40 ఏళ్ల కిడ్నీ సమస్యకు పరిష్కారం చూపిన సీఎం జగన్
ఖర్చు ఎక్కువైనా వెరవకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆ ప్రాంత ప్రజల కష్టాలు పట్టని చంద్రబాబు
ఉద్దానం సమస్యను తన ప్రచారానికి వాడుకుని వదిలేసిన పవన్
ప్రాజెక్టును అందరూ ప్రశంసిస్తుంటే నోరెత్తని చంద్రబాబు, పవన్
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం పేరు చెబితే కిడ్నీ బాధితుల కష్టాలే కళ్లముందు మెదులుతాయి. కలుషిత నీరు తాగడంతో ఒళ్లు గుల్లయి, వైద్యం కోసం అప్పుల పాలై తమ కష్టాలు తీర్చే నేత కోసం ఎదురుచూశారు. ఒక ప్రాంతం కోసం రూ. వందల కోట్లు ఖర్చు పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. అయితే సీఎం జగన్ మోహన్‌రెడ్డి పాదయాత్రలో తానిచ్చిన మాటను నిలుపుకుంటూ ఆ ప్రాంత ప్రజల ప్రాణాలు నిలబెట్టారు. ఉద్దానానికి ఊపిరులూదారు. దశాబ్దాలుగా వారిని వేధిస్తున్న కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు.
ఆయన చేపట్టిన ఉద్దానం ప్రాజెక్టు ఒక అద్భుతం.. కలుషిత తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.700 కోట్లతో వైఎస్సార్ సుజలధార ప్రాజెక్ట్ నిర్మించి ప్రారంభించారు. ఆ ప్రాజెక్ట్ ద్వారా 807 గ్రామాలకు 1.12 టీఎంసీల సురక్షిత మంచినీరు సరఫరా చేస్తున్నారు. రూ.85 కోట్లతో 200 పడకల కిడ్నీ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా ఆ ప్రాంత ప్రజల కష్టాలను ఏనాడూ కన్నెత్తి చూడలేదు. పవన్ కల్యాణ్ తన రాజకీయ ప్రచారానికి ఆ ప్రాంత సమస్యను వాడుకుని ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడలేదు. ఉద్దానం ప్రాజెక్టును అందరూ ప్రశంసిస్తుంటే చంద్రబాబు, పవన్ మాత్రం అసలు నోరెత్తడం లేదు.
కరోనాతో అడ్డంకులు ఏర్పడినా..
2017లో పాదయాత్రలో భాగంగా ఉద్దానంలో పర్యటించిన జగన్‌మోహన్‌రెడ్డి ఆ ప్రాంత ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు. 2018 డిసెంబరు 31న మరోసారి అక్కడికి వెళ్లిన జగన్‌మోహన్‌రెడ్డి తాను అధికారంలోకి వచ్చాక, ఆ ప్రాంతంలో కిడ్నీ బాధితుల కోసం సూపర్ సెష్పాలిటీ హాస్పటల్ తీసుకొస్తామని, కలుషిత నీటి సమస్యను పరిష్కరించేందుకు ఆ ప్రాంతానికి ప్రత్యేకంగా రిజర్వాయర్ నీటిని పైపులైన్ ద్వారా తీసుకొచ్చి ప్రతి గ్రామానికి నీరు ఇస్తామని హామీనిచ్చారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగు నెలలకే.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి 2019 సెపె్టంబరు 6న రూ. 700 కోట్లతో ఉద్దానం ప్రాంతంలో రక్షిత మంచినీటి పథకానికి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. మధ్యలో.. కరోనా విపత్తు వల్ల పనులు ముందుకు సాగక ఆటంకాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అడ్డంకులని దాటి నిర్మాణం పూర్తి చేసుకోగా.. రక్షిత మంచినీటి పథకాన్ని, కిడ్నీ రీసెర్చి సెంటర్ ఆసుపత్రిని పూర్తి చేసి ప్రారంభించారు.
ఖర్చు ఎక్కువైనా వెరవకుండా..
ఉద్దానం కోసం రూ.వందల కోట్లు ఖర్చు పెట్టి రక్షిత మంచినీటి పథకం నిర్మాణం చేపట్టినా, ఆ పథకంలో సరఫరాకు నీరు అందుబాటులో లేకపోతే నిర్మాణం వృథాగా పోవాల్సిందే.. తక్కువ ఖర్చుతో ఉద్దానం ప్రాంత సమీపంలో ఉండే బహుదా, మహేంద్ర తనయ నదుల నుంచి రక్షిత నీటి సరఫరాకు అవకాశం ఉన్నా వేసవిలో ఆ నదులు ఎండిపోతే అక్కడి ప్రజలు బోరు నీటిని తాగక తప్పదని ప్రభుత్వం ఆ ప్రతిపాదనను పక్కనపెట్టింది.
ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉండేందుకు.. ఖర్చు ఎక్కువైనా వెరవకుండా.. ఆ ప్రాంతానికి 104 కిలోమీటర్ల దూరంలో ఉండే హిరమండలం రిజర్వాయర్ నుంచి నీటి తరలింపునకు ప్రభుత్వం పూనుకుంది. ఉద్దానం ప్రాంతం మొత్తానికి ఏడాది పొడవునా నీటి అవసరానికి ఒక టీఎంసీ కన్నా తక్కువ నీరు అవసరం ఉండగా.. హిరమండలం రిజర్వాయర్‌లో కనీస నీటిమట్టం స్ధాయిలోనూ 2.67 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుంది. దీని కోసం ఏకంగా 1,047 కిలో మీటర్ల పొడవున భూగర్భ పైపులైన్ల నిర్మించారు.
మౌనంగానే బాబు, పవన్‌లు ఉద్దానం ప్రాంత కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని అందరూ ప్రశంసిస్తుండగా.. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుతో పాటు పవన్‌కల్యాణ్ మాత్రం నోరు మెదపడం లేదు. జనసేన మాజీ నేత జేడీ లక్ష్మీనారాయణ వంటి వారు ఉద్దానం సమస్య పరిష్కారానికి ప్రభుత్వ చర్యలను కొనియాడారు.
9 జిల్లాలో రూ. 10,137 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు
గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యాలకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తూ.. ఇంటింటికీ మంచినీటి కుళాయిల ఏర్పాటుతో పాటు వాటర్ గ్రిడ్ పథకంలో భాగంగా తొమ్మిది జిల్లాల్లో మంచినీటి పథకాల్ని నిరి్మస్తోంది. వాటర్ గ్రిడ్ కార్యక్రమాల్లో భాగంగా... ఉద్దానం ప్రాంతంలో ప్రభుత్వం రూ.700 కోట్లతో చేపట్టిన పథకం పూర్తయ్యింది. పులివెందుల ఏరియాలో మొత్తం 299 గ్రామాలకు ఏడాది పొడవునా తాగునీటి సరఫరాకు రూ.480 కోట్లతో పులివెందుల సమగ్ర రక్షిత మంచినీటి పథకం, డోన్‌లో 138 నివాసిత గ్రామాల కోసం రూ. 297 కోట్లతో డోన్ సమగ్ర రక్షిత మంచినీటి పథకం పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
ఈ రెండు ప్రాజెక్టుల పనులు 70 నుంచి 80 శాతం పూర్తయ్యాయి. సముద్ర తీర ప్రాంతాల్లో తాగునీటి పరిష్కారానికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని కోస్తా తీర ప్రాంతంలో రూ.1650 కోట్లతో, ఉమ్మడి పశి్చమ గోదావరి జిల్లా కోస్తా తీర ప్రాంతంలో మరో రూ.1400 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకంలో సమగ్ర రక్షిత పథకాల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైంది. రూ.1290 కోట్లతో ఉమ్మడి ప్రకాశం జిల్లా పశి్చమ ప్రాంతం, మరో రూ.1200 కోట్లతో ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో, రూ.750 కోట్లతో ఉమ్మడి కృష్ణా జిల్లా కోస్తా ప్రాంతంలో, ఇంకో రూ.2,370 కోట్లతో ఉమ్మడి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతంలో వాటర్ గ్రిడ్ పథకాల్ని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment