
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో)గా పనిచేస్తున్న వారికి పదోన్నతులలో విద్యార్హత కీలకం కానుంది. వీఆర్వోలకు గతంలో జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులిచ్చే ప్రక్రియ ఉండగా, ఇప్పుడు వీఆర్వో నుంచి సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి ఇవ్వాలని నిర్ణయించారు.
అయితే ఇది డిగ్రీ ఉత్తీర్ణులైన వారికి మాత్రమే వర్తిస్తుందని గురువారం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.ఆర్.మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ డిగ్రీ నిబంధనలో కొంత మినహాయింపునిచ్చారు. 2014 మే 12 నాటికి వీఆర్వోలుగా నియమితులై ఉంటే వారి కి ఇంటర్ ఉత్తీర్ణతతోనే సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులివ్వాలని, ఆ తర్వాత నియామకమైన వారికి డిగ్రీ నిబంధన వర్తిస్తుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment