రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం చంద్రబాబే: ద్రోణంరాజు శ్రీనివాస్ | Chandrababu is the reason behind state bifurcation, criticises Dronamraju Srinivas | Sakshi
Sakshi News home page

రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం చంద్రబాబే: ద్రోణంరాజు శ్రీనివాస్

Published Mon, Sep 9 2013 8:54 PM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం చంద్రబాబే: ద్రోణంరాజు శ్రీనివాస్ - Sakshi

రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం చంద్రబాబే: ద్రోణంరాజు శ్రీనివాస్

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై, ఇతర సీనియర్ నేతలపై అనుచిత వ్యాఖ్యలపై చేస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా గత 41 రోజులుగా కొనసాగుతున్న ఉద్యమాలకు మద్దతు తెలుపకపోగా.. ఆత్మగౌరవ యాత్రలో కాంగ్రెస్ నేతలపై విమర్శలకు దిగడం శోచనీయం అని అన్నారు.

కాంగ్రెస్ పార్టీపై, నేతలపై అవాకులు చెవాకులు పేల్చితే చంద్రబాబుకు కాంగ్రెస్ కార్యకర్తలు బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. విమర్శలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసివస్తుందన్నారు. ఎనిమిదేళ్లు ముఖ్యమంత్రిగా, బాధ్యాతాయుతమైన ప్రతిపక్ష నేతగా ఓ దేశ ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని శ్రీనివాస్ తప్పుపట్టారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితులకు, ఆందోళనలకు కారణం తెలుగుదేశం పార్టీనేనని ఆరోపించారు. 2008 సంవత్సరంలో ప్రధానికి రాష్ట్రాన్ని విభజించాలని లేఖ ఇచ్చిన తొలి రాజకీయ పార్టీ తెలుగుదేశమే అని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement