Kidney problem
-
హై ప్రోటీన్.. వాడటం మంచిది కాదు
ఇన్స్టంట్.. ఈ మాట వినగానే ఏదో కొత్త ఊపు వచ్చేస్తుంది మనకు...ఏ పనైనా త్వరగా పూర్తవ్వడమే ఇందులోని ప్రత్యేకత.. రకరకాల అడ్వరై్టజ్మెంట్ల ప్రేరణతో.. మనం దీనికి బాగానే అలవాటుపడిపోయాం.. అయితే ఇప్పుడీ అలవాటే కొంపముంచుతోంది.. ఆహారానికే కాదు.. దాని నుంచి అందే ప్రొటీన్లు ఇన్‌స్టంట్‌గా తీసుకోవాలనుకోవడం.. ఇన్‌స్టంట్‌గా కండలు పెంచేయాలనుకోవడం పొరపాటే అంటున్నారు నిపుణులు.. సప్లిమెంట్లు, అధిక ప్రొటీన్ వినియోగం ప్రయోజనాల కంటే ప్రమాదాలను ఎక్కువ కలిగిస్తుందని జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్ఐఎన్) స్పష్టం చేసింది. దీని వల్ల కండరాల క్షీణత సహా అనేక రకాల అనారోగ్యాలు తప్పవని తేలి్చంది. దీనిపై ఒక పరిశోధన ఆధారిత నివేదికను ఇటీవలే విడుదల చేసింది. ఆ విశేషాలు తెలుసుకుందాం... ఒకప్పుడు విపరీతమైన శ్రమ చేసే క్రీడాకారులు లేదా సిక్స్‌ప్యాక్ వంటివి సాధన చేసే వ్యాయామ ప్రియులకు మాత్రమే పరిచయమున్న ప్రొటీన్ సప్లిమెంట్స్ నగరంలో ప్రతి ఒక్కరికీ చిరపరిచితంగా మారాయి. ఆహారం ద్వారా ప్రొటీన్ అందడం లేదనే ఆలోచనతో వే ప్రొటీన్ తదితర పౌడర్లను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. అయితే ప్రొటీన్ సప్లిమెంట్ల వినియోగంపై నేషనల్ ఇని స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) తాజాగా నిర్వహించిన పరిశోధన ఆశ్చర్యాన్ని కలిగింది.. అందులోని కొన్ని అంశాలు.. ఆహారం ద్వారా ప్రొటీన్ అందడం లేదనే ఆలోచనతో వే ప్రొటీన్ తదితర పౌడర్లను విచ్చలవిడిగా వాడేస్తున్నారు.ఆహారంలో తగినంత కార్బోహైడ్రేట్లు కొవ్వులు లేకుండా నాణ్యత కలిగిన అధిక ప్రోటీన్లను తీసుకున్నప్పటికీ అది సరిపోదు.👉అదనంగా జత చేసిన చక్కెరలు, కృత్రిమ స్వీట్నర్లతో పాటు ప్రొటీన్ పౌడర్లలో సాధారణంగా ఉండే ఫ్లేవర్ల ప్రొటీన్ పౌడర్స్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం హానికరం. 👉ఈ సప్లిమెంట్లలో సాధారణ ముడిపదార్థమైన వే ప్రొటీన్, బ్రాంచ్డ్–చైన్ అమైనో ఆమ్లాలను (బీసీఎఎఎస్) అధికంగా కలిగి ఉంటుంది. అధిక బీసీఎఎఎస్లు నాన్–కమ్యూనికబుల్ (అంటువ్యాధులు కాని) వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. 👉 సప్లిమెంట్లను తీసుకోవడం కండరాల బలాన్ని పెంచదు. అయితే ఆరోగ్యకరమైన వ్యక్తులు దీర్ఘకాలిక కఠిన వ్యాయామ సమయంలో మాత్రమే ప్రొటీన్ సప్లిమెంటేషన్ కండర పరిమాణాన్ని కొద్దిగా మెరుగుపరుస్తుంది. 👉 రోజుకు 1.6 గ్రా కంటే ఎక్కువ ప్రొటీన్ తీసుకోవడం ఏ విధమైన అదనపు ప్రయోజనాలను అందించదు. 👉 మన శరీరానికి ప్రొటీన్ అవసరాలు మనం అంచనా వేసుకున్నంత ఎక్కువగా ఉండవు. 👉 క్రీడాకారులు సైతం సప్లిమెంట్లపైనే ఆధారపడకుండా ఆహారం నుంచి తగిన మొత్తంలో ప్రొటీన్ పొందడం మేలు. 👉దీర్ఘకాలం పెద్ద మొత్తంలో ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల ఎముక, కణజాలానికి నష్టం కలిగించవచ్చు. అలాగే మూత్రపిండాల సమస్యకు దారితీసే అవకాశం ఉంది. 👉 శాకాహారం లేదా మాంసాహారం నుంచి ఆరోగ్యకరమైన అమైనో ఆమ్లాలను సులభంగా అందుకోవచ్చు. 👉 తృణధాన్యాలు, పప్పుధాన్యాలను 3:1 నిష్పత్తిలో లేదా 30 గ్రాముల వరకూ పప్పులతోనో, రోజుకు 80గ్రా మాంసంతోనో ప్రొటీన్ స్థాయిల్ని భర్తీ చేయవచ్చు. ఇది సాధారణ వ్యక్తుల ప్రొటీన్ అవసరాలను తీర్చడానికి సరిపోతుంది. 👉కేవలం ప్రొటీన్ వినియోగం మాత్రమే కండరాల నిర్మాణంలో ఉపకరిస్తుందనేది అపోహ మాత్రమే. ఆహారంలో తగినంత కార్బోహైడ్రేట్లు కొవ్వులు లేకుండా నాణ్యత కలిగిన అధిక ప్రొటీన్లను తీసుకున్నప్పటికీ అది సరిపోదు. ఆహారపు అమైనో ఆమ్లాలు (ప్రొటీన్లు) ద్వారా కండర శ్రేణి నిర్మాణానికి శరీరంలో అమైనో–యాసిడ్ సంబంధిత విధులకు కార్బోహైడ్రేట్లు కొవ్వుల నుంచి కూడా తగినంత శక్తి అందాల్సిన అవసరం ఉంది. 👉 తగినంత శారీరక శ్రమ లేకుండా, కండరాల నిర్మాణానికి ప్రొటీన్లు ఉపకరించవు. సహజ ప్రొటీన్లతో మేలు..మాంసం, పౌల్ట్రీ, చేపలు, గుడ్డు, పాలు ప్రొటీన్లు శరీరంలో కొత్త ప్రొటీన్లను తయారు చేయడానికి అవసరమైన ఇరవై అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి. పప్పులు, పచ్చి శెనగలు, గుర్రపు శెనగలు, నల్ల శనగలు, చిక్పీస్, సోయాబీన్, పచ్చి బఠానీలు వంటి పప్పుధాన్యాల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్నట్లు, హాజెల్‌నట్‌లు, సోయా గింజలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, నువ్వులు గణనీయమైన పరిమాణంలో ప్రొటీన్లను కలిగి ఉంటాయి. పప్పులను తృణ ధాన్యాలతో కలిపి లేదా తృణధాన్యాలు మాంసం ఆహారం, గుడ్లు/ పాలతో కలిపి తిన్నప్పుడు ఆహారంలో ప్రొటీన్ నాణ్యత మెరుగుపడుతుంది. తక్కువ కొవ్వు అధిక ఫైబర్ కలిగిన పప్పులు ఇనుము, పొటాషియం, జింక్, మెగ్నషియంవంటి ముఖ్యమైన విటమిన్లు, ఇతర ఖనిజాలను కలిగి ఉంటాయి. శాఖాహార ఆహారాలు 70%–85% వరకూ ప్రొటీన్‌ను జీర్ణం చేస్తాయి. మితిమీరితే యూరిక్ యాసిడ్ పెరిగే ప్రమాదం... తీసుకున్న ఆహారం ద్వారా గానీ, ఇతరత్రా గానీ శరీర బరువు కిలోకి 1.5 గ్రాముల్ని మించి ప్రొటీన్ తీసుకోకూడదు. అతిగా ప్రొటీన్ తీసుకుంటే కిడ్నీ సమస్యలతో పాటు యూరిక్ యాసిడ్ పెరిగే ప్రమాదాలున్నాయి. మార్కెట్లో అందుబాటులో ఉండే సప్లిమెంట్స్‌లో కొన్నింటిలో స్టెరాయిడ్స్ కలుస్తున్నాయని సమాచారం. వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ప్రొటీన్ సప్లిమెంట్స్ వినియోగించాలి. –డా.కిషోర్‌రెడ్డి, అమోర్ హాస్పిటల్స్ -
ఉద్దానానికి ఊపిరి
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం పేరు చెబితే కిడ్నీ బాధితుల కష్టాలే కళ్లముందు మెదులుతాయి. కలుషిత నీరు తాగడంతో ఒళ్లు గుల్లయి, వైద్యం కోసం అప్పుల పాలై తమ కష్టాలు తీర్చే నేత కోసం ఎదురుచూశారు. ఒక ప్రాంతం కోసం రూ. వందల కోట్లు ఖర్చు పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. అయితే సీఎం జగన్ మోహన్‌రెడ్డి పాదయాత్రలో తానిచ్చిన మాటను నిలుపుకుంటూ ఆ ప్రాంత ప్రజల ప్రాణాలు నిలబెట్టారు. ఉద్దానానికి ఊపిరులూదారు. దశాబ్దాలుగా వారిని వేధిస్తున్న కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు.ఆయన చేపట్టిన ఉద్దానం ప్రాజెక్టు ఒక అద్భుతం.. కలుషిత తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.700 కోట్లతో వైఎస్సార్ సుజలధార ప్రాజెక్ట్ నిర్మించి ప్రారంభించారు. ఆ ప్రాజెక్ట్ ద్వారా 807 గ్రామాలకు 1.12 టీఎంసీల సురక్షిత మంచినీరు సరఫరా చేస్తున్నారు. రూ.85 కోట్లతో 200 పడకల కిడ్నీ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా ఆ ప్రాంత ప్రజల కష్టాలను ఏనాడూ కన్నెత్తి చూడలేదు. పవన్ కల్యాణ్ తన రాజకీయ ప్రచారానికి ఆ ప్రాంత సమస్యను వాడుకుని ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడలేదు. ఉద్దానం ప్రాజెక్టును అందరూ ప్రశంసిస్తుంటే చంద్రబాబు, పవన్ మాత్రం అసలు నోరెత్తడం లేదు. కరోనాతో అడ్డంకులు ఏర్పడినా.. 2017లో పాదయాత్రలో భాగంగా ఉద్దానంలో పర్యటించిన జగన్మోహన్రెడ్డి ఆ ప్రాంత ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు. 2018 డిసెంబరు 31న మరోసారి అక్కడికి వెళ్లిన జగన్మోహన్రెడ్డి తాను అధికారంలోకి వచ్చాక, ఆ ప్రాంతంలో కిడ్నీ బాధితుల కోసం సూపర్ సెష్పాలిటీ హాస్పటల్ తీసుకొస్తామని, కలుషిత నీటి సమస్యను పరిష్కరించేందుకు ఆ ప్రాంతానికి ప్రత్యేకంగా రిజర్వాయర్ నీటిని పైపులైన్ ద్వారా తీసుకొచ్చి ప్రతి గ్రామానికి నీరు ఇస్తామని హామీనిచ్చారు.ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగు నెలలకే.. సీఎం జగన్మోహన్రెడ్డి 2019 సెపె్టంబరు 6న రూ. 700 కోట్లతో ఉద్దానం ప్రాంతంలో రక్షిత మంచినీటి పథకానికి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. మధ్యలో.. కరోనా విపత్తు వల్ల పనులు ముందుకు సాగక ఆటంకాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అడ్డంకులని దాటి నిర్మాణం పూర్తి చేసుకోగా.. రక్షిత మంచినీటి పథకాన్ని, కిడ్నీ రీసెర్చి సెంటర్ ఆసుపత్రిని పూర్తి చేసి ప్రారంభించారు. ఖర్చు ఎక్కువైనా వెరవకుండా.. ఉద్దానం కోసం రూ.వందల కోట్లు ఖర్చు పెట్టి రక్షిత మంచినీటి పథకం నిర్మాణం చేపట్టినా, ఆ పథకంలో సరఫరాకు నీరు అందుబాటులో లేకపోతే నిర్మాణం వృథాగా పోవాల్సిందే.. తక్కువ ఖర్చుతో ఉద్దానం ప్రాంత సమీపంలో ఉండే బహుదా, మహేంద్ర తనయ నదుల నుంచి రక్షిత నీటి సరఫరాకు అవకాశం ఉన్నా వేసవిలో ఆ నదులు ఎండిపోతే అక్కడి ప్రజలు బోరు నీటిని తాగక తప్పదని ప్రభుత్వం ఆ ప్రతిపాదనను పక్కనపెట్టింది.ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉండేందుకు.. ఖర్చు ఎక్కువైనా వెరవకుండా.. ఆ ప్రాంతానికి 104 కిలోమీటర్ల దూరంలో ఉండే హిరమండలం రిజర్వాయర్ నుంచి నీటి తరలింపునకు ప్రభుత్వం పూనుకుంది. ఉద్దానం ప్రాంతం మొత్తానికి ఏడాది పొడవునా నీటి అవసరానికి ఒక టీఎంసీ కన్నా తక్కువ నీరు అవసరం ఉండగా.. హిరమండలం రిజర్వాయర్‌లో కనీస నీటిమట్టం స్ధాయిలోనూ 2.67 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుంది. దీని కోసం ఏకంగా 1,047 కిలో మీటర్ల పొడవున భూగర్భ పైపులైన్ల నిర్మించారు. మౌనంగానే బాబు, పవన్‌లు ఉద్దానం ప్రాంత కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని అందరూ ప్రశంసిస్తుండగా.. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుతో పాటు పవన్‌కల్యాణ్ మాత్రం నోరు మెదపడం లేదు. జనసేన మాజీ నేత జేడీ లక్ష్మీనారాయణ వంటి వారు ఉద్దానం సమస్య పరిష్కారానికి ప్రభుత్వ చర్యలను కొనియాడారు. 9 జిల్లాలో రూ. 10,137 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యాలకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తూ.. ఇంటింటికీ మంచినీటి కుళాయిల ఏర్పాటుతో పాటు వాటర్ గ్రిడ్ పథకంలో భాగంగా తొమ్మిది జిల్లాల్లో మంచినీటి పథకాల్ని నిరి్మస్తోంది. వాటర్ గ్రిడ్ కార్యక్రమాల్లో భాగంగా... ఉద్దానం ప్రాంతంలో ప్రభుత్వం రూ.700 కోట్లతో చేపట్టిన పథకం పూర్తయ్యింది. పులివెందుల ఏరియాలో మొత్తం 299 గ్రామాలకు ఏడాది పొడవునా తాగునీటి సరఫరాకు రూ.480 కోట్లతో పులివెందుల సమగ్ర రక్షిత మంచినీటి పథకం, డోన్‌లో 138 నివాసిత గ్రామాల కోసం రూ. 297 కోట్లతో డోన్ సమగ్ర రక్షిత మంచినీటి పథకం పనులు వేగంగా కొనసాగుతున్నాయి.ఈ రెండు ప్రాజెక్టుల పనులు 70 నుంచి 80 శాతం పూర్తయ్యాయి. సముద్ర తీర ప్రాంతాల్లో తాగునీటి పరిష్కారానికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని కోస్తా తీర ప్రాంతంలో రూ.1650 కోట్లతో, ఉమ్మడి పశి్చమ గోదావరి జిల్లా కోస్తా తీర ప్రాంతంలో మరో రూ.1400 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకంలో సమగ్ర రక్షిత పథకాల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైంది. రూ.1290 కోట్లతో ఉమ్మడి ప్రకాశం జిల్లా పశి్చమ ప్రాంతం, మరో రూ.1200 కోట్లతో ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో, రూ.750 కోట్లతో ఉమ్మడి కృష్ణా జిల్లా కోస్తా ప్రాంతంలో, ఇంకో రూ.2,370 కోట్లతో ఉమ్మడి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతంలో వాటర్ గ్రిడ్ పథకాల్ని జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టింది. -
Fact Check: పచ్చ‘రోగం’ ముదిరింది
గురివింద రామోజీ అర్జంటుగా కళ్లద్దాలు మార్పించుకుంటే బావుంటుంది. చూపు మందగించడంతో రాష్ట్రంలో అభివృద్ధిని ఎటూ చూడలేకపోతున్న ఈ రాజగురువు ప్రజల రోగాలతో కూడా ఆడుకోవడం దుర్మార్గం. గత ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చి.. ఉద్దానం సమస్యకు పరిష్కారం చూపకపోతే పల్లెత్తు మాట అనని రామోజీ.. ఇప్పుడు కిడ్నీ పరిశోధన కేంద్రం, రీసెర్చ్ సెంటర్ అందరి కళ్లెదుటే అద్భుత పనితీరు కనబరుస్తున్నా కుళ్లుబోతు రాతలు రాస్తున్నారు. ఇదివరకెన్నడూ లేని విధంగా సీఎం వైఎస్ జగన్ ఏకంగా కిడ్నీ వ్యాధిపై యుద్ధమే ప్రకటించి, ఉద్దానంకు ఆరోగ్య భరోసా కల్పించడం పట్ల యావత్ ప్రపంచం ప్రశంసిస్తుంటే రామోజీ మాత్రం తప్పుడు కథనాలు వండివారుస్తున్నారు. దుర్మార్గానికి కూడా ఓ హద్దు ఉంటుంది. రామోజీ ఈ హద్దును కూడా దాటేసి చంద్రబాబు కోసం బరితెగించారు. ఈయన గారి పచ్చ రోగానికి త్వరలో ప్రజలే తగిన వైద్యం చేయడం ఖాయం. సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: చంద్రబాబు అధికారంలో ఉండగా ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశాడు. కొన్ని దశాబ్ధాలుగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం చూపడంలో పూర్తిగా విఫలం అయ్యారు. బాబుకు తొత్తుగా ఉన్న రామోజీరావుకు అప్పట్లో చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు. ప్రజాశ్రేయస్సు పట్ల కమిట్మెంట్ ఉన్న సీఎం జగన్ కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే ఉద్దానం ప్రాంత సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం చూపారు. బాబు చేయలేనిది సీఎం జగన్ చేసి చూపించడంతో రామోజీరావుకు కన్నుకుట్టింది. దశాబ్ధాల సమస్యలను అనతికాలంలోనే పరిష్కరించిన సీఎం జగన్‌కు, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ పెరిగి, టీడీపీ కనుమరుగు అవుతుందని భయం పట్టుకుంది. దీంతో తన ‘ఛీ’నాడులో ‘కిడ్నీ రోగం పిండేస్తోంది’ అంటూ మంగళవారం ఓ కట్టుకథను రామోజీ అల్లాడు. కిడ్నీ వ్యాధిగ్రస్తులను సీఎం జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. బాబే వాళ్లను ఉద్దరించాడంటూ సన్నాయి నొక్కుడు రాతలు రాసుకొచ్చారు. ఈ రాతలను చూసి ఉద్దానం ప్రాంత వాసులతో పాటు, రాష్ట్ర ప్రజలు పచ్చపత్రికను ఛీదరించుకుంటున్నారు. రాష్ట్రంలో కిడ్నీ బాధితులను నిర్లక్ష్యం చేసింది.. మీ బాబు కాదా రామోజీరావ్ అని ప్రశ్నిస్తున్నారు. కళ్లెదుటే ప్రాజెక్టులుంటే కబోది రాతలా.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం చూపుతానని 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక అడుగులు ముందుకు వేశారు. పలాసలో రూ. 85 కోట్లతో వైఎస్సార్ కిడ్నీ పరిశోధనా కేంద్రం, మరొకటి రూ. 700 కోట్లతో వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టు. ఈ వ్యాధిపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్ యూనిట్లు ఏర్పాటయ్యాయి. సుజలధార ప్రాజెక్ట్ ద్వారా కిడ్నీ ప్రభావిత పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలో 7 మండలాల్లోని 807 గ్రామాలకు రక్షిత నీటి సరఫరా చేపడుతున్నారు. 6.78 లక్షల జనాభా 2051 నాటికి 7.85 లక్షలకు చేరుతుందన్న అంచనాతో అప్పటి అవసరాలకు కూడా సరిపోయేలా ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్ల చొప్పున నీటి సరఫరా చేసేలా ప్రాజెక్టు నిర్మించారు. కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్ యూనిట్ల ఏర్పాటు చేశారు. విరివిగా కేంద్రాలు నెలకొల్పి.. ప్రస్తుతం టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆస్పత్రుల్లో డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. 63 మెషిన్లతో 68 పడకలపై డయాలసిస్ అందిస్తున్నారు. సోంపేట సీహెచ్‌సీ డయాలసిస్ సెంటర్లలో గతంలో 13 పడకలు ఉండేవి. ఇప్పుడవి 19కి పెరిగాయి. కవిటి సీహెచ్‌సీ డయాలసిస్ సెంటర్లలో గతంలో 10 పడకలు ఉండేవి. ఇప్పుడవి 15కి పెరిగాయి. హరిపురంలో కొత్తగా 10 పడకలతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు. కొత్తగా గోవిందపురం, అక్కుపల్లి, కంచిలి, బెలగాంలో డయాలసిస్ సెంటర్లు మంజూరయ్యాయి. ఇవికాకుండా రెండు కంటైన్డ్ బేస్డ్ సర్వీసెస్ డయాలసిస్ యూనిట్లను ఏర్పాటు చేశారు. టీడీపీ హయాంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు 37రకాల మందులను అందుబాటులో ఉంచారు. రోగులకు వైద్య పరీక్షల కోసం సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్, యూరిన్ ఎనలైజర్స్‌ను ఉద్దానం పరిధిలో ఉన్న 29ల్యాబ్‌లలో అందుబాటులో ఉంచారు. టీడీపీ హయాంలో జిల్లా నెఫ్రాలజీ విభాగమే లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక శ్రీకాకుళం జీజీహెచ్‌లో నెఫ్రాలజీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. పలాసలో కిడ్నీ ఆస్పత్రి నిర్మించాక స్పెషలిస్ట్‌లతో పాటు మొత్తంగా 17 మంది వైద్యులు, స్టాఫ్ నర్సులు 60 మంది, డీడీఏ స్టాఫ్ 50 మంది, సపోర్టింగ్ స్టాఫ్ 20 మంది సేవలు అందిస్తున్నారు. మొత్తం ఆస్పత్రిలో 195 పోస్టులు మంజూరుకాగా ప్రస్తుతం 127 పోస్టులను భర్తీ చేయడం జరిగింది. మిగతావి భర్తీ చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దాన ప్రాంతంలోని ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, వజ్రపు కొత్తూరు, పలాస తదితర 7 మండలాలు, ఇచ్ఛాపురం, పలాస మున్సిపాలిటీల్లో మొత్తం 807 హేబిటేషన్ల పరిధిలో కిడ్నీ రోగులున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కచ్చితంగా స్క్రీనింగ్ క్రమం తప్పకుండా వైద్యారోగ్య శాఖ సిబ్బందితోనే నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న మొత్తం 4,34,925 మంది జనాభాలో ఇప్పటివరకు 30,612 మందికి స్క్రీనింగ్ పూర్తి చేశారు. సీరమ్ క్రియాటిన్ సికెడి (క్రిటికల్ కిడ్నీ డిసీజ్) కేసులు సుమారుగా 3 వేల మందిని గుర్తించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో నిర్వహించిన వైద్యశిబిరాల్లో సుమారు 49,021 మంది ఓపి చూపించుకున్నారు. ఇందులో ఇప్పటివరకు 474 మందిని సికెడి అనుమానితులుగా గుర్తించారు. 2018లో టీడీపీ హయాంలో ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ రోగాలకు అసలైన కారణాల పరిశోధనకు అప్పటి ప్రభుత్వం జార్జి ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందంతో రూ.5 కోట్ల చెల్లింపునకు ఎంవోయు కుదుర్చుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాచింగ్ గ్రాంట్ నిధులు విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది. జాతీయ హెల్త్ మిషన్ ద్వారా రూ.2 కోట్లను విడుదల చేసింది. మిగిలిన నిధులు విడుదల చేయలేదు. ప్రభుత్వం మారిపోగా...కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఎన్హెచ్ఎం నుంచి నిధులను సదరు జార్జి సంస్థకు పరిశోధనకై నిధులు కేటాయించేది లేదని స్పష్టం చేసింది. దీంతో మిగిలిన నిధులు ఆ సంస్థకు సర్దుబాటు కాలేదు. కొండూరు బాధితులకు కొండంత అండ ఎన్టీఆర్ జిల్లా కొండూరు ప్రాంత కిడ్నీ బాధితులకు ఈ ప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తోంది. ఎ.కొండూరు, తిరువూరుల్లో కొత్తగా డయాలసిస్ సెంటర్లను నెలకొల్పింది. కొండూరు చుట్టుపక్కల తండాల్లో 30 ఏళ్లు పైబడిన వారందరికీ రక్త పరీక్షలను నిర్వహించి కిడ్నీ సమస్యలున్న వారిని గుర్తించింది. కిడ్నీ బాధితులకు రూ.వేల ఖరీదు చేసే మందులను ఉచితంగా సరఫరా చేస్తోంది. తిరువూరు, విజయవాడకు డయాలసిస్, ఇతర వైద్య సేవలు అవసరం ఉన్న కిడ్నీ బాధితులకు ఉచిత రవాణా కోసం ప్రత్యేకంగా ఓ అంబులెన్స్‌ను ఎ.కొండూరులో అందుబాటులో ఉంచింది. కిడ్నీ కేసులు నమోదు అవుతున్న గ్రామాలన్నింటికీ రక్షిత మంచినీటి ట్యాంకర్ల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం పరిసర ప్రాంతాల్లో కిడ్నీ బాధితులకు వైద్య సేవలను చేరువ చేయడంలో భాగంగా కొత్తగా ఏర్పాటు చేసిన మార్కాపురం బోధనాస్పత్రిలో యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాలను ప్రభుత్వం మంజూరు చేసింది. పింఛన్ పెంచి.. బాసటగా నిలచి కిడ్నీ బాధితులకు గత ప్రభుత్వంలో రూ.2500 ఉన్న పింఛన్‌ను ఏకంగా రూ.10 వేలకు పెంచింది. . ప్రభుత్వం వ్యాధి తీవ్రత ఆధారంగా రెండు రకాలుగా పింఛన్లు అందజేస్తుస్తోంది. 5పైబడి సీరం క్రియేటినైన్ ఉన్న వారికి రూ.5వేలు, డయాలసిస్ రోగులకు రూ. 10వేల పింఛను ఇస్తున్నారు. ఈ లెక్కన ప్రస్తుతం 831మందికి రూ.10వేలు చొప్పున, 451 మందికి రూ.5వేలు ఇస్తున్నారు. ఈ రకంగా ఎంతమందికైనా మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇలా కిడ్నీ బాధితులకు ప్రతి అడుగులో ప్రభుత్వం అండగా నిలుస్తుంటే రామోజీ వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. -
మార్కాపురం కిడ్నీ బాధితులకు ప్రభుత్వం భరోసా
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రకాశం జిల్లా మార్కాపురం పరిసర ప్రాంతాల్లో కిడ్నీ సమస్య బాధితులపై ప్రత్యేక దృష్టి సారించింది. వీరికి ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయనుంది. ఇందులో భాగంగా మార్కాపురంలో నూతనంగా ప్రారంభించబోతున్న ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన బోధనాస్పత్రిలో నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే నెఫ్రాలజీ విభాగం ఏర్పాటు కోసం 21 పోస్టులను కొత్తగా మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూరాలజీ విభాగం ఏర్పాటుకు పోస్టులు మంజూరు చేస్తూ శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2024–25 విద్యా సంవత్సరంలో మార్కాపురం వైద్య కళాశాల ప్రారంభం కానుంది. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) నిబంధనల ప్రకారం.. ఎంబీబీఎస్‌లో ప్రవేశాలు ప్రారంభించడానికి నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాల ఏర్పాటు తప్పనిసరి కాదు. అయినప్పటికీ మార్కాపురం ప్రాంత కిడ్నీ సమస్యల బాధితులకు వైద్య సేవలను చేరువ చేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. ఇందులో భాగంగానే ఆ రెండు విభాగాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే గత నాలుగు దశాబ్దాల ఉద్దానం కిడ్నీ సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రూ.700 కోట్లతో వైఎస్సార్ సుజలధార ప్రాజెక్ట్‌ను చేపట్టి కిడ్నీ సమస్యల ప్రభావిత గ్రామాలకు మంచినీటి సరఫరాను చేపట్టింది. అదే విధంగా రూ.85 కోట్లతో శ్రీకాకుళం జిల్లా పలాసలో డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని, 200 పడకలతో ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. వీటిని కొద్ది రోజుల క్రితం సీఎం వైఎస్ జగన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. -
ఉద్దానం సమస్యకు ఇక శాశ్వత పరిష్కారం
సాక్షి, అమరావతి: ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోంది. దీంతో వారి కష్టాలు తీరనున్నాయి. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా పలాసలో రూ.85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ – 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. అలాగే రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఉద్దానం ప్రాంతంలో కళ్లెదుటే కిడ్నీ సమస్య కనిపిస్తున్నా గతంలో ఎవరూ దీనికి పరిష్కారం చూపడానికి కూడా సాహసించలేదు. ఇలాంటి పరిస్థితిలో వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.785 కోట్లు భారీ వ్యయం చేసి మరీ.. ఉద్దానం వ్యాధిగ్రస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపింది. వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్– 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు, అలాగే అన్ని రకాల కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్ యూనిట్ల ఏర్పాటు.. మూడు బ్లాకులుగా నాలుగు అంతస్తుల్లో ఆస్పత్రి నిర్మాణం. క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, పాథాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ ల్యాబ్స్, సెంట్రల్ ల్యాబ్స్, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, డయాలసిస్, పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ, రీసెర్చ్ ల్యాబ్‌తో ప్రత్యేక వార్డులు. సీటీ స్కాన్, 2డీ ఎకో, హై ఎండ్ కలర్ డాప్లర్, మొబైల్ ఎక్స్ రే (డిజిటల్), థూలియం లేజర్ యూరో డైనమిక్ మెషీన్ తదితర పరికరాలతో పాటు ఐసీయూ సౌకర్యాలు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఇప్పటికే 42 స్పెషాలిటీ డాక్టర్ పోస్టులు, 60 స్టాఫ్ నర్సు పోస్టులు, 60 ఇతర సహాయ సిబ్బంది పోస్టుల భర్తీ. వైఎస్సార్ సుజలధార ప్రాజెక్ట్.. ఉద్దానం ప్రాంతంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు (క్రానిక్ కిడ్నీ డిసీజెస్) ప్రబలంగా ఉన్న ఏడు మండలాల్లోని అన్ని గ్రామాలకు ‘వైఎస్సార్ సుజలధార‘ ప్రాజెక్టు ద్వారా శుద్ధి చేసిన రక్షిత తాగునీరు. హిరమండలం రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకుని శుద్ధి చేసి పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలో 7 మండలాల్లోని 807 గ్రామాలకు రక్షిత నీటి సరఫరా. ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న 6.78 లక్షల జనాభా 2051 నాటికి 7.85 లక్షలకు చేరుతుందన్న అంచనాతో అప్పటి అవసరాలకు కూడా సరిపోయేలా ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్ల చొప్పున నీటి సరఫరా చేసేలా ప్రాజెక్టు నిర్మాణం. ఇప్పటికే 613 గ్రామాలకు నీటి సరఫరా.. ఈ నెలాఖరుకు మిగిలిన గ్రామాలకు. ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు.. ♦ గత ప్రభుత్వంలో డయాలసిస్ రోగులకు కేవలం రూ.2,500 చొప్పున పింఛన్ ఇస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాన్ని ఏకంగా రూ.10 వేలకు పెంచింది. ప్రతి నెలా 1న ఠంఛన్‌గా లబ్ధిదారులకు వారి ఇళ్ల వద్దే వలంటీర్లతో అందజేస్తోంది. ♦ ఇప్పటికే టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆస్పత్రుల్లో 74 మెషీన్లతో డయాలసిస్ సేవలు. ఇలా వరుసగా 2019–20లో 37,454 సెషన్లు, 2020– 21లో 46,162 సెషన్లు, 2021–22లో 54,520 సెషన్లు, 2022–23లో 55,520 సెషన్లు, 2023–24లో (అక్టోబర్ నాటికి) 38,513 సెషన్ల చొప్పున కిడ్నీ బాధితులకు ప్రభుత్వం డయాలసిస్ సేవలు అందించింది. ఇప్పుడు దీనికి అదనంగా మరింత మెరుగైన సేవలు అందించేందుకు కిడ్నీ రీసెర్చ్ సెంటర్–సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ♦వైద్య పరీక్షల కోసం ఉద్దానం ప్రాంతంలోని 18 పీహెచ్‌సీలు, 5 యూపీహెచ్‌సీలు, 6 సీహెచ్‌సీల్లో సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్, యూరిన్ ఎనలైజర్స్ ఏర్పాటు. గత టీడీపీ ప్రభుత్వంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులు మాత్రమే.. అది కూడా అరకొరగా అందజేశారు. ప్రస్తుతం ఇక్కడ ప్రతి ఆస్పత్రిలో 37 రకాల మందులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. కొత్త కేసుల గుర్తింపునకు నిరంతరాయంగా స్క్రీనింగ్ కొనసాగుతోంది. స్క్రీనింగ్ అనంతరం అనుమానిత లక్షణాలున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించి సీరమ్ క్రియాటినిన్ పరీక్షల కోసం సమీపంలోని పీహెచ్‌సీలకు తరలిస్తున్నారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లో పనిచేసే సీహెచ్‌వోలకు ప్రత్యేక యాప్. ఉద్దానం సమస్యలకు సంబంధించి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా.. జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్ నేడు సీఎం పర్యటన ఇలా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించనున్నారు. ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నివాసం నుంచి ఉదయం 8 గంటలకు బయలుదేరి 10.30 గంటలకు కంచిలి మండలం మకరాంపురం గ్రామానికి హెలికాప్టర్లో వస్తారు. అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరించి 11.10 గంటలకు వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టు పంప్‌హౌస్ స్విచ్ నొక్కి దాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పలాస వెళ్తారు. అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరించి 11.40 గంటలకు కిడ్నీ పరిశోధన కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ ఆస్పత్రిని ప్రారంభించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఇండ్రస్టియల్ కారిడార్‌కు శంకుస్థాపన చేస్తారు. అలాగే ఎచ్చెర్లలోని బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన వసతి గృహ భవనాన్ని వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. ఆ తర్వాత పాత జాతీయ రహదారి మీదుగా పలాస రైల్వే క్రీడా మైదానానికి చేరుకుంటారు. సభా ప్రాంగణంలో స్టాల్స్‌ను పరిశీలించి బహిరంగ సభలో మాట్లాడతారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తిరిగి హెలికాప్టర్లో విశాఖకు బయలుదేరతారు. -
ఉద్దానానికి ఊపిరి
పచ్చటి ఉద్దానం కంట వెచ్చగా జారిన కన్నీటి బొట్లు.. దశాబ్దాలుగా గుండెలు పిండేసే కిడ్నీ బాధలు ఇక్కడెన్నో.. ఐదో తనం కోల్పోయిన తల్లులు, అమ్మనాన్నలకు దూరమైన పిల్లలు అడుగడుగునా కనిపిస్తారు. ఇక్కడ మనుషులకు కన్నీరు శాశ్వత నేస్తం. ఈ ఊళ్లకు ఉమ్మడి ఆస్తి కష్టం. ఈ కిడ్నీ వ్యాధి ఊళ్లకు ఊళ్లను తినేసింది. పరిస్థితి ఎక్కడికి వెళ్లిపోయిందంటే ఎంతకాలం రాసుంటే అంతకాలం బతుకుతాం, అప్పులు చేసి అనే వైరాగ్య పరిస్థితికి ఇక్కడి బాధితులు వెళ్లిపోయారు. నెలనెలా వేలకు వేలు ఖర్చుపెట్టి వైద్య పరీక్షలు, కిడ్నీ వైద్యం చేయించుకోలేక స్థానికంగా దొరికే మందు బిళ్లలో, ఆకులతోనో సరిపెట్టుకునేవారు. ఇది నిన్నటి వరకు ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఈ చీకటి బతుకులకు సీఎం వైఎస్ జగన్ చరమగీతం పాడుతున్నారు. నాడు ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చిన హామీ మేరకు.. మూడు దశాబ్దాల సమస్యకు చెక్ చెబుతూ శాశ్వత పరిష్కారం చూపారు. రూ.742 కోట్లతో వైఎస్సార్ సుజలధార మంచినీటి ప్రాజెక్టు, రూ.85 కోట్లతో 200 పడకల డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రిని ఏర్పాటుచేశారు. ఈ రెండింటినీ ప్రారంభించే మహోన్నత ఘట్టాన్ని గురువారం సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షి, అమరావతి/వజ్రపుకొత్తూరు రూరల్/వజ్రపుకొత్తూరు/మందస: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత ప్రజలను నాలుగు దశాబ్దాలుగా పీల్చిపిప్పి చేస్తున్న కిడ్నీ సమస్య సృష్టిస్తున్న కల్లోలం అంతాఇంతా కాదు. ఏళ్ల తరబడి నుంచి చాపకింద నీరులా ఈ ప్రాంతాన్ని కబళిస్తోంది. ఇక్కడున్న జనాభాలో 21 శాతానికి పైగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. ఇప్పటికే 15వేల మంది చనిపోయినట్లు అంచనా. ఒక అంచనా ప్రకారం.. జిల్లాలో 112 గ్రామాలు కిడ్నీ బారినపడి విలవిల్లాడుతున్నాయి. సాధారణంగా రక్తంలో సీరం క్రియాటిన్ 1.2 మిల్లీగ్రామ్/డెసీలీటర్ కంటే ఎక్కువగా ఉంటే కిడ్నీ సరిగా పనిచేయడంలేదని అర్థం. కానీ, ఉద్దానం ప్రాంతంలో సీరం క్రియాటిన్ లెవెల్స్ చాలామందిలో 25 మిల్లీగ్రామ్/డెసీలీటర్ మేరకు ఉంది. క్రియాటినిన్ 5 దాటితే డయాలసిస్ తప్పనిసరి. ఇటువంటి వారిలో వ్యాధి తీవ్రత పెరుగుతుంది. వీరంతా విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చేది. వారానికి రెండుసార్లు కూడా వెళ్లేవారున్నారు. ఇలా రోజుకు 500కి.మీ. దూరం ప్రయాణించాల్సి వచ్చేది. రవాణా, వైద్య ఖర్చులు తలకుమించిన భారంగా మారాయి. ఎంతోమంది డబ్బుల్లేక, వైద్యం చేసుకోలేక ప్రాణాలను కోల్పోయేవారు. మరోవైపు.. ఈ మహమ్మారిని పాలకులెవరూ పట్టించుకోలేదు. ఏళ్లుగా ఇక్కడి బీల నేలలో తెగిపడిన తాళిబొట్లు ఏ నేతనూ కదిలించలేదు. హామీలిచ్చిన వారు కొందరు, అన్నీ చేసేశామని ప్రచారం చేసుకున్న వారు ఇంకొందరు. ఇలాంటి ఆపత్కాలంలో ప్రతిపక్షనేత హోదాలో జగన్ కిడ్నీ బాధితులకు సాంత్వన చేకూర్చే కబురు చెప్పారు. చెప్పినట్లుగానే ఇప్పుడు ఆపన్నహస్తం అందిస్తున్నారు. డబ్బుల్లేక అల్లాడుతున్న అభాగ్యులకు నెలనెలా చేతిలో రూ.10వేలు పెడుతున్నారు. ఎక్కడో ఉన్న వంశధారను ఉద్దానానికి తీసుకొచ్చారు. తగ్గిపోతున్న ఉద్దానం ఆయష్షు రేఖకు ఊపిరిలూదుతున్నారు. అంతేకాదు.. రూ. వందల కోట్లతో మంచినీటి ప్రాజెక్టును.. కిడ్నీ పరిశోధనా ఆస్పత్రిని ఏర్పాటుచేశారు. గతమంతా పరిశోధనలకే పరిమితం.. నిజానికి.. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ఆనవాళ్లు 1990 దశకంలో కన్పించాయి. కానీ, 2000లో సోంపేటకు చెందిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు వై.కృష్ణమూర్తి, పి.శివాజీ కవిటి ప్రాంతంలో కిడ్నీవ్యా««ధి కేసులను గుర్తించారు. 2002 నుంచి వారే వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో ఉందనే అంశంపై పరిశోధన ప్రారంభించారు. ♦ 2004లో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేజీహెచ్ హెచ్ఓడీ డాక్టర్ రవిరాజ్‌తో కవిటి ప్రాంతంలో పరిశోధన వైద్య శిబిరాలు ప్రారంభించారు. ♦ 2008 మే 24న నెఫ్రాలజిస్ట్ డాక్టర్ గంగాధర్, హైదరాబాద్ నిమ్స్ ఆర్ఎంఓ శేషాద్రి ఉద్దానంలో పర్యటించారు. అదే ఏడాది నాటి రాష్ట్ర నీటి విశ్లేషణ పరిశోధనా సంస్థ ఇక్కడ నీటి నమూనాలను తీసుకెళ్లింది. ♦ 2009లో న్యూయార్క్‌కు చెందిన కిడ్నీ వ్యాధుల నిపుణుడు డాక్టర్ శివప్రసాద్ ఈ ప్రాంతంలో పర్యటించి రోగుల ఆహార అలవాట్లు, నీరు, రక్తం తదితర నమూనాలను పరిశోధనకు తీసుకెళ్లారు. ♦ 2011లో డాక్టర్ రవిరాజ్, డాక్టర్ వెలగల శ్రీనివాస్, డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి, ఎ.వేణుగోపాల్ అనే నెఫ్రాలజీ నిపుణుల బృందం ఉద్దానం ఎండోమిక్ నెఫ్రోపతి (యూఈఎన్) పేరిట ఓ అధ్యయనం చేసింది. ♦ 2011లో న్యూయార్క్‌కు చెందిన స్టోనీబ్రూక్స్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ అనూప్ గంగూలీ, డాక్టర్ నీల్ ఓలిక్‌ల నేతృత్వంలో ఓ బృందం వివిధ గ్రామాల ఆహారపు అలవాట్లు తెలుసుకుని రక్త, మూత్ర నమూనాలు తీసుకెళ్లింది. ♦ 2011లో హైదరాబాద్‌కు చెందిన పరిశోధకురాలు సీఐఎస్ఆర్ సుజాత ఈ ప్రాంతంలో నీటిని తీసుకెళ్లి దాని ద్వారా ఏఏ మార్పులు వస్తున్నాయో పరిశీలించారు. ♦ ఆ తర్వాత 2012లో జపాన్ బృందం, అమెరికన్ల బృందం పర్యటించింది. ♦ 2012 అక్టోబరు 1న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికల్ డిసీజెస్ బృందం పరిశీలించింది. 2013లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పోతురాజు అనే రీసెర్చ్ స్కాలర్ పరిశోధన చేశారు. ♦ 2017 నుంచి భారతీయ వైద్య పరిశోధనా మండలి డాక్టర్ వివేక్ ఝా నేతృత్వంలో ప్రస్తుతం పరిశోధన సాగుతోంది. ♦ అయితే, ఇప్పటివరకు, శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ఇక్కడి కిడ్నీ వ్యాధులకు కచ్చితమైన మూలకారణాన్ని గుర్తించలేకపోయారు. ♦ కొన్ని అధ్యయనాలు ఈ వ్యాధి నీటిలో అధిక సెలీనియం లేదా సీసం కారణంగా ఉండవచ్చని అనుమానించాయి. మరికొందరు దీనికి నేల స్వభావమే కారణమై ఉండొచ్చని నివేదించారు. ఉష్ణోగ్రత, తక్కువ నీటి వినియోగం, అధిక పెయిన్ కిల్లర్స్ వాడకం, జన్యుపరమైన లోపాలు కూడా వ్యాధికి కారణమని అధ్యయనాలు చెబుతూ ఉన్నాయి. కానీ, ఈ అధ్యయనాలు ఏవీ సరైన స్పష్టత ఇవ్వలేకపోయాయి. ♦ మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్, టెక్నాలజీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (టీఆర్ఐ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)తో 2019లో సంయుక్తంగా సమగ్ర పరిశోధనలు నిర్వహించి వ్యాధిని గుర్తించేందుకు అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేసింది. కిడ్నీ బాధితులపై ఆగ్రహంతోఊగిపోయిన బాబు.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ ఉద్దానంలోని కిడ్నీ బాధితుల గురించి పట్టించుకోలేదు. తిత్లీ తుపాను సమయంలో మొక్కుబడిగా పర్యటించినప్పటికీ వారికెలాంటి భరోసా ఇవ్వలేదు సరికదా.. తుపానుతో సర్వం కోల్పోయిన బాధితులు తమ గోడు చెప్పుకునేందుకు వస్తే ఆగ్రహంతో ఊగిపోయారు.‘నాకు 40 ఏళ్ల అనుభవం ఉంది.. నాకు అడ్డొస్తే బుల్డోజర్తో తొక్కేస్తా.. తొక్కతీస్తా.. తోలు తీస్తా’ అని వ్యాఖ్యానించారు. కొంతమందిపై కేసులు కూడా పెట్టారు. డ్రామాలకే పవన్ పరిమితం.. ఇక పవన్‌కళ్యాణ్ అయితే 2017లో దీక్ష పేరుతో పెద్ద డ్రామా ఆడారు. టీడీపీతో కలిసి ఐదేళ్లు చెట్టాపట్టాలు వేసుకున్నా దానికొక పరిష్కారం చూపలేదు. ఎవరైనా అడిగితే.. అంతా తానే చేశానని, కిడ్నీ బాధల నుంచి విముక్తి కల్పిస్తానని హడావుడి చేయడం తప్ప నిజానికి ఆయన చేసిందేమీ లేదు. కిడ్నీ బాధితులకు ఇది పెద్ద ఊరట ఉద్దానంలో కిడ్నీ బాధితులకు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెద్ద ఊరట కలిగిస్తుంది. వీరికోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు ప్రధాన కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయం. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుచేయడంతోపాటు వంశధార నది నుంచి మంచినీటిని అందించేందుకు చర్యలు చేపట్టడం, అది కూడా హామీ ఇ చ్చిన ఐదేళ్లలో పనులు పూర్తిచేయడం చరిత్రాత్మకం. ఆస్పత్రి పరంగా మూలాల శోధనకు ప్రాధాన్యత ఇవ్వడం, పరిశోధనతోనే కిడ్నీ ఇబ్బందులకు పరిష్కారం దొరుకుతుంది. – డాక్టర్ ప్రధాన శివాజీ, రిటైర్డ్ ప్రభుత్వ వైద్యుడు, సోంపేట వైఎస్ జగన్ సీఎం అయ్యాక తీసుకున్న చర్యలు వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత కిడ్నీ రోగులకు అండగా ఉండేందుకు పింఛన్ పెంచారు. అప్పటివరకు రూ.3,500 ఉన్న పింఛన్‌ను రూ.10వేలకు పెంచారు. వ్యాధి తీవ్రత ఆధారంగా రెండు రకాలుగా పింఛన్లు అందజేస్తున్నారు. 5కు పైబడి సీరం క్రియాటిన్ ఉన్న వారికి రూ.5వేలు, డయాలసిస్ రోగులకు రూ.10వేల పింఛన్ ఇస్తున్నారు. ఈ లెక్కన ప్రస్తుతం రూ.10వేలు చొప్పున 792 మందికి.. రూ.5 వేలు చొప్పున 451 మందికి పింఛన్లు ఇస్తున్నారు. అవసరమైతే ఎంతమందికైనా మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ♦ ప్రస్తుతం టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆసుపత్రుల్లో డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. 63 మెషిన్లతో 68 పడకలపై డయాలసిస్ అందిస్తున్నారు. ♦ సోంపేట సీహెచ్‌సీ డయాలసిస్ సెంటర్లో 13 పడకలుండేవి. వాటిని 21కి పెంచారు. ♦ కవిటి సీహెచ్‌సీ డయాలసిస్ సెంటర్లో 10 పడకలు ఉండగా, 19కి పెంచారు. ♦ హరిపురంలో కొత్తగా 10 పడకలతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుచేశారు. రెండు కంటైన్డ్ బేస్డ్ సర్విసెస్ డయాలసిస్ యూనిట్లను ఏర్పాటుచేశారు. ♦ ఇవికాక.. కొత్తగా గోవిందపురం, కంచిలి, అక్కుపల్లి, బెలగాంలో 25 మెషిన్లతో డయాలసిస్ సెంటర్లు మంజూరయ్యాయి. ♦ ఇచ్ఛాపురం సీహెచ్‌సీ, కంచిలి పీహెచ్సీలో 25 మెషిన్లతో డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి చ్చింది. ♦ టీడీపీ హయాంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు 37 రకాల మందులను అందుబాటులో ఉంచారు. అవసరమైతే ఇంకా మందులు కొనుగోలు చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ♦ కిడ్నీ రోగులకు నిరంతరం వైద్య పరీక్షల కోసం సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్, యూరిన్ ఎనలైజర్స్‌ను ఉద్దానం పరిధిలో ఉన్న 29 ల్యాబ్‌లలో అందుబాటులో ఉంచారు. ♦ కిడ్నీ సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి, బాధితులకు మెరుగైన వైద్యం అందించడం ద్వారా మరణాలను నియంత్రించేందుకు నిరంతర స్క్రీనింగ్‌ను ప్రభుత్వం చేపడుతోంది. వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్ఓ)లకు ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించారు. ఇప్పటివరకూ ఉద్దానం ప్రాంతంలోని 2.32లక్షల మందిని స్క్రీన్ చేయగా 19,532 మందిలో సీరమ్ క్రియాటిన్ 1.5 ఎంజీ/డీఎల్ కన్నా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వీరందరికీ వైద్య సాయం అందించారు. ♦ టీడీపీ హయాంలో జిల్లా నెఫ్రాలజీ విభాగమే లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక శ్రీకాకుళం రిమ్స్‌లోనెఫ్రాలజీ విభాగం ఏర్పాటుచేశారు. ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. ప్రతి శనివారం పలాస సీహెచ్‌సీకి వెళ్లి రోగులకు వైద్యం అందిస్తున్నారు. ♦ కిడ్నీ బాధితులకు అత్యంత నాణ్యమైన కార్పొరేట్ వైద్యాన్ని పూర్తి ఉచితంగా చేరువలో అందించడం కోసం రూ.85 కోట్ల అంచనాలతో పలాసాలో రీసెర్చ్ సెంటర్‌తోపాటు 200 పడకలతో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించారు. ఇందులో రూ.60 కోట్లు ఆస్పత్రి నిర్మాణానికి, రూ.25 కోట్లు అధునాతన వైద్య పరికరాలు, ఇతర వనరుల కల్పనకు కేటాయించారు. రూ.742కోట్లతో భారీ రక్షిత మంచినీటి పథకం ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణం తాగునీరుగా భావిస్తున్న నేపథ్యంలో నిపుణుల సూచనల మేరకు వంశధార నదీ జలాలను భూ ఉపరితల తాగునీరుగా అందించేందుకు రూ.742 కోట్లతో వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును సీఎం జగన్ మంజూరు చేశారు. దీనికింద ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఏడు మండలాల్లోని 807 గ్రామాలకు ఇంటింటికీ కుళాయిల ద్వారా నిరంతరం స్వచ్ఛమైన తాగునీరు అందించనున్నారు. ఈ మంచినీటి పథకానికి 2019 సెపె్టంబరు 6న సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. 2050 నాటికి ఆ ప్రాంతంలో పెరిగే జనాభా అంచనాతో ఒక్కొక్కరికి రోజుకు వందలీటర్ల చొప్పున అందేలా ఈ పథకాన్ని రూపొందించారు. భవిష్యత్‌లో శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, మెలియాపుట్టి మండలాల్లోని 170 గ్రామాలకు కూడా ఈ పైపులైన్ ద్వారా అదనంగా తాగునీరు అందించే వీలుగా ఈ పథకాన్ని డిజైన్ చేశారు. నిజానికి.. ఉద్దానం సమీపంలో ఉన్న బాహుదా, మహేంద్రతనయ నదుల నుంచి తక్కువ ఖర్చుతోనే రక్షితనీటి సరఫరాకు అవకాశమున్నా వేసవిలో ఆ నదులు ఎండిపోతే ఇక్కడి ప్రజలు బోరు నీటిని తాగక తప్పదన్న భావనతో జగన్ సర్కార్ ఆ ప్రతిపాదనను మొదట్లోనే పక్కనపెట్టింది. ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఖర్చు ఎక్కువైనా ఈ ప్రాంతానికి 104 కిలోమీటర్ల దూరంలోని హిరమండలం రిజర్వాయర్ నుంచి నీటి తరలింపునకు పూనుకుంది. ఈ ప్రాంతం మొత్తానికి ఏడాది పొడవునా తాగునీటి అవసరాలకు ఒక టీఎంసీ కన్నా తక్కువ నీరు అవసరం ఉండగా.. హిరమండలం రిజర్వాయర్‌లో కనీస నీటిమట్టం స్థాయిలోను 2.67 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ నుంచి మూడు భారీ మోటార్ల ద్వారా 32 కిలోమీటర్ల దూరంలోని మెలియాపుట్టి మండల కేంద్రం వద్దకు చేరుతుంది. అక్కడ నీటిని శుద్ధిచేసి ఉద్దానానికి సరఫరా చేస్తారు. ఇదీ కిడ్నీ పరిశోధనా కేంద్రం స్వరూపం.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో ఈ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ♦ ఇందులో.. మొదటి అంతస్తులో అత్యాధునిక సౌకర్యాలతో ఓపీ విభాగం, రీనల్ ల్యాబ్, పాలనా విభాగం, మీటింగ్ హాల్, మెడిసిన్ స్టోర్సు ఉన్నాయి. ♦ రెండో అంతస్తులో నెఫ్రాలజీ విభాగం, పేమెంట్ రూములు, కీలకమైన డయాలసిస్ విభాగాన్ని ఏర్పాటుచేశారు. ♦ మూడో అంతస్తులో ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, సీఎస్ఎస్ డి, అదనపు వసతులతో ఉన్న పే రూములు, ప్రీ, పోస్ట్ ఆపరేటివ్ వార్డులు, ఐసోలేషన్ గది, బ్లడ్ బ్యాంకు ఉన్నాయి ♦ నాలుగో అంతస్తులో యూరాలజీ వార్డు, పే రూములు, రీసెర్చ్ లేబొరేటరీలు ఏర్పాటుచేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు.. ఈ కేంద్రంలో అందించే వైద్యసేవల్ని పరిశీలిస్తే యూరాలజీ, రేడియాలజీ, ఎనస్తీషియా, నెఫ్రాలజీ, వ్యాస్కులర్ సర్జన్, పల్మనాలజీ, కార్డియాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, బయో కెమిస్ట్రీ లాంటి సూపర్ స్పెషాలిటీస్ సేవలు.. జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్ సేవలు అందిస్తారు. ఈ ఆస్పత్రిలో 41 మంది సూపర్ స్పెషలిస్టులు, స్పెషలిస్టులు, వైద్యాధికారులను రెగ్యులర్ ప్రాతిపదికన నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూలై 3న ఉత్తర్వులు జారీచేసింది. వీరితోపాటు స్టాఫ్ నర్సు పోస్టులు 60, ఇతర సహాయ సిబ్బంది పోస్టులు కలిపి 154 పోస్టులను కొత్తగా మంజూరు చేసి భర్తీ చేపట్టారు. మరోవైపు.. ఇందులో ప్రపంచస్థాయి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్ర పరికరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధంచేసింది. గత 20 రోజులుగా వీటితో ఇప్పటికే రోగులకు చికిత్స చేస్తున్నారు. ఎక్స్‌రే (300ఎంఎ), సిటీస్కాన్, అల్ట్రా సౌండ్ మెషిన్, ఆటోమెటిక్ టిష్యూ ప్రాసెసర్, క్రయోస్టాట్, ఆటోమేటిక్ బయో కెమిస్ట్రీ ఎనలైజర్, సి–ఆర్మ్ మిషన్, ఈఎస్డబ్ల్యూ మిషన్, ఆటోమేటిక్ ఓటి టేబుల్స్, –80 నుంచి –40 సెంటీగ్రేడ్ల డీప్ ఫ్రీజర్లు, వెంటిలేటర్లు ఇప్పటికే సిద్ధంచేశారు. జీవితంపై ఆశ కలిగింది.. కూలీ పనిచేసే నాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆరేళ్ల క్రితం కిడ్నీ వ్యాధి బారినపడ్డాను. అప్పట్లో సరైన వైద్యం అందక డయాలసిస్ కోసం మరొకరి సాయంతో విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చేది. బోలెడంత డబ్బు ఖర్చేయ్యేది. ఇక్కడ సరైన వైద్య సదుపాయాల్లేక మా కళ్ల ముందే మా స్నేహితులు, బంధువులు ఎందరో మృత్యువాత పడ్డారు. ఎవ్వరూ పట్టించుకునే వారు కాదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆయన దయవల్ల ప్రతినెలా రూ.10 వేలు పింఛన్ అందుకుంటున్నాను. విశాఖకు వెళ్లే పని తప్పింది. పలాసలోనే డయాలసిస్, మందులు అందుతున్నాయి. పెద్ద ఆసుపత్రిని కూడా సిద్ధం చేశారు. ఇప్పుడు జీవితంపై ఆశ కలుగుతోంది. సీఎంకు ఉద్దానం వాసులంతా రుణపడి ఉంటారు. – గేదెల కోదండరావు, చినడోకులపాడు గ్రామం, వజ్రపుకొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వం మాలాంటి వారికి ప్రాణం పోస్తోంది చికిత్స కోసం నాకు లక్షల రూపాయలు ఖర్చేయ్యేవి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంది. 108 అంబులెన్స్‌లో ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లి, డయాలసిస్ అయ్యాక మళ్లీ ఇంటి వద్ద దిగబెడుతున్నారు. రూ.10వేలు పింఛను కూడా అందుతోంది. పౌష్టికాహారం, పండ్లు, మందులు కొనడానికి ప్రభుత్వం సహకరిస్తోంది. నాలాంటి ఎంతోమందికి జగన్ ప్రభుత్వం ప్రాణం పోస్తోంది. – నర్తు సీతారాం, లోహరిబంద, మందస మండలం, శ్రీకాకుళం జిల్లా ఇంటింటికీ కుళాయి ఇచ్చారు..జగనన్న చల్లగా ఉండాలి మా ప్రాంత వాసుల కష్టాల తీర్చేందుకు.. కిడ్నీ మహమ్మారి బారినపడిన ఉద్దానం వాసుల్ని రక్షించేందుకు జగనన్న మంజూరు చేసిన వైఎస్సార్ సుజలధార ప్రారంభానికి సిద్ధమయ్యిందనే విషయం తెలియగానే చాలా ఆనందం అనిపించింది. రోజూ కిడ్నీ వ్యాధులకు భయపడి 20 లీటర్ల క్యాన్లను కొనుగోలు చేస్తున్నాం. జగనన్న దయవల్ల ఇంటింటికీ కుళాయిలను ఇప్పటికే అమర్చారు. మా ప్రాంత వాసుల కష్టాలు తీరుస్తున్న జగనన్న చల్లగా ఉండాలి. – కర్ని సుహాసిని, గృహిణి, అమలపాడు, వజ్రపుకొత్తూరు మండలం -
కిడ్నీ వ్యాధితో వీఆర్వో మృతి
ప్రకాశం: సింగరాయకొండ–2 వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్న కళ్యాణి బుధవారం అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఈమె బింగినపల్లి వీఆర్వోగా కూడా పని చేశారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆమెకు తన తల్లి కిడ్నీ దానం చేయడంతో కొంత కాలం బాగానే ఉన్నారు. ఆరోగ్యం కుదుటపడుతోందని అనుకుంటున్న తరుణంలో కిడ్నీ సమస్య పునరావృతమైంది. కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం మృతి చెందారు. గ్రామ సచివాలయ ఉద్యోగిగా ఎంపికై న కళ్యాణికి ఇంకా వివాహం కాలేదు. ఆమె మరణ వార్త తెలిసి మండల సర్వసభ్య సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఆమె భౌతికకాయాన్ని తహసీల్దార్ సీహెచ్ ఉష, రెవెన్యూ సిబ్బంది సందర్శించి నివాళులర్పించారు. -
మాట ఇచ్చారు.. వెంటనే ఆదుకున్నారు
కాకినాడ సిటీ: కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఓ మహిళకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. కుటుంబ పోషణ నిమిత్తం ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని విన్నవించగా.. 3 గంటల్లోనే ఆమె చేతికి ఉద్యోగ నియామక పత్రం అందించారు. వివరాలు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా తొత్తరమూడికి చెందిన గన్నవరపు ఝూన్సీరాణి కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. భర్త కూలి పనితో వచ్చే అంతంత మాత్రం ఆదాయమే ఆ కుటుంబానికి ఆధారం. ఈ నేపథ్యంలో బుధవారం జగ్గంపేట మండలం ఇర్రిపాకకు వచ్చిన సీఎం జగన్‌ను ఝూన్సీరాణి కలిసింది. తన బాధను ముఖ్యమంత్రికి తెలియజేసింది. ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది. ఆమె పరిస్థితి తెలుసుకున్న సీఎం జగన్.. అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. తప్పకుండా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. వెంటనే ఝాన్సీకి విద్యార్హతల ఆధారంగా ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కాకినాడ కలెక్టర్ కృతికా శుక్లాను ఆదేశించారు. సీఎం జగన్ కార్యక్రమం ముగిసిన వెంటనే కలెక్టర్ కృతికా శుక్లా తన క్యాంపు కార్యాలయానికి ఝూన్సీరాణిని తీసుకెళ్లారు. డిగ్రీ, డీఈడీతో పాటు పీజీ డిప్లామో ఇన్ కంప్యూటర్ అప్లికేషన్(పీజీడీసీఏ) చదివినట్లు తెలుసుకున్న కలెక్టర్.. వికాస సంస్థ సమన్వయంతో రూ.14 వేల ప్రారంభ వేతనంతో ఇంటి నుంచే పని చేసేలా కోజెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఉద్యోగం కల్పించారు. వెంటనే నియామక పత్రాన్ని అందించారు. అలాగే ఆమెకు ఉచిత వైద్య పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సమన్వయకర్తను ఆదేశించారు. ఝాన్సీరాణి కుటుంబసభ్యులు స్పందిస్తూ.. అడిగిన వెంటనే స్పందించి తమ జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
ఒక కిడ్నీతోనే పతకాలు సాధించా
కొచ్చి: స్టార్ ఒలింపియన్ అంజూ బాబీ జార్జి భారత అథ్లెటిక్స్కే వన్నె తెచ్చింది. లాంగ్‌జంప్‌లో తన పతకాలతో చరిత్ర సృష్టించింది. ఇంత చేసిన ఆమె పయనం నల్లేరుపై నడకలా సాగలేదని ఇన్నేళ్ల తర్వాత తాజాగా వెల్లడించింది. తాను సుదీర్ఘ కాలం కిడ్నీ సమస్యలతో సతమతమయ్యానని 43 ఏళ్ల అంజూ చెప్పింది. పోటీల్లో తలపడే సమయానికే ఒక కిడ్నీ పూర్తిగా దెబ్బతింది. దీంతో కేవలం ఒకే కిడ్నీతో ఆమె ఒంట్లో ఆరోగ్య సమస్యలతో పోరాడుతూనే బయట ఈవెంట్లలో ప్రత్యర్థులతో పోటీ పడినట్లు పేర్కొంది. ‘మీరు నమ్మినా నమ్మకపోయినా... ఒకే కిడ్నీతో ప్రపంచ క్రీడల్లో పోటీపడిన అతికొద్ది మందిలో నేనుంటాను. అలర్జీ, కాలి నొప్పి చాలా ఆరోగ్య సమస్యలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. నా భర్త, కోచ్ బాబీ జార్జి ప్రోద్బలంతోనే వీటన్నింటిని అధిగమించి పతకాలు నెగ్గాను’ అని ప్రస్తుతం టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) చైర్‌పర్సన్‌గా ఉన్న అంజూ ట్వీట్ చేసింది. కేరళకు చెందిన అంజూ 2003 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గి భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. ఐఏఏఎఫ్ ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్స్ (2005)లో స్వర్ణం గెలిచింది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో ఆమె ఆరో స్థానంలో నిలిచింది. అయితే మరియన్ జోన్స్ (అమెరికా) డోపింగ్‌లో పట్టుబడటంతో ఆమెకు ఐదో స్థానం దక్కింది. అంతకుముందు 2002 బుసాన్ ఆసియా క్రీడల్లో ఆమె బంగారు పతకం సాధించింది. అంజూ ట్వీట్‌పై కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ ‘నీ కఠోర శ్రమ, నిబద్దతతో భారత్ ప్రతిష్ట పెంచావు’ అని కొనియాడారు. -
ఆగుతూ.. సాగుతూ..
