46 మంది వీఆర్వోల బదిలీ | 46 members vro badili | Sakshi
Sakshi News home page

46 మంది వీఆర్వోల బదిలీ

Published Sat, Sep 3 2016 12:15 AM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

46 members vro badili

  • డివిజన్‌ దాటేలా పోస్టింగ్‌లు
  • ‘టోల్‌ ఫ్రీ’ ఫిర్యాదుల ఎఫెక్ట్‌
  • ముందే చెప్పిన ‘సాక్షి’
  •  
    హన్మకొండ అర్బన్‌ : 
    జిల్లాలో 46 మంది విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్‌(వీఆర్వో)లకు స్థానచలనం కల్పిస్తూ జిల్లా కలెక్టర్‌ వాకాటి కరుణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నూతన జిల్లాల ఏర్పా టు సమయంలో పెద్ద సంఖ్యలో వీఆర్వోలను బదిలీ చేయ డం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్‌కు కొంతకాలంగా వస్తున్న ఫిర్యాదులు, ఇటీవల ఉద్యోగుల పనితీరు విషయంలో ఆర్డీవోల నుంచి కలెక్టర్‌ సేకరించిన నివేదిక ఆధారంగా భారీ సంఖ్యలో వీఆర్వోలను కలెక్టర్‌ బదిలీ చేసినట్లు సమాచా రం. ప్రస్తుత బదిలీల్లో వీఆర్వోలను రెవెన్యూ డివి జన్‌ పరి ధి దాటేలా చేశారు. ములుగు డివిజన్‌ నుంచి అత్యధికంగా 17 మందికి స్థానచలనం కల్పించారు. కాగా త్వర లో ఇతర కేడర్ల ఉద్యోగులు, అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైం ది. బదిలీ అయిన వీఆర్వోల వివరాలిలా ఉన్నాయి. 
     
    వరంగల్‌ డివిజన్‌ నుంచి ఏడుగురు
    శ్రీధర్‌రెడ్డి ఆత్మకూరు మండలం నుంచి బచ్చన్నపేట మండలం అల్లిపురానికి, పద్మ ఆత్మకూరు మండలం నుంచి జనగామ మండలం చీటకోడూరు, సంపత్‌ వర్ధన్నపేట మండలం నుంచి లింగాలఘన్‌పూర్‌ మండలం కల్లెంకు, శ్రీనివాస్‌ వర్ధన్నపేట మండలం నుంచి పెద్దరాంచెర్లకు, రాంబాబు గీసుకొండ మండలం నుంచి చిట్యాల మండలం దానంపల్లికి, ఏకాంబరం పర్వతగిరి మండలం నుంచి కొడకండ్లకు, ప్రదీప్‌కుమార్‌ జఫర్‌గఢ్‌ మండలం నుంచి బచ్చన్నపేట మండలం కట్కూర్‌కు.
     
    జనగామ డివిజన్‌ నుంచి 8 మంది
    వీఆర్వో నర్సింహులును బచ్చన్నపేట మండలం నుంచి ఆత్మకూరు మండలం దామెరకు, అదే మండలం నుంచి లక్ష్మనర్సయ్యను జఫర్‌గఢ్‌ మండలం ఉప్పుగల్లుకు, రామకృష్ణారెడ్డి లింగాలఘన్‌పూర్‌ మండలం నుంచి వర్ధన్నపేట మండలం నందనంకు, సైదులు కొడకండ్ల మండలం నుంచి పర్వతగిరి మండలం గోపనపల్లికి, బాబు జనగామ నుంచి ఆత్మకూరు మండలం కటాక్షపూర్‌కు, అబ్బసాయిలు జనగామ మండలం నుంచి వర్ధన్నపేట మండలం ల్యాబర్తి, సిద్దమల్లయ్య చిట్యాల నుంచి గీసుకొండ మండలం మచ్చాపూర్, తిరుపతి నర్మెట్ట మండలం నుంచి గూడూరు మండలం లక్ష్మపూర్‌కు.
     
    నర్సంపేట డివిజన్‌ నుంచి ఆరుగురు
    గూడూరు మండలం నుంచి రవీందర్‌ నర్మెట్ట మండలం వెల్దండకు, శ్రీనయ్య చెన్నారావుపేట మండలం నుంచి డోర్నకల్‌ ఉయ్యాలవాడకు, వీరస్వామి గూడూరు మండలం నుంచి డోర్నకల్‌ మండలం చిల్కోడు, రమేష్‌ కొత్తగూడ మండలం నుంచి కేసముంద్రం మండలం పెనుగొండ, సురేష్‌బాబు కొత్తగూడ మండలంనుంచి కురవి మండలం గుండ్రాతిమడుగు, రాములు కొత్తగూడ మండలం నుంచి కురవి మండలం నేరడకు.
     
    మహబూబాబాద్‌ డివిజన్‌ నుంచి 8 మంది
    కుమారస్వామి మహబూబాబాద్‌ మండలం నుంచి చెన్నారావుపేట మండలం అమీనాబాద్‌కు, యాకయ్య తొర్రూరు నుంచి నల్లబెల్లి మండలం రంగాపూర్‌కు, నారాయణ నెక్కొండ మండలం నుంచి రేగొండ మండలం కొడవటం చ, నాగభూషణం డోర్నకల్‌ మండలం నుంచి ఏటూరునాగారం మండలం ఐలాపూర్‌కు, పండయ్య కురవి మండలం నుంచి ఏటూరునాగారం ఆకులవారి ఘనపురం, బషీర్‌ మరిపెడ మండలం నుంచి చిట్యాల మండలం గర్మిళ్లపల్లికి, అఫ్జల్‌ మరిపెడ మండలం నుంచి చిట్యాల మండలం వెల్లంపల్లికి, ముత్తయ్య కేసముంద్రం మండలం నుంచి గోవిందరావుపేట మండలం కర్లపల్లికి బదిలీ చేశారు.
     
    ్ఠ్ఠ్ఠ్ఠ్ఠ్ఠ్ఠ్ఠ్ఠ్ఠ్ఠ్ఠములుగు డివిజన్‌ నుంచి 17 మంది
    వీఆర్వో సంతోష్‌ చెల్పూర్‌ గ్రామం నుంచి కురవి మం డలం కందికొండకు, రాజేందర్‌ భూపాలపల్లి మండలం నుంచి నర్సింహులపేట మండలం గున్నెపల్లికి, కిష్ణమూర్తి భూపాలపల్లి మండలం నుంచి తొర్రూరు మండలం బొమ్మకల్‌కు, జేసీ భాస్కర్‌ ములుగు మండలం నుంచి నెల్లికుదురు మండలం బ్రాహ్మణకొత్తపల్లికి, దేవేందర్‌ మొగుళ్లపల్లి మండ లం నుంచి మరిపెడ మండలం తానంచెర్లకు, మొగిలి మొగుళ్లపల్లి మండలం నుంచి మరిపెడ మండలం ధర్మారం, మం డల సుభాష్‌ రేగొండ మండలం నుంచి మరిపెడ మండలం గుండెపుడి, గంపల నర్సయ్య ఏటూరునాగారం మండలం నుంచి నెల్లికుదురు మండలం ఎర్రబెల్లిగూడెం, ఎండీ.ఖాసిం ఏటూరునాగారం మండలం నుంచి నెల్లికుదురు మండలం నైనాల, ఐలయ్య ఏటూరునాగారం మండలం నుంచి నెల్లికుదురు మండలం ఆలేరుక్లస్టర్, శేఖర్‌ మంగపేట మండలం నుంచి కొత్తగూడ మండలం జంగంవానిగూడెం, మున్వర్‌ మంగపేట మండలం నుంచి కొత్తగూడ మండలం గంగారం, గోపాల్‌రావు వెంకటాపూర్‌ మండలం నుంచి తిమ్మరేనిపహాడ్‌కు, మల్లయ్య చిట్యాల మండలం నుంచి గూడూరు మం డలం అప్పరాజుపల్లికి, సాంబలక్ష్మి చిట్యాల మండలం నుంచి దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి, సాంబయ్య తాడ్వా యి మండలం నుంచి పాలకుర్తి మండలం విస్నూరు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement