Raghunatha Reddy
-
ఏ కారణంతో చనిపోయినా చంద్రబాబు అకౌంటే..
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నాలుగు రోజుల క్రితం మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పుట్టపర్తి మండలం నిడిమామిడి నుంచి గంట్ల మారెమ్మ ఆలయం వరకు సంఘీభావ యాత్ర నిర్వహించారు. ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో మద్యం, డబ్బులు ఎరగా వేశారు. ఈ క్రమంలోనే గాజులపల్లికి చెందిన ఓ వ్యక్తి పూటుగా మద్యం తాగి ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయాడు. కానీ చంద్రబాబు అరెస్టును తట్టుకోలేకే అతను గుండె ఆగి చనిపోయినట్లు టీడీపీ నేతలు ప్రచారం చేశారు. ఎల్లో మీడియాలోనూ వార్తలు వచ్చాయి. ఇలాంటి ఘటనలు ప్రతి నియోజకవర్గంలోనూ ఉన్నాయి. వారం రోజుల క్రితం పెనుకొండలో బీకే పార్థసారథి ఆధ్వర్యంలో 40 కుటుంబాలు టీడీపీలో చేరినట్లు టీడీపీ అనుకూల పత్రికల్లో వార్తలు వచ్చాయి. అయితే వారందరూ ఆరంభం నుంచి టీడీపీ వెంట నడిచిన వారేనని తేలింది. అయితే కొంతకాలంగా సవితమ్మ వర్గంలో ఉన్న వారంతా ఇప్పుడు బీకే పార్థసారథి వైపు వచ్చారని తెలిసింది. అలాగే నాలుగు కుటుంబాలు మాత్రమే టీడీపీలో చేరగా.. 40 కుటుంబాలు చేరినట్లు ప్రచారం చేశారు. ఫొటోల్లో జనం భారీగా కనిపించాలన్న ఉద్దేశంతో టీడీపీ కార్యాలయంలోని వారందరికీ కండువాలు వేసి ఫొటోలకు ఫోజులివ్వడం గమనార్హం. సాక్షి, పుట్టపర్తి: అధినేత అవినీతి కేసులో జైలు పాలయ్యాడు.. ప్రజలు పట్టించుకోవడం మానేశారు. నిరసన, ధర్నాలకు పిలుపునిచ్చినా కార్యకర్తలు కన్నెత్తి చూడటం లేదు. ఏం చేయాలో తెలియని పచ్చ తమ్ముళ్లు ఉనికి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పార్టీ కార్యకర్తలకే మళ్లీ కండువాలు వేసి టీడీపీలో చేరినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఎల్లో మీడియాలోనూ అవే వార్తలు కనిపిస్తుండటంతో జనం నవ్వుకుంటున్నారు. వాపును బలుపుగా ప్రచారం.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కుల, మత, రాజకీయాలకు అతీతంగా పథకాలు అమలు చేయడంతో చాలా మంది టీడీపీ నేతలూ లబ్ధి పొందుతున్నారు. దీంతో వారంతా ఒక్కొక్కరుగా ఫ్యాన్ కిందకు చేరుతున్నారు. ఈ క్రమంలోనే హిందూపురం, పెనుకొండ, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి, మడకశిర, రాప్తాడు నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి భారీగా వలసలు మొదలయ్యాయి. గ్రామాల వారీగా టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వస్తున్నారు. దీంతో ‘తమ్ముళ్ల’కు వణుకు పట్టుకుంది. అవినీతి కేసులో చంద్రబాబు జైలు వెళ్లడం...టీడీపీ ముఖ్య నేతలు కూడా తలోదారి చూసుకుంటున్నట్లు వార్తలు వస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవడం కష్టమనే భావన కార్యకర్తల్లోకి వెళ్లిపోయింది. అందువల్లే మండల స్థాయి నేతలంతా వైఎస్సార్ సీపీ వైపు చూస్తున్నారు. కానీ కొందరు టీడీపీ నేతలు మాత్రం వాపును బలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ‘తెలుగు తమ్ముళ్ల’కే మళ్లీ కండువాలు కప్పుతూ కొత్తగా టీడీపీలో చేరారంటూ గొప్పలు పోతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవం తెలిసిన జనం మాత్రం వీరి చర్యలు చూసి నవ్వుకుంటున్నారు. ఏ కారణంతో చనిపోయినా చంద్రబాబు అకౌంటే.. కిందపడినా మాదే పైచేయి అన్నట్లుగా ఉంది టీడీపీ నేతల పరిస్థితి. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును సీఐడీ అరెస్టు చేయగా.. కోర్టు సైతం ఆయనకు రిమాండ్ విధించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపింది. దీన్ని చూపి సానుభూతి పొంది ఓట్లు రాబట్టుకోవాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఏ కారణంతో ఎవరు మరణించినా.. వెంటనే ‘చంద్రబాబు అరెస్టు’ ఖాతాలో వేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు జిల్లాలో నాలుగైదు వెలుగు చూశాయి. ఓట్ల వేటలో టీడీపీ నేతల కక్కుర్తి వ్యవహారాలు నచ్చక చాలా మంది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. ఉనికి కోసమే చంద్రబాబు జైలుకెళ్లాడు.. లోకేష్ పారిపోయాడు. వ్యవస్థలను మేనేజ్ చేయడం జగనన్న ప్రభుత్వంలో కుదరదు. ఇక ఆ అవినీతి పరుడు జైల్లో ఉండాల్సిందే. టీడీపీ జీరో అయింది. అందువల్లే ఉనికి చాటుకునేందుకు ఆ పార్టీ నేతలు ఉత్తుత్తి ప్రచారం చేస్తున్నారు. కానీ విజ్ఞులైన జనం అంతా గమనిస్తున్నారు. – గోరంట్ల మాధవ్, ఎంపీ, హిందూపురం నలుగురు కూడా చేరలేదు మా గ్రామం నుంచి 25 కుటుంబాలు టీడీపీలో చేరినట్లు ఆ పార్టీ నేతలు ప్రచారం చేశారు. కానీ వారందరూ టీడీపీలో ఉన్నవాళ్లే. అయితే అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారన్న భయంతో వారికి కండువాలు కప్పి కొత్తగా టీడీపీలో చేరినట్లు బీకే పార్థసారథి ప్రచారం చేశారు. కనీసం నలుగురు కూడా టీడీపీలో చేరలేదు. – రామాంజనేయులు, కురుబవాండ్లపల్లి -
పల్లెకు టికెట్ ఇవ్వొద్దు
పుట్టపర్తి: మాజీ మంత్రి, పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పల్లె రఘునాథరెడ్డికి అసమ్మతి సెగ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత పెదరాసు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మంగళవారం బుక్కపట్నంలో అసమ్మతి నేతలందరూ సమావేశమై ఈ సారి ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వరాదంటూ తీర్మానం చేసి అధిష్టానానికి పంపారు. సమావేశంలో పెదరాసు మాట్లాడుతూ.. పల్లె కంటే పార్టీలో తామే సీనియర్లమని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేశామని పల్లెలా పార్టీని అడ్డం పెట్టుకుని రూ.కోట్లు సంపాదించలేదని మండిపడ్డారు. పార్టీ బలోపేతానికి తాము సమావేశాలు ఏర్పాటు చేస్తూంటే వద్దనేందుకు నీవెవరూ అంటూ ప్రశ్నించారు. నీవెక్కడి వాడవని నిలదీశారు. స్థానికేతరుడైన పల్లెకు కాకుండా ఈ సారి పార్టీ టికెట్ తమకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పల్లెను బేషరతుగా నియోజకవర్గం వీడి వెళ్లాలన్నారు. .2009, 2014 ఎన్నికల్లో పల్లెను గెలిపిస్తే అడ్డగోలు సంపాదనకే ప్రాధాన్యతనిస్తూ పార్టీ కార్యకర్తలను, నాయకులను, బీసీల అభ్యున్నతిని ఏనాడూ పట్టించుకోలేదని పీసీ గంగన్న విమర్శించారు. 2014లో పార్టీ విజయానికి తాము పడిన కష్టాన్ని వివరించారు. పుట్టపర్తి మున్సిపాలిటీ చైర్మన్‌గా తాను ఎన్నికై నప్పుడు తన ఎదుగుదలకు పల్లె రఘునాథరెడ్డి అడుగడుగునా అడ్డుపడ్డాడని ఆరోపించారు. నిధులున్నా పుట్టపర్తిలో అభివృద్ధి పనులు చేపట్టకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. 2024లో పార్టీ విజయం సాధించాలంటే పల్లెకు టికెట్ ఇవ్వకుండా వేరొకరికి ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులు కేశప్ప, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చెన్నకేశవులు, నాగప్ప, మైనార్టీ నాయకుడు అల్లాబకాష్ తదితరులను సన్మానించారు. కార్యక్రమంలో ఓడీచెరువు మాజీ ఎంపీపీ ఇస్మాయిల్, కొత్తచెరువు శ్రీనాథ్, అగ్రహారం వరదప్ప, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
చీఫ్ విప్‌లుగా పయ్యావుల, పల్లె
సాక్షి ప్రతినిధి, అనంతపురం: శాసనసభ చీఫ్ విప్‌గా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘనాథరెడ్డి, శాసనమండలి చీఫ్‌విప్‌గా ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఎంపిక దాదాపుగా ఖరారయింది. వీరిద్దరికీ పదవులు కట్టబెడుతున్నట్లు సీఎంఓ నుంచి ఫోన్ చేసినట్లు సమాచారం. అయితే నియామకానికి సంబంధించిన జీఓ వెలువడాల్సి ఉంది. శాసనమండలి ఎన్నిక రోజు, లేదంటే అంతకు ముందుగానే జీఓ వెలువడనున్నట్లు తెలిసింది. పయ్యావుల కేశవ్ తొలిసారి 1994లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 1999లో ఓటమిపాలయ్యారు. అనంతరం 2004, 2009 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. 2014లో ఓటమి చవిచూశారు. 2015లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. 2014 టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో మంత్రి పదవిపై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. అయితే ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందని ఆశపడ్డారు. అప్పుడు కూడా చంద్రబాబు మొండిచేయి చూపారు. దీంతో కేశవ్ తీవ్ర నిరాశ చెందినా.. చివరకు మండలి చీఫ్‌విప్ పదవిని కట్టబెట్టారు. = పల్లె రఘునాథరెడ్డి తొలిసారి 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో ఓడిపోయారు. ఆ తర్వాత 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అనంతరం 2009, 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో సమాచార, పౌరసంబంధాలు, మైనార్టీ, ఐటీశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ ఏడాదిలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో పదవి కోల్పోయారు. ఇప్పుడు తిరిగి చీఫ్ విప్‌గా ఎంపికయ్యారు. అనంతపురం చరిత్రలో చీఫ్ విప్‌గా తొలిసారి నల్లమాడ ఎమ్మెల్యే వీరప్ప ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014లో రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు.. అనంతరం చీఫ్‌విప్‌లుగా పల్లె, పయ్యావుల నియమితులయ్యారు. -
ఛలో విజయవాడ కార్యక్రమం రద్దు
కడప అర్బన్ : ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు 2013 నుంచి చెల్లించాల్సిన బకాయిల కోసం ఈనెల 29వ తేదీన చేపట్టిన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కడప రీజినల్ అధ్యక్షుడు వై.రవీంద్రనాథ్వర్మ, సెక్రటరీ ఎల్.రఘునాథరెడ్డిలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. 19న రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని ప్రధాన కార్యాలయాల ఎదురుగా సామూహిక రిలే నిరాహార దీక్షలు నిర్వహించామన్నారు. యాజమాన్యం స్పందించని కారణంగా 29న ఛలో విజయవాడ కార్యక్రమాన్ని రాష్ట్ర కమిటీ నిర్ణయించిందన్నారు. యాజమాన్యం రాష్ట్ర కమిటీని మంగళవారం చర్చలకు ఆహ్వానించి మూడు వారాల్లోపు బకాయిలలో 50 శాతం ఇచ్చేందుకు, మిగతా 50 శాతం ఫిబ్రవరి నెలాఖరులో ఇచ్చేందుకు, పీఎఫ్ కార్యదర్శితో చర్చించి త్వరలో బకాయిలు చెల్లించేందుకు ఎండీ పీఎఫ్ సెక్రటరీని ఆదేశించారన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఎన్ రెడ్డి, బి.పటేల్ రాజారెడ్డిలు పాల్గొని ఎండీతో చర్చించారని వారు పేర్కొన్నారు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు. -
అమెరికాను ఇక్కడే చూపిస్తాం...
సీఆర్డీఏ డీసీ రఘునాథరెడ్డి రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు కౌలు రూపంలో ఏడాదికి రూ.50 వేలు చొప్పున చెల్లిస్తున్నామని, రైతులు రాజధానికి మరింతగా సహకరిస్తే అమెరికాను ఇక్కడే చూపిస్తామని సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ జి. రఘునాథరెడ్డి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. భూములు లేని మూడు వేలకు పైగా రైతులకు, రైతు కూలీలకు నెలనెలా రూ.2,500 పింఛన్లు చెల్లిస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ తప్పకుండా పింఛను అందేలా కృషి చేస్తానన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం గ్రామం నుంచి 160 మీటర్ల వెడల్పున రెండు ఎక్స్‌ప్రెస్ రహదారులు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. అయితే ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తరువాత మాత్రమే ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఒక వేళ ఇళ్లను తొలగించాల్సి వస్తే మెరుగైన ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పచ్చల రత్నకుమారి, జెడ్పీటీసీ ఆకుల జయసత్య, ఎంపీటీసీ సభ్యులు మొగిలి లీలావతి, షేక్ హన్నన్, మార్కెట్ చైర్మన్ ఆరుద్ర భూలక్ష్మి, వైస్ చైర్మన్ మన్నెం రమేష్, మండల ప్రత్యేకాధికారి ఎంజే నిర్మల, డెరైక్టర్ ల్యాండ్స్ బి. చెన్నకేశవులు, తహశీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో పద్మావతి, ఈవోఆర్డీ రవికుమార్‌లతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రబీ రుణ లక్ష్యం రూ.658.10 కోట్లు
సాక్షి, కడప : రబీలో రూ.658.10 కోట్లు రుణాలుగా అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ (ఎల్డిఎం) లేవాకు రఘునాథరెడ్డి పేర్కొన్నారు. అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించామన్నారు. ఖరీఫ్‌లో రూ.2077.96 కోట్లు రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకుని రూ.1402.11 కోట్లు అందజేశామన్నారు. ముద్ర పథకం కింద ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రుణలిస్తామని, వివిధ పథకాల కింద రుణం కోసం దరఖాస్తు చేసిన వారికి బ్యాంకుల్లో ఇక్కట్లు ఎదురైతే తమ దృష్టికి తేవచ్చని ఆయన బుధవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ఇంటర్వ్యూ వివరాలు.. సాక్షి : ఖరీఫ్‌లో అనుకున్న రీతిలో రుణ లక్ష్యం చేరుకోలేదు.. రబీలో ఏ విధంగా వ్యూహం రూపొందిం చుకున్నారు? ఎల్డీఎం : ఖరీఫ్‌లో 2077.96 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని 1402.11 కోట్లు ఖర్చు చేశాం. దాదాపు 67.48 శాతం వృద్ధి సాధించాం. ఇది మంచి ప్రగతే. సుమారు 2.40 లక్షల మంది రైతులకు రుణాలందించాం. 2014-15లో 32 బ్యాంకుల ద్వారా సుమారు పది వేల మంది కొత్త రైతులకు రుణాలిచ్చాము. ఇపుడు రబీ సీజన్ ప్రారంబమవుతోంది. అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు రుణ ప్రణాళిక రూపొందించుకున్నాం. ఇందులో భాగంగా రూ.658.10 కోట్లు రైతులకు రుణంగా ఇవ్వాలని నిర్ణయించాం. సాక్షి : ఉద్యాన (హార్టికల్చర్) రైతులకు రుణ మాఫీ వర్తించలేదు. అందువల్ల చేయూతనిస్తామన్నారు.. ఆ ప్రక్రియ ఎంత వరకు వచ్చింది? ఎల్డీఎం : ప్రభుత్వం నుంచి ఉద్యాన రైతులకు రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో నెల రోజులుగా వారి జాబితాను అప్లోడ్ చేస్తున్నాం. దాదాపు 70 - 80 వేల మంది పండ్ల తోటల రైతుల పేర్లను ప్రభుత్వానికి పంపుతున్నాం. త్వరలో ఈ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నాం. సాక్షి : కౌలు రైతులకు పూర్తి స్థాయిలో రుణాలు అందడం లేదు.. ఎల్డీఎం : జిల్లాలో దాదాపు 3 వేల మంది కౌలు రైతులు ఉన్నారు. వీరిలో సుమారు 800 మంది కౌలు రైతులకు రుణాలు ఇచ్చాం. అన్నీ అర్హతలతో ముందుకు వస్తే ఇవ్వడానికి బ్యాంకులకు ఎలాంటి ఇబ్బంది లేదు. సాక్షి : చాలా బ్యాంకులు రైతుల బంగారాన్ని వేలం వేస్తున్నాయి.. కొద్ది రోజులు వేచి చూడవచ్చు కదా? ఎల్డీఎం : బంగారం ధర అధికంగా ఉన్నప్పుడు చాలా మంది రుణాలు తీసుకున్నారు. ఇటీవల ధర తగ్గడంతో విడిపించుకునేందుకు చాలా మంది మొగ్గు చూపడం లేదు. ఇలాంటప్పుడు ఇంకా వేచి చూస్తే బ్యాంకులు నష్టపోతాయి. సాక్షి : చాలా చోట్ల రైతుల రుణాల రెన్యూవల్స్ ఎందుకు అగిపోయాయి? ఎల్డీఎం : పాస్ పుస్తకాలలో ఉన్న భూముల వివరాలను ప్రభుత్వం ఇటీవల ఆన్లైన్ చేయడంతో చాలా మంది రెన్యూవల్ చేయలేదు. గతంలో కొంత మంది తప్పుడు రికార్డులతో రుణాలు తీసుకునేవారు. ఇపుడు ఆన్లైన్ చేయడం వల్ల 1బి అడంగల్, ఇతర రికార్డులు సక్రమంగా ఉంటేనే బ్యాంకర్లు రుణం ఇస్తారు. ఇందువల్లే చాలా చోట్ల రెన్యూవల్స్ ఆగిపోయాయి. సాక్షి : జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రుణాలు, విద్యా రుణాల కోసం బ్యాంకర్లు బాగా తిప్పుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.. ఎల్డీఎం : అన్ని వివరాలు సక్రమంగా ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. విద్యా రుణాలకు సంబంధించి సబ్ ప్లాన్‌లో ప్రత్యేకంగా టార్గెట్ ఇచ్చారు. అదే పనిగా బ్యాంకు మేనేజర్లు ఇబ్బంది పెడితే మా దృష్టికి తీసుకు వస్తే రుణం అందేలా చర్యలు తీసుకుంటాం. సాక్షి : ముద్ర రుణాలు ష్యూరిటీ లేకుండా ఇస్తారా..? ఎల్డీఎం : ప్రధాన మంత్రి ప్రవేశ పెట్టిన ముద్ర పథకం ద్వారా అన్ని వ్యాపార లావాదేవీలకు రుణాలిస్తాము. రూ. 50 వేలు మొదలు రూ.10 లక్షల వరకు రుణాలు ఇవ్వాలని స్పష్టంగా ఆదేశాలు వచ్చాయి. ష్యూరిటీతో సంబంధం లేకుండా రుణం ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 5 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. మరో మూడు వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. -
మైనార్టీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
శ్రీకాకుళం: మైనార్టీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్టు రాష్ట్ర సమాచారం, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. వక్ఫ్ ఆస్తులను పరి రక్షించాలని ఆధికారులను ఆదేశించా రు. జిల్లా పరిషత్ సమావేశం మంది రంలో జిల్లా అధికారులతో మంగళవా రం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో మైనార్టీ సంక్షేమంపై సమీక్షిస్తూ 1780 ఎకరాల వక్ఫ్ భూములుయని అధికారులు అన్నారు. వీటిలో 755.73 ఎకరాలు పొం దూరు, 12.82 ఎకరాలు బలగలోనూ గుర్తించామని అధికారులు వివరించారు. వక్ఫ్ భూము లు కోట్లాది రూపాయల విలువైనవని, ఆక్రమణలను గుర్తించి తమకు తెలియజేస్తే తగిన చర్యలు తీసుకుని వాటి పరిరక్షణకు కృషి చేస్తామని రాష్ట్ర కార్మికశాఖమంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆమదాలవలసలో షాదీఖా నా నిర్మించినా నిరుపయోగంగా ఉందని ప్రభుత్వ విప్ కూ న రవికుమార్ తెలిపారు. తహశీల్దార్ ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేసుకొని వక్ఫ్ ఆస్తులను పరిరక్షించుకోవాలని మంత్రి రఘునాథరెడ్డి సూచిం చారు. జిల్లాలో 48 వక్ఫ్ సంస్థలున్నప్పటికీ.. చాలా చోట్ల ఆక్రమణలో ఉన్నాయని సమీక్షలో పాల్గొన్న ముస్లిం నా యకులు ఫిర్యాదు చేశారు. స్పెషల్ డ్రైవ్‌లో ఆక్రమణ భూముల వివరాలను సేకరించి తమకు అందజేయాలని డీఆర్వోను మంత్రి రఘునాథరెడ్డి ఆదేశించారు. శ్రీకాకుళం చౌకబజారులో సర్వే నంబరు 224లోని మసీదు ఆక్రమణలో ఉన్నందున త్వరలోనే జరగబోయే పీర్ల పండుగకు అవకాశం లేదని ముస్లీం నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్థలం కోర్టు ట్రిబ్యునల్‌లో ఉన్నందున తమకు న్యాయం చేయాలని కోరారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఒకే మైనారిటీ వెల్ఫేర్ అధికారి ఉండడం వల్ల సామూహిక వివాహాల బడ్జెట్ ఖ ర్చు చేయలేక పోయామని జిల్లా ట్రెజ రీలో సాంకేతిక సమస్య వల్ల బిల్లుల చెల్లింపులు జరగడం లేదని మైనార్టీ సంక్షేమాధికారి తెలిపారు. సమాచార శాఖ అధికారులు వారిధిలాంటి వారు సమాచారశాఖపై సమీక్షించిన మంత్రి రఘునాథరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సమాచార శాఖ అధికారులు వారధిలాంటివారన్నారు. ప్రజా సంక్షేమ పథకాల అమలు పని తీరు ప్రజలకు తెలియజేయడం, ప్రజల స్పందనను ప్రభుత్వానికి చేరవేయడం రోజూ పత్రికల్లో వచ్చే అనుకూల, ప్రతి కూల వార్తలను జిల్లా, డివిజన్ స్థాయి ల్లో కలెక్టర్‌కు, ఆర్డీవోలకు పంపించి ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేయడానికి నిరంతరం సమాచార శాఖాధికారులు పనిచేయూలన్నారు. పాత్రికేయుల సంక్షేమ నిధిని కోటి రూపాయల నుంచి పెంచుతామన్నారు. రాష్ట్రంలో 9,264 విద్యుత్ ఫీడర్లు ఉన్నాయని, 4.20 లక్షల ఆధార్ సీడింగ్ పూర్తరుునట్టు మంత్రి పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాను పారి శ్రామికంగా అభివృద్ధి పరిచి వలసలను నివారించేందుకు కృషి చేస్తానన్నారు. తెలుగుజాతి ప్రతిష్టను పెంపొందిస్తాం తెలుగుజాతి ప్రతిష్టను పెంపొందిస్తామని మంత్రి పేర్కొన్నారు. తెలుగు జాతి గౌరవాన్ని, ప్రతిష్టను నిలిపిన మహానుభావులు అల్లూరి సీతారామరాజు, గురజాడ అప్పారావు, టంగుటూరి ప్రశాశం పంతులు వంటి మహోన్నతుల ఉత్సవాలు జరుపుకోవాల న్నారు. విజయనగరం జిల్లాలో లలిత కళా అకాడమీని ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో విమానాశ్రయం, పుడ్‌పార్కు ఏర్పాటు చేస్తామని, ఫార్మా రం గాలను అభివృద్ధి చేస్తామన్నారు. వంశధార, నాగావళికి ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికిఎంత ఖర్చు అయిన వెనుకాడబోమని ముఖ్యమంత్రి తెలిపారన్నారు. ఎంపీ కె.రామ్మోహన్నాయుడు, ఎమ్మె ల్యే గుండ లక్ష్మీదేవి, జెడ్పీ చైర్మన్ చౌదరి ధనలక్ష్మి, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జేసీ జి.వీరపాండ్యన్, ఏజేసీ మహమ్మద్ హషీం షరీఫ్ మాట్లాడారు. కార్యక్రమంలో డ్వామా పీడీ ఎ.కల్యాణ చక్రవర్తి, సమాచార శాఖ సంయుక్త సంచాకుడు కె. రాజబాబు, డీఆర్వో నూర్ బాషాఖాసీం, సమాచారశాఖ ప్రాంతీ య సమాచార ఇంజినీర్ ఎ.సత్యనారాయణ, ఏడీ బాబ్జి, డీపీఆర్వో ఎల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఐటీకి పర్యాటకం తోడు
సిటీలో మరో ఇంక్యుబేషన్ సెంటర్‌కు ప్రభుత్వం కసరత్తు మధురవాడ ఐటీ సెజ్‌ను పరిశీలించిన మంత్రి, కలెక్టర్, ఏపీఐఐసీ సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఐటీ రంగానికి విశాఖ మరిం త కీలకంగా మారబోతోంది. భారీ కొండలు, వాటిపై ఆధునిక ఐటీ కంపెనీలు, వాటి మధ్య నుంచి సముద్రాన్ని వీక్షించే వీలుగా పర్యాటకపరంగానూ కీలకంగా మార్చేం దుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తు తం నిర్మాణమవుతున్న ఇంక్యుబేషన్ కేంద్రానికి అదనంగా రెండో కేంద్రాన్ని భారీగా నిర్మించాలని భావిస్తున్నారు. కొండపై సరికొత్తగా కన్వెన్షన్ సెంటర్ నిర్మాణాన్ని చేపట్టాలని, ఇందుకోసం మధురవాడ ఐటీ సెజ్‌లో ఖాళీ స్థలాల ను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, కలెక్టర్ యువరాజ్, ఇతర అధికారులు ఆదివారం ఈ విషయమై చర్చలు జరిపారు. వస్తే ఐటీకి మేలే... నగరంలో 70 వరకు ఐటీ కంపెనీలు పనిచేస్తున్నాయి. మున్ముందు భారీ సంఖ్యలో కొత్తవి రానున్నాయి. కానీ కనీస సౌకర్యాలు లేవు. హైదరాబాద్‌లో ఐటీ సంస్థల కోసం ఇంక్యుబేషన్ సెంటర్లు, కన్వెన్షన్సెంటర్లు ఉన్నాయి. విశాఖలో ఇవి లేవు. ఈ నేపథ్యంలో ఐటీకి విశాఖ భవి ష్యత్తు రాజధానిగా మారుతుండడంతో ఇంక్యుబేషన్, కన్వెన్షన్ సెంటర్లను నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం మధురవాడ ఐటీ సెజ్‌లో రూ.23 కోట్లతో ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మిస్తున్నారు. ఇది చాలా చిన్నది. విదేశాల నుంచి వచ్చే ఐటీ కంపెనీలకు తక్షణమే కార్యకలాపాలు నిర్వహించేందుకు ఇది సరి పోదు. దీంతో రెండో కేంద్రాన్ని భారీ స్థాయిలో నిర్మిం చాలని ఎప్పటి నుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి. మధురవాడ సెజ్ సందర్శన మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, అయ్యన్నపాత్రుడు, ఐటీ సలహాదారు సత్యనారాయణ, కలెక్టర్ యువరాజ్, ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య ఆదివారం మధురవాడ సెజ్‌ను పరిశీలించారు. హిల్ నంబర్ 2లో నాన్‌ఐటీ ఎస్ఈజెడ్లో ఆరున్నర ఎకరాలు, హిల్ 3లో 30 ఎకరాలు అందుబాటులో ఉన్నట్టు గుర్తించారు. భవిష్యత్తు అవసరాల కోసం ఈ సెజ్‌లో ఎక్కడోచోట ఐటీ కంపెనీల సమావేశాల నిర్వహణకు కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలని ప్రతిపాదించారు. దీంతో కలెక్టర్, ఐటీ సలహాదారు సత్యనారాయణ హిల్3లో విప్రోకు కేటాయించిన 10 ఎకరాలను మంత్రికి చూపించారు. ఈ స్థలాలు వినియోగంలో లేకపోవడంతో అక్కడ దీన్ని నిర్మించవచ్చని వివరించారు. పాత నిధులు సుమారు రూ.20 కోట్లు ఉండడంతో దీనికి సంబంధించి తదుపరి ఏర్పాట్లు చూడాలని మంత్రి వీరిని ఆదేశించారు. ఆ తర్వాత వీరంతా ఐబీఎంను సందర్శించారు. ఈ సంస్థకు గతంలో 26 ఎకరాలు కేటాయించగా, అందులో 3 ఎకరాల్లోనే కంపెనీ ఉండడంతో మిగిలిన భూములను మంత్రితోపాటు అధికారులు వెళ్లారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, సింబయాసిస్ టెక్నాలజీ సీఈవో నరేష్‌కుమార్‌లు స్థానిక సమస్యలు వివరించారు. కొండపై ఐటీ కంపెనీలకు ఇంక్యుబేషన్ సెంటర్ లేదని చెప్పారు. ఈలోపు ఐటీ సలహాదారు సత్యనారాయణ జోక్యం చేసుకుని ఎండాడలో 20 ఎకరాల్లో దీన్ని నిర్మించే ప్రతిపాదన ఉందన్నారు. సముద్రం కనిపించేలా ఇంక్యుబేషన్ సెంటర్! కలెక్టర్, ఏపీఐఐసీ చైర్మన్, మంత్రి పల్లె మాట్లాడుతూ సముద్రతీరంతో అత్యద్భుతంగా కనిపిస్తోన్న ఈ ప్రాంతంలో ఇంక్యుబేషన్ నిర్మిస్తే పర్యాటకపరంగానూ మంచి ఆదాయం పెంచుకునేందుకు వీలుం టుందని చెప్పారు. దీంతోపాటే హోటళ్లు నిర్మిస్తే పర్యాటకులకు వీనులవిందుగా ఉంటుందన్నారు. ఏపీఐఐసీ చైర్మన్ కల్పించుకుని ఐబీఎంకు కేటాయించిన భూముల్లో కార్యకలాపాలు లేనందున 23 ఎకరాల వరకు వెనక్కు తీసుకుంటున్నట్టు ఏపీఐఐసీ అధికారులు వివరించారు. దీంతో ఇక్కడే దీన్ని నిర్మిం చడానికి ప్రతిపాదనలు తయారుచేయాలని ఆదేశిం చారు. స్థల లభ్యత ఎక్కువగా ఉన్న కారణంగా పది లక్షల అడుగుల్లో దీన్ని నిర్మిస్తే ప్రయోజనకరంగా ఉం టుందని భావించారు. ఇందుకు రూ.800 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. పీపీపీ పద్ధతి లో అందుబాటులోకి తెచ్చే విషయంపై కొంతసేపు చర్చించారు. -
పప్పుచారు.. ఉప్పు చేప.. ఓ మంత్రి!
గోదావరి జిల్లాల్లో పప్పుచారు - ఉప్పుచేప కాంబినేషన్ అంటే ఇక చెప్పనక్కర్లేదు. దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువ ఖర్చులు భరించలేని వాళ్లు, వ్యవసాయ కూలిపనులకు వెళ్లేవాళ్లు కాస్త రుచికరమైన ఆహారం తీసుకోవాలంటే.. ఎక్కువగా ఈ కాంబినేషన్నే ఇష్టపడుతుంటారు. అందరికీ అందుబాటులో ఉండే మాంసాహారం కావడంతో అన్ని తరగతుల వాళ్లు కూడా దీన్ని ఇష్టపడుతుంటారు. ఉప్పు చేపలు నిల్వ ఉండే పదార్థం కావడంతో ఏడాది పొడవునా ఇంట్లో ఉంచుకుంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పుచారు చేసుకుని దాంట్లోకి దీన్ని నంజుకుని తింటారు. స్వతహాగా రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి గోదావరి జిల్లాలకు వచ్చిన సందర్భంగా తొలిసారి ఈ పప్పు చారు - ఉప్పు చేప కాంబినేషన్ రుచి చూశారు. అద్భుతః అంటూ ఇష్టపడ్డారు. మరికొంత కావాలంటూ అడిగి తీసుకుని మరీ తిన్నారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, కలెక్టర్ నీతూప్రసాద్, కాకినాడ రూరల్ ఎమ్మల్యే అనంతలక్ష్మి, రూరల్ ఎంపీపీ పుల్లా సుధాచంద.. వీళ్లంతా వ్యవసాయ కూలీలతో కలిసి కళ్లంలోకి దిగి నాట్లు వేశారు. కలెక్టర్ సహా అందరికీ మంత్రి రఘునాథ రెడ్డే తన చేత్తో నారు అందించారు. ఆ తర్వాత కూలీలు తెచ్చుకున్న అల్పాహారాన్ని మంత్రి తీసుకుని తాను తింటూ వాళ్లకు కూడా తినిపించారు. తలపాగా చుట్టుకుని కాసేపు ఎడ్లబండి నడిపించారు. తర్వాత కూలీలతో మాట్లాడారు. -
