
విజయవాడ: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంపై ఎమ్మెల్యే,మల్లాది విష్ణు స్పందించారు. చంద్రబాబు చేతిలో అధికారం ఉందన్న గర్వంతో అడ్డూ అదుపూ లేకుండా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
కౌరవసభగా మార్చేశారు..
ఆదివారం ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించిన నేపథ్యంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. 2014 నుంచి 19 వరకూ చంద్రబాబు పాలనంతా అవినీతిమయమేనని ప్రజల జీవన స్థితిగతులు మార్చేందుకు కనీస చర్యలు కూడా తీసుకోలేదన్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ కళ్లు నెత్తిమీద పెట్టుకుని పాలించారని శాసన సభను కౌరవ సభగా మార్చి రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయడానికి ప్రయత్నించారన్నారు.
అన్నీ కుంభకోణాలే..
స్కిల్ స్కాంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి దొరికిపోయాడని అమరావతి పేరుతో ప్రజలను మభ్యపెట్టారని ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ ఐదేళ్ల పాలనలో అన్నీ కుంభకోణాలేనన్నారు. ఆ ఐదేళ్ల రాక్షస పాలనలో కిందనున్న కార్యకర్తలు జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారని పైనున్న మంత్రులు,ముఖ్యమంత్రి స్కాముల పేరుతో దోచుకున్నారన్నారు.
తుస్సుమన్న బంద్..
అవినీతికి కేరాఫ్ అడ్రస్ టీడీపీ పార్టీ అని మరోసారి నిరూపితమైంది నిజంగా తమ తప్పు లేకపోతే స్కిల్ కుంభకోణంతో తనకు సంబంధం లేదని చంద్రబాబు, టీడీపీ నాయకులు ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. తప్పు చేసినట్టు ఆధారాలున్నాయి కాబట్టి రిమాండ్ విధిస్తే ఆఘమేఘాల మీద బంద్ కు పిలుపునిచ్చారు. తీరా చూస్తే బంద్ పూర్తిగా విఫలమవ్వడంతో టీడీపీ పరువుపోయిందన్నారు.
ఆయనకు సిగ్గులేదు..
టీడీపీ బంద్‌కు మద్దతుగా పిలుపునివ్వడానికి పవన్‌కు అసలు సిగ్గుందా అని ప్రశ్నించారు. బాబు జమానాలో అంతా అవినీతికి పాల్పడే ఖజానా నింపుకుందని ఏమీ తెలియనట్టు ఈరోజు చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నాడని అన్నారు. ఈరోజు వైసీపీ ప్రభుత్వం అవినీతికి ఎక్కడా ఆస్కారం లేకుండా మేం పాలన చేస్తున్నామన్నారు. చంద్రబాబు తప్పులన్నీ తాను చేసి నిందలు మాపై వేస్తున్నాడని అన్నారు.
నోరు జాగ్రత్త..
చంద్రబాబుకి మద్దతిచ్చే పార్టీల వైఖరి చూస్తే నవ్వొస్తుంది. చంద్రబాబు మోదీని పొగుడుతాడు. మోదీని పొగిడిన చంద్రబాబును సీపీఐ వెనకేసుకొని వస్తుంటుంది. ఇక జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడతాడో ఆయనకే అర్ధం కాదన్నారు. పవన్ పులివెందుల గురించి మాట్లాడే ముందు అక్కడి సంస్కృతి గురించి తెలుసుకుని మాట్లాడాలన్నారు.
తెలుసుకుని మాట్లాడు..
చంద్రబాబుకు, పవన్‌కు అమరావతి తప్ప మరొకటి తెలియదని పేదలకు సొంతింటి కల నెరవేరిందంటే అది పులివెందుల నుంచి వచ్చిన వ్యక్తి ఆలోచన వలనేనని అన్నారు. అమ్మ ఒడి, ఫీజురీయింబర్స్ మెంట్ వంటి అనేక పథకాలు వచ్చాయంటే అది పులివెందుల వ్యక్తి నుంచి వచ్చిన ఆలోచనల చలవేనని అన్నారు. పేదలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న పవన్‌కు మానవత్వమే లేదని అన్నారు. అసలు పవన్‌కు సీఎం జగన్‌ను విమర్శించే అర్హతే లేదన్నారు.
ఇది కూడా చదవండి: చెంపలు వేసుకోవాల్సింది పోయి జనాన్ని రెచ్చగొడతారా?
Comments
Please login to add a commentAdd a comment