‘‘పుట్టగానే సక్రమంగా పరీక్షించకుండా మా బిడ్డ చనిపోయాడని నిర్ధారించి మూటగట్టి ఇచ్చారు. పైగా మరణ ధ్రువీకరణ పత్రం కూడా చేతిలో పెట్టారు. ఇంటికి తీసుకెళుతుండగా మా అదృష్టంకొద్దీ బాబులో చలనం రావడంతో తిరిగి ఆస్పత్రికి తీసుకొచ్చాం. ఇంత జరిగినా వైద్యులు నిర్లక్ష్యాన్ని వీడలేదు. సరైన వైద్యం అందించకుండా ఈసారి మా బిడ్డను నిజంగానే చంపేశారు..’’ అంటూ గుంటూరుకు చెందిన జగన్నాథం నాగబాబు, భవాని దంపతులు గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల(జీజీహెచ్) వైద్యుల ఎదుట బుధవారం ఆవేదన వెలిబుచ్చారు.