
ప్రకాశం: సింగరాయకొండ–2 వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్న కళ్యాణి బుధవారం అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఈమె బింగినపల్లి వీఆర్వోగా కూడా పని చేశారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆమెకు తన తల్లి కిడ్నీ దానం చేయడంతో కొంత కాలం బాగానే ఉన్నారు. ఆరోగ్యం కుదుటపడుతోందని అనుకుంటున్న తరుణంలో కిడ్నీ సమస్య పునరావృతమైంది.
కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం మృతి చెందారు. గ్రామ సచివాలయ ఉద్యోగిగా ఎంపికై న కళ్యాణికి ఇంకా వివాహం కాలేదు. ఆమె మరణ వార్త తెలిసి మండల సర్వసభ్య సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఆమె భౌతికకాయాన్ని తహసీల్దార్ సీహెచ్ ఉష, రెవెన్యూ సిబ్బంది సందర్శించి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment