
కార్గిల్‌లో గెలిచింది మనమే!
కరాచీ: కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైన్యం భారత్ పీక పట్టుకున్నంత పని చేసిందని, మూణ్ణెళ్ల పాటు జరిగిన ఆ యుద్ధాన్ని భారత్ మరిచిపోలేదని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ వ్యాఖ్యానించారు. తన పార్టీ ఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ యువజన విభాగం ఆదివారంఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలోప్రసంగిస్తూ ‘ద్వితీయశ్రేణి దళాలతో పాటు పాక్ సైన్యం కశ్మీర్‌లోని కార్గిల్ జిల్లాలోకి ప్రవేశించింది.
అక్కడి 5 కీలక వ్యూహాత్మకప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. ఒక ప్రాంతంలోని కొంత భాగాన్ని భారత్ తిరిగి వెనక్కు తీసుకోలేకపోయింది. మన సైన్యం భారత్‌పై సాధించిన గొప్ప విజయాన్ని మన రాజకీయ నాయకత్వం సద్వినియోగం చేసుకోలేకపోయింది’ అన్నారు.