Uddanam Kidney diseases prevention
-
‘ఉద్దానం సమస్య ఇప్పటిది కాదు’
సాక్షి, అమరావతి: ఉద్దానం సమస్య ఇప్పటిది కాదని, గత ప్రభుత్వం ఉద్దానాన్ని ఏనాడూ పట్టించుకోలేదన్నారు ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని. ఉద్దానం సమస్యపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బుధవారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉద్దానంలో పరిస్థితిపై ఈనాడు దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి రజిని. ‘ఉద్దానం బాధితుల కోసం చంద్రబాబు ఏరోజూ ఆలోచించలేదన్నారు. సీఎం వైఎస్ జగన్ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టారు. చంద్రబాబు ప్రయోజనాల కోసమే ఈనాడు పని చేస్తోంది. చంద్రబాబును రామోజీరావు ఏరోజూ ఎందుకు ప్రశ్నించలేదు? సీఎం వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం చేయడమే ఎల్లోమీడియా పని.. ఉద్దానం బాధితుల కోసం చంద్రబాబు ఏరోజూ ఆలోచించలేదు. ప్రత్యేక దృష్టి పెట్టి బాధితులకు అండగా నిలిచింది సీఎం జగనే. ఉద్దానం బాధితులకు రూ.10వేలు పెన్షన్ అందిస్తున్నాం. బాధితులకు రెగ్యులర్‌గా డయాలసిస్ చేస్తున్నాం. కిడ్నీ బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకే హాస్పిటల్ నిర్మాణం.’ అని వెల్లడించారు ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని. ఇదీ చదవండి: టిడ్కో ఇళ్ల నిర్వహణ బాగుండాలి: గృహనిర్మాణ సమీక్షలో సీఎం జగన్ -
ఊపిరి పీల్చుకుంటున్న ఉద్దానం
-
‘ఉద్ధానం’ సమస్యకు శాశ్వత విరుగుడు
శ్రీకాకుళం: హంగూ లేదు, ఆర్భాటం అంతకన్నా లేదు. సమస్యను మానవతా కోణంలో చూడటం, నిబద్ధతతో పరిష్కారంపై దృష్టి పెట్టడం. సరిగ్గా ఇదే పనిచేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అధికారంలోకి రాకముందు, పర్యటనల్లో పాదయాత్రలో ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను ప్రత్యక్షంగా చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. అధికారంలోకి వచ్చిందే తడవుగా బాధితుల పక్షాన తన మనసులో ఉన్న పరిష్కాన్ని పలుదఫాలుగా అధికారులతో చర్చించారు. ఏం చేస్తే ఉద్దానం బాధితులకు శాశ్వత ఉపశమనం లభిస్తుందో తెలుసుకున్నారు. ఆచరణాత్మకమైన మార్గంలో పని మొదలుపెట్టారు. యుద్ధ ప్రతిపాదికన శుద్ధి చేసిన తాగునీటిని అందించి వ్యాధికి శాశ్వత విరుగుడు కనిపెట్టింది. ఉద్దానం కిడ్ని సమస్యకు శాశ్వత పరిష్కారంగా మేలైన తాగునీటి పథకాన్ని మందుగా ముందుకు తీసుకువచ్చింది. ఏమాత్రం హడావుడి, ఆర్భాటం లేకుండానే సమగ్ర తాగునీటి పథకం అమలు చేసేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏకంగా కార్యాచరణతో రంగంలోకి దిగిపోయింది. తాగునీరే విషపూరితం – లక్షల్లో బాధితులు, వేలల్లో మరణాలు ప్రపంచంలో కిడ్నీ వ్యాధి గ్రస్తులతో అల్లాడే నాలుగు ప్రాంతాల్లో ఒకటి శ్రీకాకుళం జిల్లా ఉద్దానం. నికరాగువా, కోస్టారిక, శ్రీలంక, ఉద్దానం ప్రాంతాలు ఎక్కువ కిడ్నీ వ్యాధిగ్రస్తులతో ప్రపంచంలోనే తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. మంచినీటిలో ఉన్న విషపూరిత కారకాలు ఇక్కడ ప్రజల కిడ్నీ సమస్యకు కారణమని పలు పరిశోధనల్లో ప్రాధమికంగా తేల్చారు. ఈ సమస్యకు పరిష్కారం అప్పట్లోనే వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రయత్నించారు. సురక్షితమైన తాగు నీరు అందించేందుకు శ్రీకారం చుట్టారు. కానీ ఆయన మరణంతో ఈ పథకం అటకెక్కింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాజకీయ, పర్యటనలకు, ప్రకటనలకు పరిమితం అయ్యారే తప్ప, ఉద్దానం సమస్య పరిష్కారానికి కృషి చేయలేదనే వాదనలు ఉన్నాయి. తాజాగా వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్దానంలో శాశ్వత తాగునీటి పధకాన్ని ఏర్పాటు చేయటంతో పాటు, పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టారు. రూ 700 కోట్ల అంచనాలతో ఈ పధకాన్నిడిజైన్ చేసి రూ 530 కోట్లతో పనులకు అధికారులు టెండర్లు పిలిచారు. రివర్స్ టెండరింగ్ లో రూ 527 కోట్లతో పనులు చేసేందుకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ ముందుకు వచ్చింది. ఇది నిర్ణయించిన ధర కంటే 0.60 శాతం తక్కువ. ఉద్దానం ప్రాంత ప్రజల ఏడాది కాలం తాగునీటి అవసరాల కోసం 1.12 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్ట్ ద్వారా అందించనున్నారు. త్వరలోనే పనులను ప్రారంభించేందుకు ఎంఈఐఎల్ సన్నాహాలు చేస్తోంది. తాగునీటి రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ లు చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ ఈ పథకాన్ని నిర్ణీత గడువులోగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేస్తుందని ప్రభుత్వ అధికారులు విశ్వసిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల్లోని రెండు పురపాలక సంఘాలతో పాటు, కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్చాపురం, పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లో ఈ కిడ్నీ బాధితుల సమస్య ఎక్కువగా ఉంది. హీర రిజర్వాయర్ నుంచి నీరు- భూగర్భ మార్గంలో తరలింపు ఉద్దానంలోని 809 నివాసిత ప్రాంతాల్లో 5.74 లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారు. తాగునీటికి బోరు నీరే ఆధారం. కానీ అవి విషపూరితం, రసాయనాల మయం. తప్పని పరిస్థితుల్లో అదే నీరు తాగుతున్నారు ఉద్దానం ప్రజలు. సమీపంలో ఉండే బహుదా, మహేంద్ర తనయ నదులు వేసవిలో ఎండిపోతుండడం వల్ల బోరు నీటినే తాగక తప్పని పరిస్థితి. మేఘా ఇంజనీరింగ్ ఉద్దానానికి దాదాపు వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న హీర మండలం రిజర్వాయర్ నుంచి భూ గర్భ పైపులైను ద్వారా నీటిని తరలించి మిలియకుట్టి మండల కేంద్రం వద్ద ఆ నీటిని ఇసుక ఫిల్టర్ల ద్వారా శుద్ది చేసి ఆ నీటిని ఉద్దానం ప్రాంతంలోని వివిధ గ్రామా ల్లో ఏర్పాటు చేసిన రక్షిత మంచి నీటి ఓవర్‌హెడ్ ట్యాంకులకు తరలిస్తారు. ప్రతి ఇంటికి ఈ నీటిని అందిస్తారు. పాలకుల వైఫల్యం - ఏళ్ళుగా పీడిస్తున్న సమస్య ఉద్దానం సమస్య ఇప్పటిది కాదు. దీనిని పరిష్కరించడంలో ఎవరూ చిత్తశుద్ది చూపలేదు. నాడు వైఎస్సార్- నేడు వైఎస్ జగన్ ప్రజలు, పీడితుల పక్షాన నిలబడ్డారు. 1985-86 లో బయటపడ్డా అప్పటి నుంచి ప్రభుత్వాల నిర్లక్షమే బాధితుల పట్ల శాపమైంది. 2004 అధికారం తర్వాత వైఎస్సార్ దృష్టి పెట్టినా, ఆయన అకాల మరణంతో సమస్య మొదటికి వచ్చింది. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక, టీడీపీతో పాటు జనసేన పవన్ కల్యాణ్ రాజకీయ లబ్ది కోసం ప్రకటనలకే పరిమితం అయ్యారు. ఉద్దానంలో 35 నుంచి 40 శాతం కిడ్నీ బాధితులు, వేల సంఖ్యలో మరణాలకు ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వ సంకల్పం, మేఘా సంస్థ నైపుణ్యం పరిష్కారం చూపబోతున్నాయి. -
కిడ్నీ బాధితులకు ‘భరోసా’గా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
ఉద్ధానం సమస్యపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి : ఉద్ధానం సమస్యపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కిడ్నీ బాధితుల కోసం శ్రీకాకుళం జిల్లా పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆస్పత్రికి అనుసంధానంగా రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్‌కు రూ.50కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రీసెర్చ్ సెంటర్లో రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో ప్రభుత్వం సిబ్బందిని నియమించనుంది. వైద్యుడు, సిబ్బందిని మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ ప్రాతిపదికన 5 పోస్టులు, కాంట్రాక్ బేసిస్ కింద 98, సర్వీస్ ఔట్‌సోర్స్ కింద60 పోస్టులను మంజూరు చేసింది. కాగా ప్రభుత్వ నిర్ణయం పట్ల కిడ్నీ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి కాకముందే తమ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. కిడ్నీ బాధితులకు ‘భరోసా’గా రూ.10 వేలు కాగా, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజు నుంచే కిడ్నీ బాధితులకు నెలకు రూ. 10 వేల పెన్షన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం ప్రాంతంతో పర్యటించారు. కిడ్నీ బాధితుల అవస్థలను చూసి ఆయన చలించిపోయారు. వారి గోడు విన్న వైఎస్ జగన్ ‘మనం అధికారంలోకి వస్తే నెలకు రూ.10 వేల ఇస్తా’నని మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కిడ్నీ బాధితులకు ఇచ్చిన మాట ప్రకారం వారికిచ్చే పింఛను రూ.10 వేలకు పెంచారు. రాష్ట్రంలో సుమారు 8,500 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలోని 112 గ్రామాల్లో ఉన్నారు. ఆ తర్వాత కృష్ణా జిల్లా జి.కొండూరు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో డయాలసిస్ బాధితులు ఉన్నారు. వీళ్లందరూ పేదవాళ్లే. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో 4 వేల మందికి మాత్రమే నెలకు రూ.2,500 చొప్పున పింఛను ఇచ్చేవారు. 2019 ఫిబ్రవరి తరువాత 8,500 మందికి రూ.3,500 చొప్పున రూ.2.80 కోట్లను వ్యయం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక రూ.10 వేల చొప్పున 8,500 మందికి నెలకు రూ.8.50 కోట్లను చెల్లిస్తున్నారు. కేవలం కిడ్నీ బాధితులకు ఇచ్చే పింఛను వ్యయమే ఏడాదికి రూ.102 కోట్లు కానుంది. అంతే కాకుండా ఉద్దాన సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఇపుడు రూ.50 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎన్నో ఏళ్లుగా పట్టి పీడిస్తున్న ఉద్దాన సమస్యపై సీఎం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం కిడ్నీ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మా పాలిట దేవుడయ్యారని ప్రశంసిస్తున్నారు. కిడ్నీ డయాలసిస్ రోగులకు ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
కిడ్నీ వ్యాధి సమస్యకు శాశ్వత పరిష్కారం
సాక్షి, అమరావతి: దశాబ్దాల తరబడి శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న కిడ్నీ వ్యాధి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ ప్రాంతంలో రూ.600 కోట్లతో సమగ్ర మంచి నీటి పథకం నిర్మాణానికి అనుమతి తెలిపింది. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి ప్రబలడానికి, రోగులు ఎక్కువగా ఉండడానికి అక్కడి ప్రజలు తాగే నీరు కారణమని పలువురు నిపుణులు ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని బోర్ల ద్వారా సేకరించిన నీటినే మంచినీటి పథకాల ద్వారా తాగునీరు అందిస్తున్నారు. ఇకపై బయటి ప్రాంతం నుంచి నదీ జలాలను ఆ ప్రాంతానికి తరలించి ప్రజల తాగునీటి అవసరాలకు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జిల్లాలోని రేగులపాడు వద్ద ఒక రిజర్వాయర్‌ను నిర్మించాలని ప్రణాళిక రూపొందించింది. ప్రభుత్వ చర్యల వల్ల జిల్లాలోని పలాస–కాశీబుగ్గ, ఇచ్ఛాపురం పట్టణాలతో పాటు ఏడు మండలాల పరిధిలోని 807 నివాసిత ప్రాంతాల్లోని లక్షలాది మంది ప్రజలకు ఉపయోగం కలగనుంది. ఈ సమగ్ర మంచినీటి ప్రాజెక్టు నిర్మాణానికి పరిపాలన పరమైన అనుమతి తెలుపుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ట ద్వివేది బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఈ పథకానికి శంకుస్థాపన చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం పొందే మండలాలు 7 కంచిలి, కవిటి, వజ్రపుకొత్తూరు,పలాస–కాశీబుగ్గ, మందస, సోంపేట, ఇచ్ఛాపురం -
ఉద్దానంపై లోతుగా అధ్యయనం
- హార్వర్డ్ వర్సిటీ వైద్య నిపుణుల రాక - త్వరలో రానున్న150 మంది వైద్యుల బృందం పాత పోస్టాఫీసు (విశాఖ దక్షిణ): ఉద్దానం కిడ్నీ వ్యాధుల నివారణకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు శనివారం హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు అంతర్జాతీయ వైద్య నిపుణులు విశాఖకు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు హార్వర్డ్ యూనివర్సిటీ నెఫ్రాలజీ విభాగంలో సేవలు అందిస్తున్న డాక్టర్ జోసెఫ్ బాస్‌వెంట్రీ, తెలుగు వ్యక్తి డాక్టర్ వెంకట్ సబ్బిశెట్టి వచ్చారు. గతంలో ఉద్దానం సమస్యపై పరిశోధనలు చేసిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉపకులపతి, కిడ్నీ వ్యాధుల నిపుణుడు డాక్టర్ టి.రవిరాజ్‌తో ఆంధ్ర వైద్య కళాశాలలో సమావేశమై ఉద్దానం కిడ్నీ వ్యాధుల సమస్యపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆంధ్రవైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి.సుధాకర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో డాక్టర్ జోసెఫ్ మాట్లాడుతూ... ఉద్దానం ప్రాంతంలో ప్రజలు తాగే నీరు, తినే ఆహారం, జీవన విధానం, వాతావరణం, అధిక మోతాదులో ఉండే ఖనిజాల వివరాలను సేకరించి, అధ్యయనం చేయడంతో పాటు పూర్తి స్థాయిలో పరిశోధనలు చేపడతామని చెప్పారు. 150 మంది వైద్యుల బృందం ఉద్దానంలో పర్యటించి కిడ్నీ వ్యాధులకు మూలాలను కనిపెట్టి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని డాక్టర్ వెంకట్ సబ్బిశెట్టి చెప్పారు.