Cellars
-
ఢిల్లీలో 13 ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు సీజ్
ఢిల్లీ: ఢిల్లీలోని ఓ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి వర్షం నీరు పోటెత్తిన ఘటనలో ముగ్గురు అభ్యర్థులు మృతిచెందారు. ఈ ఘటన నేపథ్యంలో ఓల్డ్ రాజేంద్ర నగర్ ప్రాంతంలో నిబంధనలు ఉల్లంఘించి బేస్మెంట్ ఏరియాను ఉపయోగిస్తున్న 13 కోచింగ్ సెంటర్లపై మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీబీ) చర్యలు చేపట్టింది. ఈ మేరకు 13 కోచింగ్ సెంటర్లను అధికారులు సీజ్ చేశారు.‘‘ఆదివారం రాజేంద్ర నగర్ ప్రాంతంలోని పలు ఐఏఎస్ కోచింగ్ సెంటర్లలో ఎంసీడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. బేస్మెంట్ ఏరియాను కమర్షియల్ అవసరాలకు ఉపయోగిస్తున్న కోచింగ్ సెంటర్లను సీజ్‌చేశాం. శనివారం జరిగిన ప్రమాదం నేపథ్యంలో తనిఖీలు చేపట్టాం. రాజేంద్రనగర్ ప్రాంతంలో నిబంధనలు ఉల్లంఘించిన కోచింగ్ సెంటర్లను సీజ్ చేస్తాం. అదేవిధంగా ఢిల్లీ మొత్తం ఉన్న కోచింగ్ సెంటర్లు, పలు భవనాల్లో తనిఖీలు చేస్తాం’’ అని ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబేరాయ్ ‘ఎక్స్ ’లో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన కోచింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రావుస్ ఐఎఎస్ స్టడీ సెంటర్లో జరిగిన సంఘటనకు ఎంసీడీ అధికారులు ఎవరైనా బాధ్యులు ఉన్నారా? అనేదానిపై వెంటనే విచారణ జరుగుతోందని అన్నారు. ఈ ఘటన వెనుకు ఎవరైనా అధికారులు దోషులగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.సీజ్ చేసిన 13 ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు ఇవే..ఐఏఎస్ గురుకులంచాహల్ అకాడమీప్లూటస్ అకాడమీసాయి వర్తకంఐఏఎస్ సేతుటాపర్స్ అకాడమీదైనిక్ సంవాద్సివిల్ రోజువారీ ఐఏఎస్కెరీర్ పవర్99 నోట్లువిద్యా గురుగైడెన్స్ ఐఏఎస్ఐఏఎస్లకు ఈసీచదవండి: సివిల్స్ కల జల సమాధి -
Gyanvapi: మిగిలిన సెల్లార్లలో కూడా ఏఎస్ఐ సర్వే చేపట్టాలి
లక్నో: జ్ఞానవాపి కాంప్లెక్స్‌లో మిగిలిన సెల్లార్లను సర్వే చేసేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హిందూ పిటిషనర్ వారణాసిలోని ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. కాంప్లెక్స్ మతపరమైన స్వభావాన్ని నిర్ధారించడానికి ఈ సెల్లార్లను సర్వే చేయడం చాలా కీలకమని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రవేశానికి అనుమతి లేని మిగిలిన సెల్లార్లలో సర్వే చేపట్టవలసిందిగా పిటిషనర్ ఏఎస్ఐని అభ్యర్థించారు. వీటితోపాటు జ్ఞానవాపి ఆవరణలో ఇటీవలి సర్వే సమయంలో దర్యాప్తు చేయని సెల్లార్ల సర్వేలను నిర్వహించాలని ఏఎస్ఐని కోరారు. ఏ సర్వే నిర్వహించినా నిర్మాణానికి నష్టం జరగకుండా చూడాలని పిటిషన్లో పేర్కొన్నారు. కొన్ని ఇటుకలు, రాళ్లతో ఉన్న అడ్డంకుల కారణంగా ఏఎస్ఐ సర్వే కొన్నిసెల్లార్లలో పూర్తి కాలేదని పిటిషనర్ పేర్కొన్నారు. నిర్మాణానికి హాని కలిగించకుండా ఈ అడ్డంకులను సురక్షితంగా తొలగించడానికి అవసరమైన నైపుణ్యాలను ఏఎస్ఐ నిపుణులు కలిగి ఉన్నారని స్పష్టం చేశారు. అవసరమైతే ఈ అడ్డంకుల తొలగింపుపై ఏఎస్ఐ నివేదిక పొందాలని అభ్యర్థించారు. జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేను పూర్తి చేసి నివేదికను కూడా బహిర్గతం చేసింది. మసీదు ప్రాంగణంలో భారీ హిందూ దేవాలయ ఆనవాళ్లు ఉన్నాయని ఏఎస్ఐ స్పష్టం చేసింది. హిందూ దేవాలయ చిహ్నాలు శంఖం, చక్రం సహా పలు ఆధారాలు లభించాయని స్పష్టం చేసింది. అయితే.. ఈ సర్వే తర్వాత జ్ఞానవాపి కాంప్లెక్స్ సెల్లార్లో పూజలు చేసుకోవడానికి హిందూ పక్షంవారికి అనుమతినిస్తూ వారణాసి కోర్టు తీర్పునిచ్చింది. ఇదీ చదవండి: Varanasi: మాఘ పౌర్ణమి వేళ.. వారణాసికి మోదీ -
రాజన్నకు వర్షం ఎఫెక్ట్
వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ఎఫెక్టు ఎములాడ రాజన్నపై పడింది. ప్రతీ ఆదివారం వేల సంఖ్యలో వచ్చే భక్తులు ఈ ఆదివారం రాలేదు. దీంతో ఆలయం వెలవెలబోయింది. రాజన్న గుడితోపాటు బద్దిపోచమ్మగుడి, భీమన్న గుడి, నగరేశ్వరస్వామి ఆలయాలు, ధర్మగుండం నిర్మానుష్యంగా కనిపించాయి. – వేములవాడ -
‘పుర్రె’కో బుద్ధి!
చూస్తుంటే ఫ్రాన్స్ విచిత్రమైన వినోదాలకు నెలవులా ఉంది! అందుకే, ఈసారి ‘వర్ణం’లోని మూడు అంశాలూ అక్కడివే! చిత్రంలోని ఇద్దరమ్మాయిలు ఉల్లాసంగా ఫొటోలు తీసుకుంటున్నది ఒకప్పటి శవాల నేలమాళిగలో! 18వ శతాబ్దం చివర్లో పారిస్ నగరంలో శ్మశనాలు చాలకపోవడంతో ఇక్కడ పూడ్చేవారు. సుమారు 60 లక్షల మందిని ఇక్కడ ఖననం చేసినట్టుగా చెబుతారు. ఆ సంఖ్యను నిర్ధారించేది పేర్చిపెట్టిన పుర్రెలూ, ఎముకలూ! ఈజిప్ట్, ఇటలీలాంటి ఇంకా ఎన్నో దేశాల్లోనూ ఇలాంటి నేలమాళిగలు ఉన్నప్పటికీ చాలావరకు అవి మతంతో ముడిపడిన క్రతువులు నిర్వహించడానికి ఉద్దేశించినవి. ‘క్యాటకాంబ్స్ ఆఫ్ పారిస్’ మాత్రం కేవలం ‘మృతుల రద్దీ’ని తట్టుకోవడానికి తవ్వింది! చిత్రంగా, ఇప్పుడది పర్యాటక స్థలంగా వర్ధిల్లుతోంది. ఒక సమయం తర్వాత మరణం కూడా తీపిగుర్తేనన్నమాట!