జీ.. హుజూర్
సాక్షి ప్రతినిధి, కడప:ప్రభుత్వ అధికారులమనే భావనను వారు మరచిపోతున్నారు. పచ్చ కండువా కప్పుకోకుండానే అధికార పార్టీ నేతలకు జీ.. హుజూర్ అంటున్నారు. రాజభక్తి ప్రదర్శించడంలో పోటీలు పడుతున్నారు. నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులను గాలికి వదిలేస్తున్నారు. జమ్మలమడుగు ఆర్డీఓ మొదలు జెడ్పీ సీఈఓ వరకూ వారి పరిధిలో సరికొత్త నాటకాలకు తెరలేపుతున్నారు. ప్రజాప్రతినిధులను విస్మరిస్తూ వింతపోకడలు ప్రదర్శిస్తున్నారు.వైఎస్సార్ జిల్లాలో అధికార యంత్రాంగం ఏకపక్ష ధోరణిలో పయనిస్తోంది. కాదు...కాదు... ఏకపక్షంగా పనిచేసి తీరాలంటూ తెలుగుతమ్ముళ్లు ఆదేశిస్తున్నారు. వారి ఆదేశాలను యంత్రాంగం తుచ తప్పకుండా పాటిస్తోంది. ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనలు ఇందుకు తాత్కారంగా నిలుస్తున్నాయి. జమ్మలమడుగు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించిన ఆర్డీఓ రఘునాథరెడ్డి డ్రామా ఆర్టిస్ట్‌ను మరిపించారు.ఎన్నికలు నిర్వహిస్తే చైర్మన్‌గిరీ వైఎస్సార్సీపీ వశమవుతుందని గ్రహించిన తెలుగుతమ్ముళ్లు తెరవెనుక ఆదేశాలు అందజేయడంతో తెరముందు అనారోగ్య సమస్యను ఆర్డీఓ ఆవిష్కరించారు. కొద్దిసేపటి క్రితం వరకూ చలాకీగా ఉన్న ఆయన తెలుగుతమ్ముళ్ల మెప్పు కోసం అనారోగ్య డ్రామాను రక్తి కట్టించారు. జెడ్పీ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా అధికారుల నాటకం మారోమారు బహిర్గతం అయింది. టీడీపీ సభ్యులు, వారి మద్దతుదారులు పత్రాలు చింపేయడం, వెంటనే అక్కడి నుంచి సీఈఓ మాల్యాద్రి జారుకోవడం టీడీపీ నేతల స్క్రిప్ట్ ప్రకారమే జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. క్రమం తప్పకుండా... జమ్మలమడుగు ఉద ంతం తర్వాత అధికారులు అధికార పార్టీ మెప్పుపొందడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనల మేరకు వేదికపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యేకు సీటు కేటాయించకుండా కమిషనర్ వెంకటకృష్ణ టీడీపీ నేతల మెప్పు కోసం తాపత్రయపడ్డారు. టీడీపీ నేతల ఆదేశాలకు అనుగుణంగా జెడ్పీ సీఈఓ మాల్యాద్రి చెప్పాపెట్టకుండా జారుకోవడంతో డీప్యూటీ సీఈఓ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలను నిర్వహించాల్సి వచ్చింది. దీంతో రాష్ట్రంలో ఎక్కడా పనిచేయలేవంటూ డిప్యూటీ సీఈఓ బాలసరస్వతీదేవిని అధికార పార్టీ నేత ఒకరు బెదిరించినట్లు సమాచారం. అధికారులు అంతా చూస్తుండటానే టీడీపీ నేత ఫోన్లో డీప్యూటీ సీఈఓపై బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. తలాడించకుంటే బదిలే ... అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ తమకు అనుకూలంగా లేని అధికారులను బదిలీ చేయడం ప్రారంభించింది. అందులో భాగంగా కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ అశోక్‌కుమార్‌ను అనతికాలంలోనే బదిలీ చేయించారు. దీంతో అధికారులు టీడీపీ నేతలు ఆదేశిస్తే జీ హుజూర్ అనడం అలవాటు చేసుకుంటున్నారు. నిబంధనలు అడ్డువస్తున్నాయని కొంతమంది అధికారులు వివరిస్తే వారిని దూషించడం మొదలు పెడుతున్నారు. జిల్లాలో సోదరులైన టీడీపీ నేతలు ఇష్టానుసారంగా అధికారులను దూషిస్తున్నట్లు పలువురు చెప్పుకొస్తున్నారు. దీంతో టీడీపీ నేతల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవడాన్ని యంత్రాంగం అలవాటుగా చేసుకుంటోంది. కిందిస్థాయి యంత్రాంగం అయితే అధికార పార్టీ నేతల ఆదేశాలను తక్షణమే ఆచరిస్తున్నారు. ఇందుకు ఒంటిమిట్ట తహశీల్దారు ఈశ్వరయ్య శైలి నిదర్శనంగా నిలుస్తోంది.