ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూత | EX MLA Dronamraju Srinivas Passed Away | Sakshi

మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూత

Oct 4 2020 4:27 PM | Updated on Oct 5 2020 11:34 AM

EX MLA Dronamraju Srinivas Passed Away - Sakshi

సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే, విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) మాజీ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌(59) గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పినాకిల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన విశాఖ వన్‌టౌన్‌ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.

అపర రాజకీయ చాణిక్యుడు ద్రోణంరాజు సత్యనారాయణ కుమారుడుగా ద్రోణంరాజు శ్రీనివాస్‌కు ఉత్తరాంధ్రలో చెరగని ముద్ర వేశారు. ద్రోణంరాజు శ్రీనివాస్ కు భార్య శశి, కుమార్తె శ్వేత, కుమారుడు శ్రీవత్సవ ఉన్నారు. శ్రీనివాస్ మృతి పట్ల మంత్రి అవంతి శ్రీనివాస్‌ రావు, ద్రోణంరాజు రవికుమార్‌  సంతాపం ప్రకటించారు. శ్రీనివాస్‌ మృతి బ్రాహ్మణ సమాజానికి తీరని లోటని రవికుమార్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement