సాక్షి, అమరావతి: ఉద్దానం సమస్య ఇప్పటిది కాదని, గత ప్రభుత్వం ఉద్దానాన్ని ఏనాడూ పట్టించుకోలేదన్నారు ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని. ఉద్దానం సమస్యపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బుధవారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఉద్దానంలో పరిస్థితిపై ఈనాడు దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి రజిని. ‘ఉద్దానం బాధితుల కోసం చంద్రబాబు ఏరోజూ ఆలోచించలేదన్నారు. సీఎం వైఎస్ జగన్ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టారు. చంద్రబాబు ప్రయోజనాల కోసమే ఈనాడు పని చేస్తోంది. చంద్రబాబును రామోజీరావు ఏరోజూ ఎందుకు ప్రశ్నించలేదు? సీఎం వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం చేయడమే ఎల్లోమీడియా పని..
ఉద్దానం బాధితుల కోసం చంద్రబాబు ఏరోజూ ఆలోచించలేదు. ప్రత్యేక దృష్టి పెట్టి బాధితులకు అండగా నిలిచింది సీఎం జగనే. ఉద్దానం బాధితులకు రూ.10వేలు పెన్షన్ అందిస్తున్నాం. బాధితులకు రెగ్యులర్‌గా డయాలసిస్ చేస్తున్నాం. కిడ్నీ బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకే హాస్పిటల్ నిర్మాణం.’ అని వెల్లడించారు ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని.
ఇదీ చదవండి: టిడ్కో ఇళ్ల నిర్వహణ బాగుండాలి: గృహనిర్మాణ సమీక్షలో సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment