
సాక్షి, విశాఖ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్ సీపీ నేత, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన సోమవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘పవన్ నీ బెదిరింపులు ఎవరికి?. నా వెనుక వున్నారంటున్నావు. నీ వెనుక ఎవరున్నారో చెప్పు. నీ వెనుక దావుద్ ఇబ్రహీం ఉన్నాడా?. ప్రభుత్వాన్ని విమర్శించిన పవన్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రాజకీయ నాయకుడిగా రాణించాలంటే ఆవేశం తగ్గించుకోవాలి. వాపును చూసి...బలుపు అనుకుంటే దెబ్బతింటారు. మీ వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరో పవన్ బయటపెట్టాలి’ అని డిమాండ్ చేశారు.