పరాన్నజీవులు గురించి విన్నాం. ఇతరులను ఆశ్రయించి బతికే వాటిని పరాన్నజీవులు అనిపిలుస్తాం. పందులు, ఇతర జంతువులు ఆశ్రయించి ఉండే బద్దేపురుగులు, వైరస్‌లను ఇలా పిలుస్తాం. అయితే మనుషుల్లో కూడా కొందూ ఇతరులపై ఆధారపడి జీవనం సాగించేవారిని కూడా ఇలా పోలుస్తు తిడుతుంటారు. కానీ అచ్చం అలానే రియల్ లైఫ్ పరాన్నజీవిలా జీవనం సాగిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పైగా దొరికిపోయి కూడా అడ్డంగా బుకాయించే యత్నం చేసిందామె. ఈ విషయం కాస్తా కోర్టుదాక చేరుకుంటే గానీ ఆమె తిక్క కుదరలేదు.
అసలేం జరిగిందంటే..తూర్పు చైనా(China)లోని జియాంగ్సు ప్రావిన్స్‌లో నివశిస్తున్న లీ అనే వ్యక్తి ఒక రోజుల తన ఇంటిని శుభ్రపరుస్తున్నాడు. సరిగ్గా ఆసమయంలోనే తన ఇంటి బేస్మెంట్(Basement)లో ఒక గది ఉండటం చూసి విస్తుపోతాడు. అక్కడ ఒక మనిషి జీవనం సాగిస్తున్నట్లు అన్ని వసతులు ఉంటాయి.
ఇదేంటని ఆశ్చర్యపోతూ..క్షుణ్ణంగా పరిశీలించడం ప్రారంభించడం మొదలుపెడుతుంది. ఆ తర్వాత అక్కడ నిజంగానే ఒక వ్యక్తి ఉండటం చూసి ఆశ్చర్యపోతుంది. ఆమె ఎవరా అని ఆలోచించగా.. ఈ ఇంటి పాత యజామని(Former Homeowner) జాంగ్‌గా గుర్తించి కంగుతింటుంది. వెంటనే లీ తనకు ఈ ఇల్లుని కొనుగోలు చేసిన మాజీ యజమానురాలు జాంగ్‌ని గట్టిగా నిలదీస్తుంది.
అయితే ఆమె తెలివిగా ఇంటి గురించి పూర్తి సమాచారం ఇచ్చానే గానీ కింద బేస్‌మెంట్ మీకు చెందుతుందని ఒప్పందంలో లేదంటూ మాట్లాడుతుంది. కానీ లీ తనకు అమ్మకం సమయంలో ఇంటి బేస్మెంట్ గురించి రహస్యంగా ఉంచి మళ్లీ ఇలా దబాయిస్తుందని మండిపడతాడు.
పైగా ఇల్లు అమ్మేశానే కానీ బేస్మింట్ కాదని తేల్చి చెప్పింది పాత యజమానురాలు జాంగ్. పైగా విరామ సమయంలో ఇలా ఆ బేస్‌మెంట్‌లో సేదతీరుతానని కరాఖండీగా చెప్పింది. అయితే ఇక్కడ లీ గమనించకుండా జాంగ్ ఎలా ఆ బేస్మెంట్‌లోకి వెళ్లి వస్తుందన్నది అస్పష్టంగా ఉంది. ఈ స్టోరీ అచ్చం చైనాలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న చిత్రం పారాసైట్ కథలా ఉంది. ఈ మూవీలో కూడా ఒక వ్యక్తి బేస్మెంట్లో రహస్యంగా సంవత్సరాలు గడుపుతాడు.
కాగా, దీనిపై చాలా సీరియస్‌గా ఉన్న లీ వెంటనే ఈ విషయమై కోర్టు(court)ని ఆశ్రయించి గట్టిగా పోరాడతాడు. చివరికి మాజీ ఇంటి యజమానిపైకేసు గెలిచి నష్టపరిహారం కూడా అందుకుంటాడు లీ.
(చదవండి: ఈ డివైజ్‌తో చిన్నారులను నిద్రపుచ్చడం చాలా ఈజీ..!)
Comments
Please login to add a commentAdd a comment