సమస్యలను పరిష్కరించకుంటే... | Rangareddy DRO warned and notices will be issued if problems will not solved | Sakshi
Sakshi News home page

సమస్యలను పరిష్కరించకుంటే...

Published Mon, Apr 24 2017 11:08 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

Rangareddy DRO warned and notices will be issued if problems will not solved

సాక్షి, రంగారెడ్డి జిల్లా: నిర్దిష్ట గడువులోగా ప్రజల సమస్యలను పరిష్కరించని అధికారులకు నోటీసులు జారీచేస్తామని జిల్లా రెవిన్యూ అధికారి భవానీ శంకర్‌ హెచ్చరించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా లక్డీకపూల్‌లోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజల నుంచి ఆయన వినతులను స్వీకరించారు.

అనంతరం డీఆర్‌ఓ మాట్లాడుతూ.. ప్రజల నుంచి వినతులు అందిన నాటి నుంచి 30 రోజుల్లోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దీన్ని అమలు చేయని అధికారులకు నోటీసులు ఇవ్వడంతోపాటు వివరణ తీసుకుంటామని చెప్పారు. ప్రజావాణిలో వచ్చిన విజ్ఞప్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రజల నుంచి ఆయా శాఖలకు సంబంధించి అధికారులకు మొత్తం 63 దరఖాస్తులు అందాయి. కార్యక్రమంలో సీపీఐ వైఆర్‌బీ శర్మ, డీఆర్‌డీఓ ప్రశాంత్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement