పుణ్యప్రవాదేవి (ఫైల్ ఫోటో)
బీచ్‌రోడు (విశాఖ తూర్పు): ప్రముఖ బాలల సాహిత్య రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పుణ్యప్రవాదేవి (84) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె విశాఖలోని తన నివాసంలో మృతి చెందారు. ఒడియా సాహిత్యానికి జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చిన ప్రముఖ రచయిత చరణ్‌దాస్ కుమార్తె ఈమె.
చదవండి: కష్టపడి ఎస్‌ఐ అయ్యాడు.. పెళ్లయి కూడా 5 రోజులే.. విధుల్లో చేరేందుకు వెళ్తూ..
కటక్‌లో 1938లో జన్మించిన పుణ్యప్రవాదేవి బాలల సాహిత్యంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ప్రవాదేవికి నలుగురు పిల్లలు. 2010లో బాల సాహిత్య విభాగంలో లిటిల్ డిటెక్టివ్ కథకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. అలాగే ఒడియా నుంచి సాహిత్యరత్న అవార్డుతో పాటు 1965లో ఆకాశ వాణి పురస్కారం, 1960లో జాతీయ పురస్కారం, ఎన్‌సీఈఆర్‌టీ అవార్డులు పొందారు. ఆమె తొలి పిల్లల కథ బాడదో గొల్లగొల్ల (కితకితలు) కాగా, పిలోంకా రామాయణ, శిశుసైనిక, మేఘదూత, టికీ రాజా రచనలు ప్రాముఖ్యత పొందాయి.
Comments
Please login to add a commentAdd a comment