ద్రోణంరాజు శ్రీనివాస్‌కు కీలక బాధ్యతలు | YS Jagan Appoints Dronamraju Srinivas as VMRDA Chairperson | Sakshi
Sakshi News home page

వీఎండీఆర్‌ఏ చైర్మన్‌గా ద్రోణంరాజు శ్రీనివాస్‌

Published Sat, Jul 13 2019 2:33 PM | Last Updated on Sat, Jul 13 2019 2:46 PM

YS Jagan Appoints Dronamraju Srinivas as VMRDA Chairperson - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత ద్రోణంరాజు శ్రీనివాసరావుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనను విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎండీఆర్‌ఏ) చైర్మన్‌గా  నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప‍్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ సౌత్‌ నుంచి పోటీ చేసిన ద్రోణంరాజు టీడీపీ అభ్యర్థిపై ఓటమిపాలైన విషయం తెలిసిందే. కాగా ద్రోణంరాజు శ్రీనివాస్‌ గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement