Uddanam problem
-
ఉద్దానానికి ఊపిరి
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం పేరు చెబితే కిడ్నీ బాధితుల కష్టాలే కళ్లముందు మెదులుతాయి. కలుషిత నీరు తాగడంతో ఒళ్లు గుల్లయి, వైద్యం కోసం అప్పుల పాలై తమ కష్టాలు తీర్చే నేత కోసం ఎదురుచూశారు. ఒక ప్రాంతం కోసం రూ. వందల కోట్లు ఖర్చు పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. అయితే సీఎం జగన్ మోహన్‌రెడ్డి పాదయాత్రలో తానిచ్చిన మాటను నిలుపుకుంటూ ఆ ప్రాంత ప్రజల ప్రాణాలు నిలబెట్టారు. ఉద్దానానికి ఊపిరులూదారు. దశాబ్దాలుగా వారిని వేధిస్తున్న కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు.ఆయన చేపట్టిన ఉద్దానం ప్రాజెక్టు ఒక అద్భుతం.. కలుషిత తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.700 కోట్లతో వైఎస్సార్ సుజలధార ప్రాజెక్ట్ నిర్మించి ప్రారంభించారు. ఆ ప్రాజెక్ట్ ద్వారా 807 గ్రామాలకు 1.12 టీఎంసీల సురక్షిత మంచినీరు సరఫరా చేస్తున్నారు. రూ.85 కోట్లతో 200 పడకల కిడ్నీ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా ఆ ప్రాంత ప్రజల కష్టాలను ఏనాడూ కన్నెత్తి చూడలేదు. పవన్ కల్యాణ్ తన రాజకీయ ప్రచారానికి ఆ ప్రాంత సమస్యను వాడుకుని ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడలేదు. ఉద్దానం ప్రాజెక్టును అందరూ ప్రశంసిస్తుంటే చంద్రబాబు, పవన్ మాత్రం అసలు నోరెత్తడం లేదు. కరోనాతో అడ్డంకులు ఏర్పడినా.. 2017లో పాదయాత్రలో భాగంగా ఉద్దానంలో పర్యటించిన జగన్మోహన్రెడ్డి ఆ ప్రాంత ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు. 2018 డిసెంబరు 31న మరోసారి అక్కడికి వెళ్లిన జగన్మోహన్రెడ్డి తాను అధికారంలోకి వచ్చాక, ఆ ప్రాంతంలో కిడ్నీ బాధితుల కోసం సూపర్ సెష్పాలిటీ హాస్పటల్ తీసుకొస్తామని, కలుషిత నీటి సమస్యను పరిష్కరించేందుకు ఆ ప్రాంతానికి ప్రత్యేకంగా రిజర్వాయర్ నీటిని పైపులైన్ ద్వారా తీసుకొచ్చి ప్రతి గ్రామానికి నీరు ఇస్తామని హామీనిచ్చారు.ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగు నెలలకే.. సీఎం జగన్మోహన్రెడ్డి 2019 సెపె్టంబరు 6న రూ. 700 కోట్లతో ఉద్దానం ప్రాంతంలో రక్షిత మంచినీటి పథకానికి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. మధ్యలో.. కరోనా విపత్తు వల్ల పనులు ముందుకు సాగక ఆటంకాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అడ్డంకులని దాటి నిర్మాణం పూర్తి చేసుకోగా.. రక్షిత మంచినీటి పథకాన్ని, కిడ్నీ రీసెర్చి సెంటర్ ఆసుపత్రిని పూర్తి చేసి ప్రారంభించారు. ఖర్చు ఎక్కువైనా వెరవకుండా.. ఉద్దానం కోసం రూ.వందల కోట్లు ఖర్చు పెట్టి రక్షిత మంచినీటి పథకం నిర్మాణం చేపట్టినా, ఆ పథకంలో సరఫరాకు నీరు అందుబాటులో లేకపోతే నిర్మాణం వృథాగా పోవాల్సిందే.. తక్కువ ఖర్చుతో ఉద్దానం ప్రాంత సమీపంలో ఉండే బహుదా, మహేంద్ర తనయ నదుల నుంచి రక్షిత నీటి సరఫరాకు అవకాశం ఉన్నా వేసవిలో ఆ నదులు ఎండిపోతే అక్కడి ప్రజలు బోరు నీటిని తాగక తప్పదని ప్రభుత్వం ఆ ప్రతిపాదనను పక్కనపెట్టింది.ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉండేందుకు.. ఖర్చు ఎక్కువైనా వెరవకుండా.. ఆ ప్రాంతానికి 104 కిలోమీటర్ల దూరంలో ఉండే హిరమండలం రిజర్వాయర్ నుంచి నీటి తరలింపునకు ప్రభుత్వం పూనుకుంది. ఉద్దానం ప్రాంతం మొత్తానికి ఏడాది పొడవునా నీటి అవసరానికి ఒక టీఎంసీ కన్నా తక్కువ నీరు అవసరం ఉండగా.. హిరమండలం రిజర్వాయర్‌లో కనీస నీటిమట్టం స్ధాయిలోనూ 2.67 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుంది. దీని కోసం ఏకంగా 1,047 కిలో మీటర్ల పొడవున భూగర్భ పైపులైన్ల నిర్మించారు. మౌనంగానే బాబు, పవన్‌లు ఉద్దానం ప్రాంత కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని అందరూ ప్రశంసిస్తుండగా.. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుతో పాటు పవన్‌కల్యాణ్ మాత్రం నోరు మెదపడం లేదు. జనసేన మాజీ నేత జేడీ లక్ష్మీనారాయణ వంటి వారు ఉద్దానం సమస్య పరిష్కారానికి ప్రభుత్వ చర్యలను కొనియాడారు. 9 జిల్లాలో రూ. 10,137 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యాలకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తూ.. ఇంటింటికీ మంచినీటి కుళాయిల ఏర్పాటుతో పాటు వాటర్ గ్రిడ్ పథకంలో భాగంగా తొమ్మిది జిల్లాల్లో మంచినీటి పథకాల్ని నిరి్మస్తోంది. వాటర్ గ్రిడ్ కార్యక్రమాల్లో భాగంగా... ఉద్దానం ప్రాంతంలో ప్రభుత్వం రూ.700 కోట్లతో చేపట్టిన పథకం పూర్తయ్యింది. పులివెందుల ఏరియాలో మొత్తం 299 గ్రామాలకు ఏడాది పొడవునా తాగునీటి సరఫరాకు రూ.480 కోట్లతో పులివెందుల సమగ్ర రక్షిత మంచినీటి పథకం, డోన్‌లో 138 నివాసిత గ్రామాల కోసం రూ. 297 కోట్లతో డోన్ సమగ్ర రక్షిత మంచినీటి పథకం పనులు వేగంగా కొనసాగుతున్నాయి.ఈ రెండు ప్రాజెక్టుల పనులు 70 నుంచి 80 శాతం పూర్తయ్యాయి. సముద్ర తీర ప్రాంతాల్లో తాగునీటి పరిష్కారానికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని కోస్తా తీర ప్రాంతంలో రూ.1650 కోట్లతో, ఉమ్మడి పశి్చమ గోదావరి జిల్లా కోస్తా తీర ప్రాంతంలో మరో రూ.1400 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకంలో సమగ్ర రక్షిత పథకాల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైంది. రూ.1290 కోట్లతో ఉమ్మడి ప్రకాశం జిల్లా పశి్చమ ప్రాంతం, మరో రూ.1200 కోట్లతో ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో, రూ.750 కోట్లతో ఉమ్మడి కృష్ణా జిల్లా కోస్తా ప్రాంతంలో, ఇంకో రూ.2,370 కోట్లతో ఉమ్మడి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతంలో వాటర్ గ్రిడ్ పథకాల్ని జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టింది. -
శ్రీకాకుళం : ఉద్దానంలో సీఎం జగన్ పర్యటన (ఫొటోలు)
-
Uddanam Hospital: పలాసలోని ఉద్దానం ఆసుపత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ (ఫొటోలు)
-
శెభాష్ సీఎం జగన్.. ఉద్దానంపై ప్రత్యేక శ్రద్ధకు హ్యాట్సాఫ్
ఆంధ్రప్రదేశ్‌లో అదొక మారుమూల పట్టణం. పేరు పలాస. ఆ ప్రాంతాన్నే ఉద్దానం అంటారు. అంటే.. ఉద్యానవనాలు ఉండే ఏరియా అని అర్ధం. కొబ్బరి, జీడి తోటలు ఉంటాయి. అయితే కళకళలాడే అదే చోట.. దురదృష్టవశాత్తు ఒక ప్రమాదకరమైన జబ్బు కూడా ప్రజలను పీడిస్తుంటుంది. అది కిడ్నీ వ్యాధి. దశాబ్దాలుగా ఆ పరిస్థితి అలాగే ఉన్నా.. మొదటిసారి ఒక ముఖ్యమంత్రి అక్కడకు వెళ్లి వారిపై శ్రద్ద చూపెట్టారు. ఆయనే వైఎస్ జగన్. కొద్దిరోజుల క్రితం ఆ ప్రాంతానికి వెళ్లిన సందర్భంలో.. కిడ్నీ పరిశోధన కేంద్రం, డయాలిసిస్ సెంటర్ నిర్మాణం, అక్కడ బాధితులకు జగన్ సర్కార్ నుంచి అందుతున్న సాయం, నీటి సరఫరా ఏర్పాట్ల గురించి నేను తెలుసుకున్నాను. స్వయంగా భవన నిర్మాణం జరుగుతున్న ప్రదేశాన్ని పరిశీలించాను. ఒక భారీ భవనం దాదాపు సిద్దం అయింది. కిడ్నీ,యూరాలజీ పరీక్షలకు అవసరమయ్యే పరికరాల అమరిక జరుగుతోంది. వంద పడకలతో ఆస్పత్రిని అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. బహుశా కొద్ది నెలల్లో అది పూర్తి కావచ్చు. ✍️ ఉద్దానంలో ఎక్కడకు వెళ్లినా.. ఎవరితో మాట్లాడినా, జగన్ మానవత్వంతో వ్యవహరించిన తీరును అభినందిస్తున్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన డాక్టర్ కూడా. అక్కడ.. కిడ్నీ వ్యాధి ఎందుకు వస్తుందన్నది ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేకపోయారని, తాము వైద్యులుగా మందులు ఇస్తూ చికిత్స చేస్తుంటామని ఆయన చెప్పారు. తమ ప్రాంతంలో ఈ వ్యాధి ఉందని చెప్పడానికి ఈ ప్రాంత ప్రజలు ఇష్టపడరని, దానివల్ల సమాజంలో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరిస్తుంటారని ఆయన అన్నారు. అయినా వ్యాధి వయసుతో నిమిత్తం లేకుండా యువతకు కూడా కొంతమేర వస్తున్నందునా.. సీఎం జగన్ గతంలో ఇచ్చిన హామీ ప్రకారం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారని మంత్రి సీదిరి తెలిపారు. ✍️ అంతెందుకు.. అక్కడ భవన నిర్మాణానికి స్థలం విషయంలో కూడా సమస్య కూడా ఎదురైందట. దానిని మండల తహశీల్దార్ తదితర అధికారులు ఎంతో శ్రమించితే కాని అది పరిష్కారం కాలేదట. చకచకా రోడ్డు పనులు కూడా జరగుతున్నాయి. లోపల ఫ్లోరింగ్ దాదాపు అయిపోయింది. అవసరమైన వైద్య పరికరాలు, పరిశోధనకు అవసరమైన యంత్రాలు అమర్చితే పూర్తి అయినట్లే. ఈ భవన నిర్మాణానికి సుమారు వంద కోట్ల మేర ఖర్చు చేస్తున్నారు. ఇదే సమయంలో ఉద్దానం ప్రాంతాలు ఉన్న పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాలలోని గ్రామాలన్నిటికి శుద్ది చేసిన మంచినీరు ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వాటర్ స్కీమ్ కు సుమారు రూ. 700 కోట్లు వ్యయం చేస్తున్నారు. వంశధార నది బాక్ వాటర్‌ను ఇందుకోసం వాడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సహజ సిద్దరీతిలో నీటిలోని లవణాలు తగ్గించడానికి వీలుగా పరిజ్ఞానాన్ని వాడుతున్నట్లు చెబుతున్నారు. 140 కిలోమీటర్ల దూరం పైప్ లైన్ వేసి సురక్షిత నీటిని ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలు గమనిస్తే మనసున్న ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని అభినందించక తప్పదు. ✍️ శ్రీలంక, దక్షిణాఫ్రికా మొదలైన కొన్ని దేశాలలో కూడా ఇలాంటి కిడ్నీ సమస్య ఉందని, కాని అక్కడ ఇలాంటి ప్రయత్నం జరగలేదని స్థానిక జర్నలిస్టులు తెలిపారు. జగన్ అమలు చేస్తున్న ఈ స్కీము ఈ ప్రాంత ముఖచిత్రాన్ని మార్చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కిడ్నీ బాధితులకు పలాసలోను, మరి కొన్ని గ్రామాలలోను డయాలిసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం మీద సుమారు డెబ్బై పడకలను ఇందుకోసం వాడుతున్నారు. పలాస కేంద్రంలో డయాలిసిస్ చేయించుకుంటున్నవారిని చూస్తే ‘అయ్యో’ అనిపిస్తుంది. వారిలో ఎక్కువ మంది నలభై ఏళ్లలోపు వారే ఉన్నారు. పలాసలో రెండు షిప్ట్ లలో డయాలిసిస్ చేస్తున్నట్లు అక్కడి ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. గత పలు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఈ సమస్య ఉన్నప్పటికీ, జగన్ మాదిరి ఎవరూ ఇంత శ్రద్ద చూపలేదని , ఆస్పత్రి ఛైర్మన్ భవాని శంకర్ చెప్పారు. ఆస్పత్రి కూడా నీట్ గానే కనిపించింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అక్కడకు వెళ్లి పరిశీలించారు. అయినా పూర్తి స్థాయిలో చంద్రబాబు ప్రభుత్వం కిడ్నీ జబ్జు నివారణ చర్యలు చేపట్టలేకపోయింది. కానీ, జగన్ ఆ ప్రాంతంలో పర్యటించి తాను అధికారంలోకి రాగానే కిడ్నీ వ్యాధి బాధితులకు పెన్షన్ పది వేల రూపాయలు చేస్తామని, ఇక్కడే కిడ్నీ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని, శుద్ది చేసిన నీరు అందించడానికి స్కీమ్ ను అమలు చేస్తామని ప్రకటించారు. ఆ ప్రకారమే ఆయన ముందుకు వెళ్లారు. ✍️ నీటి సరఫరా కోసం భారీ ఎత్తున పైప్ ల ఏర్పాటు జరిగింది. డిస్ట్రిబ్యూటరీలను సిద్దం చేస్తున్నారు. డయాలిసిస్ కు వచ్చే రోగులకు అంబులెన్స్ సదుపాయం కూడా కల్పించారు. ఇవన్నీ మానవత్వంతో కూడిన చర్యలుగా కనిపిస్తాయి. కొద్ది నెలల్లో ఈ స్కీమును జగన్ ఆరంభించవచ్చు. రాష్ట్రంలో అభివృద్ది లేదని అబద్దం చెప్పే రాజకీయ నేతలకు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 వంటి మీడియాలకు.. ఈ పలాస కిడ్నీ పరిశోధన కేంద్రం, తాగు నీటి పధకం పెద్ద జవాబు అని ఎలాంటి సంశయం లేకుండా చెప్పవచ్చు. శహబాష్ జగన్ .. కీప్ ఇట్ అప్. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
కన్నీటి ఉద్దానంపై పన్నీటి జల్లు.. సీఎం జగన్ చిత్తశుద్ధికి సాక్ష్యాలివే!
పచ్చటి ఉద్దానం కంట వెచ్చగా జారిన కన్నీటి బొట్లు ఏ నాయకుడి కంటా పడలేదు. ఏళ్లుగా ఇక్కడి బీల నేలలో తెగిపడిన తాళిబొట్లు ఏ నేతనూ కదిలించలేదు. ఐదో తనం కోల్పోయిన తల్లులు, అమ్మనాన్నలకు దూరమైన పిల్లలు, మనుషులు లేక వారి జ్ఞాపకాలుగా మిగిలిన ఇళ్లు.. ఏవీ ప్రజా ప్రతినిధుల కరకు గుండెలను కరిగించలేదు. హామీలిచ్చిన వారు కొందరు, అన్నీ చేసేశామని ప్రచారం చేసుకున్న వారు ఇంకొందరు. అలాంటి ఆపత్కాలంలో వచ్చాడొక నాయకుడు. వైద్యం కోసం విశాఖ వెళ్లే రోగుల చెంతకు డయాలసిస్ యూనిట్లు రప్పించాడు. డబ్బుల్లేక అల్లాడుతున్న అభాగ్యులకు చేతిలో నెలకు రూ.10 వేలు పెడుతున్నాడు. ఎక్కడో ఉన్న వంశధారను ఉద్దానంకు తీసుకువస్తున్నాడు. అతడే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల ఆస్పత్రి, ఉద్దానం ప్రాజెక్టు ఆయన చిత్తశుద్ధికి సజీవ సాక్ష్యాలు. సాక్షి, శ్రీకాకుళం: ఉద్దానం ఊపిరి పీల్చుకుంటోంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండడంతో మృత్యుకౌగిట నుంచి విడుదలవుతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఒకవైపు వ్యాధి మూలాలు కనుగొనేందుకు కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రిని నిర్మిస్తోంది. మరోవైపు వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యంతో పాటు డయాలసిస్, ఉచిత మందులను పూర్తిస్థాయిలో అందిస్తోంది. ఇంకోవైపు వ్యాధి ప్రబలడానికి ప్రధాన కారణం తాగునీరై ఉండొచ్చన్న నిపుణుల సూచనల మేరకు రూ.700 కోట్లతో భారీ మంచినీటి పథకాన్ని నిర్మిస్తోంది. ఇవి త్వరలోనే పూర్తి కానున్నాయి. పాదయాత్రలో చూసి.. పాదయాత్రలో కిడ్నీ వ్యాధి బాధితుల బాధలను వైఎస్ జగన్ దగ్గరుండి చూశారు. ప్రతిపక్ష నేత హోదాలో కవిటి మండలం జగతిలో కిడ్నీ బాధితుల భరోసా యాత్ర పేరిట పర్యటించారు. బాధితులతో ముఖాముఖి మాట్లాడి.. తన కార్యాచరణను అప్పుడే స్పష్టంగా ప్రకటించారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు, పింఛన్ల పెంపు, ఉపరితల తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకున్నారు. బాబుదంతా బడాయే.. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, ఆయన భాగస్వామి పవన్ కల్యాణ్ ఉద్దానం కిడ్నీ బాధితులను పట్టించుకున్న పాపాన పోలేదు. తిత్లీ సమయంలో గోడు చెప్పుకుందామని వెళ్లిన వారిపై చంద్రబాబు మండిపడ్డారు కూడా. 2019 ఎన్నికల ప్రచారానికి సీఎం హోదాలో వచ్చిన చంద్రబాబు ఒక్క కిడ్నీ వ్యాధి బాధితుడికి కూడా భరోసా ఇవ్వలేకపోయారు. మరోవైపు పవన్ కల్యాణ్ పెద్ద ఎత్తున ఉద్దానం సమస్య పరిష్కరించేశానని ప్రచారం చేసుకున్నారు తప్ప.. చేసిన పని ఒక్కటీ లేదు. తన మిత్రపక్షం అధికారంలో ఉన్నా కూడా ఏమీ చేయలేకపోయారు. కిడ్నీ రీసెర్చ్‌సెంటర్ పరిశీలనలో మ్యాప్ చూస్తున్న మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు బతుకుతా అనుకోలేదు.. అంతా జగనన్న దయే! నా పేరు సుగ్గు లక్ష్మీ. ఇచ్ఛాపురం మండలం మారుమూల ప్రాంతం సన్యాసిపుట్టుగ గ్రామం మాది. నాలుగేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ లక్షల రూపాయలు ప్రైవేటు ఆస్పత్రికే ధారబోశాను. అప్పట్లో కనీసం ఒక్క డాక్టర్ గానీ, మందులు ఇచ్చేవారు గానీ మా గ్రామానికి వచ్చేవారు కాదు. రెండున్నరేళ్ల నుంచి రూ.10వేలు పింఛన్ వస్తోంది. అంతే కాదు నన్ను డయాలసిస్ కేంద్రానికి తీసుకువెళ్లడానికి 108 బండి వస్తోంది. కలలో కూడా అనుకోలేదు నేను ఇప్పటి వరకు బతుకుతానని, అంతా జగనన్న దయే! వైఎస్ జగన్ సీఎం అయ్యాక.. ►కిడ్నీ వ్యాధి గ్రస్తులకు పింఛన్‌ను రూ.3500 నుంచి రూ.10వేలకు పెంచారు. 5పైబడి సీరం క్రియేటినిన్ ఉన్న వారికి రూ.5వేలు, డయాలసిస్ రోగులకు రూ. 10వేల పింఛను ఇస్తున్నారు. ►ఉపరితల తాగునీరు అందించేందుకు రూ.700 కోట్ల వ్యయంతో భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాల్లో గల 827 గ్రామాలకు ఇంటింటికీ కుళాయిల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించనున్నారు. ►వ్యాధి మూలాలను తెలుసుకునేందుకు రీసెర్చ్ సెంటర్‌తో పాటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కూడా మంజూరు చేశారు. మార్చిలో వీటిని ప్రారంభించనున్నారు. ►టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆస్పత్రుల్లో డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. 63 మెషీన్లతో 68పడకలపై డయాలసిస్ అందిస్తున్నారు. సోంపేట, కవిటిలో పడకలు పెంచారు. హరిపురంలో పది పడకలతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు. కొత్తగా గోవిందపురం, అక్కుపల్లి, కంచిలి, బెలగాంలో డయాలసిస్ సెంటర్లు మంజూరయ్యాయి. ►ఇవి కాకుండా ఇచ్ఛాపురం సీహెచ్‌సీలో 10పడకలు, బారువ సీహెచ్‌సీలో 10పడకలతో డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు కొత్తగా ప్రతిపాదనలు తయారయ్యాయి. ఇవికాకుండా రెండు కంటైన్డ్ బేస్డ్ సరీ్వసెస్ డయాలసిస్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అవి జిల్లాకొచ్చాయి. కవిటి, సోంపేట సీహెచ్‌సీల్లో వీటిని అందుబాటులో ఉంచుతున్నారు. ఒక్కో యూనిట్లో ఏడేసి పడకలు ఉంటాయి. ►టీడీపీ హయాంలో డయాలసిస్ రోగులకు 20రకాల మందులే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు 37రకాల మందులను అందుబాటులో ఉంచారు. ►కిడ్నీ రోగులకు వైద్య పరీక్షల కోసం సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్, యూరిన్ ఎనలైజర్స్‌ను ఉద్దానం పరిధిలో ఉన్న 29 ల్యాబ్‌లలో అందుబాటులో ఉంచారు. పాతవి పాడైతే ఎప్పటికప్పుడు కొత్తవి కొనుగోలు చేసి అందుబాటులో ఉంచుతున్నారు. ►టీడీపీ హయాంలో జిల్లాలో నెఫ్రాలజీ విభాగమే లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక శ్రీకాకుళం జీజీహెచ్‌లో నెఫ్రాలజీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. ప్రతి శనివారం పలాస సీహెచ్‌సీకి వెళ్లి అక్కడి రోగులకు వైద్యం అందిస్తున్నారు. రూ. 10వేలు పింఛన్ అందుకుంటున్నాం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక రూ.10వేలు పింఛన్ ఇస్తున్నారు. టీడీపీ హయాంలో డయాలసిస్ చేసుకోవడానికి స్థానికంగా సరిపోయిన బెడ్స్ లేక ఇబ్బంది పడేవాళ్లం. ఈ ప్రభుత్వం వచ్చాక ఆర్థిక సమస్యలు నుంచి గట్టెక్కాం. డయాలసిస్ కూడా సకాలంలో చేసుకుంటున్నాం. – మర్రిపాటి తులసీదాస్, డయాలసిస్ రోగి, పెద్దశ్రీరాంపురం, కంచిలి మండలం ఆదుకున్న జగనన్న ప్రభుత్వం పూర్తిగా చితికిపోయిన కిడ్నీ బాధితుల్ని జగనన్న ప్రభు త్వం వచ్చాక ఆదుకుంది. ఉద్దానం పర్యటన సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిగా మా సమస్యల మీద దృష్టిపెట్టారు. మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. – లండ శంకరరావు, కిడ్నీ డయాలసిస్ రోగి, పెద్దశ్రీరాంపురం గ్రామం, కంచిలి మండలం ఉచితంగా మందులు, ఇంజెక్షన్లు.. డయాలసిస్ కేంద్రంలో కిడ్నీ రోగులకు అవసరమైన అన్ని మందులను, ఇంజెక్షన్లను ఉచితంగానే ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక విశాఖపట్నం లాంటి దూరప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండానే డయాలసిస్ చేయించుకుంటున్నాం. – అందాల రత్నాలు, డయాలసిస్ రోగి, లోహరిబంద గ్రామం, -
‘ఉద్దానం సమస్య ఇప్పటిది కాదు’
సాక్షి, అమరావతి: ఉద్దానం సమస్య ఇప్పటిది కాదని, గత ప్రభుత్వం ఉద్దానాన్ని ఏనాడూ పట్టించుకోలేదన్నారు ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని. ఉద్దానం సమస్యపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బుధవారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉద్దానంలో పరిస్థితిపై ఈనాడు దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి రజిని. ‘ఉద్దానం బాధితుల కోసం చంద్రబాబు ఏరోజూ ఆలోచించలేదన్నారు. సీఎం వైఎస్ జగన్ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టారు. చంద్రబాబు ప్రయోజనాల కోసమే ఈనాడు పని చేస్తోంది. చంద్రబాబును రామోజీరావు ఏరోజూ ఎందుకు ప్రశ్నించలేదు? సీఎం వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం చేయడమే ఎల్లోమీడియా పని.. ఉద్దానం బాధితుల కోసం చంద్రబాబు ఏరోజూ ఆలోచించలేదు. ప్రత్యేక దృష్టి పెట్టి బాధితులకు అండగా నిలిచింది సీఎం జగనే. ఉద్దానం బాధితులకు రూ.10వేలు పెన్షన్ అందిస్తున్నాం. బాధితులకు రెగ్యులర్‌గా డయాలసిస్ చేస్తున్నాం. కిడ్నీ బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకే హాస్పిటల్ నిర్మాణం.’ అని వెల్లడించారు ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని. ఇదీ చదవండి: టిడ్కో ఇళ్ల నిర్వహణ బాగుండాలి: గృహనిర్మాణ సమీక్షలో సీఎం జగన్ -
ఊపిరి పీల్చుకుంటున్న ఉద్దానం
-
ఉద్దానంలో భల్లూక భయం
సాక్షి, పలాస (శ్రీకాకుళం): భల్లూకాలు అడవి వదిలి ఊళ్ల మీద పడుతున్నాయి. పలాస నియోజకవర్గంలోని ఉద్దానం ప్రాంతాలుగా పేరుపొందిన పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లోని జీడి తోటల్లో ఎలుగు బంట్లు స్వైర విహార చేస్తున్నాయి. ఒక్కోసారి రాత్రి పూట వీధుల్లోకి కూడా వచ్చేస్తున్నాయి. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే గత మూడేళ్లలో పదుల సంఖ్యలో రైతులు మృత్యువాత పడ్డారు. రాత్రి పగలు జీడి తోటల్లో పశువులు మందలతో రైతులు స్వేచ్ఛగా తిరుగుతూ తమ పనులను చక్కబెట్టుకునే వారు. అలాంటిది ఇప్పుడు గ్రామ పొలిమేరలు దాటి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీనికి కారణం లేకపోలేదు. గతంలో ఉన్న ఉద్దానం ప్రాం తంలోని పెద్ద కొండ, రట్టికొండ, బాతుపురం కొండలతో పాటు జీడి తోటలు చాలా చిక్కగా దట్టంగా ఉండేవి. సాయంత్రం వేళ తర్వాత ఎలుగు బంట్లు తమ దాహార్తిని తీర్చుకోవడానికి వాటికంటూ ప్రత్యేకంగా ఒక తోవలు ఉండేవి. ఇప్పుడు అవన్నీ తారుమారయ్యాయి. దీనికి తోడు గత ఏడాది అక్టోబరులో వచ్చిన తిత్లీ తుపానుకు జీడి చెట్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఈ పరిస్థితిలో వాటికి అలవాటైన తోవలు కనుమరుగయ్యాయి. ఒక పక్క అవి ఉండటానికి తగిన ఆవాసాలు లేక మరో పక్క దాహార్తిని తీర్చుకోవడానికి దగ్గరలో చెరువులు ఇతర నీటి సదుపాయాలు లేకపోవడంతో.. ఉద్దానం ప్రాంతం నుంచి అటు సముద్రం వైపు ఇటు పల్లపు మైదాన ప్రాంతాల వైపు పరుగులు తీస్తూ ఊళ్లలోకి వస్తున్నాయి. ఇలా వస్తున్న క్రమంలో ఎలుగుబంట్లకు పగలు రాత్రి తేడా తెలీడం లేదు. ఎక్కడ చీకటి పడితే అక్కడ ఉండిపోవడం, ఎక్కడ పొద్దు తూరితే అక్కడ నుంచి బయలు దేరడం ప్రా రంభిస్తున్నాయి. ఈ సమయంలోనే ఎక్కువగా ప్రమాదాలు జరగుతున్నాయి. ♦ సోమవారం ఉదయం ఉద్దానం గ్రామాలైన లోహరబంద, రట్టి, బాహాడపల్లి తదితర గ్రామాల్లో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. ఎలాంటి భయం లేకుండా మోటారు బైకులు శబ్దం వినిపిస్తున్నా ఖాతరు చేయకుండా నడుస్తూ వెళ్లి ప్రజలను ఆశ్చర్యం చేసింది. ఇది తాజా ఉదాహరణ మాత్రమే. రెండేళ్ల కిందట పలాస మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన మద్దిల జానకిరావు అనే పశువుల కాపరి తన జీడితోటలో పశువుల మంద వద్దకు వెళ్లి వస్తుండగా పిల్లల ఎలుగుబంటి దాడి చేసింది. అతను తీవ్రగాయాలపాలయ్యాడు. అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ♦ వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు ఒంకులూరుగెడ్డ సమీపంలో కాశీబుగ్గకు చెందిన ఒక బట్టల వ్యాపారి కాలకృత్యాల కోసం రోడ్డు పక్క కూర్చోగా ఎలుగు దాడి చేసింది. ఈ దాడి జరుగుతున్న సందర్భంగా ఆర్టీసి బస్సు కూడా అక్కడకు చేరింది. ఎంత మంది రాళ్లు విసిరి కేకలు వేసినా ఆయన మృత్యువు నుంచి తప్పించుకోలేకపోయాడు. వణుకుతున్న ఉద్దానం వజ్రపుకొత్తూరు రూరల్: ఉద్దాన తీర ప్రాంతంలో ఎలుగులు సంచరించడంతో ఉద్దాన ప్రజలు భయాందోళనతో వణుకుతున్నారు. గత రెండు రోజులుగా ఉద్దాన ప్రాంతంలో డెప్పూరు, అనకపల్లి, సీతానగర్, వంకులూరు, చీపురుపల్లి తదితర గ్రామాల్లో ఎలుగులు సంచరిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఎలుగులు సంచరించడంతో ఏ సమయంలో ఏమవుతుందోనని వారు భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో వీటి సంచారం ఎక్కువగా ఉంటోం దని, ఆరుబయట అడుగు పెట్టేందుకు భయపడుతున్నామని వారు వాపోతున్నారు. గతంలో ఈ ఎలుగులు చీపురుపల్లి, గుణుపల్లి, అనకపల్లి, గడూరు తదితర గ్రామాల్లో సంచరించి దాడులు చేయడంతో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కపల్లి, రాజాం గ్రామాల్లో రాత్రి సమయంలో ఎలుగులు సంచరించి కిరాణ దుకాణం, అంగన్వాడీ కేంద్రంలోకి ప్రవేశించి సరుకులు ధ్వంసం చేశాయి. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఎలుగుల సంచారాన్ని నియంత్రించాలని వారు కోరుతున్నారు. గత ఏడాది ఇదే రోజు ఎలుగు దాడి గత ఏడాది ఎర్రముక్కాం, పితాతొళి, లోహరబంద, లింబుగాం తదితర ప్రాంతాల్లో ఎలుగుబంటి చేసిన దాడిలో ఇద్దరు చనిపోయారు. ఆరుగురు గాయాలపాలయ్యారు. ఆ దాడి జరిగి సరిగ్గా సోమవారానికి ఏడాది అవుతోంది. ఇప్పుడు అదే ప్రాంతంలో ఎలుగుబంట్లు తిరగాడటంతో ప్రజలు భయపడుతున్నారు. బాతుపురం కొండ సమీపంలో కూడా ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ విధంగా ఎలుగుబంట్లు ఉద్దానం ప్రాంతంలో విచ్చల విడిగా తిరుగుతున్నాయి. గతంలో ఇవి సంచరించడానికి రాత్రి పూట ఒక సమ యం అంటూ ఉండేది. రాత్రి పది గంటల తర్వాత తమ ఆవాసాల నుంచి బయటకు వచ్చి ఆహారం, మంచినీటి కోసం వచ్చేవి. ఇప్పుడు వాటికి ఒక సమయం అంటూ లేదని ఉద్దానం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు వీటిపై దృష్టి సారించి ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు వాటిని సంరక్షించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
కిడ్నీ బాధితుల సమస్యపై పవన్ ఒకరోజు దీక్ష
-
రిసార్ట్స్‌లో పవన్ కల్యాణ్ దీక్ష
సాక్షి, హైదరాబాద్: ఉద్దానం కిడ్నీ బాధితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఒకరోజు దీక్ష చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ప్రస్తుతం తాను బసచేసిన ఎచ్చెర్ల డాట్లా రిసార్ట్స్‌లోనే శుక్రవారం సాయంత్రం నుంచి ఆయన దీక్షలో కూర్చున్నారు. 24 గంటలపాటు ఈ దీక్ష కొనసాగనుంది. శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పవన్ ప్రజల మధ్యే దీక్ష చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పవన్ దీక్షకు సంఘీభావంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సంఘీభావ దీక్షలు జరుగుతాయని జనసేన పార్టీ నాయకులు మాదాసు గంగాధర్, అద్దేపల్లి శ్రీధర్‌లు తెలిపారు. ఉద్దానం బాధితులకు ప్రభుత్వం మెరుగైన వైద్యసేవలు అందించేదాకా జనసేన పోరాడుతూనేఉంటుందని వారు చెప్పారు. బౌన్సర్లు లేక ఆగిన యాత్ర: జన పోరాట యాత్ర పేరులో మే 20 నుంచి పవన్ యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 45 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్ర అనూహ్య కారణాల వల్ల అర్ధాంతరంగా నిలిచిపోయింది. ప్రభుత్వం భద్రత కల్పించడంలేదని ఆరోపిస్తోన్న పవన్.. ప్రైవేటు సెక్యూరిటీ(బౌన్సర్ల) సాయంతో యాత్రను కొనసాగిస్తున్నారు. పలు చోట్ల స్థానికులు, అభిమానులతో బౌన్సర్లు దురుసుగా ప్రవర్తించడం, ఒక దశలో దెబ్బలాటకు దిగడం, ఈ క్రమంలో బౌన్లర్లూ గాయపడటం, ఆస్పత్రిపాలుకావడం తెలిసిందే. ప్రైవేటు సెక్యూరిటీ లేని కారణంగా పవన్ యాత్ర గురు, శుక్రవారాల్లో వాయిదాపడింది. ఇక ఒక్క రోజు దీక్ష చేస్తుండటంతో శనివారం కూడా యాత్ర లేనట్లే. -
ఆ వ్యాధికి మూలకారణాలేమిటో అంతుచిక్కడం లేదు..
సాక్షి, హైదరాబాద్: శ్రీకాకుళంలోని ఉద్దానం, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ప్రబలుతున్న కిడ్నీ వ్యాధికి మూలకారణాలేమిటో అంతుచిక్కడం లేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అనుప్రియా పటేల్ వెల్లడించారు. రాజ్యసభలో నిన్న (మంగళవారం) వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి రాతపూర్వక సమాధామిచ్చారు. ఆయా ప్రాంతాల్లో రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నవ్యాధులకు మూలకారణాలేమిటో విచారించడానికి కేంద్ర బృందం శ్రీకాళంలో పర్యటించిందనీ, కానీ దానికి గల కారణాలు వెల్లడి కాలేదన్నారు. ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించిందా? అన్న ప్రశ్నకు ఆరోగ్య మంత్రి జవాబిస్తూ... శ్రీకాళంలో ఇప్పటికే అయిదు డయాలసిస్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్), టెక్కలి, పాలకొండ, పలాసలోని ఏరియా ఆస్పత్రుల్లో, సోంపేటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డయాలసిస్ కేంద్రాలు పనిచేస్తున్నట్లు తెలిపారు. కిడ్నీ వ్యాధి మరింతగా ముదరకుండా చూడడానికి 15 ప్రత్యేక మొబైల్ మెడికల్ క్లినిక్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్‌లోని విశాఖపట్నంలోగల కింగ్ జార్జి హాస్పిటల్ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రిఫరెల్ కేంద్రంగా పనిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి వీలుగా కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ పలు రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక కేంద్ర ప్రభుత్వ పథకాల కింద సాంకేతక, ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ పథకాల కింద దేశంలో 99 ప్రాజెక్ట్‌లను ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్టులుగా గుర్తించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని 8 ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రాధాన్య ప్రాజెక్టులుగా గుర్తించామన్నారు. అయితే అందులో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వెలిగోడు ప్రాజెక్టును ప్రతిపాదించలేదని మరో ప్రశ్నకు సమాధానంగా అనుప్రియ వెల్లడించారు. -
మరో మహమ్మారి!
ఉద్దానంపై మరో మహమ్మారి పంజా విసిరింది. ఏడు మండలాల్లో విస్తరించిన ఉద్దానం ప్రాంతం ఇప్పటికే కిడ్నీ వ్యాధులతో వణికిపోతుండగా..ఇప్పుడు బోధకాలు రూపంలో మరో భూతం చాపకిందనీరులా కబళిస్తోంది. దోమకాటు వల్ల సోకే బోదకాలు వ్యాధి (ఫైలేరియా) బాధితులు ఈ ప్రాంతంలో వందలాది మంది ఉన్నారు. కనీసం నడవడానికి కూడా వీల్లేనంతగా కాళ్లు ఉబ్బిపోయినా పేదరికం కారణంగా వైద్యానికి దూరమవుతూ మంచంపైనే మగ్గిపోతున్నారు. సర్కార్ స్పందించి ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. శ్రీకాకుళం, కాశీబుగ్గ : ఉద్దాన ప్రాంతానికి చెందిన వందలాది మంది మూత్రపిండాల వ్యాధితో మంచం పట్టారు. వారిని చూసి కన్నవారు.. కుటుంబాలు కన్నీరుపెడుతున్నారు. బతికిం చుకోవడానికి అప్పులు చేసి.. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇలాంటి తరుణంలో బోదవ్యాధి అనే భూతం వారి జీవితాలను దహించడానికి చాపకింద నీరులా దూసుకొస్తోంది. ఈ ప్రాంతంలోని ఏ గ్రామంలో చూసినా పది మందికి తక్కువ కాకుండా ఫైలేరియా వ్యాధిగ్రస్తులు దర్శనమిస్తున్నారు. ఇప్పటికే ఉద్దానం, తీరప్రాంతం, మెట్ట ప్రాంతాల ప్రజలను కిడ్నీ వ్యాధి వణికిస్తోంది. వందలాది మంది మృత్యువతా పడ్డారు. తాజాగా బోదవ్యాధి వ్యాపిస్తుండడంతో ఈ ప్రాంతీయులు భయాందోళన చెందుతున్నారు. ఉద్దాన ప్రాంతంలోని ప్రధాన మండలాలైన పలాస, వజ్రపుకొత్తూరు, మందస, కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం, సొంపేట ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందిలో పది నుంచి 15 మంది వరకూ బోదవ్యాధితో బాధపడుతున్నారు. పలాస మండలం బొడ్డపాడు గ్రామంలో 30 మంది, బ్రాహ్మాణతర్లాలో 20 మంది వ్యాధితో అల్లాడుతున్నారు. అలాగే లక్ష్మీపురం, బెండి, వజ్రపుకొత్తూరు, పూండి, పలాస, కాశీబుగ్గ, బైపల్లి, అక్కుపల్లితోపాటు గిరిజన ప్రాంతంలో కూడా ఈ వ్యాధి లక్షణాలతో వందలాది మంది మంచం పట్టారు. నడకయాతన.. బోదవ్యాధి బారిన పడిన వారు నడకకు కూడా నరక యాతన పడుతున్నారు. బరువెక్కిన శరీరంతో అవిటితనాన్ని అనుభవిస్తున్నారు. ఎటువంటి పనులు చేసుకోలేక కుటుంబాలకు భారంగా మారుతున్నారు. లేచి నిలబడి మంచినీరును సైతం తీసుకోలేక ఇతరులపై ఆధారపడుతున్నారు. ఇంజక్షన్లు నిలిపివేత.. గత ప్రభుత్వాలు ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలను ఉచితంగా అందించేవి. సామాజిక ఆస్పతుల్లో ఇంజక్షన్లు అందుబాటులో ఉంచేవారు. ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎడాదిలోపే బోదవ్యాధిగ్రస్తులకు ఇచ్చే ఇంజక్షన్ల సరఫరాను నిలిపివేసింది. దీంతో వ్యాధిగ్రస్తులు డబ్బులుపెట్టి చికిత్స చేయించుకోలేక, రోజురోజుకూ పెరుగుతున్న శరీర బరువురును భరించలేక మానసికంగా కుంగుపోతున్నారు. దినదిన గండంగా ఉంటున్న వీరి పరిస్థితిని చూసి ఆయా కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు. తోడులేకుండా చిన్న పని కూడా చేసుకోలేక మంచానికే పరిమితిమవుతున్న వారిని చూసి కన్నీరు పెడుతున్నారు. వీరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడంలేదని బాధను వ్యక్తం చేస్తున్నారు. వయసు నిండకుండానే అవిటితనంగా మారుతున్న వారికి కనీసం పింఛన్ కూడా అందించడం లేదు. ప్రభుత్వం స్పందించి ఉచిత వైద్యంతోపాటు.. పింఛన్ అందేలా చూడాలని వ్యాధిగ్రస్తులు, వారి కుటుంబాలు వేడుకుంటున్నాయి. శుభకార్యాలకు సైతం అందని ఆహ్వానాలు బోదవ్యాధి బారిన పడిన వారితో సహా.. వారి కుటుంబాలు వింతపరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. తమను శుభకార్యాలు, ఉపాధి హామీ పథకం పనులకు కూడా పిలవడం లేదని చాలామంది బాధను వ్యక్తం చేస్తున్నారు. బ్రాహ్మాతర్లా గ్రామంలో దాసరి బోగమ్మ, దాసరి వల్లయ్య, బడే జంగమయ్య, పైల నారాయణరావు, తలగాపు నర్సమ్మ, రోళ్ల బయ్యన్నతోపాటు 20 మందికిపైగా బోద మహమ్మారితో మంచానికే పరిమితమయ్యారు. నడవలేకపొతున్నాను నేను బిలాయ్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేసేవాడిని. గ్రామానికి వచ్చి వెళ్లేవాడిని ఆరుబయట పడుకున్నప్పుడు దోమలు కరిచాయి. అప్పటి నుంచి బోదవ్యాధి సోకింది. కాళ్లు వాపులతో అవిటివాడిలా ఇంటికే పరిమితమయ్యాను. ఎటువంటి వైద్య సేవలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను. – గేదెల శ్రీరాములు, వ్యాధిగ్రస్తుడు, బొడ్డపాడు ఇంజక్షన్లు నిలిపివేశారు ఫైలేరియాసిస్ దోమకాటు కారణంగా బోదవ్యాధి సంక్రమిస్తుంది. మైక్రో ఫైలేరియా మనిషిశరీరంలోకి ప్రవేశించి తన పెరుగుదలను నెమ్మదిగా చూపుతుంది. శరీరంలో ఏ అవయవానికి సంక్రమించినా అది పెరుగుతుంది. మగవారిలో వృషనాలకు సైతం ఎఫెక్టు ఉంటుంది. మైక్రోరిలెన్ జ్వరంతో శరీరంలో లక్షణాలు చూపుతుంది. రక్తపరీక్ష ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు. ప్రారంభంలోనే డయటిఇధైల్ కార్బన్జిన్ సిట్రస్‌ను 21 రోజులు శరీరంలోకి పంపించాలి. అంతకు మించిన స్టేజి దాటితే ఎవ్వరూ దానిని నయంచేయలేరు. ఇదివరకు సిప్రోల్ సర్జరీ చేసేవారు. లావుగా ఉన్న కాళ్లను సైజుతగ్గించే విధంగా వైద్యం అందించేవారు. ప్రభుత్వ ఆస్పపత్రిలో ఇంజక్షన్లు అందించేవారు. అయితే ఆ ఇంజక్షన్లు ఎముకలపై ప్రభావం చూపుతుండడంతో నిలిపివేశారు. పలాస ప్రభుత్వ ఆస్పత్రికి వారానికి పదిమందికిపైగా వ్యాధిగ్రస్తులు వచ్చి వెళ్తుంటారు. – డాక్టర్ ప్రకాశవర్మ, పలాస ప్రాంతీయ ఆస్పత్రి ఆస్పత్రి పర్యవేక్షులు -
ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం
♦ సాక్షి ఈడీ కె.రామచంద్రమూర్తి వెల్లడి ♦ పరీక్షల కోసం నీటి నమూనాలు జీఎస్ఐకి.. నాగోలు (హైదరాబాద్): శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత గ్రామాల్లో మంచినీరు కలుషితమై స్థానికులు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారని, ఇప్పటికే వేలాది మంది మృత్యువాత పడ్డారని ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలనే లక్ష్యంతో ఆయా ప్రాంతాల నీటి నమూనాలను పరీక్షల కోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ)కు అందజేశామన్నారు. రామచంద్రమూర్తితో పాటు సీనియర్ జర్నలిస్ట్ మల్లెపల్లి లక్ష్మయ్య, అఖిల భారత రైతు కూలీ సంఘం శ్రీకాకుళం కార్యదర్శి వంకాయల మాధవరావులు గురువారం బండ్లగూడలో జీఎస్ఐ అదనపు డైరెక్టర్ జనరల్ ఎం. శ్రీధర్‌ను కలసి ఉద్దానం ప్రాంతంలోని ఏడు మండలాల్లో ఇటీవల సేకరించిన నీటితో కూడిన 12 సీసాలను అందజేశారు. ఈ నీటిని ల్యాబ్‌లో పరీక్షించి, కిడ్నీ వ్యాధులకు మూలాలు కనుక్కోవాలని విజ్ఞప్తి చేశారు. మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలి.. ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల బారిన పడినవారు ప్రతిరోజూ డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉందని రామచంద్రమూర్తి చెప్పారు. ఈ జబ్బులు ప్రాణాలు హరిస్తున్నా ఎవ రూ స్పందించక పోవడం బాధాకరమన్నారు. ఆ ప్రాంతంలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్నారు. కేంద్రం,ఐరాస, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి బాధితులను కాపాడాలని కోరారు. ఉద్దానం ప్రాంత ప్రజలు నీటి కాలుష్యంతో పిట్టల్లా రాలిపోతున్నారని, సాక్షి యాజమాన్యం ఆ ప్రాంతానికి వచ్చి నీటి నమూనాలు సేకరించి పరీక్షలకివ్వడం అభినందనీయమని మాధవరావు అన్నారు. గతంలో పవన్‌కల్యాణ్ వచ్చి హడావుడి చేశారే తప్ప పరిష్కారం చూపలేదన్నారు. వ్యాధుల మూలాలు కనుగొని సమస్య కు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. నీటిని పరీక్షించి త్వరలో నివేదిక అందజేస్తామని జీఎస్ఐ అదనపు డీజీ శ్రీధర్ చెప్పారు.