సాక్షి, విశాఖపట్నం: విపత్కర పరిస్థితుల్లో ప్రజల రక్షణ కోసం జిల్లా యంత్రాంగం కష్టపడి పనిచేస్తోందని వీఎంఆర్‌డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ అభినందించారు. విశాఖలో సోమవారం నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే అత్యధికంగా విశాఖలో కరోనా టెస్ట్ లు నిర్వహించామని పేర్కొన్నారు. విశాఖలో కరోనా కేసులను దాచాల్సిన అవసరం లేదని.. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో కరోనా కేసులు పెరగాలని కొందరు కోరుకున్నారని.. వారి ఐరన్ టంగ్ ఫలితంగా దురదృష్టవశాత్తూ కేసులు పెరిగాయన్నారు. (కంటైన్‌మెంట్ జోన్లలో ఆంక్షలు కొనసాగింపు)
లాక్‌డౌన్ సమయంలో రాష్ట్రంలో పేదలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని విధాల ఆదుకుంటున్నారని తెలిపారు. కరోనా నియంత్రణలో ప్రధాని మోదీ సైతం తీసుకున్న లాక్‌డౌన్ లాంటి నిర్ణయాలు మంచి ఫలితాలిచ్చాయని ఆయన పేర్కొన్నారు.టీడీపీ నేతలు విమర్శలు చేయడం మాని ప్రభుత్వానికి సహకరించాలని హితవు పలికారు. నీచ రాజకీయాలు చేయకుండా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు. పార్టీలకతీతంగా ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయంలో ప్రభుత్వంపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేయడాన్ని ద్రోణంరాజు శ్రీనివాస్ తప్పుపట్టారు. (ఏపీ సచివాలయంలో పెరిగిన ఉద్యోగుల హాజరు)
Comments
Please login to add a commentAdd a comment