సాక్షి, హైదరాబాద్: ‘కొత్త ఉద్యోగాల భర్తీ.. సీఎం కేసీఆర్ అంకెల గారడీ’ అని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన సీఎం ఇప్పడు గ్రూప్ 4 ఉద్యోగాల్లో వాళ్లను భర్తీ చేయాలని చూస్తున్నారన్నారు. ధరణి పేరిట భూములు దోచుకోవడానికి వీఆర్వోలు అడ్డుగా ఉన్నారని ఆ వ్యవస్థనే రద్దు చేశారని ఆరోపించారు. లక్ష ఉద్యోగాలకు ఎసరు పెట్టి.. 80 వేల ఉద్యోగ ఖాళీలే అని తేల్చారన్నారు.
రాష్ట్రంలో లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఎనిమిదేళ్లుగా కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా.. తొలగించిన ఉద్యోగులతో భర్తీ చేయడమేంటని ఆక్షేపించారు. కాగా.. ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర ఈ నెల 4 నుంచి పునఃప్రారంభం కా నుంది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మలచెరువు నుంచి ఆమె పాదయాత్రను కొనసాగించనున్నట్టు ఆ పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వాడుక రాజగోపాల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment