రోజు రోజుకు పచ్చ నేతల ఆగడాలు అధికమవుతున్నాయి. టీడీపీ నేతలు ఓటమి అక్కసుతో రగిలిపోతున్నారు. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. కడుపు మంటతో భౌతిక దాడులకు దిగుతున్నారు. నిన్నటి వరకు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు చేసేవారు. తాజాగా వారు మరో అడుగు ముందుకేసి.. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం మల్లపాలెం గ్రామంలో ఓ టీడీపీ కార్యకర్త ఏకంగా వీఆర్వోపైనే దాడికి తెగబడ్డాడు. తాము చెప్పిన పనులు చేయాల్సిందే అంటూ బండ బూతులు తిట్టాడు. అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడు. అంతటితో ఆగకుండా ఓటరు గుర్తింపు కార్డులకి ఆధార్ అనుసంధానం చేసే పనిలో ఉన్న వీఆర్వో వెంకటేశ్వర్లుపై గ్రామస్తుల సమక్షంలోనే టీడీపీ నాయకుడు బాలూ నాయక్ విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.