
హన్మకొండ అర్బన్ : సుమారు 10 రోజుల క్రితం మొదలైన రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనతో వీఆర్వోలకు ఊపిరి సల్పకుండా అయింది. ఉదయం 8 గంటలకు గ్రామ సభలతో మొదలైతే సాయంత్రం పనులు ముగించుకుని ఇంటికి చేరేసరికి రాత్రి పొద్దుపోతుంది. పదిరోజుల పాటు విరా మం లేకుండా ఉన్న తమకు ఆదివారం కాస్త సెలవు దొరికిందనుకుంటే ఓట్ల జాబితా సవరణ పేరుతో ఆదివారం కూడా హన్మకొండ మండలంలోని వీఆర్వోలను అధికారులు కార్యాలయానికి పిలిచి సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో హన్మకొండ, వరంగల్ కాజీపేట మండలాల పరిధిలోని వారు ఉదయం 9 గంటలకే కలెక్టరేట్ చేరుకున్నారు. కనీసం ఆదివారం కూడా వదలకుండా విధుల్లో ఉంచితే ఇక తమ కుటుంబం, ఇంటిపనుల చేసుకునేదెలా అని వీఆర్వోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.