లక్నో: జ్ఞానవాపి కాంప్లెక్స్‌లో మిగిలిన సెల్లార్‌లను సర్వే చేసేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హిందూ పిటిషనర్ వారణాసిలోని ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. కాంప్లెక్స్ మతపరమైన స్వభావాన్ని నిర్ధారించడానికి ఈ సెల్లార్‌లను సర్వే చేయడం చాలా కీలకమని పిటిషనర్ పేర్కొన్నారు.
ప్రవేశానికి అనుమతి లేని మిగిలిన సెల్లార్లలో సర్వే చేపట్టవలసిందిగా పిటిషనర్ ఏఎస్‌ఐని అభ్యర్థించారు. వీటితోపాటు జ్ఞానవాపి ఆవరణలో ఇటీవలి సర్వే సమయంలో దర్యాప్తు చేయని సెల్లార్ల సర్వేలను నిర్వహించాలని ఏఎస్‌ఐని కోరారు. ఏ సర్వే నిర్వహించినా నిర్మాణానికి నష్టం జరగకుండా చూడాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
కొన్ని ఇటుకలు, రాళ్లతో ఉన్న అడ్డంకుల కారణంగా ఏఎస్‌ఐ సర్వే కొన్నిసెల్లార్లలో పూర్తి కాలేదని పిటిషనర్ పేర్కొన్నారు. నిర్మాణానికి హాని కలిగించకుండా ఈ అడ్డంకులను సురక్షితంగా తొలగించడానికి అవసరమైన నైపుణ్యాలను ఏఎస్‌ఐ నిపుణులు కలిగి ఉన్నారని స్పష్టం చేశారు. అవసరమైతే ఈ అడ్డంకుల తొలగింపుపై ఏఎస్‌ఐ నివేదిక పొందాలని అభ్యర్థించారు.
జ్ఞానవాపి మసీదులో ఏఎస్‌ఐ సర్వేను పూర్తి చేసి నివేదికను కూడా బహిర్గతం చేసింది. మసీదు ప్రాంగణంలో భారీ హిందూ దేవాలయ ఆనవాళ్లు ఉన్నాయని ఏఎస్‌ఐ స్పష్టం చేసింది. హిందూ దేవాలయ చిహ్నాలు శంఖం, చక్రం సహా పలు ఆధారాలు లభించాయని స్పష్టం చేసింది. అయితే.. ఈ సర్వే తర్వాత జ్ఞానవాపి కాంప్లెక్స్ సెల్లార్‌లో పూజలు చేసుకోవడానికి హిందూ పక్షంవారికి అనుమతినిస్తూ వారణాసి కోర్టు తీర్పునిచ్చింది.
ఇదీ చదవండి: Varanasi: మాఘ పౌర్ణమి వేళ.. వారణాసికి మోదీ
Comments
Please login to add a commentAdd a comment