ఎమర్జెన్సీ కేసులకే చికిత్స
నేడు మంత్రులతో ఆశా ప్రతినిధుల భేటీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడింది. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ స్పెషాలిటీ అసోసియేషన్(ఆశా) ప్రతినిధులు సేవలు నిలిపివేశారు. ఎమర్జెన్సీ కేసుల్లో మాత్రమే రోగులకు చికిత్సలు అందించారు. ఎమర్జెన్సీ కాని సందర్భాల్లో రోగులకు చికిత్సలు అందించడానికి విముఖత చూపారు. దీంతో దూర ప్రాంతాల నుంచి చికిత్సల కోసం ఆస్పత్రులకు వచి్చన వివిధ అనారోగ్య బాధితులు వెనుదిరిగారు.
రూ.2,500 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని లేదంటే ఆగస్ట్ 15 నుంచి సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వానికి నెట్‌వర్క్ ఆస్పత్రులు గత నెల 30వ తేదీనే అల్టిమేటం ఇచ్చాయి. ఈ నెల 10వ తేదీలోగా కొంత మొత్తం విడుదల చేస్తామని అధికారులు చెప్పినప్పటికీ నిధులు విడుదల చేయలేదు. ఆస్పత్రులు నిర్వహించడం కూడా కష్టంగా ఉంటోందని తేల్చి చెప్పి గురువారం నుంచి సమ్మెలోకి వెళతామని యాజమాన్యాలు తేల్చి చెప్పాయి.
దీంతో చేసేదేమీ లేక రూ.200 కోట్లు మాత్రమే బుధవారం ప్రభుత్వం విడుదల చేసింది. మరో రూ.300 కోట్లు త్వరలో విడుదల చేస్తామన్నప్పటికీ సేవల కొనసాగింపునకు ఆస్పత్రులు ససేమిరా అన్నాయి. శుక్రవారం మంత్రులు సత్యకుమార్, లోకేశ్‌లతో భేటీ ఏర్పాటు చేయడంతో అప్పటి వరకూ కేవలం ఎమర్జెన్సీ కేసులకు మాత్రమే సేవలు అందిస్తామని యాజమాన్యాలు ఒప్పుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment