
ఇంకా ఆంధ్రపదేశ్‌లోనేనా..!
ఒకే సర్టిఫికెట్‌లో రెండు రాష్ట్రాల పేర్లు
పెద్దపల్లిరూరల్ : మీసేవ కేంద్రం నుంచి మరణ ధ్రువీకరణ పత్రం పొందితే ఒకే సర్టిఫికెట్‌లో రెండు రాష్ట్రాల పేర్లు ఉండడం చూసి అవాక్కయ్యూరు. గోదావరిఖనికి చెందిన రాజేందర్ తన తండ్రి మరణధ్రువీకరణ పత్రం కోసం పెద్దపల్లి మీసేవ కార్యాలయంలో సోమవారం దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం ధ్రువీకరణపత్రం తీసుకుని ‘ఆంధ్రప్రదేశ్’ అని ఉండడంతో అవాక్కయ్యూడు. తెలంగాణ ఏర్పడి రెండేళ్లు దాటినా ఇప్పటికీ ధ్రువీకరణపత్రాల్లో ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం’ అనే పేరును తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తమ అవసరాల కోసం తీసుకున్న సర్టిఫికెట్లను బ్యాంకు అధికారులకు చూపితే తెలుగులో ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం’ అని, ఇంగ్లిష్‌లో ‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం’ అని రాసి ఉందని నిరాకరిస్తున్నారని బాధితులు తెలిపారు.