డయాలసిస్ బాధితులకు రక్తశుద్ధి ఆగుతూ.. సాగుతోంది. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే జిల్లాలోని రెండు డయాలసిస్ కేంద్రాలూ పనిచేయడం లేదు. జనరేటర్లు లేకపోవడంతో రక్తశుద్ధి గంటల తరబడి నిలిచిపోతోంది. దీంతో రోగులు అవస్థ పడుతున్నారు. దీనికితోడు నెఫ్రాలజిస్ట్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్లే డయాలసిస్ చేస్తున్నారు. డ్యూటీ డాక్టర్లే పర్యవేక్షిస్తున్నారు. కొత్తగూడెంరూరల్ : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రి, భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఒక్కోటి చొప్పున రెండు డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇందుకోసం రూ.1.2 కోట్లు వెచ్చించింది. ఇవి కిడ్నీలు పనిచేయని వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గతంలో హైదరాబాద్ వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేసి, వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకునేవారు. ఇక్కడ ఏర్పాటు చేశాక వ్యయప్రయాసలు తగ్గిపోయాయి. కానీ వైద్యనిపుణులను నియమించకపోవడం, మౌలిక సదుపాయాలను కల్పించకపోవడంతో బాధితులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. కొత్తగూడెంలో.. గత నెల 12న కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభించారు. 4 నెగిటివ్ బెడ్స్, మరొకటి పాజిటివ్ బెడ్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు రోజు 20 మంది పేషెంట్ల వరకు డయాలసిస్ కోసం వస్తున్నారు. కానీ ఇక్కడ నెఫ్రాలజిస్ట్ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్లే రక్తశుద్ధి ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పేషెంట్‌కు ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితని బాధితులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆయా పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. ఒక పేషెంట్‌కు నాలుగు గంటల వరకు రక్తశుద్ధి చేస్తారు. ఇలా 24 గంటల వరకు ఆరుగురికి, మొత్తం నాలుగు బెడ్స్‌లో రోజుకు 24 మందికి రక్తశుద్ధి చేస్తారు. కేంద్రం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు రోజుకు సుమారు 20 మంది చొప్పున 515 మంది డయాలసిస్ చేయించుకున్నారు. కరెంటు పోతే ఇబ్బందులే.. ఆస్పత్రికి జనరేటర్ ఉన్నా డయాలసిస్ కేంద్రానికి ప్రత్యేకంగా జనరేటర్ సౌకర్యం లేదు. ఎక్కువ సమయం కరెంటు పోతే డయాలసిస్‌ను మధ్యలోనే నిలిపివేస్తున్నారు. మళ్లీ కరెంటు వచ్చినా తర్వాత రక్తశుద్ధిని కొనసాగిస్తున్నారు. వేసవి కాలం నేపథ్యంలో తరచూ కరెంటు పోతుండటం వల్ల రక్త శుద్ధి ఆగిపోతోంది. దీంతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. భద్రాచలంలో.. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఈ నెల 3న డయాలసిస్ కేంద్రం ప్రారంభించారు. ఇప్పటి వరకు 171 మందికి రక్తశుద్ధి చేశారు. కేంద్రంలో ఆయాల పోస్టు ఖాళీగా ఉన్నాయి. జనరేటర్ సౌకర్యం లేదు. కరెంటు పోతే రోగులు ఇబ్బందులు పడక తప్పదు. నెఫ్రాలజిస్టు కూడా లేరు. రోజుకు మూడు షిఫ్టుల చొప్పున ఒక్కో షిఫ్టునకు ఒక టెక్నీషియన్, ఒక స్టాఫ్ నర్స్.. మొత్తం ఆరుగురు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డయాలసిస్ కేంద్రాలకు ప్రత్యేకంగా జనరేటర్తోపాటు, నెఫ్రాలజిస్ట్ పోస్టులను నియమించాలని పలువురు కోరుతున్నారు. -
కిడ్నీ కౌన్సెలింగ్
పెయిన్‌కిల్లర్స్‌తో కిడ్నీకి ప్రమాదమా? నా వయసు 62 ఏళ్లు. విపరీతమైన మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాను. తట్టుకోలేక చాలాకాలం నుంచి నొప్పి నివారణ మందులు (పెయిన్ కిల్లర్స్) వాడుతున్నాను. దీనివల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా? – కృష్ణారావు, విజయవాడ పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడినట్లయితే కిడ్నీ దెబ్బతినే అవకాశం లేకపోలేదు. డాక్టర్ పర్యవేక్షణ లేకుండా నేరుగా మెడికల్ షాప్ నుంచి పెయిన్ కిల్లర్స్ తీసుకొని వాడడం మంచిది కాదు. కొన్ని పెయిన్ కిల్లర్స్‌లో రెండు లేదా మూడు రకాల మందులు కలిపి ఉంటాయి. ఇవి కిడ్నీకి చాలా హాని చేస్తాయి. పెయిన్ కిల్లర్స్ కాకుండా ఫిజియోథెరపీ వంటి ఇతర పద్ధతులతో నొప్పి తగ్గించుకోడానికి ప్రయత్నించండి. రోజూ నీళ్లు ఎక్కువగా తాగండి. మీ భుజం నొప్పి తగ్గడం కోసం ఒకసారి మీకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించండి. మీ అంతట మీరే మందులు వాడకండి. బీపీ చాలా ఎక్కువగా ఉంది... కిడ్నీ సమస్య వస్తుందా? నా వయసు 32 ఏళ్లు. నాకు ఏ విధమైన ఇబ్బందులూ లేవు. కానీ జ్వరం వచ్చినప్పుడు ఒకసారి డాక్టర్‌కు చూపించుకుంటే బీపీ 170 / 120 అని చెప్పి, మందులు వాడాలన్నారు. మందులు వాడకపోతే భవిష్యత్తులో కిడ్నీ సమస్య వచ్చే అవకాశం ఉందా? – నవీన్‌కుమార్, మహబూబాబాద్ ఈ వయసులో ఏ కారణం లేకుండా బీపీ రావడం చాలా అరుదు. ముఫ్ఫై ఏళ్లలోపు బీపీ ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీ సమస్య ఏమైనా ఉందేమోనని చూడాలి. మీరు ముందుగా యూరిన్ టెస్ట్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్, క్రియాటినిన్‌తో పాటు కొన్ని ఇతర పరీక్షలు చేయించుకోండి. ఏ లక్షణాలూ లేనప్పటికీ బీపీ నియంత్రణలో ఉండటానికి మందులు వాడాలి. లేకపోతే భవిష్యత్తులో కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంది. మందులు వాడటమే కాకుండా, ఆహారంలో ఉప్పు చాలా తగ్గించడం వంటి జీవనశైలికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా ఒక గంటకు తగ్గకుండా వాకింగ్ చేయాలి. బరువు ఎక్కువగా ఉన్నట్లయితే, మీ ఎత్తుకు తగినట్లుగా దాన్ని నియంత్రించుకోవాలి. పొగతాగే అలవాటు ఉంటే తప్పనిసరిగా మానేయాలి. ఇంట్లోనూ డయాలసిస్ చేసుకోవచ్చు... నా వయసు 68 ఏళ్లు. షుగర్‌వల్ల రెండు కిడ్నీలూ పనిచేయడం లేదు. రెండేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. మూడు సార్లు ఫిస్టులా ఆపరేషన్ అయ్యింది. డయాలసిస్ చేయించుకుంటున్న సమయంలో చలి, వణుకు వస్తున్నాయి. డయాలసిస్ కాకుండా ఇంకేమైనా పద్ధతులున్నాయా? – శ్యాంప్రసాద్, హైదరాబాద్ ఇప్పుడు వాడుతున్న క్యాథెటర్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుంది. మొదట ఈ ఇన్ఫెక్షన్ తగ్గడానికి తగ్గడానికి మందులు వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత పర్మ్ క్యాథ్ ద్వారా డయాలసిస్ చేయించుకోవడం మంచిది. ఇలా ఫిస్టులా సమస్య ఉన్నప్పుడు హోమ్ డయాలసిస్ (కంటిన్యువస్ ఆంబుల్యేటరీ పెరిటోనియల్ డయాలసిస్–సీఏపీడీ) చేయించుకోవడం మేలు. సీఏపీడీ వల్ల ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. ఇంట్లోనే ఉండి, ఈ డయాలసిస్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ వృత్తినిర్వహణకూ ఇలాంటి ఇబ్బందీ ఉండదు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. హోమ్ డయాలసిస్‌కు అయ్యే ఖర్చు హాస్పిటల్స్ డయాలసిస్ కంటే తక్కువ. కాబట్టి ఒకసారి మీ నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించి ఈ వివరాలు తెలుసుకోండి. - డాక్టర్ విక్రాంత్‌రెడ్డి, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
జనం పరిస్థితి అధ్వానం ఇది మన'ఉద్ధానం'
- కృష్ణమ్మ, తుంగభద్ర తీరాన కిడ్నీ వ్యాధులతో అవస్థలు - నల్లగొండ, పాలమూరు జిల్లాల్లో జనం వెతలు - గువ్వలగుట్ట, యాపదిన్నెలో దారుణ పరిస్థితి మేకల కల్యాణ్‌చక్రవర్తి, వర్ధెల్లి వెంకటేశ్వర్లు సాక్షి, హైదరాబాద్: పచ్చని చెట్లు.. ఎత్తైన కొండలు.. చుట్టూ కృష్ణా నది.. ఆహ్లాదకర వాతావరణం.. మధ్యలో గువ్వలగుట్ట. నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో ఉన్న ఈ ఊరు కిడ్నీ సంబంధ వ్యాధులతో వణికిపోతోంది. ఊరి జనాభా దాదాపు 600 కాగా.. అందులో సగానికి సగం మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ఐదేళ్ల చిన్నారుల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు అందరినీ చుట్టుబెడుతోంది ఈ వ్యాధి. ఇక్కడే కాదు.. తుంగభద్ర తీర ప్రాంత పల్లెలనూ ఈ మాయరోగం వెంటాడుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా ఐజా, ఇటిక్యాల, మనోపాడు మండలాల ప్రజలు కిడ్నీ వ్యాధులతో నానా గోస పడుతున్నారు. ఐజా మండలం యాపదిన్నె గ్రామంలో 600 కుటుంబాలు ఉండగా.. ప్రతి మూడు ఇళ్లకు ఒక కిడ్నీ వ్యాధిగ్రస్తుడు ఉన్నారు. గత నాలుగేళ్లలో ఏకంగా 17 మంది చనిపోయారు. మరో 15 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. మరణించిన వారిలో 75 శాతం మంది 40 ఏళ్ల లోపు యువతే. ఈ రెండు పల్లెల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తుల వెతలు శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో పరిస్థితిని తలపిస్తున్నాయి. చెంతనే కృష్ణా.. అయినా సుద్దనీరు కృష్ణానది బ్యాక్‌వాటర్ ఒడ్డున ఉంటుంది గువ్వలగుట్ట. ఇక్కడ నివసించేవారికి ప్రతిరోజూ కృష్ణమ్మ దర్శనమిస్తూనే ఉంటుంది. కానీ 15 ఏళ్ల నుంచి ఈ ఊళ్లో చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అందరూ కిడ్నీల వ్యాధి బారిన పడుతున్నారు. తలాపునే కృష్ణమ్మ ఉన్నా ఆ నీరు వచ్చే పరిస్థితి లేక సుద్ద నీళ్లు తాగుతున్నారు. దీంతో సగానికిపైగా గ్రామస్తులు కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. వాంతులతో ప్రారంభమై నడుము నొప్పి వచ్చిందంటే ఇక వాళ్లు కిడ్నీ డాక్టర్ బాట పట్టాల్సిందే. ఊరిలో ఇప్పటికే 100 మంది కిడ్నీ ఆపరేషన్లు చేయించుకున్నారు. ఇక్కడి మహిళలు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారంటే అనారోగ్య సమస్యలతో అనివార్యంగా గర్భసంచి తీయించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తుల్లో నిస్సత్తువ ఆవరిస్తోంది. చాలామంది ఎక్కువ సేపు నడవలేరు. పని చేయలేరు. కనీసం మాట్లాడనూ లేరు. ‘సాక్షి’ ప్రతినిధి వెళ్లిన సమయంలో ఊళ్లో.. 150–200 మంది వరకు ఉన్నారు. మిగతా వారు పొలం పనులకు వెళ్లారు. ఊళ్లోని మాలచ్చమ్మ గుడి వద్దకు ఓ 70 మంది వరకు వచ్చారు. వారితో అక్కడే 20–25 నిమిషాలు మాట్లాడిన తర్వా త చూస్తే 70 శాతం మంది కింద కూర్చుండిపోయారు. అంతలో ఓ 40 ఏళ్ల మనిషి మాట్లాడుతూ.. ‘‘చూసిండ్రా సారూ...! మీరు మాట్లాడుతుంటేనే అందరూ ఎలా కూర్చున్నారో.. పట్టుమని పది నిమిషాలు కూడా మేం నిలబడలేం. కాళ్లు నొప్పులు వచ్చినందుకే కూర్చున్నాం..’’ అని అన్నాడు. పోలీసులు ప్లాంట్ ఇచ్చినా.. కరెంటు లేక.. గువ్వలగుట్టలో కిడ్నీల సమస్య ఉందని తెలియడంతో గతంలో ఎస్పీగా పనిచేసిన విక్రమ్‌జిత్ దుగ్గల్ ఓ వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేశారు. దాదాపు రూ.లక్ష వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ఇప్పుడు ఊళ్లో లేదు. ఎందుకంటే ప్లాంట్ పనిచేసేందుకు తగినంత కరెంటు కూడా రావడం లేదు. తక్కువ వోల్టేజీ కరెంటుతో ప్లాంట్ నడవకపోవడం, స్థానికులకు మెయింటెనెన్స్ తెలియకపోవడంతో మళ్లీ పోలీసులే వచ్చి ప్లాంటును తీసుకెళ్లారు. ఈ ఊరు కంబాలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోకి వస్తుంది. కంబాలపల్లిని గ్రామజ్యోతి కింద రాష్ట్ర విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి దత్తత తీసుకున్నారు. అయినా పక్కనున్న గువ్వలగుట్టలో విద్యుత్ పరిస్థితి మెరుగుపడలేదు. మా బాధలు ఎవరూ పట్టించుకోవడం లేదు మా బాధలు ఎవరూ పట్టించుకోవడం లేదు. రాజకీయ నాయకుల చిన్నచూపు, అధికారుల నిర్లక్ష్యం కలిసి మా జీవితాల్ని ఆగమాగం చేస్తున్నయ్. – రమావత్ సక్రు, గువ్వలగుట్ట నుంచి మొదటి గ్రాడ్యుయేట్ 30 వేలు తీసుకొని ఆపరేషన్‌కు రమ్మన్నారు నాకు కిడ్నీ సమస్య ఉంది. నొప్పితో కనీసం పడుకునే పరి స్థితి కూడా లేదు. హాస్పిటల్‌కు పోతే ఆపరేషన్‌కు రూ.30 వేలు తీసుకుని రమ్మన్నారు. ఊరంతా ఇదే సమస్య. –వడ్త్యా రవి, గువ్వలగుట్ట అన్నం కాదు.. మంచినీళ్లు ఇవ్వండి.. మాకు బస్సొద్దు. ఇళ్లూ వద్దు. ఏమీ వద్దు.. అన్నం లేకున్నా సరే.. మంచినీళ్లు ఇవ్వండి. అవి వస్తేనే బతుకుతాం. ఇట్లాగే ఉంటే మేం 40 ఏళ్లు కూడా బతకడం కష్టమే. అది కూడా డబ్బులు పెడితేనే. లేదంటే ఎప్పుడు పోతామో తెలియదు. – ముడావత్ లక్ష్మణ్, గువ్వలగుట్ట యాపదిన్నె యాతన ఇదీ.. ‘సాక్షి’ ప్రతినిధి యాపదిన్నెకు వెళ్లినరోజున జయలక్ష్మి అనే మహిళ ఇంట్లో దశదిన ఖర్మ చేస్తున్నారు. నాలుగేళ్ల కిందట ఆమె కిడ్నీ వ్యాధి బారిన పడి మరణించింది. ఉన్న రెండెకరాలు అమ్మి వైద్యం చేయించుకుంది. ప్రతి మూడ్రోజులకు ఓసారి మహబూ బ్‌నగర్ వెళ్లి డయాలసిస్ చేయించుకొని వచ్చేది. చివరికి ఆసుప త్రిలో చికిత్స పొందుతూనే మరణించింది. ఈ ఊరి పక్కన నుంచే తాండవ వాగు పారుతుంది. వాగుల్లో నీళ్లున్నప్పుడు ఊళ్లో బోర్లు పోస్తాయి. లేదంటే వ్యవసాయ బావుల నుంచి నీళ్లు తెచ్చుకోవా ల్సిందే. చేను చెలకల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. పంట పొలాల్లో ఉన్నంతసేపు రైతులు నీళ్లు తాగటం లేదు. తీవ్ర అలసట, డీహైడ్రేషన్‌తో కండరాల నొప్పుల బారిన పడుతున్నారు. ఒంటి నొప్పుల నివారణకు ఇంజెక్షన్లు ఎక్కువగా తీసుకుంటున్నారు. కూర్చున్నా.. నిల్చున్నా.. నడుంనొప్పి నాకు కిడ్నీ రోగం వచ్చి ఆరు నెలలు దాటింది. కూర్చున్నా.. నిలబడ్డా నడుంనొప్పి వస్తోంది. ఎప్పుడూ నడవాలనిపిస్తది. కానీ నడవటానికి చేతకాదు. ఇప్పుడే మొదలైందట. నెలకు రూ 3వేలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకుంటున్నా. – చాకలి రాములు, యాపదిన్నె నాకు, నాయినకు కిడ్నీ జబ్బు.. మా నాయిన కిడ్నీ రోగంతోనే ఉన్నడు. ఇప్పుడు నాకు కూడా ఉన్నట్లు తేలింది. మా అన్న పొలం లో ఏడు గంటలు పని చేస్తడు. నేను రెండు గంటలు కూడా చేయలేకపోతున్న. నాయిన మంచం మీదనే ఉన్నడు. మందులు తింటుండు కానీ ఎక్కువ రోజులు కాలం గడుపుడు కష్టమే అనిపిస్తంది. – బొర్ల కిష్టన్న, యాపదిన్నె రోగం కమ్ముకొస్తోంది పిలగాళ్లు సూత్తానికి బాగానే కనిపిస్తున్నరు. కానీ లోపల నుంచి రోగం కమ్ముకొస్తోంది. ఇప్పటికే 20 మందికి పైగా చనిపోయారు. ఊర్లే ఇంకో 15.. 20 మందికి రోగం ఉంది. ఇంకా ఎంత మందికి ఉందో తెల్వదు. ఈ రోగం మా ఎమ్మట ఎందుకు పడ్డదో అర్థం కాట్లేదు. – రామకృష్ణ, గ్రామపెద్ద, యాపదిన్నె ఈ చిత్రంలో కనిపిస్తున్న బాబు పేరు మేరావత్ లక్ష్మణ్. 12 ఏళ్లుంటాయి. చిన్నతనంలోనే కిడ్నీల వ్యాధి బారిన పడ్డాడు. చికిత్స కోసం ఆయన తల్లిదండ్రులు ఇల్లు, పొలం అమ్ముకున్నారు. 100 జీవాలూ అమ్ముకున్నా రు. ఇప్పుడు వేరే ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. 10 నెలల క్రితం లక్ష్మణ్ హైదరాబాద్ నిమ్స్‌లో చేరాడు. అయినా ఫలితం లేకపోవడంతో లాభం లేదని ఇంటికి తెచ్చారు. ఈ చిత్రంలో కనిపిస్తున్న పాప పేరు ముడావత్ స్వప్న. వయసు ఐదేళ్లు. ఆపకుండా ఏడుస్తుంటే ఏమైందని ‘సాక్షి’ ప్రతినిధి అడగ్గా.. ‘‘ఏముంది సారూ..! మాయదారి కిడ్నీ జబ్బే. కొంచెం దూరం కూడా నడవలేదు. ఎప్పుడూ ఎత్తుకునే ఉండాలి. నాలుగడుగులు వేస్తే రొప్పుతుంది. ఒకటే ఏడుస్తుంది..’’ అని చిన్నారి అమ్మమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. ఈసారి ఓట్లకొస్తే గడగొయ్యలే మా ఊరికి ఎమ్మెల్యే రాడు.. ఎంపీ రాడు.. ఎవ్వరూ రారు. ఓట్ల సమయంలో వచ్చి మాలచ్చమ్మ గుడి దగ్గర మీటింగ్‌లు పెట్టి ప్రమాణాలు చేస్తరు. కానీ ఆ తర్వాత పట్టించుకోరు. ఈసారి ఓట్ల కోసం వస్తే గడగొయ్యలే అందుకుంటం. కృష్ణానది రోజూ కనపడుతుంది. కానీ, మా కడుపులోకి పోయేది మాత్రం సుద్ద నీళ్లు..అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. -
ఉద్దానం బద్దలవుతోంది
- తీవ్ర కిడ్నీ వ్యాధులతో ఉన్నవారు ఎక్కువైనట్టు వెల్లడి - ముప్పై ఏళ్ల లోపు వారే ఎక్కువ మంది బాధితులు - వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్న ఐసీఎంఆర్ - ఇప్పటివరకూ 77 వేల మందికి వైద్య పరీక్షలు.. 20 శాతం మందిలో అధిక తీవ్రత సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. ఇప్పటికీ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. వైద్య పరీక్షల్లో మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న వారిసంఖ్య తీవ్రంగా పెరుగుతూండటం కలవరపెడుతోంది. ఉద్దానంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు, జిల్లా ఆరోగ్యశాఖ అధికారుల నుంచి సాక్షి సమాచారం సేకరించగా.. బాధితుల్లో ఎక్కువ మంది ముప్ఫై ఏళ్ల వారుండటం కలవర పెట్టే అంశం. 2017 మార్చి 31 వరకు సుమారు 110 పల్లెల్లో 77 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 20 శాతం వరకూ బాధితులు తీవ్ర మూత్రపిండాల వ్యాధికి గురైనట్టు తేలింది. అంటే 15 వేల మంది పైచిలుకు బాధితుల్లో మోతాదుకు మించి సీరం క్రియాటినైన్ ఉన్నట్టు తేలింది. మూత్రపిండాల వ్యాధికి కారణమైన సీరం క్రియాటినైన్ 1.2 కంటే తక్కువగా ఉంటేనే కిడ్నీలు సురక్షితంగా ఉన్నట్టు. కానీ వైద్య పరీక్షల్లో 1.2 నుంచి 4 వరకు ఉందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సీరం క్రియాటినైన్ 5గా నమోదైన వారు కూడా 500 మంది ఉన్నట్టు తేలింది. బాధితులకు ఇప్పటికే 80 శాతం పైన దెబ్బతిన్నట్టు తేలింది. ఇలాంటి వారిని తక్షణమే డయాలసిస్ కేంద్రాలకు తరలించాలని వైద్యులు సూచించారు. సీరం క్రియాటినైన్ 3 కంటే తక్కువగా ఉన్న వారిని సోంపేట, పలాస, హరిపురం, కవిటి తదితర సామాజిక ఆరోగ్య కేంద్రాలకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఏప్రిల్ 15 నాటికి వైద్య పరీక్షల ప్రక్రియ పూర్తవుతుందని, ఇంకా ఎంతమంది బాధితులున్నారో అర్థం కావడం లేదని వైద్యులు తెలిపారు. ఉన్నతస్థాయి కమిటీలు ఏం చెప్పాయి? ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల తీవ్రతపై రాష్ట్రప్రభుత్వం ఒక కమిటీ వేసింది. అలాగే కేంద్రం ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) బృందాన్ని వేసింది. ఈ రెండు కమిటీలు చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి.. ⇒ ఈ ప్రాంతంలో పరిస్థితులపై సుదీర్ఘమైన ప్రయోగాలు (రీసెర్చ్) జరగాల్సిన అవసరం ఉంది ⇒ సీకేడీ (క్రానిక్ కిడ్నీ డిసీజెస్) వైద్య పరీక్షలు ఎప్పటికప్పుడు పకడ్బందీగా నిర్వహించాలి ⇒ ఇక్కడ కిడ్నీ జబ్బులను నియంత్రించేందుకు వైద్యులు తదితర సిబ్బందిని బాగా పెంచాలి ⇒ కిడ్నీ వ్యాధులకు కారణమైన పర్యావరణ కారకాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి. ఈ చర్యలు తీసుకుంటున్నాం: ప్రభుత్వం ⇒ ఏప్రిల్ 15 వరకూ కిడ్నీ వ్యాధులపై వైద్య పరీక్షలు ⇒ కిడ్నీ వ్యాధుల పరీక్షలకు సోంపేట, పలాస, కవిటి, హరిపురం మండలాల్లో ల్యాబ్ పరికరాలు ఏర్పాటు ⇒ పలాస సామాజిక ఆరోగ్య కేంద్రంలో డ యాలసిస్ కేంద్రం ఏర్పాటు.. సోంపేటలో కూడా త్వరలో ఏర్పాటుకు చర్యలు ⇒ రెండు వారాలకు ఒకసారి టెక్కలి ఏరియా ఆస్పత్రిలో మూత్రపిండాల వ్యాధి నిపుణుల (నెఫ్రాలజిస్ట్)ను అందుబాటులో ఉంచడం ⇒ కింగ్‌జార్జి ఆస్పత్రి నిపుణుల ఆధ్వర్యంలో ఉద్దానం ప్రాంతంలో పనిచేస్తున్న వైద్యులకు, పారామెడికల్ సిబ్బందికి కిడ్నీ వ్యాధుల గురింపుపై శిక్షణ ⇒ కిడ్నీ వ్యాధుల తీవ్రత ఉన్న వారి వివరాలను ఆధార్‌తో అనుసంధానించి వైద్యసేవలు ⇒ కిడ్నీ ప్రభావిత పల్లెలకు రక్షిత మంచినీటి వసతి కల్పించడం -
తల్లి వద్దకు చేరిన కుమారుడు
గిద్దలూరు : పట్టణంలోని పాములపల్లె రోడ్డులో ఉంటున్న దార్ల నిర్మలాదేవి కుమారుడు శివశక్తికుమార్ ఎట్టకేలకు తల్లి వద్దకు చేరాడు. ‘అందరు ఉన్నా అనాథ!’ శీర్షికతో ఈ నెల 3వ తేదీన ‘సాక్షి’లో ప్రచురించిన కథనాన్ని చదివిన నిర్మలాదేవి కుమారుడు శివశక్తికుమార్ శుక్రవారం ఇంటికి చేరాడు. తన తల్లి అనారోగ్యంతో పడుతున్న కష్టాలు పత్రిక ద్వారా తెలుసుకుని తల్లి చెంతకు చేరాడు. భార్య, ఇద్దరు కుమారులతో వచ్చి రెండు రోజులుగా తల్లి ఆలనాపాలన చూసుకుంటున్నాడు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తల్లికి స్థానికంగా వైద్యం చేయిస్తున్నాడు. కన్న కుమారుడు ఏడేళ్ల తర్వాత తిరిగి ఇంటికి రావడంతో ఆ తల్లి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తన కుమారుడిని దగ్గరకు చేర్చేందుకు ‘సాక్షి’ చేసిన కృషిని నిర్మాలాదేవి, ఆమె బంధువులు అభినందించారు. దాతలు సహకరించాలని విజ్ఞప్తి: కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తన తల్లికి వైద్యం అందించి మామూలు మనిషిని చేసుకోవాలని కుమారుడు శివశక్తి కుమార్ ఆరాటపడుతున్నాడు. నెల్లూరు తీసుకెళ్లి పూర్తిస్థాయి వైద్యం చేయించేందుకు తన వద్ద డబ్బులు లేవని, అప్పు ఇవ్వాలని బంధువులను కోరుతున్నాడు. బంధువులు వాయిదాలు వేస్తుండటంతో చేసేది లేక తల్లికి సపర్యలు చేస్తూ రోజులు నెట్టుకొస్తున్నాడు. ఇంటి నుంచి వెళ్లిపోయాక శివిశక్తికుమార్ తిరుపతిలో ఉంటూ అక్కడే ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. అనంతరం నెల్లూరులో ఓ కాంట్రాక్టర్ వద్ద దినసరి కూలీగా పనిచేస్తూ భార్య, పిల్లలను పోషించుకుంటున్నాడు. ఇంతలో తల్లికి అనారోగ్యంగా ఉందని తెలుసుకుని ఉండలేక ఉన్నఫళంగా వచ్చేశాడు. తల్లి వైద్యానికి అవసరమైన డబ్బు కోసం శివశక్తికుమార్ ఉన్న దారులన్నీ వెతుకుతున్నాడు. ఇంటి నుంచి వెళ్లిపోయి మళ్లీ రావడంతో బంధువులు సహకరించడం లేదని తెలుస్తోంది. దాతలు సహకారం అందించి తన తల్లిని కాపాడాలని శివశక్తికుమార్ కోరుతున్నాడు. సత్యసాయి సేవా సమితి, గిద్దలూరు జర్నలిస్టులు కొంతమేర ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఇంకా దాతలు ఎవరైనా ఉంటే ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని శివశక్తికుమార్ కోరుతున్నాడు. ఆర్థిక సహాయం చేయదలచిన వారు 99495 97381, 99516 07043 నంబర్లను సంప్రదించాలని విజ్ఞప్తి చేశాడు. -
‘ఎన్డీఆర్ఎఫ్’ ఎంతో గర్వకారణం
♦ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడి ♦ కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ హెడ్‌క్వార్టర్స్‌కు శంకుస్థాపన సాక్షి, అమరావతి: జాతీయ విపత్తుల నివారణ సంస్థ(ఎన్డీఆర్ఎఫ్)ను స్థాపించిన పదేళ్లలోనే ప్రజల విశ్వాసాన్ని పొందిందని, ఏ విపత్తు వచ్చినా ఎన్డీఆర్ఎఫ్ ఉందనే ధీమా ప్రజల్లో పెరిగిందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కృష్ణా జిల్లా కొండ పావులూ రులో 50 ఎకరాల్లో నిర్మించనున్న ఎన్డీఆర్ఎఫ్ పదవ బెటాలియన్ హెడ్‌క్వార్టర్స్ కు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. తొలుత సభలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ అనతి కాలంలోనే అతి పెద్ద ఫోర్సుగా అవతరిం చిన ఎన్డీఆర్ఎఫ్ దేశానికే గర్వకారణమన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం ఏపీకి సీఆర్పీఎఫ్ బలగాల ను తరలించేందుకు చర్యలు తీసుకుంటా మన్నారు. ఏపీలో గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రాన్ని, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ విభాగం ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ సేవలు మరువలేనివి.. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రెండున్నరేళ్లు అయినా తెలంగాణ, ఏపీ అస్తుల పంపకం తేలలేదని, అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. వెంకయ్య నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీకి కొత్తగా కేన్సర్ సంస్థ.. సాక్షి, విశాఖపట్నం: దేశంలోని 20 రాష్ట్రాల్లో రూ. 150 కోట్లతో కొత్తగా క్యాన్సర్ సంస్థలను ఏర్పాటు చేçస్తుంటే వాటిలో ఒకటి ఏపీకి కేటాయిస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్‌ప్రకాష్ నడ్డా చెప్పారు. విశాఖ చినవాల్తేరు మానసిక ఆస్పత్రి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య కేంద్రాన్ని(సీజీహెచ్ఎస్) మరో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో దశాబ్దాలుగా ఉన్న కిడ్నీ సమస్య మూలాలను తెలుసుకునేందుకు నేషనల్ మెడికల్ ఇన్స్టిట్యూట్ నిపుణుల ద్వారా పరిశోధన చేయించనున్నట్టు వెల్లడించారు. అవసరమైతే ఇక్కడ మరో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఢిల్లీలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న టెలీ కన్సల్టెన్సీ, టెలీ మెడిసిన్ విధానాన్ని మార్చి నుంచి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ గిరిజన విశ్వవిద్యాలయం, రైల్వే జోన్లు కూడా త్వరలోనే కార్యరూపం దాల్చనున్నాయన్నారు. -
ఆ బాలికకకు ఎంతకష్టం
కాళ్ల వాపుకు ఆర్ఎంపీ వైద్యం l తుదకు రెండు కాళ్లూ తొలగింపు ∙ తాజాగా కిడ్నీల సమస్యతో తీవ్ర అనారోగ్యం చింతూరు: పదిహేనేళ్ల చిన్నారి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆర్ఎంపీ వైద్యంతో ఇప్పటికే రెండు కాళ్లూ కోల్పోయిన ఆ బాలికకు ప్రస్తుతం కిడ్నీలు కూడా పాడవడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. వీఆర్‌పురం మండలం రాజుపేట కాలనీకి చెందిన పెట్టా దుర్గాభవానీ ఏడాది క్రితం టెన్త్ చదువుతుండగా కాళ్లవాపు వ్యాధి వచ్చింది. స్థానికంగా ఉన్న ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా, అక్కడి వైద్యం అనంతరం కాళ్లు ఒక్కసారిగా నలుపు రంగులోకి మారిపోయి తమ కుమార్తె నడవలేని స్థితిలోకి చేరుకుందని వివరించింది. తర్వాత తన బిడ్డను భద్రాచలం ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి విజయవాడ తీసుకెళ్లమని సూచించారని తెలిపింది. ఆ ప్రకారం విజయవాడ తీసుకెళ్లగా అక్కడి వైద్యులు ఆపరేషన్ చేసి రెండు కాళ్లను తొలగించారని తల్లి పేర్కొంది. కొంతకాలంగా దుర్గాభవానీ అనారోగ్యంతో బాధపడుతోందని, తన బిడ్డకు న్యాయం చేయాలని ఇటీవల తమ గ్రామం వచ్చిన మంత్రిని కూడా వేడుకున్నామని సత్యవది ఆవేదన వ్యక్తం చేసింది. కాగా ఆదివారం రాత్రి తన బిడ్డ ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించడంతో రేఖపల్లి ఆసుపత్రిలో చూపించామని, అక్కడి వైద్యుల సూచనతో చింతూరు ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చినట్టు తెలిపింది. ఇక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి కాకినాడ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారని సత్యవతి వివరించింది. తన కుమార్తె ఆరోగ్యంపై ఆమె ఆందోళన వెలిబుచ్చింది. కాగా ఈ విషయంపై వైద్యులను అడగ్గా, బాలిక కిడ్నీల్లో సమస్య ఉండడంతో పరిస్థితి విషమంగా ఉందన్నారు. అందుకే కాకినాడ ఆస్పత్రికి రిఫర్ చేసిన ట్టు తెలిపారు. -
కాళ్ల వాపులు కిడ్నీ సమస్య వల్లనేనా?
కిడ్నీ కౌన్సెలింగ్ నాకు 67 ఏళ్లు. గత పన్నెండేళ్లుగా డయాబెటిస్తో బాధపడుతున్నాను. ఇటీవల ప్రయాణాలు చేసేప్పుడు కాళ్లకు వాపులు వస్తున్నాయి. బ్లడ్ టెస్ట్ చేయిస్తే క్రియాటినిన్ 10 ఎంజీ/డీఎల్ అని వచ్చింది. యూరియా 28 మి.గ్రా. అని చూపిస్తున్నది. యూరిన్ టెస్ట్‌లో ప్రోటీన్ విలువ 3 ప్లస్‌గా ఉంది. నాకు షుగర్ వల్ల కిడ్నీకి సంబంధించిన వ్యాధి ఏమైనా వచ్చిందా? - ఎన్. రవిందర్ రావు, నిడదవోలు మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీకు మూత్రంలో ప్రోటీన్లు ఎక్కువగా పోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది డయాబెటిస్ వల్ల వచ్చిన మూత్రపిండాల సమస్యా (డయాబెటిక్ నెఫ్రోపతి) లేక ఇతర కారణాల వల్ల వచ్చిందా అన్న విషయాన్ని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా మూత్రంలో ప్రోటీన్లు పోవడానికి డయాబెటిస్ వ్యాధే కారణమవుతుంది. ఈ సమస్య ఉన్నవాళ్లు భవిష్యత్తులో కిడ్నీలు పాడుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు తమలో చక్కెరపాళ్లను అదుపులో ఉంచుకోవడం అత్యవసరం. మీరు తినకముందు బ్లడ్ షుగర్ 110 మి.గ్రా/డీఎల్ లోపు తిన్న తర్వాత 160 మి.గ్రా/డీఎల్ లోపు ఉండేటట్లుగా చూసుకోవాలి. బీపీ 115/75 లోపు ఉంచుకోవాలి. ఇవే కాకుండా మనం తీసుకునే భోజనంలో ఉప్పు తగ్గించుకోవాలి. పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేయాలి. నొప్పి నివారణ మందుల (పెయిన్‌కిల్లర్స్)ను సొంతవైద్యంగా వాడకూడదు. మీరు ఒకసారి వెంటనే దగ్గర్లోని నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించండి. నాకు 48 ఏళ్లు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేయించుకున్నాను. నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. - స్వామి, కోదాడ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ తర్వాత కూడా శరీరం దాన్ని నిరాకరించకుండా (రిజెక్ట్ చేయకుండా) ఉండటానికి కొన్ని మందులు జీవితాంతం వాడుతూ ఉండాలి. కొందరు రోగులు కిడ్నీ బాగానే పనిచేస్తుంది కదా అని మందులు మానేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కిడ్నీని శరీరం రిజెక్ట్ చేస్తుంది. ఆ ప్రమాదం రాకుండా చూసుకోవాలి. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయిన తర్వాత రోగుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ. జలుబుగానీ, జ్వరం గానీ, ఇతరత్రా ఏ ఇబ్బంది తలెత్తినా తక్షణం డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్ పర్యవేక్షణలో లేకుండా ఎలాంటి ఇతర మందులూ వాడకూడదు. అప్పటికప్పుడు తాజాగా తయారు చేసుకున్న ఆహారం తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీరు తాగాలి. ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. జనం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకూడదు. ఇంటి పరిసరాలను చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బీపీ, షుగర్ ఉన్నట్లయితే వాటిని నియంత్రించుకుంటూ ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. - డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
చదువుల తల్లికి ఎంత కష్టం
రెండు కిడ్నీలు పాడైన విద్యార్థిన పేదరికంతో అందని ఉన్నత వైద్యం బలిజిపేట రూరల్: చదువులో రాణిస్తున్న కుమార్తెను చూసి మురిసిపోయాడు. బంగారు భవిత కోసం కలలుగన్నాడు. రెక్కలు ముక్కలు చేసుకుని చదివిస్తున్నాడు. అంతలోనే ఊహించని ఉపద్రవం. కుమార్తెకు తీవ్ర అనారోగ్యం చేసింది. అన్నం మెతుకులకే సరిపోని ఆదాయంతో వైద్యమెలా చేయించాలి?.. బిడ్డను ఎలా కాపాడుకోవావాలి?.. అంటూ పెదపెంకి గ్రామానికి చెందిన రిక్షా కార్మికుడు పి.బాల కుమిలిపోతున్నాడు. దయగల దాతలు కరుణించి కిడ్నీ జబ్బుతో క్షీణిస్తున్న తన కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టాలని కన్నీటితో విన్నవిస్తున్నాడు. భవితపై నీలినీడలు రిక్షా కార్మికుడు పి.బాల కుమార్తె పారమ్మ (22) కు రెండు కిడ్నీలు పాడవ్వడంతో అయిదు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. కుమార్తె వైద్యానికి ఇప్పటికే సుమారు రూ.3 లక్షల వరకు వెచ్చించడంతో ఆర్థికంగా చితికిపోయాడు. పారమ్మ డిగ్రీ పూర్తి చేసింది. పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించింది. భవిషత్లో మంచి ఉద్యోగాన్ని సాధించాలనే పట్టుదలతో చదువుతున్న పారమ్మకు కిడ్నీలు పాడైపోవడంతో ఆమె భవితపై అంధకారం అలముకుంది. ఎన్టీఆర్‌వైద్యసేవ అంతంతమాత్రమే అయినెలల క్రితం పారమ్మకు కాళ్లు పొంగడంతో బొబ్బిలిలో వైద్యులను సంప్రదించారు. వారి సూచనలతో విజయనగరం వైద్యులకు చూపించగా ఎనీమియా క్రానిక్ వల్ల రెండు కిడ్నీలు పాడైనట్టు నిర్థారించారు. విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ చేయించినా ప్రయోజనం లేకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రిని ఆశ్రయించామని తల్లిదండ్రులు తెలిపారు. ఎన్టీఆర్ వైద్యసేవ కార్డున్నా డయాలసిస్‌కు మాత్రమే ఉపయోగపడుతోందన్నారు. కార్డుద్వారా ప్రభుత్వం సరఫరా చేసిన మందుల శక్తి తక్కువ కావడంతో ప్రైవేటు వైద్యులు సూచించిన ఖరీదైన మందులు కొనుక్కోవలసి వస్తోందని తెలిపారు. నెలకోసారి చేయించుకోవలసిన 6000 ఐయు పవర్ రీనోసెల్ ఇంజక్షన్ ఖరీదు రూ.2,100 అని తెలిపారు. ఇవికాక మందులకు నెలకు రూ.15వేలు ఖర్చవుతోందని వివరించారు. దయగల దాతలు 9573808933 నంబర్‌కు ఫోన్ చేసి సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.