సాక్షి, అమరావతి: ఏపీలో ఆరోగ్యశ్రీపై కూటమి సర్కార్ శీతకన్ను వేసింది. బకాయిలు చెల్లించకపోవడమే కాకుండా డబ్బులు అడిగిన ఆసుపత్రులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బకాయిలు చెల్లించకపోతే రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వాన్ని అసోసియేషన్ హెచ్చరించింది.
ఈ సందర్భంగా నెట్‌వర్క్ ఆసుపత్రులు సభ్యులు మాట్లాడుతూ..‘ఆరోగ్యశ్రీ బకాయిలు అడిగితే వేధిస్తున్నారు. తనిఖీల పేరుతో కేసులు పెడుతున్నారు. వారం వ్యవధిలో పలు ఆసుపత్రుల్లో తనిఖీల పేరుతో హడావుడి చేశారు. అనంతపురంలో చంద్ర, క్రాంతి ఆసుపత్రులపై.. అలాగే విజయవాడలో క్యాపిటల్, గుంటూరులో శ్రావణి ఆసుపత్రుల్లో తనిఖీలు చేపట్టారు.
డబ్బులు అడిగినందుకు ఇలా కేసులు నమోదు చేసి బెదిరింపులకు దిగుతున్నారు. ఇక, రాష్ట్రంలో ఇప్పటికే రూ.2500 కోట్లకు ఆరోగ్యశ్రీ బకాయిలు చేరుకున్నాయి. ఇప్పటి వరకు చంద్రబాబు కూటమి సర్కార్ ఆరోగ్యశ్రీకి ఇచ్చింది కేవలం రూ.160 కోట్లు మాత్రమే చెల్లించారు. బకాయిలపై నోరెత్తకుండా వేధిస్తున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment