
సమావేశంలో మాట్లాడుతున్న అప్పలస్వామి
పాలకొండ : గ్రామ రెవెన్యూ సహాయకులపై(వీఆర్‌ఏ) ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వై.అప్పలస్వామి అన్నారు. ఆ సంఘ సమావేశం శుక్రవారం పాలకొండలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ వేతనాలతో జీవిస్తున్న వీఆర్‌ఏలకు రేషన్ సరుకులు నిలిపివేయడం అన్యాయమన్నారు. కనీస వేతనం కూడా చెల్లించడం లేదని పేర్కొన్నారు. కేవలం వీఆర్‌ఏలను వేధించేందుకే ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
సీఐటీయూ డివిజన్ కార్యదర్శి దావాల రమణారావు మాట్లాడుతూ పెత్తందార్లు తెలుపు రేషన్‌కార్డులు పొందినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని, అట్టడుగు వర్గాలకు చెందినవీఆర్‌ఏలపై నిర్దాక్షిణ్యంగా వ్యవహిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 13న కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పారు. వీఆర్‌ఏలంతా పాల్గొని విజయవంత చేయాలని పిలుపునిచ్చారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో ఆ సంఘ నేతలు, వీఆర్‌ఏలు పాల్గొన్నారు.