Visakha Dairy Chairman Adari Tulasi Rao Died Due To Health Issues In Hyderabad - Sakshi
Sakshi News home page

Visakha Dairy Adari Tulasi Rao Death: విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు కన్నుమూత

Published Wed, Jan 4 2023 7:22 PM | Last Updated on Wed, Jan 4 2023 7:40 PM

Visakha Dairy Chairman Adari Tulasi Rao Passed Away - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/విశాఖపట్నం: విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు బుధవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తులసీరావు మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. రేపు(గురువారం) ఉదయం 6 గంటలకు తులసీరావు పార్థివ దేహాన్ని స్వగ్రామమైన యలమంచిలికి తరలించనున్నారు.

1939 ఫిబ్రవరి 1న అనకాపల్లి జిల్లా యలమంచిలిలో వెంకటరామయ్య, సీతయ్యమ్మ దంపతులకు జన్మించారు. సుమారు 35 ఏళ్లపాటు విశాఖ డైరీ చైర్మన్‌గా కొనసాగిన ఆయన విశాఖ డెయిరీ ని ప్రగతి పథంలో నడిపించారు. రైతుల కోసం విశాఖ డెయిరీ తరఫున కృషి ఆసుపత్రిని ఏర్పాటు చేశారు.
చదవండి: నాకే రూల్స్‌ చెబుతారా..? కుప్పంలో పోలీసులపై చంద్రబాబు వీరంగం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement