతో పట్టణాలు, నగరాల్లోని పెద్దాస్పత్రులకు ప్రజలు వెళ్లాల్సిన అవసరం ఉండటం లేదు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వమే ఇళ్ల వద్దకు మందుల డోర్ డెలివరీ ప్రారంభించింది. బాబు పాలన: పల్లె ప్రజలకు సుస్తీ చేస్తే పట్టణాలు, నగరాలకు పరుగులు తీయాల్సిందే. ఫ్యామిలీ డాక్టర్ వంటి కార్యక్రమం ఉండేది కాదు. విలేజ్ క్లినిక్ వ్యవస్థ ఊసే లేదు. పీహెచ్‌సీలకు వెళితే అక్కడ డాక్టర్లు ఉంటారో లేదో తెలియని దుస్థితి. దీంతో చిన్న అనారోగ్య సమస్య వచ్చినా, వ్యయప్రయాసలకోర్చి పరుగు తీయాల్సిన పరిస్థితి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందుల పంపిణీ, క్రమం తప్పకుండా వారి ఆరోగ్యంపై వాకబు చేసే వ్యవస్థ లేక, ప్రజలు జబ్బు ముదిరి అప్పులపాలయ్యేవారు. అంశం : ఇంటింటా ఆరోగ్య సర్వే జగన్ పాలన: అందరి ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్షను ప్రవేశపెట్టింది. ప్రతి ఇంటిని జల్లెడ పట్టి, వైద్య పరీక్షలు నిర్వహించి వివిధ అనారోగ్య బాధితులను గుర్తించారు. వారికి పట్టణాలు, గ్రామాల్లో ఎక్కడికక్కడ సురక్ష శిబిరాలు నిర్వహించి స్పెషలిస్టు వైద్యులతో ఉచితంగా వైద్య సేవలు అందించారు. మెరుగైన వైద్యం అవసరం ఉన్న వారిని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు తరలించి, ఉచితంగా చికిత్స చేయించారు. బాబు పాలన: ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమం నిర్వహించిందే లేదు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి ఆరోగ్యాన్ని వాకబు చేసి, వాటి పరిష్కారానికి కనీసం ఆలోచించిన పాపాన పోలేదు. అంశం: ఆస్పత్రుల్లో నాడు–నేడు జగన్ పాలన: వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే నాడు–నేడు కార్యక్రమంల ద్వారా ఆస్పత్రుల రూపురేఖలు మార్చేశారు. రూ.16,880 కోట్లతో ఆస్పత్రుల భవనాలకు మరమ్మతులు, పాతవాటి స్థానంలో కొత్తవాటి నిర్మాణం, 17 కొత్త వైద్య కళాశాలలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టారు. జాతీయ ప్రమాణాలతో ఆస్పత్రుల్లో వనరులను సమకూర్చారు. దీంతో 640 ఆస్పత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ (ఎన్‌క్వాష్), 42 ఆస్పత్రులకు ముస్కాన్, 2022–23లో 3,161 ఆస్పత్రులకు కాయకల్ప గుర్తింపుతో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ నిలిచింది.కేరళ సైతం ఈ అంశాల్లో ఏపీ కన్నా ఎంతో వెనుకబడి ఉంది. ఆస్పత్రుల్లో ఏ ఒక్క వైద్య, సిబ్బంది పోస్టు ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా ఐదేళ్లలో 54 వేల మేర పోస్టులు భర్తీ చేసి రికార్డు సృష్టించారు. 108 వ్యవస్థకు ఊపిరిలూదుతూ రూ.136 కోట్లతో 768 అంబులెన్స్‌లు సమకూర్చి సేవలు విస్తరించారు. ఫ్యామిలీ డాక్టర్ అమలు కోసం రూ.166 కోట్లతో 104 వాహనాలు సమకూర్చారు. మొత్తం 936 వాహనాలు సేవలందిస్తున్నాయి. బాబు పాలన: రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేసేలా టీడీపీ జమానాలో ఏ ఒక్క కార్యక్రమం చేపట్టలేదు. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది, మందులు, సర్జికల్స్, ఇతర వనరులకు తీవ్ర కొరత ఉన్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగానే బాబు వ్యవహరించారు. 2014–19 మధ్య గుంటూరు జీజీహెచ్‌లో ఎలుకలు కొరికి శిశువు మృతి చెందడం బాబు పాలనలో దిగజారిన ప్రభుత్వ వైద్య రంగ దుస్థితికి నిదర్శనం. ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన అనంతరం గుణపాఠంతో ఆస్పత్రులను బలోపేతం చేసేలా అడుగులు వేయలేదు. ఐదేళ్ల బాబు పాలనలో కేవలం 4 వేల మేర పోస్టులను మాత్రమే వైద్య శాఖలో భర్తీ చేశారు. బాబు పాలనలో 108, 104 వ్యవస్థలు కూనరిల్లాయి. ఎవరు కావాలో ఆలోచించండి రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగాన్ని ఇంతగా నిర్వీర్యం చేసిన నేత ఒక్క చంద్రబాబు తప్ప దేశంలో మరొకరుండరు. సింగపూర్, యూకే ప్రపంచ స్థాయి రాజధాని అంటూ బాబు బాకాలు ఊదిన అమరావతికి కూత వేటు దూరంలోని గుంటూరు జీజీహెచ్‌లోనే అప్పట్లో శిశువును ఎలుకలు కొరికి చంపేశాయి. 2019లో అధికారంలోకి రాగానే వైఎస్ జగన్ ప్రభుత్వాస్పత్రులను సంస్కరించారు. వైద్య రంగానికి ఊపిరిలూదారు. పెద్దాస్పత్రులను ఐదేళ్లలో అవయవాలు మార్పిడి చేసే స్థాయికి తీసుకెళ్లారు.ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, విలేజ్ క్లినిక్స్ వంటి వ్యవస్థల ద్వారా ప్రజల వద్దకే సర్కార్ వైద్యాన్ని తీసుకెళ్లారు. ఈ క్రమంలో ప్రభుత్వ వైద్య రంగాన్ని దిగజార్చిన బాబు, ఆ వైద్య రంగానికి ఊపిరిలూదిన వైఎస్ జగన్.. ఈ ఇద్దరిలో ఎవరు కావాలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సముచిత నిర్ణయం తీసుకోకపోతే వైద్యానికి డబ్బు కోసం ఆస్తులు తాకట్టుపెట్టాలి. ఆస్తులు లేని వారు తల తాకట్టు పెట్టే పరిస్థితులు వస్తాయని గుర్తుంచుకోవాలి. -
త్వరలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు
రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు కొత్తగా కార్డులివ్వాలని నిర్ణయించింది. ప్రతి కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకొని యూనిక్ నంబర్‌తో కార్డులు ఇవ్వనుంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఒక్కో సబ్ నంబర్ ఇస్తారు. ఇదే కార్డును హెల్త్ ప్రొఫైల్‌కు లింక్ చేసి, స్టేట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను తయారు చేస్తారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్టు కసరత్తు చేస్తోంది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటివరకు కొందరు పేదలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. అంతేకాకుండా అనేకమంది తెల్ల రేషన్‌కార్డును ఆధారం చేసుకొనే ఆరోగ్యశ్రీ సేవలు పొందుతున్న సంగతి తెలిసిందే. ఇక నుంచి ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డుకు లింకు పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల జారీ అంశంపై ఆరోగ్యశ్రీ ట్రస్టు దృష్టిసారించింది. ఈ మేరకు లబ్దిదారుల గుర్తింపుపై మార్గదర్శకాలు రూపొందిస్తోంది. అందరికీ ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై వైద్య, ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కోసం ఏటా రూ.1,100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అందరికీ వర్తింప చేయడం వల్ల అదనంగా రూ.400 కోట్ల భారం పడే అవకాశం ఉందని, ఇది పెద్ద భారం కాదన్న భావనలో సర్కారు ఉంది. మధ్యతరగతి ప్రజల్లో చాలామందికి, ఉద్యోగులకు, ఇతరులకు పలు పథకాలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ ఆరోగ్య బీమాతో ఆరోగ్య సేవలు పొందుతున్న వారూ చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ కార్డులతో అందరికీ సార్వజనీన ఆరోగ్య సేవలు అందించవచ్చని సర్కారు యోచిస్తోంది. వంద శస్త్రచికిత్సలు చేర్చే అవకాశం రాష్ట్రంలో 293 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు, 198 ప్రభుత్వ పెద్దాసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాగే గత ఏడాది 809 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లోనూ ఆరోగ్యశ్రీ కింద సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తంగా రాష్ట్రంలో 1,310 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీకి అర్హులుగా 77.19 లక్షల మంది పేదలు ఉన్నారు. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని కూడా ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు చేస్తున్నారు. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఈజేహెచ్ఎస్ కిందకు వస్తారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద 1,376 శస్త్రచికిత్సలు, 289 వైద్య సేవలున్నాయి. ఆయుష్మాన్ భారత్ కింద 1,949 వ్యాధులకు వైద్యం అందుతోంది. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్‌లో ఈ రెండింటిలో ఉన్న వ్యాధులను కలిపి అమలు చేస్తున్నారు. వీటికి సుమారు మరో వంద శస్త్రచికిత్సలను చేర్చే అవకాశం ఉంది. ఒక్కో కుటుంబానికి 10 లక్షల కవరేజీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేంద్రం 2022లో ప్యాకేజీలను సవరించింది. గతంలో ఆరోగ్యశ్రీ కింద కవరేజీ రూ. 2 లక్షలు ఉండగా, ఆయుష్మాన్ భారత్ పథకం రావడంతో దాన్ని రూ. 5 లక్షలు చేశారు. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రూ.10 లక్షలు చేసిన సంగతి తెలిసిందే. ఏడాదికి ఈ పథకాల కింద ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల వరకు కవరేజీ వర్తిస్తుంది. దీనికి ప్యాకేజీ సొమ్ము కూడా పెంచితే ఏటా రూ.1,500 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈహెచ్ఎస్ పథకంపై తేలని నిర్ణయం ఈహెచ్ఎస్ పథకంపై ఉద్యోగులు కంట్రిబ్యూషన్ ఇస్తామని పేర్కొన్న సంగతి విదితమే. గత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌కు ముందు రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్సీటీ) ఏర్పాటు చేసి అమలు చేయాలని నిర్ణయించింది. పథకం అమలుకు ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కొంత మొత్తాన్ని, అంతే మొత్తంలో ప్రతి నెలా ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్‌గా జమ చేయాలని పేర్కొన్నది. ఈ మేరకు తమ మూల వేతనంలో ఒక శాతం కాంట్రిబ్యుషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి గతంలో విజ్ఞప్తి చేశాయి. ఆసుపత్రుల్లో తమకు వైద్యం అందనందున ఈ ప్రక్రియకు ఉద్యోగులు కూడా ముందుకు వచ్చారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల బకాయిల చెల్లింపునకు ఏర్పాట్లు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు మాత్రం ఆరోగ్యశ్రీ రోగులకు వైద్యం చేయడంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. బ కాయిలు పేరుకుపోవడంతో పాటు ఆరో గ్యశ్రీ కింద ఆసుపత్రులకు ఇచ్చే ప్యాకేజీ సొమ్ము సరిపోవడం లేదని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నా యి. దీంతో ఆరోగ్యశ్రీ లబ్దిదారులు, ఈ హెచ్ఎస్ బాధితులు డబ్బులు చెల్లించి వైద్యం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా తర్వాత అనారోగ్య సమస్యలు పెరగడంతో చాలామంది ప్రైవేట్ ఆరోగ్య బీమా తీసుకుంటున్నారు. ఉద్యోగులైతే రీయింబర్స్మెంట్ పద్ధతిలో ముందుగా డబ్బులు చెల్లించి వైద్యం పొందుతున్నా రు. అయితే బిల్లుల సొమ్ము మాత్రం పూ ర్తి స్థాయిలో రావడంలేదని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. పెద్దఎత్తున బిల్లులు పే రుకుపోవడం వల్లే తాము వైద్యం అందించలేకపోతున్నామని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు నెట్వర్క్ ఆసుపత్రుల లెక్క ప్రకా రం దాదాపు రూ.500 కోట్లు ఆరోగ్యశ్రీ నుంచి తమకు రావాల్సిన బిల్లుల బకా యిలు పెండింగ్‌లో ఉన్నాయని అంటున్నాయి. మరోవైపు వివిధ వ్యాధులకు 2013లో నిర్ధారించిన ప్యాకేజీ ప్రకారమే ఆసుపత్రులకు సొమ్ము అందుతోంది. అంటే తెలంగాణ ఏర్పడ్డాక ఇప్పటివరకు ఒక్కసారి కూడా వ్యాధులు, చికిత్సలకు ప్యాకేజీ సవరణ జరగలేదు. ఈ రెండు కారణాల వల్ల తాము ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ పథకాల కింద వైద్యం చేయలేకపోతున్నామని ఆసుపత్రుల యాజమాన్యాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో పెండింగ్ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. -
ఆరోగ్య సూచీల్లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి: చేసే పనిలో చిత్తశుద్ధి ఉంటే గుర్తింపు దానంతట అదే వస్తుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా వైఎస్ జగన్ సర్కార్ నిలుస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా.. వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వం తొలినుంచీ ముందడుగు వేస్తోంది. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వంటి అనేక కార్యక్రమాల అమలు ద్వారా ప్రజారోగ్యానికి భరోసాగా నిలుస్తోంది. నీతిఆయోగ్ విడుదల చేస్తు న్న ఆరోగ్య సూచీల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంటోంది. రక్తహీనత నివారణ చర్యల్లో భేష్ రక్తహీనత నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీని నివారణకు సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్న ఏపీకి జాతీయ స్థాయిలో మొదటి అవార్డు లభించింది. అంగన్వాడీలు, పాఠశాలల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోష ణ ప్లస్, జగనన్న గోరుముద్ద కార్యక్రమాల కింద ప్రభుత్వం పోషకాహారం పంపిణీ చేస్తోంది. స్కూల్ హెల్త్ యాప్‌తో విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ చేపడుతోంది. డిజిటల్ వైద్య సేవల్లో ఫస్ట్ ప్రజలకు డిజిటల్ వైద్యసేవల కల్పనలో దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ నిలుస్తోంది. పౌరులకు డిజిటల్ హెల్త్ అకౌంట్లు సృష్టించి, అందులో వారి ఆరోగ్య వివరాలను అప్లోడ్ చేయడం, భవిష్యత్‌లో వారు పొందే వైద్య వివరాలను డిజిటలైజ్ చేస్తున్నారు. మొత్తం జనాభాలో అత్యధికులకు హెల్త్ అకౌంట్లు సృష్టించడంతోపాటు ఆస్పత్రుల్లోనూ డిజిటల్ వై ద్యసేవల కల్పనలో ఏపీకి ఇప్పటికే జాతీయస్థాయిలో అనేక మొదటి బహుమతులు లభించాయి. డిజిటల్ వైద్య సేవల కల్పనలో ఇతర రాష్ట్రాలు సై తం ఏపీ విధానాలను అవలంభించాలని అన్ని రా ష్ట్రాలకు నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో లేఖ రాశారు.రాష్ట్రంలోని పౌరులకు టెలీ మెడిసిన్ సేవల కల్పనలో దేశంలో ఏపీ తొలి స్థానంలో నిలుస్తోంది. 2019 నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 20.41 కోట్లకు పైగా టెలీకన్సల్టేషన్లు నమోదు కాగా.. ఇందులో 25 శాతానికిపైగా టెలీకన్సల్టేషన్లు కేవలం ఏపీ నుంచే ఉంటున్నాయి. ఆరోగ్య ధీమా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా మధ్యతరగతి, పేద కు టుంబాల ఆరోగ్యానికి సీఎం జగన్ ప్రభు త్వం అండగా నిలుస్తోంది. రూ.5 లక్షలలోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ ఈ పథకం పరిధిలోకి తెచ్చింది. దీంతో ఏపీలోని 95 శాతం కుటుంబా లకు ఆరోగ్య బీమా లభిస్తోంది. అత్యధిక జనా భాకు పూర్తి ఆరోగ్య బీమా కలి్పస్తున్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని నీతిఆయోగ్ ప్రశంసించింది. 2019 నుంచి ఇప్పటివరకు వైద్యరంగం బలోపేతానికి తీసుకున్న చర్యలివీ ► వైద్య శాఖలో 53 వేలకు పైగా పోస్టుల భర్తీ. ఎప్పటి ఖాళీలకు అప్పుడే యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తున్న ప్రభుత్వం. ఇందుకోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు ► రూ.16,852 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతోపాటు నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రుల బలోపేతం ►గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు. 12 రకాల వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే ప్రజలకు వైద్య సేవలు ►దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు. నెలకు రెండుసార్లు గ్రామాలకు పీహెచ్సీ వైద్యులు ► టీడీపీ హయాంలో నిర్విర్యమైన ఆరోగ్యశ్రీ బలోపేతం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో వ్యాధుల సంఖ్య 1,059 నుంచి 3,257కు పెంపు. వైద్య ఖర్చుల పరిమితి రూ.25 లక్షలకు పెంపు ►108 (768 వాహనాలు), 104 (936) వాహనాలతో వైద్య సేవలు బలోపేతం. -
18 లక్షల ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ పూర్తి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కొత్త స్మార్ట్ కార్డుల పంపిణీ చకచకా కొనసాగుతోంది. మొత్తం మీద 1.42 కోట్ల కార్డులను పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 18,06,084 కార్డులను గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది లబ్ధిదారులకు అందజేశారు. మిగిలిన కార్డులను కూడా శరవేగంగా పంపిణీ చేస్తున్నారు. గతేడాది డిసెంబర్లో ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య ఖర్చుల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. అలాగే 2019కి ముందు 1,059గా ఉన్న ప్రొసీజర్లను ఏకంగా 3,257కి పెంచింది. ఈ నేపథ్యంలో పెరిగిన ప్రయోజనాలతో కూడిన కొత్త కార్డులను ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తోంది. అంతేకాకుండా వాటిపైన అవగాహన కల్పిస్తోంది. ఒక్కో వారం నియోజకవర్గంలో నాలుగు వరకు గ్రామాల్లో ఆరోగ్యశ్రీ పథకంపై అవగాహన, ప్రచారం, కార్డుల పంపిణీ కార్యక్రమాలను అధికారులు చేపడుతున్నారు. మరింత సులభంగా వైద్య సేవలు పొందేలా.. సరికొత్త ఫీచర్లతో కూడిన కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ప్రతి కార్డులో కుటుంబ యజమాని పేరు, జిల్లా, మండలం, గ్రామ/వార్డు సచివాలయం వివరాలతో పాటు, సంబంధిత కుటుంబ సభ్యుల ఫొటోలతో పాటు, వారి పేర్లు, ఇతర వివరాలు ఉన్నాయి. క్యూఆర్ కోడ్, యూనిక్ హెల్త్ ఐడెంటిటీ నంబర్ (యూహెచ్ఐడీ) కూడా పొందుపరుస్తున్నారు. వైద్యం కోసం నెట్వర్క్ ఆస్పత్రికి వెళ్లినప్పుడు ఆరోగ్యమిత్ర, వైద్యులు సులువుగా రిజి్రస్టేషన్ చేయడానికి క్యూఆర్ కోడ్ ఉపయోగపడుతుంది. దీంతో మరింత వేగంగా, సులభంగా ప్రజలు వైద్య సేవలు పొందొచ్చు. యాప్ ద్వారా సేవలు.. రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఉచితంగా వైద్య సేవలు పొందడం ఎలాగో ప్రజలకు సులువుగా అర్థం కావడానికి ప్రత్యేకంగా బ్రోచర్లను కూడా వైద్య సిబ్బంది అందిస్తున్నారు. అంతేకాకుండా ప్రచార కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల మొబైల్ ఫోన్లలో ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్లోడ్ చేయిస్తున్నారు. యాప్‌ను ఎలా వినియోగించాలో అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 64,15,515 ఆరోగ్యశ్రీ కార్డుదారులు యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, అందులో లాగిన్ అయ్యారు. వంద శాతం లబ్ధిదారులకు యాప్ సేవలను చేరువ చేసేలా అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు. ఈ యాప్ ఫోన్లో ఉంటే అరచేతిలో ఆరోగ్యశ్రీ ఉన్నట్టే అనే చందంగా ప్రభుత్వం యాప్‌లో ఫీచర్లను పొందుపరిచింది. పథకం కింద అందే వైద్య సేవలు, రాష్ట్రంలో, రాష్ట్రం వెలుపల ఉండే నెట్వర్క్ ఆస్పత్రులు, వాటిల్లో ఏ ప్రొసీజర్స్‌కు వైద్యం చేస్తారనే సమాచారం యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా తాముంటున్న ప్రాంతానికి చేరువలో ఏ ఆస్పత్రి ఉందో తెలుసుకుని, అక్కడకు చేరుకోవడానికి ట్రాకింగ్ సౌకర్యం కూడా ఉంది. ఇక గతంలో పథకం ద్వారా పొందిన చికిత్సలు, రిపోర్ట్‌లను సైతం ఒక్క క్లిక్‌తో పొందడానికి వీలుంది. -
ఆరోగ్యశ్రీ చికిత్స పరిమితిని భారీగా పెంచిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ప్రజారోగ్య పరిరక్షణలో మరో విప్లవాత్మక నిర్ణయానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ లభించింది. పేద కుటుంబాలకు పునర్జన్మ ప్రసాదిస్తున్న అపర సంజీవని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య పరిమితిని ఏకంగా రూ.25 లక్షలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ వైద్యశాలల్లో కార్పొరేట్ వైద్యాన్ని అందించడంతో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ అధునాతన వైద్య సేవలు పొందేలా ఆరోగ్యశ్రీని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం బలోపేతం చేయడం తెలిసిందే. ఇప్పటికే క్యాన్సర్ లాంటి మహమ్మారి బారిన బాధితులకు పరిమితి లేని చికిత్సలు అందిస్తూ ఆరోగ్యశ్రీ సంజీవనిగా మారింది. వార్షిక ఆదాయం రూ.5 లక్షలు ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చడంతో రాష్ట్రంలో 90 శాతం కుటుంబాలు ఆరోగ్యశ్రీతో లబ్ధి పొందుతున్నాయి. నాలుగున్నరేళ్లలో 37.40 లక్షల మంది ఆరోగ్యాలకు భరోసానిస్తూ వివిధ జబ్బుల చికిత్సకు 53,02,816 ప్రొసీజర్లతో ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం రూ.11,859.86 కోట్లు ఖర్చు చేసింది. గతంలో సుస్తీ చేస్తే వైద్య ఖర్చులకు కుటుంబాలు అప్పుల పాలై పేదలు జీవన ప్రమాణాలు క్షీణించేవి. అలాంటి దుస్థితి ఏ ఒక్కరికీ రాకూడదనే సంకల్పంతో ఆరోగ్యశ్రీ వైద్య పరిమితి, ప్రొసీజర్లను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. మరోవైపు గత ఎన్నికల్లో చెప్పిన మాటను తు.చ. తప్పకుండా ఆచరిస్తూ మేనిఫెస్టోలో పేర్కొన్న మరో హామీని సంపూర్ణంగా నెరవేరుస్తూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించింది. ప్రస్తుతం రూ.2,750గా ఉన్న వైఎస్సార్ పింఛన్ కానుకను జనవరి 1వ తేదీ నుంచి రూ.3 వేలకు పెంచాలని నిర్ణయించింది. తద్వారా 65.33 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, చర్మకారులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులకు మరింత ఆర్థిక భరోసా కల్పిస్తోంది. గత సర్కారు హయాంలో పింఛన్ల కోసం నెలకు రూ.400 కోట్లు మాత్రమే వ్యయం చేయగా ఇప్పుడు తాజా పెంపుతో పింఛన్ల వ్యయం నెలకు రూ.2 వేల కోట్లకు పెరగనుంది. ఈ మేరకు శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర లభించింది. ఈ నేపథ్యంలో జనవరిలో సంక్రాంతికి తోడు పేదల ఇంట సంక్షేమ పథకాల పండగ సందడి చేయనుంది. జనవరి 10వతేదీ నుంచి 23వరకు చివరి విడత వైఎస్సార్ ఆసరా, జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10 వరకు వైఎస్సార్ చేయూత కార్యక్రమాలను అమలు చేయనున్నారు. సమాచార, పౌర సంబంధాలు, బీసీ సంక్షేమ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మంత్రి మండలి నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. దేశ ప్రజారోగ్య చరిత్రలో కీలక మైలురాయి పేదలకు ఉచిత వైద్య సేవల కోసం గత సర్కారు ఏడాదికి రూ.వెయ్యి కోట్లు మాత్రమే ఖర్చు చేయగా ఇప్పుడు ఏడాది 4,400 కోట్లు వెచ్చిస్తున్నాం. ఇప్పటి వరకు ఒక్క క్యాన్సర్ ప్రొసీజర్స్‌లోనే వైద్యానికి రూ.1,897 కోట్లు వ్యయం చేశాం. ఇక ఆరోగ్యశ్రీ కొత్త కార్డుతో ఆస్పత్రికి వెళ్తే రూ.25 లక్షల వరకూ ఉచితంగా వైద్యం అందిస్తాం. ఇది దేశంలోని ప్రజారోగ్య చరిత్రలో అతిపెద్ద మైలు రాయి. ఈ నెల 18న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీని ప్రారంభిస్తారు. గతంలో ఆరోగ్యశ్రీలో 1,059 ప్రొసీజర్స్ మాత్రమే ఉండగా, సీఎం జగన్ వీటిని ఏకంగా 3,257కి పెంచడం ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధికి నిదర్శనం. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య సురక్ష కార్యక్రమాలను మరింత సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. 19వ తేదీ నుంచి ప్రతి నియోజకవర్గంలోని ఐదు గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో కొత్త కార్డుల పంపిణీ చేపడతాం. ఆరోగ్యశ్రీలో వైద్య సేవలు పొందడంపై జనవరి నెలాఖరు/ఫిబ్రవరి తొలి వారంలోగా ఆశ వర్కర్లు, సీహెచ్‌ఓలు, ఏఎన్ఎంల ద్వారా ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తాం. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ యాప్‌ను ప్రజల ఫోన్లలో డౌన్లోడ్ చేస్తారు. ఆరోగ్యశ్రీ యాప్‌లో సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రుల వివరాలు, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో అందే వైద్య సేవల సమగ్ర డేటా అందుబాటులో ఉంటుంది. ఆరోగ్యశ్రీ చికిత్సను 104 కాల్ సెంటర్, విలేజ్ హెల్త్ క్లినిక్, 108 అంబులెన్స్, ఫ్యామిలీ డాక్టర్, స్థానిక పీహెచ్‌సీల ద్వారా పొందడంపై ప్రతి ఒక్కరికీ తెలియచేస్తాం. ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో వ్యాధి నిర్ధారణ జరిగి చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీస్తాం. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొంది తిరిగి డాక్టర్ చెకప్ కోసం వెళ్లాల్సి వస్తే రవాణా ఖర్చుల కింద రూ.300 చెల్లిస్తాం. డాక్టర్ చెకప్‌కు 10 రోజులు ముందే ఏఎన్ఎంతో సమాచారం అందిస్తాం. మందులు డోర్ డెలివరీ.. ఫేజ్–2 జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన వ్యాధిగ్రస్తులకు మందులు నేరుగా ఉచితంగా డోర్ డెలివరీ చేస్తాం. మందులు అయిపోతే వాటి కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే ఇండెంట్ తీసుకుని విలేజ్ క్లినిక్స్ నుంచి ఏఎన్ఎంలు ద్వారా బాధితులకు చేరుస్తాం. తపాలా శాఖ సహాయంతో వేగంగా, డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలు కలిగిన మందుల పంపిణీ చేస్తాం. ఇందుకోసం ప్రత్యేక ఎస్ఓపీ రూపొందించాం. సూపర్ స్పెషాల్టీ సేవలందించే వైద్యులకు రూ.4 లక్షల వరకూ జీతాలు ఇస్తున్నాం. వైద్యశాఖలో 53 వేల పోస్టులను భర్తీ చేసి దాదాపు జీరో వేకెన్సీని తీసుకొచ్చాం. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ.668 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలను కూడా చెల్లించాం. 10 రోజుల పాటు ‘వైఎస్సార్ చేయూత’ పేద అక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన, సాధికారత లక్ష్యంగా వైఎస్సార్ చేయూత పంపిణీని మంత్రి మండలి ఆమోదించింది. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10 వరకూ పది రోజుల పాటు వైఎస్సార్ చేయూత సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న అక్కచెల్లెమ్మల జీవనోపాధి కల్పనకు ఏటా రూ.18,750 చొప్పున అందిస్తూ సీఎం జగన్ నాలుగేళ్లు అండగా నిలిచారు. 26 నుంచి ‘ఆడుదాం ఆంధ్ర’ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు చేపట్టిన ‘ఆడుదాం ఆంధ్ర’ మెగా టోర్నీ డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ డబుల్స్, ఖోఖో, కబడ్డీతో పాటు సాంప్రదాయ క్రీడలైన యోగ, మారథాన్, టెన్నీకాయిట్ పోటీలు ఏర్పాటు చేస్తున్నాం. దాదాపు రూ.120 కోట్ల వ్యయంతో 51 రోజుల పాటు పోటీలు నిర్వహిస్తాం. కుల, ఆదాయ ధ్రువపత్రాల జారీలో కీలక సంస్కరణలు.. కుల, ఆదాయ ధ్రువపత్రాల మంజూరులో ప్రభుత్వం కీలక సంస్కరణలు తెచ్చింది. సర్టిఫికెట్ల జారీలో జాప్యాన్ని నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. గతంలో కుటుంబ సభ్యులకు జారీ చేసిన కుల ధ్రువపత్రం ఆధారంగానే గ్రామ, వార్డు సచివాలయాల్లో వేగంగా కులధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని అందించే బాధ్యతను అధికారులకే అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలకు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారుల జాబితా నేరుగా గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్తుంది. ఆ జాబితాపై సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ చేస్తారు. అందులో విఫలం అయితే రెవెన్యూ సిబ్బందికి పంపుతారు. వారు వెంటనే పరిశీలన చేసిన ఆటోమేటిక్‌గా నిర్థారిస్తారు. గత రెండేళ్లలో దాదాపు 75 లక్షల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీచేశాం. ఒక్క జగనన్న సురక్ష కార్యక్రమంలోనే 39 లక్షల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందించాం. ఉదారంగా మిచాంగ్ సాయం.. మిచాంగ్ తుపాన్ నష్టంపై మంత్రి మండలి సుదీర్ఘంగా చర్చించింది. ప్రభుత్వం తక్షణ సహాయం కింద రూ.52.47 కోట్లు విడుదల చేసింది. శిబిరాలకు వచ్చిన వారికే కాకుండా ఇళ్లలో నీళ్లు నిలిచిన వారందరికీ కూడా ప్రత్యేక సహాయం అందించింది. ఒంటరి వ్యక్తి అయితే రూ.వెయ్యి, కుటుంబానికి రూ.2,500 చొప్పున 1.10 లక్షల మందికి సహాయం అందించాం. గతంలో ఇలాంటి సాయం ఎన్నడూ అందలేదు. ప్రత్యేక ఆర్థిక సహాయం కింద రూ.28.07 కోట్లు పంపిణీ చేశాం. -
ఆరోగ్యశ్రీ పరిధి రూ. 25 లక్షలు..!
-
కొత్త రేషన్‌కార్డులు ఇస్తారా?
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ మొదలు రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు లబ్ధిదారులుగా ఉండాలంటే..రేషన్‌కార్డు తప్పనిసరి అయ్యింది. అధికారంలోకి వస్తే అర్హులైన వారందరికీ కొత్త రేషన్‌కార్డులు (ఆహారభద్రత కార్డులు) జారీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మంగళవారం పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లోని పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసే సమీక్ష సమావేశంలో కొత్త రేషన్‌కార్డుల జారీకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంలో ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్‌కార్డుల కోసం ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా, ఇప్పటికే రాష్ట్రంలో 90 లక్షలకు పైగా కార్డులు ఉన్నాయనే కారణంతో ఆ దిశగా దృష్టి పెట్టలేదు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల్లో 3 లక్షల కార్డులు జారీ చేశారు. అప్పటి నుంచి కొత్తగా దరఖాస్తులు ఆహ్వనించలేదు. ఉమ్మడి కుటుంబాల నుంచి వేరుపడినవారు... ఈ పదేళ్లలో జన్మించిన పిల్లల పేర్లు కూడా కార్డుల్లో చేర్చలేదు. చనిపోయిన వారి పేర్లు మాత్రమే ఎప్పటికప్పుడు తొలగించారు. రాష్ట్రంలో 90.14 లక్షల రేషన్‌కార్డులు: రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆహారభద్రత కార్డులు 90.14 లక్షలు ఉన్నాయి. ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం(ఎన్ఎఫ్ఎస్ఏ) కింద 54.48 లక్షల కార్డులు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆహారభద్రత కార్డులు 35.66 లక్షలు ఉన్నాయి. ఇవి కాకుండా అంత్యోదయ అన్నయోజన కింద 5.62 లక్షల కార్డులు, అన్నపూర్ణ పథకం కింద 5,211 కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల పరిధిలో 2.83 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న జనాభా, ప్రజల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుంటే ఈ కార్డుల లబ్ధిదారుల్లో 20 శాతం వరకు అనర్హులే ఉన్నట్టు గత ప్రభుత్వం గుర్తించింది. అయితే అనర్హుల నుంచి కార్డులను ఏరివేత ప్రక్రియ ప్రారంభిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే కారణంగా యథాతథ స్థితి కొనసాగించింది. అనర్హులను తొలగిస్తారా...? గతంలో తెలుపు, గులాబీ రేషన్‌కార్డులు ఉండేవి. 2014లో కేంద్ర ప్రభుత్వం గులాబీకార్డులను పూర్తిగా ఎత్తివేసి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) వారికే ఆహారభద్రత కార్డులు జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన రేషన్ కార్డులు పొందలేని వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహారభద్రత కార్డులు ఇచ్చిం ది. ఈ లెక్కన రాష్ట్రంలో 90.14 లక్షల కుటుంబాలకు రేషన్‌కార్డులు ఉండగా, లబ్ధిదారుల సంఖ్య దాదాపు 2.83 కోట్లు. రాష్ట్ర జనాభానే 4 కోట్లు అనుకుంటే సుమారు 3 కోట్ల మంది ఆహారభద్రత కార్డులకు అర్హులుగా ఉన్నారు. కొత్త రేషన్‌కార్డులు జారీ చేయాల్సి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి విధివిధానాలు రూపొందిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత రేషన్‌కార్డులలో అర్హులైన వారిని మాత్రమే కొనసాగించి, కొత్తగా బీపీఎల్ పరిధిలోకి వచ్చే వారికి కార్డులు జారీ చేస్తారా లేక ఉన్న వాటి జోలికి వెళ్లకుండా కొత్తగా అర్హులను గుర్తిస్తారా చూడాలి. -
గుండెకు నిబ్బరం! రూపాయి ఖర్చు లేకుండా చికిత్స.. బైపాస్ సర్జరీ కూడా..
సాక్షి, అమరావతి: గుండె జబ్బుల బారిన పడ్డ పేద, మధ్యతరగతి కుటుంబాలకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కొండంత అండగా నిలుస్తోంది. చేతి నుంచి ఒక్క రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. మన రాష్ట్రంతోపాటు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం హృద్రోగ బాధితులకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్యసేవలు అందుతున్నాయి. 1.71 లక్షల మందికి వైద్యం 2019 నుంచి 1,71,829 మంది గుండె సంబంధిత జబ్బుల బాధితులు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య సేవలు పొందారు. బైపాస్ సర్జరీలు, స్టెంట్లు..యాంజియోగ్రామ్, గుండె మార్పిడి సహా వివిధ చికిత్సలను పథకం కింద ఉచితంగా నిర్వహిస్తున్నారు. హృద్రోగ బాధితులకు వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.695.15 కోట్లు ఖర్చు చేసింది. మరోవైపు శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకునే సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద ఆర్థిక సాయాన్ని కూడా అందించింది. నాలుగేళ్లలో 40 లక్షల మందికి ఉచిత వైద్యం కేవలం హృద్రోగ చికిత్సలే కాకుండా పలు రకాల ఆరోగ్య సమస్యలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందుతోంది. టీడీపీ హయాంలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీ పథకానికి ఊపిరిలూదుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చర్యలతో పేద, మధ్యతరగతి ప్రజలకు భారీ మేలు చేకూరుతోంది. పొరుగు రాష్ట్రాల్లోని పెద్ద పెద్ద కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందుతోంది. వైద్యం పొందిన అనంతరం చిరునవ్వుతో ఇంటికి తిరిగొస్తున్నారు. గత సర్కారు హయాంలో పేదలకు ఏదైనా పెద్ద జబ్బు చేస్తే తల తాకట్టు పెట్టడం మినహా గత్యంతరం లేని దుస్థితి. దేవుడిపై భారం వేసి రోజులు లెక్కపెట్టుకోవాల్సిన దయనీయ పరిస్థితులు నాడు నెలకొన్నాయి. ఈ అవస్థలకు తెరదించుతూ ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లను 3,257కి పెంచి ఉచిత వైద్య సేవలను సీఎం జగన్ అందుబాటులోకి తెచ్చారు. ఆరోగ్యశ్రీకి గత సర్కారు బకాయిపెట్టిన రూ.630 కోట్లను చెల్లించడంతోపాటు ప్రభుత్వ వైద్య రంగాన్ని అన్ని సదుపాయాలతో బలోపేతం చేశారు. దీంతో సగటున రోజుకు 3,300 మంది నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్సలు పొందుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకం కోసం గత నాలుగేళ్లలో ప్రభుత్వం ఏకంగా రూ.9,025 కోట్లు ఖర్చు చేయగా దాదాపు 40 లక్షల మంది వైద్య సేవలు పొందారు. రూపాయి ఖర్చు లేకుండా బైపాస్ రక్త నాళాలు దెబ్బతినడంతో బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు. నిరుపేద కుటుంబం కావడంతో నాకు అంత స్థోమత లేదు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా సర్జరీ చేశారు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నా. ప్రభుత్వం చేసిన మేలు ఈ జన్మలో మరువలేను. – దొంతాల రాఘవయ్య, మామడూరు, నెల్లూరు జిల్లా ఆపద్బాంధవిలా ఆదుకుంది గుండె రక్తనాళాలు దెబ్బ తినడంతో బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు నిర్థారించారు. ఆ సమయంలో ఆరోగ్యశ్రీ ఆపద్బాంధవిలా ఆదుకుంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గత నెల 26న సర్జరీ జరిగింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యా. కోలుకునే సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా ఆర్థిక సాయం అందుతుందని చెప్పారు. సీఎం జగన్ ప్రభుత్వం చేసిన మేలును ఈ జన్మకు మరువలేను. – కొరివి కిశోర్, గుంటూరు పెద్ద జబ్బులకు సైతం.. గుండె, కాలేయం, కిడ్నీ, క్యాన్సర్ సంబంధిత పెద్ద జబ్బులకు సైతం చికిత్సలు ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో ఉన్నాయి. ప్రొసీజర్ల సంఖ్య భారీగా పెరిగాయి. వైద్యం కోసం ప్రజలు ఆర్థికంగా చితికిపోకూడదనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. – హరేంధిరప్రసాద్, సీఈవో, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ద్వారా హృద్రోగ చికిత్సలు ఇలా సంవత్సరం రోగులు ప్రొసీజర్లు వ్యయం రూ.కోట్లలో 2019–2020 23,797 24,027 79.69 2020–2021 24,243 24,599 77.06 2021–2022 36,725 37,646 116.09 2022–2023 65,813 85,558 301.82 2023–2024 21,251 32,208 120.49 (ఇప్పటి వరకూ) మొత్తం 1,71,829 2,04,038 695.15 అన్నదాతకు ప్రాణదాత వ్యవసాయదారుడైన చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన కృష్ణారెడ్డి హృద్రోగం బారిన పడటంతో ఆ కుటుంబానికి గుండె ఆగినంత పనైంది! గుండె మార్పిడి శస్త్ర చికిత్స ఖర్చును భరించే స్థోమత లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోలేదు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా గుండె ఆపరేషన్ చేస్తారని స్థానిక ఏఎన్ఎం చెప్పడంతో 2021 ఏప్రిల్‌లో బెంగళూరులోని నెట్వర్క్ ఆస్పత్రిని సంప్రదించారు. మైసూర్లో బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి గుండెను కృష్ణారెడ్డికి అమర్చి ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.11 లక్షలు చెల్లించి ఆ కుటుంబ పెద్దకు రాష్ట్ర ప్రభుత్వం పునర్జన్మ ప్రసాదించింది. ‘నేను ఇవాళ ప్రాణాలతో ఉన్నానంటే ఆరోగ్యశ్రీనే కారణం. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గుండె మార్పిడి ఆపరేషన్ చేశారు. కోలుకునే సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద డబ్బులు కూడా అందచేశారు’ అని కృష్ణారెడ్డి చేతులు జోడించి చెబుతున్నారు. -
అందరికీ ఆరోగ్యం ..
-
ఏపీ : ఆరోగ్యశ్రీలో వైద్య చికిత్సల పెంపు
-
‘ఎన్టీఆర్‌పై నిజంగా ప్రేమే ఉంటే చెప్పులు, రాళ్లతో ఎందుకు కొట్టారు’
సాక్షి, అమరావతి: టీడీపీ నేతలు ప్రతిరోజూ సభలో గొడవపెట్టడమే పనిగా పెట్టుకున్నారు. ప్రతిపక్షం పనికిరాని పక్షంగా మారిపోయింది. ప్రజలకు టీడీపీ నేతలు ఏం సమాధానం చెబుతారని మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి జోగి రమేష్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ‘చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గుర్తుకురారు. పదవిలో లేనప్పుడు మాత్రమే చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు. వివాదం చేయడానికి టీడీపీ నేతలు రోజుకో అంశాన్ని ఎంచుకుంటున్నారు. ఎన్టీఆర్‌పై నిజంగా ప్రేమ ఉంటే చెప్పులు, రాళ్లతో ఎందుకు కొట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఎన్టీఆర్‌పై నిజమైన ప్రేమ ఉంది. జిల్లాకు ఎన్టీఆర్ పెడతానన్న హామీని నిలబెట్టుకున్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం చంద్రబాబు ఏం చేశారు?. ఎన్డీఏతో అధికారం పంచుకున్నప్పుడు భారతరత్న ఎందుకు ఇవ్వలేదు. లోకేష్ పాదయాత్రే కాదు పొర్లు దండాలు పెట్టినా ప్రయోజనం లేదు. ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా జిల్లా పేరు పెట్టాం. ఎన్టీఆర్‌ను గౌరవించిన పార్టీ వైఎస్సార్సీపీ. వైద్య రంగంలో వైఎస్సార్ గొప్ప సంస్కరణలు తెచ్చారు. ఆరోగ్యశ్రీతో పేదలకు ఆరోగ్య భరోసా లభించింది. పేదల ఆరోగ్యం కోసం ఆలోచించిన వ్యక్తి వైఎస్సార్. వేలమంది ప్రాణాలను 108 సర్వీస్ కాపాడింది. హెల్త్ యూనివర్శిటీపై చర్చ కొనసాగితే తప్పేముంది. పేదలకు సేవ చేశాడు కాబట్టే హెల్త్ యూనివర్శిటీకి వైఎస్సార్ పేరు పెట్టాలని బిల్లు తీసుకొస్తున్నాం’ అని స్పష్టం చేశారు. -
చెప్పాడంటే చేస్తాడంతే..!!
-
ఆరోగ్యశ్రీ ఆల్ టైమ్ రికార్డు
-
ఆరోగ్య శ్రీ తో వినికిడి వరాన్ని పొందిన చిన్నారులు
-
డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు : ఆరోగ్యశ్రీ ట్రస్ట్
అమరావతి : డబ్బులు కడితేనే చేర్చుకుంటామన్న ఎంప్లాయిస్ హెల్త్ స్కీం నెట్వర్క్ ఆసుపత్రులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీరియస్ అయ్యింది. ఆరోగ్య శ్రీ ఉన్నా మొదట డబ్బులు కట్టాలని తర్వాతే రీయింబర్స్మెంట్ పెట్టుకోవాలని ఆసుపత్రులు ఉద్యోగులకు సూచిస్తున్నట్లు సమాచారం. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆరోగ్య శ్రీ ట్రస్ట్ ఎంప్లాయిస్ హెల్త్ స్కీం నెట్వర్క్ ఆసుపత్రులకు హెచ్చరికలు జారీ చేసింది. డబ్బులు తీసుకోవడం, క్యాష్ పేమెంట్ డిమాండ్ చేయడం లాంటివి చేస్తే చర్యలు ఉంటాయని పేర్కొంది. రోగుల వద్ద తీసుకున్న డబ్బులకు 10 రెట్లు ఎక్కువ పెనాల్టీ వేస్తాం అని హెచ్చరికలు జారీ చేసింది. అలాంటి ఆసుపత్రులను ప్రభుత్వం నుంచి లభించే అన్ని స్కీంల నుంచి మూడు నెలలు సస్పెండ్ చేయాలని నిర్ణయించాయి. ఈనెల 13న ఆరోగ్య శ్రీ ట్రస్ట్ నెట్వర్క్ ఆసుపత్రులకు రూ. 31 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇప్పటికే ఆసుపత్రుల బకాయిలు దాదాపు చెల్లించిన ప్రభుత్వం..మరికొద్ది రోజుల్లో మరో 16 కోట్ల రూపాయల విడుదల చేయనుంది.