
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి మరో ఝలక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ... వైఎస్ జగన్ నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేస్తామని తెలిపారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీ అస్థిత్వం కోల్పోయిందని ద్రోణంరాజు శ్రీనివాస్ ఆరోపించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు అనైతికమని ఆయన మండిపడ్డారు. వైఎస్ జగన్ ఆదేశిస్తే ఎక్కడినుంచైనా పోటీ చేస్తానన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ జగన్ నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే నీరజా రెడ్డి కూడా శనివారం రాత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో కలిశారు. అలాగే వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జున రావు కూడా వైఎస్సార్ సీపీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment