సాక్షి, విజయవాడ : స్వాతంత్య్రం సిద్ధించి ఏళ్లు గడుస్తున్నా ముస్లింలకు సంక్షేమ పథకాలు అందని ద్రాక్షగానే మిగిలాయి. ఎన్నికల ముందు నేతలు ఇచ్చే హామీలు నమ్మి ఓట్లేయడం. అనంతరం తమ సంక్షేమాన్ని గాలికొదిలిన ప్రభుత్వాన్ని నిందించుకోవడం. ఇదీ 2004 ముందు వరకు ముస్లింల పరిస్థితి. 2004లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రయాణ స్వీకరం చేశారు.
ముస్లింల సంక్షేమానికి బాటలు వేస్తానని హామీ ఇచ్చారు. అలాంటి వారి జీవితాల్లో ఐదున్నర దశాబ్దాల తర్వాత వెలుగులు నింపారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. అందుకే మైనార్టీల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన హయాంలో మైనార్టీల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి.మరోక వైపు బీజేపీతో పొత్తులు పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముస్లింలపై కపట ప్రేమ చూపించారు.
ముస్లింలకు నాలుగుశాతం రిజర్వేషన్లు..
పేదరికంలో ఉన్న మైనార్టీలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కనీస భద్రత, ఆనందవంతమైన బతుకు గడిపేందుకు భరోసా అందించారు. ఇందులో భాగంగా 4 శాతం రిజర్వేషన్ పథకాన్ని అమలు చేశారు. ఇందులో నిరుపేద ముస్లింలను మొత్తం చేర్చారు. 2005 జూన్‌లో ప్రవేశ పెట్టిన ఈ పథకం ద్వారా జిల్లాలో వందల మంది రిజర్వేషన్ కోటాలో ఉద్యోగాలు సాధించారు.
తద్వారా ఐఏఎస్, ఐపీఎస్, వైద్యులు, ఆర్డీఓ, తహసీల్దార్ తదితర ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. పేదరికంలో మగ్గుతున్న మైనార్టీ విద్యార్థుల జీవితాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంతో ఉన్నత విద్యా వెలుగులు నింపారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. ఇందులో భాగంగా ఇంజినీరింగ్, మెడిసిన్‌కు సంబంధించి కళాశాల గ్రేడ్‌ను బట్టి మైనార్టీలకు రూ.35 వేలు, ఎంసీఏ, ఎంబీఏ కోర్సులకు రూ.26 వేల నుంచి రూ.27 వేల వరకు ఆయా కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేది.
దీంతో పాటు కళాశాలకు సంబంధించిన హాస్టల్లో ఉండి చదువుకునే విద్యార్థులకు స్కాలర్‌షిప్ కింద రూ.13 వేలను అందజేసేది. జిల్లా వ్యాప్తంగా 39 ఇంజినీరింగ్ కళాశాలలుండగా.. వీటి పరిధిలో ప్రతి ఏటా 11,584 నుంచి 12,000 మంది మైనార్టీ విద్యార్థులు ఇంజినీరింగ్, మెడిసెన్ కోర్సుల్లో విద్యను అభ్యసించేవారు. వీరి ఏటా సుమారు రూ.23.18 కోట్లు చెల్లించేవారు. ఇలా ఐదేళ్లలో 58 వేల మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించారంటే అది వైఎస్సార్ ఘనతే.
బీజేపీతో బాబు దోస్తీ..
చంద్రబాబునాయుడు బీజేపీతో స్నేహం కోసం తహతహలాడతారు. 1999లో తొలిసారిగా బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. వాజ్‌పేయ్‌కు ఉన్న హవాతో చంద్రబాబు కూడా ముఖ్యమంత్రి అయ్యారు. ఐదేళ్లు ముస్లింల వైపు చంద్రబాబు కన్నేతి చూడలేదు. బీజేపీతో చెట్టాపట్టాలు వేసుకుని తిరి గారు. 2004లో బీజేపీతో కలిసి పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
తన ఓటమికి బీజేపీనే కారణమంటూ ఇక భవిష్యత్తులో బీజేపీతో పొత్తు పెట్టుకోనంటూ శపధం చేశారు. అయి తే 2014లో తిరిగి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. నరేంద్ర మోడి ప్రభంజనంతో తిరిగి ము ఖ్య మంత్రి అయ్యారు. ముస్లింలను దూరంగా ఉంచారు. నాలుగున్నర ఏళ్లు చిలకా గోరింకలులాగా బీజేపీ, టీడీపీలు కలిపి పనిచేశాయి. అప్పుడు ముస్లింలను దగ్గరకు రానీవ్వలేదు. బీజేపీకీ దూరమైన తరువాత కేవలం ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా ఫారూఖ్‌కు మంత్రి పదవి ఇచ్చారు.
విజయవాడలో తొలి ఎమ్మెల్సీ సీటు ముస్లింలదే..
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముస్లింలను తన గుండెల్లో పెట్టుకని చూసుకుంటున్నారు. రాజకీయ సమీకరణాల్లో ముస్లింలకు జిల్లాలో సీటు ఇవ్వలేకపోయారు. అయితే విజయవాడలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన నేపథ్యంలో జననేత జగన్‌మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల తరువాత విజయవాడకు కేటాయించిన తొలి ఎమ్మెల్సీ సీటు ముస్లింలకే కేటాయిస్తానని, వారికి తగిన న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ముస్లింలలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. తండ్రి లాగానే వైఎస్ జగన్ ఇచ్చిన మాట తప్పరని తమకు రాజకీయ ప్రాధాన్యత ఇస్తారని వారు నమ్ముతున్నారు.
ముస్లింల జీవితాల్లో వెలుగులు
ముస్లింలకు ఎవరూ చేయలేని మేలును డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేసి చూపించారు. ఆయన కల్పించిన 4 శాతం రిజర్వేషన్ల ఫలితంగా ముస్లింలు ఉన్నత ఉద్యోగాల్లో చేరడమే కాక, వైద్యులు, ఇంజినీర్లుగా ఎదిగారు. అప్పటి వరకూ చదువుకోవాలని ఉన్నా సీట్లు రాక, ఫీజులు చెల్లించలేక నిస్సహాయ స్థితిలో ఉన్న ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత వైఎస్‌రాజశేఖరరెడ్డి. ఆయన చేసిన మేలును ఎన్నటికీ మరువజాలదు. ముస్లింలకు ఏదైనా మేలు జరిగిందంటే అది వైఎస్ రాజశేఖరరెడ్డి హాయాంలోనేనని అందరూ నమ్ముతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ నేటికీ ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు.
– ఫయాజ్ అహ్మద్, లబ్బీపేట, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment