ఆండ్రెస్ కాంటో అనే ఈ స్పానిష్ కుర్రాడికి కోపం వచ్చింది. ఎవరి మీదంటారా? తల్లిదండ్రుల మీదే! కారణం మరీ పెద్దదేమీ కాదు గాని, అసలు కథలోకి వచ్చేద్దాం. ఎనిమిదేళ్ల కిందట ఆండ్రెస్ పద్నాలుగేళ్ల కుర్రాడు. ట్రాక్‌సూట్‌తోనే ఊళ్లోకి బలాదూరుగా తిరగడానికి వెళతానన్నాడు. ట్రాక్‌సూట్‌లో అలా తిరగొద్దని తల్లిదండ్రులు మందలించారు. అంతే! ఆండ్రెస్‌కు చర్రున కోపం తన్నుకొచ్చింది. కోపం వస్తే ఎవరైనా ఊరుకుంటారా? ఆండ్రెస్ కూడా ఊరుకోలేదు.
విసవిసా పెరట్లోకి వెళ్లాడు. పెరట్లో పాతకాలం నాటి గడ్డపలుగు కనిపించింది. వెంటనే ఆ గడ్డపలుగు పుచ్చుకుని, చేతులు నొప్పెట్టే వరకు పెరట్లో మట్టిని తవ్విపోశాడు. ఇలా ఒకరోజు రెండురోజులు కాదు, ఎనిమిదేళ్లు అదేపనిగా తవ్విన చోటనే తవ్వుతూ, తాను తలదాచుకోవడానికి అనువైన నేలమాళిగను నిర్మించుకున్నాడు. తనకు అవసరమైన కుర్చీ, బల్ల, మంచం వంటి సామగ్రిని ఇంటి నుంచి అందులోకి చేరవేసుకున్నాడు. వైఫై, స్పీకర్లు, వంట చేసుకోవడానికి ఒక బొగ్గుల పొయ్యి కూడా అందులో అమర్చుకున్నాడు. ఇప్పుడు ఆ నేలమాళిగనే తన ప్రత్యేక స్థావరంగా వాడుకుంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment