
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: ఆస్తిపై కన్నేసిన దుర్మార్గులు ఓ వ్యక్తి బతికుండాగానే చనిపోయినట్లు రికార్డులు సృష్టించారు. ఘటనకు సంబంధించి ఎప్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు అనంతపురం రెండో పట్టణ సీఐ శివరాముడు కేసు నమోదు చేశారు. వివరాలను మంగళవారం ఆయన వెల్లడించారు.
అనంతపురం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీరామ్‌నాయక్... మృతి చెందినట్లు నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఆయన ఇంటిని కాజేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న శ్రీరామ్‌నాయక్ ఇటీవల ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ కేసులో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తుల పాత్రపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
(చదవండి: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో మూడేళ్లుగా అగ్రస్థానంలో ఏపీ)
Comments
Please login to add a commentAdd a comment