
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఆరోగ్యశ్రీ పథకంపై దాఖలైన పిల్ ను కోర్టు కొట్టివేసింది. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీని అమలు చేయాలని పేరాల కేశవరావు పిల్ దాఖలు చేశారు. అయితే ప్రైవేట్ ఆస్పత్రులకు అధిక బడ్జెట్ కేటాయించడం కంటే ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధిపై దృష్టి సారించాలని పిటిషనర్ కోరారు. పిటిషనర్ వాదనలు విన్న హైకోర్టు.. ‘ప్రభుత్వం ఆరోగ్యశ్రీని సక్రమంగా అమలు చేయలేదనడానికి ఏమైనా ఆధారాలున్నాయా’ అని ప్రశ్నించింది. అదే విధంగా హైదరాబాద్ లోని అన్ని ఆస్పత్రులలో మెరుగైన వైద్యం అందుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment